సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1494వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా ప్రసాదించిన తమ దర్శనాలు

నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు హేమలత. ముందుగా సాయితండ్రికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ బ్లాగు ద్వారా బాబా తమకు ప్రసాదించిన అనుభవాలను పంచుకుంటున్న ప్రతి ఒక్క సాయి బంధువుకు నా నమస్సులు. ఆ సాయితండ్రి లీలలు ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువే. నేను ఇంతకుముందు బాబా 'నేను నీ వెనుకనే ఉన్నాను. నువ్వే నన్ను చూసుకోవట్లేదు' అని ఒకసారి, మరొకసారి కోవిడ్ సమయంలో నా తలనిమిరి నన్ను కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడేసిన విషయం మీతో పంచుకున్నాను. వాటికన్నా ముందు జరిగిన మరో అనుభవం ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను. అసలైతే ఈ అనుభవం నేను ఎప్పుడో పంచుకోవాలి. ఆలస్యమైనందుకు సాయితండ్రిని క్షమించమని వేడుకుంటున్నాను.

బాబా నాకు స్వప్నంలో పకీరు రూపంలో దర్శనమిచ్చి చాలాసార్లు మాట్లాడారు. ఆయన చాలా సందర్భాలలో "నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీ కుటుంబ బాధ్యత నాది. నీ భర్తని, పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వు నన్ను 'సాయి' అని పిలు" అంటుండేవారు. నేను ఆ స్వప్నం నుంచి మేల్కొన్న తర్వాత, 'బాబా నాతోనే ఉన్నా నేను మూర్ఖత్వంతో ఒక్కొక్క సమయంలో ఆయన నామస్మరణ చేయట్లేదు. అందుకే బాబా పదేపదే నన్ను హెచ్చరిస్తున్నారు. 'సాయి సాయి' అని పిలు అని చెప్తున్నారు' అనిపించి చాలా ఏడ్చేదాన్ని. ఇలా ఉండగా నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి బాబాకి నాలుగు హారతులు ఇస్తున్నాను. ఆ హారతులు ఇవ్వడం కూడా నాకు ఒక మిరాకిలే. దాన్ని మీతో తరువాత పంచుకుంటాను. కానీ ఇప్పుడు బాబా నాకు హారతి సమయాలలో ఇచ్చే దర్శనాలను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకసారి మధ్యాహ్న హారతి సమయంలో నేను బాబా హారతి వింటూ ఉన్నాను. మరో పది నిమిషాలలో హారతి పూర్తవుతుందన్న సమయంలో నేను తలుపు వైపు చూసేసరికి బాబా ఆ తలుపులో పకీరు రూపంలో దర్శనమిచ్చారు. వెంటనే నేను ఉన్న చోటు నుంచే ఫోటో తీసి మా బంధువులలో ఒకరికి పంపించాను(ఆ ఫోటో కింద ఇస్తున్నాను మీరు కూడా చూడండి). వాళ్లు ఆ ఫోటో చూసి, "అవును బాబా చాలా స్పష్టంగా  కనిపిస్తున్నారు" అని అన్నారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. సాయితండ్రి స్వప్నంలో చెప్పినట్టు నిజంగా నా వెనుకే ఉండి నన్ను ప్రతిక్షణం చూసుకుంటున్నారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ఎంత పుణ్యం చేసుకుంటే ఆయన భక్తురాలినయ్యానని ఆ దర్శనాన్ని తలుచుకుంటూ నా మనసు ఉప్పొంగిపోతుండేది.

అలా ఒక ఎనిమిది నెలలు గడిచాయి. తరువాత ఒకరోజు సంధ్య హారతి అనంతరం నా అలవాటు ప్రకారం నా భర్త వచ్చేవరకు బయట వాక్ చేద్దామని బయటకి వెళ్లేసరికి మేఘం రూపంలో బాబా నాకు దర్శనమిచ్చారు. నేను వెంటనే ఆ బాబా రూపాన్ని ఫోటో తీసి మా బంధువులకు పంపించాను. మా బంధువులు వెంటనే, 'బాబా నీకు విరాట్ సాయిలా దర్శనమిచ్చారు. నిజంగా బాబా నీకు భలే దర్శనాలు ఇస్తారు. చక్కగా స్వప్నంలో మాట్లాడతారు. నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు" అని అన్నారు. ఆ ఫోటో కూడా కింద జతపరుస్తున్నాను, చూడండి.
రెండు సంవత్సరాల క్రితం నేను సాయి దివ్యపూజ చేశాను. ఎవరైనా దివ్యపూజ ఏదైనా కోరికతో చేసుకుంటారు. అంటే సంతానం, ఆర్థిక సమస్యలు మొదలైన వాటికోసం చేసుకుంటారు. నాకూ ఆర్థిక సమస్యలున్నాయి. కానీ, "మీ కుటుంబ బాధ్యత మొత్తం నాదే" అని బాబా మాటిచ్చాక నేను మళ్ళీ ఏదైనా సమస్య కోసం బాబాను వేడుకుంటే నాకు ఆయనపై నమ్మకం లేనట్టే కదా! కాబట్టి నేను ఏ పూజ చేసినా బాబాని ఆయన దర్శనం కోసం మాత్రమే వేడుకుంటాను. అలాగే దివ్యపూజ చేసేటప్పుడు కూడా, "బాబా! నేను 5 వారాలు పూజ చేస్తాను. ఈ ఐదు వారాలలో మీరు నాకు ఏదో ఒక రూపంలో దర్శనం ఇవ్వండి. ఆ దర్శనం నాకే కాదు, తోటి సాయి బంధువులకి కూడా చూపించే విధంగా ఉండాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా ఐదవ వారం పూజ పూర్తి కాకముందే ఒక చామంతి పువ్వులో వంట పాత్రలో చేయి పెట్టి కలుపుతున్నట్లు నాకు దర్శనమిచ్చారు. చామంతి పువ్వులో బాబా అలా దర్శనమివ్వడం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజంగా మనసుపెట్టి బాబాను ఏదైనా అడగలేగాని ఖచ్చితంగా ఆయన మన కోరిక తీరుస్తారు. బాబాకు మనకు ఏమి ఇవ్వాలో తెలుసు. కానీ కొన్ని సందర్భాలలో మనం అనుభవిస్తున్న బాధలను తట్టుకోలేక, "బాబా! మీరు అన్ని చూసుకుంటారన్న నమ్మకంతో ఉన్నాం. కానీ రోజురోజుకీ ఎందుకిన్ని కష్టాలు" అని అనుకుంటాం. వాస్తవానికి నేను కూడా అలా అనుకుంటూ ఉంటాను. అయితే మరుక్షణంలోనే ఎవరో ఒకరి రూపంలో, ఏదో ఒక మెసేజ్ రూపంలో నాకు బాబా తమ సందేశం ఇస్తారు. "ధన్యవాదాలు బాబా. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నేనెప్పుడూ మీ సేవలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు నాలుగు ఆరతులు ఎటువంటి ఆటంకం లేకుండా చేసేలా నన్ను అనుగ్రహించండి. అలాగే ఎల్లవేళలా మీ దర్శన భాగ్యం నాకు కల్పిచండి. నాకు, నా కుటుంబానికి మీ పాదాల దగ్గర స్థానం ఎల్లవేళలా ఉండాలి. నా మనసులో ఉన్న చిన్న టెన్షన్ మీరు తొలగిస్తారనే నమ్మకంతో ఉన్నాను సాయి. నా టెన్షన్ తొలగిపోతే వెంటనే మీ అనుగ్రహాన్ని తోటి సాయి బంధువులతో పంచుకుంటాను. తోటి సాయి బంధువులు కూడా మీ అనుగ్రహాన్ని ఈ బ్లాగులో పంచుకోవాలి. ఎంతోమంది మీ లీలలు తెలుసుకొని మీ భక్తులుగా మారాలి. వాళ్ళకీ మీ అనుగ్రహంతో అనుభవాలు కలగాలి. తెలిసీతెలియక చేసే మా తప్పులను క్షమించండి. మీ సంపూర్ణ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... నీ భక్తురాలు".

6 comments:

  1. సాయి నన్ను నా భర్తని కలుపు సాయి వంశీ నన్ను అర్థం చేసుకుని కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి నాతో మళ్లీ మాట్లాడేలా చూడు స్వామి నన్ను భార్యగా స్వీకరించేలా చూడు సాగింది

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Chaalaa chakkani anubhavam post chesaru…..

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om Sairam 🙏🏻💐🙏🏻

    ReplyDelete
  6. Chala happy ga vundhi me anubhavam chaduvutunta.baba prema nu manasara asvadhistunamu.Thank you

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo