సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1493వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపిన కరుణ
2. బాబా చల్లని చూపుతో ఎంతటి అసాధ్యమైన సుసాధ్యమవుతుంది

బాబా చూపిన కరుణ

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై!!! నా పేరు ఉష. నేను బాబా భక్తురాలిని. మా పాప కాలేజీకి వెళ్లి, రావడానికి కాలేజీ బస్సు వున్నా బస్సు స్టాప్ నుండి మా ఇంటికి మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉన్నందున రోజూ పాపకి వెళ్ళి, రావటం ఇబ్బందవుతుంది. అందువల్ల మేము ఈ సంవత్సరం(2023) నుండి నెలకి పదివేల రూపాయలిచ్చి ఒకటి, రెండు నెలల కొరకు కారు డ్రైవరును పెట్టుకున్నాము. ఆ తరువాత సొంతంగా నేనే కారులో పాపని తీసుకెళ్లి, తిరిగి తేవాలని డ్రైవింగ్ నేర్చుకున్నాను. నా తరువాత మా పాప కూడా డ్రెవింగ్ నేర్చుకుంది(తనతో పోల్చితే నేను కొంచెం బాగా డ్రైవ్ చేస్తున్నాని మావారు అన్నారు). నాకు, మా పాపకి ఒకేరోజు డ్రైవ్ంగ్ టెస్టు వుండింది. టెస్ట్ లేకుండా అయితే చూద్దామని మావారు అన్నారు కానీ, అక్కడ అందరూ టెస్టు చేయవలసిందే అన్నారు. నేను బాబాను తలచుకొని, "మేము సరిగా డ్రైవ్ చేసి టెస్టు పాసైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవలన మేమిద్దరమూ మంచిగా డ్రైవ్ చేసాము.

ఒకసారి మావారికి గొంతు ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల మాట కూడా సరిగా రాక చాలా ఇబ్బందిపడ్డారు. డాక్టరుని సంప్రదించి ప్రతి ఐదు రోజులకి ఒక రకం టాబ్లెట్లు, సిరప్ వాడుతున్నా దాదాపు రెండు, మూడు వారాల వరకు మావారికి నయం కాలేదు. నేను ఆయన పడుతున్న బాధ చూడలేక మందులు వాడుతున్నా బాబా దయ కూడా కావాలని, "బాబా! మావారి బాధను తగ్గించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆ తరువాత బాబా దయవల్ల మావారి ఆరోగ్యం కుదుటపడింది. ఇలాగే మా నాన్నకి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అప్పుడు బాబాకి చెప్పుకుంటే వెంటనే బాబా మంచి పరిష్కారం చూపుతున్నారు. "ధన్యవాదాలు బాబా. పిలిస్తే పలుకుతా అంటూ మా మీద దయ చూపుతున్న మీకు శతకోటి ప్రణామములు".

బాబా చల్లని చూపుతో ఎంతటి అసాధ్యమైన సుసాధ్యమవుతుంది

సాయి భక్తులకు నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఎన్నో రోజుల నుంచి తిరుపతి శ్రీవారి సేవకు వెళ్లాలని అనుకుంటుండగా చివరికి ఈమద్య ఆ అవకాశం వచ్చింది. తీరా వెళ్ళే సమయానికి ఎన్నో ఆటంకాలు వచ్చి నా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుందామని అనుకున్నాను. కానీ నా బాబా దయతో అన్ని సక్రమంగా జరిగాయి. నా ప్రయాణానికి ముందే నెలసరి వచ్చేలా ఆయన అనుగ్రహించారు. నేను తిరుపతి వెళ్లి ఐదు రోజుల స్వామివారి సేవలో సంతోషంగా పాల్గొన్నాను. నేను ఐదు రోజుల్లో ప్రధాన ఆలయంలో సేవ వస్తుందో, లేదో అని ఆందోళన చెంది, "ఆ అవకాశం వస్తే బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన దయతో చివరి రోజున నాకు ఆ భాగ్యం దక్కింది. ఐదు గంటలసేపు శ్రీవారి సన్నిధిలో స్వామి ముందు సేవ చేసుకున్నాను.

ఒకసారి వ్యవసాయ పనుల్లో మా అత్తగారి కాలుకి గాయం అయింది. తన వయస్సు 70 సంవత్సరాలు. పైగా తను షుగర్ పేషంట్. అందువల్ల గాయం మానడానికి సమయం పడుతుందని డాక్టరు చెప్పారు. అయితే 3 నెలలైనా తగ్గకపోయేసరికి మా అత్తమ్మ నిరాశ చెంది రోజూ బాధపడుతుండేది. అప్పుడు నేను, "బాబా! త్వరగా అత్తమ్మ గాయం మానితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఒక్క వారంలోనే గాయంలో మార్పు వచ్చి క్రమక్రమంగా తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. నిజానికి అత్తమ్మని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక మానదని ఎంతో భయపెట్టారు. ఆమె వయసురీత్యా మేము కూడా భయపడ్డాము. కానీ బాబా ఆ గాయాన్ని మాన్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మన బాబా చల్లని చూపు ఉండగా ఎంతటి అసాధ్యమైన తప్పక సుసాధ్యం అవుతుంది. బాబా చాలా గొప్పవారు. ఆయన ఎల్లప్పుడూ ఉంటారు. "థాంక్యూ బాబా".

4 comments:

  1. బాబా సాయి నన్ను నా వంశీని కలుపు సాయి నా భర్త నన్ను అర్థం చేసుకొని కాపురంకు తీసుకెళ్లాలో చూడు సాయి. నా తప్ప ఏమైనా ఉంటే దానిని క్షమించమని చెప్పు సాయి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తారు కదా నిజంగా నా తప్పేగనుకుంటే నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పు సాయి నువ్వే నాకు మాంగల్యాన్ని ఇప్పించావు కానీ భర్తని మాత్రం దూరంగా పెట్టేసావ్ ఏంటి సాయి ఇదంతా నా కర్మ ఫలితమానం ఒక అర్థమవుతుంది సాయి ప్లీజ్ నా కర్మ ని తగ్గించు సాయి నా కాపురాన్ని నిలబెట్టి సాయి ఈ సమస్యతో నేను సతమతమై పోతున్నాను సాయి ఈ సమస్య నుంచి నన్ను గట్టెక్కించండి సాయి నాకు సహాయం చేయండి సాయి మీరు నన్ను ఎన్ని జన్మలెత్తినా తెచ్చుకోలేను సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo