ఈ భాగంలో అనుభవాలు:
1. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మాతోనే ఉంటున్న బాబా
2. కోరకుండానే బాబా చేసిన అద్భుతం
ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మాతోనే ఉంటున్న బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు మిథున్. బాబా నా జీవితంలోకి నా చిన్నతనంలోనే ప్రవేశించారు. ఆయన నాకు చేసిన మేలు, కష్టాల్లో నాకు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. తద్వారా ఆ అనుభవాలను చదివేవాళ్లకి బాబా మీద ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడుతుందని నమ్ముతున్నాను. నేను యుఎస్ఏలో నివాసముంటున్నాను. 2020, అక్టోబరులో నేను పనిచేసే కంపెనీవాళ్ళు నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసారు. కానీ అందులో ఏదో తప్పు ఉండటంతో మరోసారి ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అది అప్రూవైతేనే నా హెచ్1 వీసా ఎక్స్టెన్షన్‌కి అప్లై చేసే అవకాశముంది. కానీ గ్రీన్ కార్డు ప్రాసెస్ బాగా ఆలస్యం కాసాగింది. ఆ క్రమంలో నా హెచ్1 వీసా ఎక్స్టెన్షన్‌కి అప్లై చేయడానికి కొద్దిరోజుల సమయమే ఉందని తెలియక ఆలోగా గ్రీన్ కార్డు అప్రూవ్ అవ్వకపోతే ఏం చేయాలన్న ఊహ కూడా నాకు రాలేదు. హఠాత్తుగా ఆ విషయం నా గమనికలోకి వచ్చేసరికి నేను షాకయ్యను. నేను నాకు ఏ కష్టమొచ్చినా బాబా నాతోనే ఉన్నారనే నమ్ముతాను. ఆ నమ్మకంతో నేను సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. ఆ పూజ మొదలుపెట్టగానే 2022, జూన్‌లో అంటే దాదాపు రెండు సంవత్సరాలకి 'గ్రీన్ కార్డు అప్రూవ్ అయింద'ని మా ఆఫీసు నుంచి నాకు మెయిల్ వచ్చింది. తరువాత వాళ్ళు నా హెచ్1 వీసా ఎక్స్టెన్షన్‌కి అప్లై చేస్తామని అదే నెలలో అప్లికేషన్ వేశారు. కానీ ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆలస్యం అవ్వసాగింది. అయినప్పటికీ సమయానికి ప్రాసెస్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ నవంబరులో నాకు RFE (Request for Evidence) వచ్చింది. సరే, ఒక వారంలో లెటర్ వస్తుంది. అదేంటో చూసి పంపిద్దాం అనుకున్నాను. అయితే మూడు వారాలు అయినా లెటర్ రాలేదు. దాంతో నాకు బాగా టెన్షన్ ఎక్కువై నిద్ర కూడా పట్టేది కాదు. నేను బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా దయవల్ల మా ఆఫీసువాళ్లు ప్రీమియం ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అయితే ఒక వారంలో ఆ లెటర్ వచ్చింది. అందులో కేవలం నా పాస్పోర్ట్ కాపీ పంపమని ఉంది. విశేషమేమిటంటే, నేను వీసా విషయంగా ఏడు వారాల బాబాకి దివ్యపూజ మొదలుపెట్టగానే ఈ అద్భుతం జరిగింది. మూడు వారాలు అయ్యేలోపు నా వీసా అప్రూవ్ అయింది. నాలుగో వారం పూజ అయ్యేసరికి నేను హఠాత్తుగా ఇండియా రావాల్సి వచ్చింది. మేము ఇండియా వచ్చాక తిరుగు ప్రయాణానికి 2023, మార్చి 30కి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని నేను, నా భార్య వీసా స్టాంపింగ్‌కి వెళ్లి, "నాకు, నా భార్యకి సమయానికల్లా వీసా రావాల"ని బాబాకి మొక్కుకొని డ్రాప్ బాక్స్‌లో వేసాము. బాబా దయవల్ల ఒక వారంలో నా వీసా నా చేతికి వచ్చింది. కానీ నా భార్యని వీసా ఇంటర్వ్యూకి రమ్మన్నారు. మార్చి 20న మేము చెన్నై వెళ్ళాము. నా భార్య, 'బాబా అంతా మంచే చేస్తార'ని నమ్మకంతో ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆయన దయవల్ల నా భార్య వీసా అప్రూవ్డ్ అని చెప్పారు. మేము కోరుకున్నట్లే సమయానికల్లా మా వీసా స్టాంపింగ్ అయి మేము క్షేమంగా యుఎస్ఏకి తిరిగి వచ్చాము. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా బాబా మాతోనే ఉంటారని నా నమ్మకం. మేము సదా ఆయనకి ఋణపడి ఉంటాము. "ధన్యవాదాలు బాబా".
కోరకుండానే బాబా చేసిన అద్భుతం
నా పేరు రేవతి. ఒంటిపూట స్కూళ్ళు పెట్టినప్పటినుంచి నాకు తలనొప్పి మొదలైంది. టాబ్లెట్ వేస్తే కొంచెం తగ్గి మళ్ళీ వస్తుండేది. ఎందుకో గాని, నొప్పి తగ్గాలని బాబాని నేను కోరలేదు. అయితే ఒకరోజు 'సాయి మహారాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపులో 'సాయిభక్త అనుభవమాలిక 1225వ భాగం' షేరు చేసారు. అందులో "బాబా కృపతో సంవత్సరంనాటి తలనొప్పి నుండి కొంత ఉపశమనం" అన్న ఒక భక్తుని అనుభవం ఉంది. దాన్ని చదివిన నేను అది నా గురించి కాదులే అనుకున్నాను. మరుసటిరోజు ఈ బ్లాగుకి సంబంధించిన 'సాయి మహారాజ్ బ్లెస్సింగ్స్' గ్రూపులో ఒక భక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు: "ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి. నాపేరు లక్ష్మి. ఈరోజు నేను తలనొప్పి, గ్యాస్ ప్రోబ్లంతో చాలా ఇబ్బందిపడ్డాను. మన సాయితండ్రిని ప్రార్థించి ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. వెంటనే ఆ సమస్యలు తగ్గాయి. శతకోటి వందనాలు సాయితండ్రి. ఎల్లవేళలా అందరినీ ఇలాగే కాపాడు సాయిబాబా" అని. అది చదివాక బాబా నాకే చెప్తున్నారనిపించి వెంటనే ఊదీ కలిపిన నీళ్లు తాగి పడుకున్నాను. నిద్రలేచేసరికి తలనొప్పి లేదు. వారం రోజులుగా టాబ్లెట్ వేస్తున్నా, నవరత్న తైలం రాస్తున్నా తగ్గని తలనొప్పి బాబా ఊదీ వలన తగ్గింది. అది కూడా బాబానే నాకు గుర్తు చేసి నాచేత ఊదీ నీళ్లు త్రాగించారు. "నేను చెప్పకుండానే నా బాధను తొలగించిన మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు బాబా. నిజంగా మీ బిడ్డలం అయినందుకు మేము ఎంతో అదృష్టవంతులం బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDelete