సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1505వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • మనస్ఫూర్తిగా అడిగితే ఏ సమయమైనా, ఎలాంటి పరిస్థితి అయినా సహాయం అందిస్తారు బాబా

నేను బాబా భక్తురాలిని. నేను ఇంతకుముందు ఎన్నో అనుభవాల రూపంలో బాబా పంచిన ప్రేమని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ముందుగా, ఎవరి జీవితాలలో వాళ్ళు బిజీగా ఉండే ఈ రోజుల్లో కూడా బాబా కోసం తన జీవితంలోని చాలా సమయాన్ని వినియోగిస్తూ, బాబా ప్రసాదించే అనుభవాలను ఎంతోమంది భక్తులకు అందిస్తూ, బాబాపై ఎంతోమందికి నమ్మకం కలిగేలా చేస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులైన సాయి అన్నయ్యకి చాలా చాలా థాంక్స్.

నా ఫ్రెండ్ ఒకరు శివరాత్రికి హైదరాబాద్ నుంచి శ్రీశైలం నడిచి వస్తానని మ్రొక్కుకున్నారు. తను బయలుదేరినరోజు నేను బాబాని, "తనకి ఏ ఇబ్బందీ లేకుండా క్షేమంగా వెళ్ళొచ్చేలా చూడండి బాబా" అని ప్రార్థించాను. మొత్తం రెండు రోజులు నడక. వెళ్ళేదారిలో నా ఫ్రెండ్‍కి బాగా కాళ్లనొప్పులు వచ్చాయి. తను రాత్రి పడుకునేటప్పుడు టాబ్లెట్ వేసుకోకుండా, "బాబా! ఉదయానికి నా కాళ్లనొప్పులు తగ్గించి, మళ్లీ నడిచే శక్తి వచ్చేలా చేయండి" అని బాబాను వేడుకొని నిద్రపోయారు. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికి తన కాళ్ళనొప్పులు తగ్గాయి. తను బాబాని తలచుకుంటూ తన నడక సాగించారు. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా తను గుడికి చేరుకొని శివుని దర్శనం చేసుకొని తిరిగి క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. "చాలా కృతజ్ఞతలు బాబా".

ఈమధ్య నేను ఒక కోరిక కోరుకొని, 'అది తీరితే శిరిడీ వస్తాన'ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ కోరిక తీరింది. కానీ ఎప్పుడు, ఎలా శిరిడీ వెళ్ళాలన్నది అర్థంకాక శిరిడీ వెళ్లడం కొంచెం ఆలస్యమైంది. అంతలో నేను ఏదైతే కోరుకున్నానో దానికి సంబంధించి ఒక సమస్య వచ్చింది. ఇక అప్పుడు నేను వెంటనే శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకొని అప్పటికప్పుడు శిరిడీకి టిక్కెట్లు బుక్ చేయాలనుకున్నాను. అయితే అది చివరి నిమిషం అయ్యేసరికి బస్సులో చివరి సీట్లు మాత్రమే ఉన్నాయి. అయినా వెంటనే శిరిడీ వెళ్లి, బాబాకి కృతజ్ఞతలతోపాటు నా బాధ చెప్పి రావాలని టిక్కెట్లు బుక్ చేశాను. ఇంటినుండి బయలుదేరేముందు, "ఏ ఇబ్బందీ లేకుండా శిరిడీ వెళ్లి వచ్చేలా చూడండి బాబా" అని బాబాను వేడుకొని బయలుదేరాను. నాకు ఎప్పటినుంచో బాబాని కిరీటం పెట్టుకుని ఉన్నపుడు దర్శించుకోవాలని కోరిక. అయితే, అది మామూలు రోజుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే, కేవలం ఆరతి సమయంలోనే బాబా కిరీటంతో ఉంటారు. అందుచేత నేను కోరుకొనే ఆ దర్శనం కోసం ఈసారి ఆరతి టిక్కెట్లు బుక్ చేసుకుందామనుకున్నాను కానీ,  చివరి నిమిషంలో శిరిడీ ప్రయాణం పెట్టుకున్నందువల్ల ఎంత ప్రయత్నించినా నాకు ఆరతి టిక్కెట్లు దొరకలేదు. అయినా బాబా నాపై దయచూపారు. నేను దర్శనానికి వెళ్లే సమయానికి బాబా కిరీటంతో నాకు దర్శనం ఇచ్చారు. కారణం, అది హోలీ పండుగ సమయమైనందున బాబాని అలా అలంకరించి ఉంచారు. బాబాను అలా చూడగానే నాకు చాలా సంతోషమేసింది. బాబా నా కోరికను అలా తీర్చడమే కాకుండా మొట్టమొదటిసారి తమ సమాధిని తాకే భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చారు. అంతేకాదు, నా ప్రయాణంలోనూ, మిగతా అన్ని విషయాలలోనూ నాకు తోడుగా ఉండి ఏ ఇబ్బందీ లేకుండా నా శిరిడీయాత్రను పూర్తిచేయించి తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చారు బాబా. "ప్రతి విషయంలో తోడుగా ఉండి శిరిడీ దర్శనభాగ్యాన్నిచ్చి నా కోరిక తీర్చినందుకు, తిరిగి ఇంటికి క్షేమంగా చేర్చినందుకు చాలా ధన్యవాదాలు బాబా".

ఈమద్య మా అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదు. తరచుగా తనకి జ్వరం, దగ్గు వస్తున్నాయి. పెద్దవయస్సు, గ్రామంలోని డాక్టర్ దగ్గరే చికిత్స తీసుకుంటుంది. అయితే ఆ మందుల పవర్ వల్ల తను మాట కూడా రానంతగా చాలా నీరసించిపోయింది. నాకు చాలా బాధేసి, "ఎలా అయినా జ్వరం, దగ్గు తగ్గి అమ్మమ్మ ఆరోగ్యం బాగుండాలి బాబా. అదే జరిగితే మీ అనుగ్రహాన్ని వెంటనే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను చాలా ఆర్తిగా ప్రార్థించాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి అమ్మమ్మ ఆరోగ్యం పూర్తిగా కాకపోయినా కొంచెం కుదుటపడింది. కానీ నేను ఏదో బిజీలో ఉండి బాబా అనుగ్రహాన్ని పంచుకోవడం మర్చిపోయాను. ఇంతలో మళ్ళీ అమ్మమ్మకి దగ్గు మొదలైంది. ఆ సమయంలో ఏదో పనిమీద మేము అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాము. ఆరోజు రాత్రి నేను శిరిడీ నుండి తెచ్చిన ఊదీని అమ్మమ్మ నుదుటన పెట్టి బాబాను ప్రార్థించి, మధ్యరాత్రిలో అమ్మమ్మ దగ్గుతున్నప్పుడు కూడా బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి అమ్మమ్మకి కొద్దిగా సెట్ అయింది. మేము అక్కడినుండి తిరిగి వచ్చేముందు బాబా ఊదీ ప్యాకెట్ అమ్మమ్మకి ఇచ్చి వచ్చాను. మేము ఇంటికి వచ్చాక అమ్మమ్మకి మళ్ళీ లైట్‍గా జ్వరం వచ్చిందని తెలిసింది. నేను వెంటనే అమ్మమ్మకి ఫోన్ చేసి, "నేను ఇచ్చిన బాబా ఊదీ పెట్టుకొని, ఆ ప్యాకెట్ తలగడ కింద పెట్టుకొని పడుకో" అని చెప్పి,  బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి అమ్మమ్మ ఆరోగ్యం బాగానే సెట్ అయి ఇప్పటివరకూ బాగానే వుంది. "ఇదీ బాధ అని ప్రార్థించినంతనే నువ్వు ఉన్నావన్న నమ్మకాన్నిచ్చి అమ్మమ్మ ఆరోగ్యం బాగుండేలా చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇకముందు కూడా తన ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు బాబా. ఈ అనుభవం పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు క్షమించి ఇంకా ఏవైనా అనుభవాలు మర్చిపోయివుంటే పెద్దమనసుతో గుర్తుచేయండి బాబా".

ఒకరోజు మా అమ్మ తనకి బాగా తలనొప్పిగా ఉందని చెప్పింది. అప్పుడు నేను బాబాని ప్రార్థించి అమ్మకి జండూబామ్ రాశాను. మరుసటిరోజుకి అమ్మ తలనొప్పి తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా. మనస్ఫూర్తిగా నిన్ను అడిగితే ఏ సమయమైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా నీ సహాయాన్ని మాకు అందిస్తున్నావు తండ్రీ".

5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. సాయి తండ్రి కనికరించు తండ్రి దయ చూపి స్వామి మీ పాదాల్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాను సాయి నాకు ఆ ప్రాణం నిలబెట్టిన కన్వీన దాంపత్యాన్ని ప్రసాదించు తండ్రి

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo