ఈ భాగంలో అనుభవాలు:
1. ఫీజులో 50% డిస్కౌంట్ ఇప్పించిన బాబా
2. నమ్మకముంచితే బాబా కృపతో అన్నీ నెరవేరుతాయి
ఫీజులో 50% డిస్కౌంట్ ఇప్పించిన బాబా
సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేనొక సాయిభక్తురాలిని. నా పేరు లక్ష్మి. మాది వైజాగ్. ఒక ఐదు సంవత్సరాల క్రితం మావారు వ్యాపారంలో చాలా పెద్ద మొత్తంలో నష్టపోయారు. మాకున్న ఇల్లు, వాకిలి, నగలు, డబ్బు అన్నీ పోగొట్టుకొని చాలారోజులు ఇబ్బందిపడ్డాం. ఆ సమయంలో మా అపార్ట్‌మెంట్‌లో ఉండే ఒక ఆంటీ సాయి దివ్యపూజ పుస్తకం ఒకటి నాకిచ్చింది. నేను ఆ పుస్తకమంతా చదివి ఆ పూజ చేశాను. బాబా దయవల్ల అస్సలు డబ్బులు లేని స్థితిలో నాకు లోన్ వచ్చింది. తర్వాత మావారు ఒక చిన్న ఉద్యోగంలో చేరారు. కానీ, వచ్చే జీతం సరిపోయేది కాదు. నేను రోజూ బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ, పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయి ఈ సంవత్సరం ఇంటర్(బైపీసీ) మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసింది. నేను తన పరీక్షల సమయం వచ్చేవరకు అడ్మిషన్ ఫీజు తప్ప కాలేజీ ఫీజు కట్టలేకపోయాను. అటువంటి స్థితిలో ఉన్న నేను ఎన్నో కష్టాలుపడుతూ ఎలా ఫీజు చెల్లించాలా అని ఆలోచిస్తుండగా అమ్మాయికి పరీక్షలు దగ్గరపడ్డాయి. అప్పుడు ఫీజు మొత్తం కడితేనే హాల్ టికెట్ ఇస్తామన్నారు కాలేజీవాళ్ళు. అటువంటి సమయంలో నేను ఫేస్‌బుక్‌లో 'సాయి మహరాజ్ సన్నిధి' పంచుతున్న సాయిభక్తుల అనుభవాలు చూశాను. వాటిని చదివి నేను కూడా, "మా పాప ఫీజు కట్టగలిగితే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత మేము కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్‍తో మాట్లాడి, 'కొంత మొత్తం ఇప్పుడు కట్టి, మిగిలిన డబ్బు ఒక నెలలో కడతాన'ని చెప్పాలనుకున్నాము. కానీ బాబా అద్భుతం చేశారు. ప్రిన్సిపాల్, "ఎంత ఫీజు బ్యాలెన్స్ ఉంద"ని అడిగితే, నేను చెప్పాను. అది విన్న ఆమె, 'అందులో సగం డబ్బులు కట్టమ'ని ఒక చిన్న కాగితం మీద వ్రాసిచ్చారు. నేను ఆ స్లిప్‍ని ఆఫీసులో ఇచ్చి, ఆ డబ్బు కట్టి చాలా సంతోషించాను.
ఇకపోతే, మా అమ్మాయికి మా ఇంటి నుంచి 30కిమీ దూరంలో పరీక్షా కేంద్రం వచ్చింది. 4వ పరీక్ష జరిగేరోజు తను, నా భర్త ఆటోలో బయలుదేరారు. అప్పటికే వాళ్ళు కొంచెం ఆలస్యంగా వెళ్తున్నారనుకుంటే, మధ్యలో రైల్వే గేట్ పడింది. మావారు నాకు ఫోన్ చేసి, "రైల్వే గేట్ పడింది. పరీక్షకి ఆలస్యమైపోతుంది" అని చెప్పారు. నేను బాబా ఫోటో ముందు నిల్చొని, "ఆలస్యం కాకుండా పాప సమయానికి వెళ్లేలా చేయండి. అలా అయితే పాప పరీక్ష నుంచి వచ్చిన వెంటనే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్ధించాను. నేను కోరుకున్నట్టుగా బాబా ఆలస్యం కాకుండా 6 నిమిషాల ముందే పాప పరీక్ష హాల్లోకి వెళ్ళేలా అనుగ్రహించారు. ఆ విషయం ఫోన్ చేసి మావారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు బాబా ఎన్నో చేశారు. ఒక్కక్కటిగా ఈ బ్లాగులో పంచుకుంటాను. "ధన్యవాదాలు బాబా. మీ దయతో పాప మంచి మార్కులతో ఇంటర్ పాసవ్వాలి బాబా. నా అనుభవం పంచుకోవటానికి ఒక నెల ఆలస్యమైంది. నన్ను క్షమించు బాబాతండ్రీ. 2017 నుంచి నేను నా సంతోషం కోల్పోయాను. మాకు చాలా అప్పులు పెరిగిపోయాయి. ఆ అప్పులన్నీ తీరి నా సంతోషం నాకు మళ్లీ రావాలి. మాకు తల్లి, తండ్రి అన్నీ నువ్వే బాబా. నిన్నే నమ్ముకున్నాం".
నమ్మకముంచితే బాబా కృపతో అన్నీ నెరవేరుతాయి
నా పేరు రాము. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ మా ఊరిలో ఉండేవాడిని. 2021, కరోనా సమయంలో మా నాన్నగారు అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. ఆయన మరణంతో జీవితం చాలా కష్టంగా మారింది. మా నాన్న తరఫు బంధువులెవరూ కుటుంబ విలువలు తెలిసినవాళ్ళు కాదు. వాళ్ళు దుఃఖంలో ఉన్న మా కుటుంబాన్ని మరింత ఇబ్బందిపెట్టాలనుకున్నారేగాని తండ్రిలేని కుటుంబం మంచిగా ఉందామనుకోలేదు. మా నాన్నగారికి తన తండ్రి ద్వారా రావాల్సిన ఆస్తుల విషయంలో కావాలని పరిష్కారం కాకుండా, మేము ఆర్థికంగా తక్కువగా ఉండేలా చేస్తూ అందరిముందు మేము తక్కువ స్థాయిలో ఉన్నామని నా పెళ్ళికి అడ్డు వేస్తుండేవారు. ఇలా ఉండగా, 2022లో నేను అప్పుగా చాలా పెద్ద మొత్తాన్ని నా స్నేహితుడికి వ్యాపార నిమిత్తం సహాయం చేశాను. తన వ్యాపారం సరిగా లేక తను నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఆ సమయంలో, అంటే 2022, ఏప్రిల్లో నేను బాబా లీలలు వింటూ, బాబా మందిరానికి తరచుగా వెళ్తూ, "బాబా! నువ్వే దిక్కు" అని ఆయననే నమ్ముకొని నా స్నేహితునికిచ్చిన అప్పు గురించి మర్చిపోయి మళ్ళీ కష్టపడి సంపాదించడం మొదలుపెట్టాను. అయితే, పెళ్లికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని మా బంధువులు చెడగొడుతుండేవారు. పైగా వాళ్ళు, 'బాబాని పూజిస్తామ'ని అందరిముందు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను నా పెళ్లి విషయాన్ని బాబా వద్ద చెప్పుకొని, "బాబా! నా పెళ్లికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడండి. అలా చేస్తే నేను తొందరలోనే మీ ద్వారకామాయికి వస్తాను" అని వేడుకొని భారం ఆయన మీదనే వేసాను. అలా కోరుకున్న కొన్నిరోజులకి ఒక మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా, నా ఆస్తిపాస్తులు చూడకుండా నా మంచితనం చూసి పెళ్లికి ఒప్పుకున్నారు. బాబా దయవల్ల నా బంధువులు కూడా ఎటువంటి ఆటంకాలు పెట్టలేదు. 2022 చివరిలో నా పెళ్లి జరిగింది. ఇక్కడ మరో ముఖ్య విషయమేమిటంటే, నేను అప్పు ఇచ్చిన నా స్నేహితుడు సరైన సమయంలో నా పెళ్ళికి కావాల్సినంత డబ్బు నేను అడగకుండానే సర్దుబాటు చేశాడు. ఇదంతా బాబా కృపతో జరిగిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఆయనకి చెప్పుకున్నట్లే ఏప్రిల్ 14న శిరిడీ వెళ్ళొచ్చాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". బాబాని నమ్ముకోండి.. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టరు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sairam
ReplyDeleteOm Sairam
Om Sairam
Om sai ram
ReplyDeleteOm sai ram please bless my family 🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం సాయి నన్ను నా వంశీని కలుపు సాయి నా కాపురాని నిలబెట్టు సాయి తను నన్ను అర్థం చేసుకుని భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకెళ్లి చూడు సాయి నేను తనకు దూరంగా ఉండలేక నరకం చూస్తున్నాను సాయి సహాయం చేయండి బాబా
ReplyDelete