సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1503వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలు వచ్చిన ప్రతిసారీ కాపాడే సాయితండ్రి
2. కృపతో ఏ సమస్యా రాకుండా చూసిన సాయినాథుడు 

సమస్యలు వచ్చిన ప్రతిసారీ కాపాడే సాయితండ్రి

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మాది ఏలూరు. మా అమ్మాయివాళ్ళు హైదరాబాద్‍లో ఉంటారు. మేము తనకి మా ఊరిలో ఒక స్థలం ఇచ్చాము. 2022, ఏప్రిల్ నెలలో ఆ స్థలంలో వేరేవాళ్ళు రోడ్డు వేశారు. మేము వెళ్ళి అడిగితే, "తెలియక వేశాను, తీసేస్తాను" అని అన్నారు. కానీ తీయలేదు. మేము రెండు నెలలు చూసి మళ్ళీ అడిగితే తీస్తానన్నారుగానీ తీయలేదు. దాంతో మేము సాయిబాబాపై భారమేసి బుల్డోజర్‌తో ఆ రోడ్డు తీయించేసి స్థలం చుట్టూ కంచె వేయించాము. బాబా ఎంతో దయతో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఆ సమయంలో మా అమ్మాయి బాబా గుడిలో అన్నదానం చేస్తానని అనుకుంది. వాళ్లు హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు గురువారంనాడు అన్నదానం చేద్దామంటే గుడిలో ఖాళీలేదన్నారు. "సంక్రాంతి పండుగకి వచ్చేటప్పుడు చేయిద్దామ"ని నేను మా అమ్మాయితో చెప్పాను. తను, "నాకు అది నెలసరి సమయం" అంది. నేను తనతో, "మన బాబా చూసుకుంటారు" అని చెప్పి 2023, జనవరి 19వ తేదీన అన్నదానం చేయడానికి బుక్ చేయించాను. ఆ సాయితండ్రి దయవలన ఆటంకం లేకుండా అన్నదానం బాగా జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం మా అమ్మాయికి నెలసరి వచ్చింది.

కరోనాకు ముందు మా అబ్బాయి హైదారాబాద్‍లో ఒక ప్లాటు తీసుకున్నాడు. అయితే అది ఇంతవరకూ మా అబ్బాయికి స్వాధీనం చేయలేదు. 2022, నవంబర్ నెలలో బిల్డర్ ఫోన్ చేసి, "మీరు ఇంకా 8.50 లక్షలు రూపాయలు కట్టాలి" అని అన్నాడు. నిజానికి మేము మొత్తం డబ్బాలు కట్టేశాము. అలాంటిది బిల్డర్ అలా అడిగేసరికి మేము చాలా భయపడి, "ఏ సమస్యా లేకుంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మన సాయితండ్రిని వేడుకున్నాను. తరువాత ఫోన్ చేసి బిల్డర్‌తో మాట్లాడితే, "మీరు ఇవ్వాలనుకొని అడిగాను. ఏమీ అనుకోవద్దు" అని అన్నాడు. "శతకోటి వందనాలు సాయితండ్రీ. త్వరగా ఆ ప్లాట్ మా అబ్బాయి స్వాధీనమయ్యేలా చేయి తండ్రీ. ఈ విషయంలో భారమంతా నీదే తండ్రీ. నిన్నే నమ్ముకున్నాం. నా సమస్య తీరిన తరువాత మీ అనుగ్రహాన్ని సాయిబంధువులతో పంచుకుంటాను".

కృపతో ఏ సమస్యా రాకుండా చూసిన సాయినాథుడు 

సాయిబంధువులందరికీ నమస్కారం. ముందుగా సాయిభక్తులు అనుభవాలను తమ తోటి భక్తులతో పంచుకొనే అవకాశం కల్పిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేనొక సాయిభక్తుడిని. నా పేరు చల్లా.గురుమూర్తి. నేను గుంటూరు నివాసిని. ఆ సాయినాథుడు కృపతో నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను. 2023, ఫిబ్రవరిలో నాకు హెర్నియా సమస్య వచ్చింది. డాక్టర్ని సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. అది విని భయమేసి, "ఎలాంటి సమస్యా లేకుండా ఆపరేషన్ జరగాల"ని సాయిబాబాని వేడుకున్నాం. బాబా దయవలన మార్చి ఒకటో తేదీన ఆపరేషన్ ఎలాంటి సమస్యా లేకుండా జరిగి మరుసటిరోజు నుండి మామూలుగానే తిరగగలిగాను. ఇకపోతే, అప్పటికే మేము మార్చి 11న హైదరాబాద్ నుండి బయలుదేరి శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవడానికి ప్రణాళిక చేసుకొని ఉన్నాము. అయితే, 'ఆపరేషన్ అయిన పది రోజుల్లో ప్రయాణం చేయాలా, వద్దా' అన్న సందిగ్ధంలో పడ్డాము. ఏదేమైనా శిరిడీ దర్శనం వాయిదా వేసుకోవడం ఇష్టం లేక, "బాబా! ఎలాంటి ఆరోగ్య సమస్యా రాకుండా ప్రయాణం జరగాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటామ"ని సాయిదేవుని వేడుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాము. అయితే, ఇక్కడ మరో సమస్య ఉంది. మేము హైదరాబాదు నుండి శిరిడీకి రైలు టికెట్లు బుక్ చేసినప్పుడు లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ మాకు రెండు అప్పర్ బెర్తులు, ఒక మిడిల్ బెర్త్ వచ్చాయి. ఆ విషయంలో మేము ఎవరైనా లోయర్ బెర్త్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాము. మేము ట్రైన్ ఎక్కి మా సీట్లలో కూర్చోగానే లాల్చీ, పైజామా వేసుకున్న ఒక పెద్దాయన వచ్చి మా ఎదురు సీటులో కూర్చున్నాడు. ఆయన మేము అడగకుండానే, "నాది లోయర్ బెర్త్. కావాలంటే మీరు తీసుకోండి" అని అన్నారు. మేము ఆశ్చర్యపోయి ఇది కేవలం బాబా కృప వలనే జరిగిందని భావించాము. ఆయన కృపవలన మా ప్రయాణం కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా జరిగింది. శిరిడీలో బాబా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. శిరిడీ నుండి వచ్చిన మూడు రోజులకి అతి ముఖ్యమైన పెళ్లి కొరకు మళ్ళీ ప్రయాణం చేయవలసి వచ్చింది. అంటే, ఆపరేషన్ జరిగిన 20 రోజుల లోపల రెండవ ప్రయాణం. అప్పుడు కూడా, "ఎలాంటి సమస్యొ లేకుండా ప్రయాణం సాగేలా అనుగ్రహించమ"ని సాయిదేవుని వేడుకున్నాం. ఆ తండ్రి కృపవలన ఎలాంటి సమస్యా లేకుండా ప్రయాణం జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

3 comments:

  1. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo