ఈ భాగంలో అనుభవాలు:
1. సమస్య ఎంత చిన్నదైనా, పెద్దదైనా వేడుకుంటే ఖచ్చితంగా పరిష్కరిస్తున్న బాబా2. నందిని ఆరోగ్యం కాపాడిన సాయితండ్రి
సమస్య ఎంత చిన్నదైనా, పెద్దదైనా వేడుకుంటే ఖచ్చితంగా పరిష్కరిస్తున్న బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. ఒకసారి నాకు సరిగా మలవిసర్జనకాక తరచుగా కడుపులో నొప్పి వస్తుండేది. ఒకరోజు రాత్రయితే చాలా విపరీతంగా నొప్పి వచ్చింది. నేను అస్సలు భరించలేక, "బాబా! ఈ సమస్య నుండి రక్షించు" అని ఆర్తిగా వేడుకున్నాను. వెంటనే వాష్‌రూమ్‍కి వెళితే మలవిసర్జన జరిగి నొప్పి పూర్తిగా తగ్గింది. "ధన్యవాదాలు సాయినాథా".
మేము మా పొలం వద్ద నీళ్లకోసం కొత్తగా బోర్ వేశాము. ఆ బోరుకి సంబంధించి మోటర్, పైపులు, ఇతర సామాగ్రి తెచ్చేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురై, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మరుసటిరోజు గురువారం. ఆరోజు నేను, "బాబా! ఈ సమస్యలు తొలగించి పనంతా సక్రమంగా పూర్తయి నీరు మంచిగా వచ్చేలా దయచూపండి" అని బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యం! వెంటనే సమస్యలు పరిష్కారమై పనంతా పూర్తయి అదేరోజు బోర్ స్టార్ట్ చేశాము. బాబా కరుణ వల్లే సమస్యలు తొలగిపోయాయి.
2023, ఫిబ్రవరి 20న నేను నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ సమేత జడల రామలింగేశ్వరస్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాను. కానీ నేను అదివరకెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. అందువల్ల, "బాబా! మొదటిసారి వెళ్తున్నాను. నాకు తోడుగా ఉండి నా యాత్రను పూర్తిచేయించండి" అని బాబాను వేడుకున్నాను. తరువాత ప్రయాణంలో బాబా నాకు చాలా సందర్భాలలో వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు. బాబా దయవల్ల అంతా మంచి జరిగింది.
మా చిన్నమ్మవాళ్ళు తమ మనవడి పుట్టువెంట్రుకలు తీయడానికి యాదగిరిగుట్ట వెళ్తూ మమ్మల్ని కూడా రమ్మన్నారు. కానీ సరిగా వాళ్లు ఇంటి నుండి బయలుదేరే సమయానికి నేను తప్పనిసరై వేరే వూరు వెళ్లి ఉన్నాను. అందువల్ల నేను వాళ్లతో యాదాద్రి వెళ్లలేకపోయాను. ఆ విషయం గురించి నేను నా మనసులో బాబాతో చెప్పుకొని చాలా బాధపడ్డాను. నేను ఇంటికి వచ్చాక మా ఇంకో చిన్నమ్మ నాకు ఫోన్ చేసి, "నేను కూడా వెళ్ళలేదు. మనం రేపు ఉదయం బస్సుకి యదాద్రి వెళదాం" అంది. అది విని నాకు చాలా ఆనందమేసింది. బాబాకి నమస్కారం చేసి మరుసటిరోజు ఉదయం యాదాద్రి వెళ్లాను. బాబా నాకంటే ముందుగానే యాదాద్రి చేరుకున్నారు. మేము యాదాద్రి చేరుకోగానే మా ముందున్న జీపు వెనుకభాగంలో పెద్ద చిత్రపట రూపంలో బాబా దర్శనం ఇచ్చారు. బాబా దయవలన ఎలాంటి సమస్యా లేకుండా యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి దర్శనభాగ్యం మాకు లభించింది. అంతా సాయిమయం. ఆయన మాకు నిరంతరం తోడు-నీడగా ఉంటున్నారు. సమస్య ఎంత చిన్నదైనా, పెద్దదైనా వేడుకుంటే ఖచ్చితంగా పరిష్కారిస్తున్నారు. "నన్ను క్షమించండి బాబా. కొన్ని అనుభవాలు మరచిపోయాను. మాకు ఎల్లప్పుడూ మీపై ప్రేమ, భక్తి, విశ్వాసాలు ఉండేలా చూడండి. మీరు లేని నా జీవితం వ్యర్థం సాయినాథా".
నందిని ఆరోగ్యం కాపాడిన సాయితండ్రి
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!! నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయినాథునికి నా నమస్కారాలు. నా పేరు నాగార్జున. 2022, ఫిబ్రవరి 20వ తేదీన మా ఇంట్లో ఉన్న గోమాత ప్రసవించి ఒక పుంగనూరు ఆవుదూడకి జన్మనిచ్చింది. సాయియే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని ఆ ఆవుదూడకు 'నందిని' అని పేరు పెట్టుకొని ఎంతో ఆనందంగా పెంచుకున్నాం. ఆ ఆవుదూడ మాతో, మా చుట్టుపక్కల పిల్లలతో ఎంతో ఆనందంగా ఆడుతూ పెరిగింది. ఆ సమయంలో ఆవులు 'లంపి వైరస్'తో బాధపడుతున్నాయి. మా నందిని కూడా ఆ వ్యాధి బారిన పడింది. మేమంతా ఎంతో బాధపడి ఆ సాయినాథుని ప్రార్థించి నందినికి ఊదీ రాస్తూ వైద్యం కూడా చేయించాం. అయితే 20 రోజులైనా నందిని కోలుకోలేదు. దాంతో నాకు భయమేసి, "బాబా! ఒక వారం రోజుల్లో మా నందిని జన్మదినం(2023, ఫిబ్రవరి 20న) ఉంది. అప్పటికల్లా నందిని ఆరోగ్యంగా ఉండేలా చేయి తండ్రీ" అని బాబాతో చెప్పుకొని దణ్ణం పెట్టుకున్నాను. ఆశ్చర్యంగా, 20 రోజులుగా కోలుకోని నందిని బాబా దయతో నాలుగు రోజుల్లో కోలుకుంది. అక్కడక్కడ చిన్న చిన్న పుండ్లు ఉన్నప్పటికీ నందిని జన్మదినంనాడు తనకి స్నానం చేయించి పూజ చేసుకునే భాగ్యాన్ని ఆ సాయితండ్రి మాకు ప్రసాదించారు. "ధన్యవాదాలు సాయినాథా! ఇలా మా జీవితాలలో మాకు అండగా నిలబడి ఎన్నో సమస్యల నుండి మమ్మల్ని కాపాడావు. వాటన్నిటిని పంచుకోనందుకు ఈ బిడ్డను క్షమించు తండ్రీ. నా కర్మను నీ ధునిలో దహించివేసి నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించి నా తల్లిదండ్రులు మానసిక ప్రశాంతతతో ఆనందంగా ఉండేలా దయచూపు తండ్రీ. మరల మంచి అనుభవంతో నేటి ఈ సాయిసచ్చరిత్రకు నా అనుభవాన్ని జోడించేలా అనుగ్రహించమని కోరుకుంటూ.. మీ పాద సేవలో మీ ఈ బిడ్డ".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om. Sairam. Sai nannu na barthani kalupu sai thanu nannu ardham cheskunela chudu sai
ReplyDelete