1. బాబా కృపాకటాక్షాలు
2. పితృదేవతల పేరు మీద అన్నదానం విషయంలో బాబా అనుగ్రహం
బాబా కృపాకటాక్షాలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మనే నమః!!!
సాయి భక్తులకు నమస్కారం. నా పేరు మల్లీశ్వరి. మేము హైదరాబాదులో ఉంటాము. 1983 నుండి బాబా నాకు తెలుసు. ఆయన అనేక అనుభవాలతో నా భక్తిని నిశ్చలం చేస్తున్నారు. 2023, ఏప్రిల్ ఒకటవ తేదీన మా మరిది వేరే ఊరిలో ఉన్న మా బావగారి దగ్గరికి వెళ్దామని, పొలం సమస్యలు మాట్లాడదామని ఒకటే గొడవ చేశారు. ఆ రోజు నాకు జ్వరంగా ఉన్నందున శరీరం సహకరించడం లేదని నేను చెపితే తను కోప్పడ్డారు కానీ, నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఏం చేయలేని పరిస్థితిలో, "బాబా! ప్రోగ్రాం పైవారానికి వాయిదాపడేలా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ రాత్రి నేను మా మరిదికి ఫోన్ చేస్తే తీయలేదు. 'ఇంకా కోపం తగ్గలేదేమో! బాబాకి చెప్పాను కదా! చూద్దాం' అని ఊరుకున్నాను. బాబా కృపాకటాక్షాల వలన మా మరిది నాకు ఫోన్ చేసి, "సరే వదిన. ఇప్పుడు వెళ్ళోద్దులే, తర్వాత చూద్దాం" అని తనంతటతానే చెప్పాడు. అది విని నా సంతోషానికి అవధులు లేవు. ఆ ఆనందంలో ఈ అనుభవం బ్లాగులో పంచుకోవాలనుకున్నాను. "ఆలస్యం చేసినందుకు క్షమించు బాబా".
2022 కార్తీక మాసంలో మేము మా ఫ్రెండ్‌వాళ్ళ కుటుంబంతో శ్రీశైలం వెళ్ళాము. అభిషేకానికి వెళదామనుకుంటే ఆన్లైన్లో టిక్కెట్లన్నీ బుక్ అయ్యిపోయాయని అన్నారు. నేను, "బాబా! ఇంత దూరం వచ్చి అభిషేకం చేయించకుండా వెళ్లాలంటే బాధగా అనిపిస్తుంది. ఎలాగైనా మాకు టికెట్ దొరికేటట్లు చూడు తండ్రి" అని బాబాను స్మరించుకున్నాను. అంతలో అన్నయ్యగారు(నా ఫ్రెండ్ భర్త), "నేను కౌంటర్ దగ్గరకు వెళ్లి ప్రయత్నిస్తాను. మీరు ఈ లోపు మిగతా ఆలయాలు చూసి రండ"ని అన్నారు. మేము అన్ని ఆలయాలు దర్శించుకుని, శిఖర దర్శనం కూడా చేసుకొని రూమ్ చేరుకున్నాము. ఆ తండ్రి బాబా దయవల్ల మాకు అభిషేకం మరియు కుంకుమార్చన టిక్కెట్లు దొరికాయని తెలిసి నేను చాలా సంతోషించాను. అయితే టికెట్ మీద ఒక్కరినే పంపుతారట. నేను లైన్లో నిల్చొని, "అయ్యో! ఇంత దూరం వచ్చాము. నాతోపాటు మా పాప కూడా అభిషేకం చేస్తే బాగుంటుంది" అని బాబాని వేడుకుంటూ ముందుకు వెళ్ళాను. సెక్యూరిటీవాళ్ళు, "ఒక టికెట్ మీద ఒక్కరే వెళ్ళాలి" అని ఆపితే, "ప్లీజ్! మా పాపని కూడా పంపండి" అని అన్నాను. 500 రూపాయలు తీసుకొని పాపని కూడా వదిలారు. సంతోషంగా నేను, మా పాప అభిషేకం చేసుకున్నాము. తరువాత పాపతో కుంకుమార్చన చేయిద్దామని భ్రమరాంబ అమ్మవారి ఆలయం దగ్గర వేచి ఉండగా అక్కడ కూడా ఒక టికెట్ మీద ఒకరినే పంపుతారని అన్నారు. "అయ్యో! ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూడకుండా వెళ్లిపోవాలా బాబా" అని బాబాని తలుచుకుంటూ "బాబా! దయచూపు తండ్రి" అనుకోని అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాను. ఈ లోపు నా ఫ్రెండ్, "పూజ చేస్తున్న వాళ్ల తాలూకు వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చట. నువ్వు సంతోషంగా వెళ్ళు" అంది. దాంతో నేను సంతోషంగా భ్రమరాంబ అమ్మవారిని దర్శనానికి వెళ్ళాను. అమ్మవారు చక్కటి అలంకరణతో శోభాయమానంగా దర్శనమిచ్చారు. బాబా కరుణాకటాక్షాల వల్ల అమ్మవారిని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయాను. "సమర్థ సద్గురు సాయినాథ మీ పాదారవిందములకు అనంతకోటి వందనాలు". మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
పితృదేవతల పేరు మీద అన్నదానం విషయంలో బాబా అనుగ్రహం
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!
నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయినాథునికి నా నమస్కారాలు. నా పేరు నాగార్జున. సాయి ఆశీస్సులతో ఆయన ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకునేందుకు ఇలా మీ ముందుకు మరోసారి వచ్చాను. 2022, ఫిబ్రవరి 28న నాకు పొంగు(అమ్మవారు) వచ్చింది. నాకొచ్చిన 18 రోజులకి మా అన్నయ్యకి కూడా వచ్చింది. ఆ సమయంలో నేను బయటకి వెళ్ళకూడదు. కానీ నేను కొత్త అమావాస్య రోజున పితృదేవతల పేరు మీద అన్నదానం చేయాలనుకున్నాను. ఆ విషయమై ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక సాయికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో భక్తులెవరో, "మేము శిరిడీ వెళ్తున్నాము. ఎవరైనా సాయి అన్నదానానికి విరాళాలు పంపగలరు" అని మెసేజ్ పెట్టారు. కొంతసేపటి తరువాత నాకు, "వాళ్ళద్వారా, వీళ్ళద్వారా ఎందుకు? నేను నీ దగ్గరలేనా?" అని మాటలు వినపడ్డాయి. అప్పుడు నాకు, 'గతంలో శిరిడీ వెళ్ళినప్పుడు నేను చిలకలూరిపేట నిత్యాన్నదాన ట్రస్ట్‌కి విరాళం ఇచ్చానని, వాళ్ళు ఇచ్చిన రసీదు నా దగ్గర ఉంద'ని గుర్తొచ్చి అక్కడికే విరాళం పంపమని బాబా చెప్తున్నారనిపించింది. నేను వెంటనే ఆ రసీదులో ఉన్న ఫోన్ నెంబరుకి 'ఫోన్ పే' ద్వారా నాకు తోచిన విరాళం పంపి మా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యల పేర్ల మీద అన్నదానం చేయమని వాళ్ళకి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాను. కొద్దిసేపటికి వాళ్ళు నాకు ఫోన్ చేసి, "మీరు కోరిన రోజున మీ పెద్దల పేరు మీద అన్నదానం చేస్తాం" అని చెప్పారు. ఆరోజు(కొత్త అమావాస్య) రానే వచ్చింది. ఆరోజు సాయంత్రం ఈటీవిలో వచ్చే 'సద్గురుసాయి' సీరియల్లో దేవా అనే ఒకతను తన పితృదేవతలకు భోజనం పెడితే, వాళ్ళు స్వీకరించినట్లు టెలికాస్ట్ అయింది. తద్వారా నేను ఆరోజు చేయించిన అన్నదానంతో మా పితృదేవతలు సంప్రీతులయ్యారని బాబా తెలియజేసారు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. "ధన్యవాదాలు సాయి. నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు తండ్రి. పదిమందికి మంచి చేసే విధంగా నన్ను, నా కుటుంబసభ్యుల్ని అనుగ్రహించు సాయి. మాకు ఏ సమయంలో ఏమి కావాలో మీకు తెలుసు. మీ ఆశీస్సులు సదా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".
Om sai ram my husband suffered in one girl matter. I harsh ly spoke d to him. Excuse me sai. His mood spoiled. Please bless him with long life baba
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sri SAI NADAIANA MAHA
ReplyDeleteOM SRI SAI NADAIANA MAHA
OM SRI SAI NADAIANA MAHA
BABA HELP ME AND MY WIFE SAI PRASANNA
GOOD HEALTH WITH YOUR BLESSINGS BABA
WE RECIEVED YOUR BLESSINGS MANY TIMES,
,
,