ఈ భాగంలో అనుభవాలు:
1. తలుచుకోగానే 'నేనున్నా'ని సమస్యలు తీరుస్తున్న బాబా
2. చిరకాల కోరికను నెరవేర్చిన బాబా
తలుచుకోగానే 'నేనున్నా'ని సమస్యలు తీరుస్తున్న బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తుడిని. ఈమధ్య మేము ఒక పని మీద మా 6 నెలల బాబుని తీసుకొని హైదరాబాద్ వెళ్ళాము. తిరిగి ఇంటికి వచ్చాక బాబుకి జలుబు, దగ్గు మొదలయ్యాయి. మందులు వాడినా తగ్గలేదు. అలా ఉండగా ఒకరోజు ఉదయం 6:30కి నా భార్య ఆఫీసు పని మీద 4 గంటల ప్రయాణ దూరంలో ఉన్న పూణేకి వెళ్ళింది. అదేరోజు బాబుకి జలుబు వల్ల ముక్కు నుండి కంటిన్యూగా నీరు కారుతూ సాయంత్రం అయ్యేసరికి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముక్కు బ్లాక్ అయిపోయి తను పాలు తాగడానికి కూడా కుదరలేదు. తను శ్వాస తీసుకోడానికి, నిద్రపోవడానికి చాలా ఇబ్బందిపడుతుంటే నేను బాబాకి నమస్కరించి, "బాబా! బాబు ఆరోగ్యం బాగుపడితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తరువాత బాబు నుదుటన బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీ నోట్లో వేసి హాస్పిటల్‍కి తీసుకొని వెళ్ళాను. డాక్టర్ పరీక్షించి సమస్య ఏమీ లేదని కొన్ని మాములు మందులు వ్రాశారు. నా భార్య రాత్రి 10.30కి వచ్చి బాబుకి పాలు పట్టి, బాబాని ప్రార్థించి మందులు వేసి పడుకోబెడితే హాయిగా నిద్రపోయాడు. "ధన్యవాదాలు బాబా".
తరువాత ఒక రోజు సాయంత్రం బాబు హఠాత్తుగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎంతమంది ఎంతలా సముదాయించినా తను ఏడుపు ఆపలేదు. తన నుదుటన బాబా ఊదీ పెట్టి 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని పఠించి బాబుని దగ్గర్లో వున్న హాస్పిటల్‌కి తీసుకెళ్లి చూపించాము. డాక్టరు, "బాబు చెవిలో ఇన్ఫెక్షన్ అయింది" అని చెప్పి మందులిచ్చి, "రేపటి వరకు ఇలానే ఉంటుంది" అని చెప్పారు. నేను బాబాని తలుచుకొని, "బాబా! బాబు ఉదయానికల్లా నవ్వుతూ మునుపటిలా మాములుగా ఉంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల బాబు మరుసటిరోజు ఉదయం చక్కగా నవ్వుతూ మేల్కొన్నాడు. తరువాత కూడా బాబుకి ఆ ఇబ్బంది మళ్ళీ రాలేదు.
బాబుకి ఏడో నెల వచ్చాక హఠాత్తుగా తల్లి పాలు తాగడం మానేశాడు. కేవలం డబ్బా పాలే త్రాగేవాడు. అలా రెండు రోజులు గడిచింది. తల్లి పాలుకి మించిన పౌష్ఠికాహారం లేనందున నా భార్య పాలు వస్తున్న కూడా బాబు తాగడం లేదని చాలా బాధపడింది. అప్పుడు నేను, "బాబా! బాబు మునుపటిలా తల్లి పాలు తాగుతూ ఆరోగ్యంగా ఉంటే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా చేసిన అద్భుతం చూడండి. ఆ రోజు సాయంత్రం నుండి బాబు నిద్రలో కొంచెం కొంచెంగా నిద్రలో తల్లి పాలు తాగడం మొదలుపెట్టాడు. మరుసటిరోజు మెలకువలో కూడా తల్లి పాలు తాగి నా భార్యను సంతోషంలో ముంచాడు. అంతా మన బాబా దయ. "ధన్యవాదాలు బాబా. ఇలానే నా భార్య, బిడ్డలను ఎల్లపుడూ సంరక్షిస్తూ ఉండు తండ్రి. మీరే కనుక లేకపోతే మీ భక్తుల పరిస్థితి ఏంటి? 'బాబా' అని తలుచుకోగానే 'నేనున్నా'ని వాళ్ల సమస్యలు తీరుస్తున్నావు తండ్రి. నేను తెలియక ఒక పెద్ద పొరపాటు చేశాను తండ్రి. దయతో నన్ను మనస్పూర్తిగా క్షమించు తండ్రి. మరెప్పుడూ అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను తండ్రి. మీ అనుగ్రహం మా కుటుంబంపై, మీ భక్తులందరిపై ఎల్లప్పుడూ చూపుతూ కాపాడు తండ్రి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
చిరకాల కోరికను నెరవేర్చిన బాబా
నాపేరు అపర్ణ. శ్రీసాయికి నమస్కరిస్తూ ఆ తండ్రి ఆశీస్సులతో నా అనుభవాన్ని తోటి సాయి భక్తులతో పంచుకోవడం ఆనందంగా ఉంది. నేను చెప్పబోయే విషయం ఇతరులకి చిన్నదిగా అనిపించవచ్చు కానీ, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నా బిడ్డ కోరికను శ్రీసాయినాథుడు కృపతో నెరవేర్చారు. ఇక విషయానికి వస్తే... మా అబ్బాయికి క్రికెట్ అంటే ఎనలేని అభిమానం. తనే కాదు మా కుటుంబంలో పిల్లలంతా క్రికెట్ అభిమానులు. అయితే రాజమండ్రిలో ఉండే మాకు ప్రత్యేక్షంగా క్రికెట్ చూసే అవకాశం ఎప్పుడోగానీ దొరకదు. అందువల్ల 2023, మార్చ్ 19న వైజాగ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌కి మా అబ్బాయి, మా బావగారి అబ్బాయి మాకు తెలిసిన ఒకతనితో కలిసి వెళ్ళాలని అనుకున్నారు. అయితే రెండు రోజుల ముందు నుంచి భారీవర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. మా అబ్బాయి సాయి భక్తుడు. తను ఏ విషయంలోనైనా శ్రీసాయినాథుని సహాయం, ఆశీర్వాదం సదా కోరుతుంటాడు. తను క్రికెట్ మ్యాచ్ విషయంలో కూడా బాబాను, "నా చిరకాల కోరిక తీర్చండి బాబా. నా అనుభవం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి విన్నవించుకొని ధైర్యంగా ఉన్నాడు. నేను కూడా "నా బిడ్డ కోరిక నెరవేరితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. మన తండ్రి తన బిడ్డల అతి చిన్న కోరికల్ని కూడా నెరవేరుస్తారు. ఆయన దయవల్ల ఆ రోజు ఉదయం వరకు కురిసిన కుంభవృష్టి పిల్లలు మ్యాచ్కి బయలుదేరే సమయానికి పూర్తిగా ఆగిపోయింది. అంతేకాక పిల్లలు మైదానానికి 4వ వరసలో కూర్చుని ఆటను చూసి ఆనందించారు. అలా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నా బిడ్డ కోరిక తీరింది. అయితే మ్యాచ్ ఓడిపోవడం వల్ల నా బిడ్డ, "అమ్మా! నేను మ్యాచ్ ఏ అవాంతరాలు లేకుండా చూడాలని మాత్రమే బాబాని అడిగాను. మ్యాచ్ గెలవాలని బాబాకి విన్నవించుకోవాల్సింది" అని బాధపడ్డాడు. శ్రీసాయితండ్రికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఆయన తమ బిడ్డల చేయి ఎన్నడూ వదలక వారిని కంటికి రెప్పలా కాపుకాస్తుంటారు. మనం అపరిమితమైన శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండి ఆ తండ్రికి సర్వస్యశరణాగతి చేయాలి. అదే మనకి పరమపదం. "ధన్యవాదాలు సాయినాథా".
ఓం సాయి రక్షక శరణం దేవా!!!
ఓం సాయిరాం సాయి నన్ను వంశీని కలుపు సాయి తను నన్ను అర్థం చేసుకొని నాకోసం మళ్లీ తిరిగి వచ్చే భార్యగా స్వీకరించికాపురానికి తీసుకెళ్లాలని చూడు సాయి
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me