ఈ భాగంలో అనుభవాలు:
1. పిలిస్తే పలుకుతారు బాబా2. సాయిదేవుని అనుగ్రహం
పిలిస్తే పలుకుతారు బాబా
నేను సాయిభక్తురాలిని. నా పేరు పద్మజ. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నేను మొదట్లో సచ్చరిత్ర చాలాసార్లు చదివాను. బాబా భక్తుల అనుభవాలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. నేను రోజూ బాబాని, "నిజజీవితంలో భక్తులకి జరిగే అనుభవాలు చదవాలని ఉంది. ఎలా? ఎక్కడ దొరుకుతాయి బాబా?" అని అడుగుతూ గూగుల్లో సెర్చ్ చేసి భక్తుల అనుభవాలు చదువుతుండేదాన్ని. ఆ క్రమంలోనే ఒకరోజు ఫేస్‌బుక్‍లో ఈ బ్లాగ్ నాకు కనిపించింది. బాబానే చూపించారు. అప్పటినుంచి ప్రతిరోజూ పొద్దున్నే 6:30 ప్రాంతంలో 'సాయి మహరాజ్ సన్నిధి' షేర్ చేసే సాయిభక్తుల అనుభవాలు చదవడానికి నేను నిరీక్షిస్తూ ఉంటాను. వాటిని చదివి ఆనందిస్తున్నాను. అవి నాకు చాలా బాగా నచ్చుతాయి.
2023, ఫిబ్రవరి 9వ తేదీ ఉదయాన నేను ఈ బ్లాగు ఓపెన్ చేయగానే పైన ఇచ్చిన బాబా మెసేజ్ వచ్చింది. తర్వాత నేను నా ఆఫీసుకు వెళ్లాను. అక్కడ మా సార్ నా పెళ్లి గురించి కొంచెం వెక్కిరిస్తూ ఎగతాళిగా మాట్లాడారు. నాకు చాలా అంటే చాలా బాధేసింది, ఏడుపు కూడా వచ్చింది. నేను ఆరోజు ఉదయం వచ్చిన బాబా మెసేజ్‍ని గుర్తు చేసుకొని ఓపికగా మా సార్‌తో, "బాబా ఈరోజు నన్ను ఎవరితో వాదించవద్దని అన్నారు. కాబట్టి నేను మీకు ఏ సమాధానం చెప్పను" అని నవ్వుతూ చెప్పాను. అందుకు ఆ సార్ మళ్లీ వెక్కిరిస్తూ, "బాబా నీకు ఫోన్ చేసి చెప్పారా?" అని నవ్వారు. నేను దానికి కూడా ఏం సమాధానం చెప్పక మౌనంగా ఆ బాబా మెసేజ్ గుర్తుచేసుకున్నాను. తర్వాత నా బాధను బాబాకి చెప్పుకొని ఆ మెసేజ్‍ని నా వాట్సాప్ స్టేటస్‍లో పెట్టుకున్నాను. వెంటనే అంతకుముందు నన్ను వెక్కిరించిన మా సార్, "సారీ, ఐ హర్ట్ యు" అని నాకు మెసేజ్ పెట్టారు. "నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బాబా. మీరు పిలిస్తే పలుకుతారు బాబా".
2023, మార్చి 27, ఉదయం నేను గుడికి వెళ్లి, బాబా దర్శనం చేసుకున్నాను. కాసేపటికి తిరిగి ఇంటికి వెళదామని నా స్కూటీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాలేదు. చూస్తే, స్కూటీలోని పెట్రోల్ లీక్ అయి బండిలో పెట్రోల్ అయిపోయింది. నా దగ్గర ఒక 50 రూపాయలు ఉంటే, ఆ డబ్బులతో బండిలో పెట్రోల్ పోయించుకున్నాను. తరువాత బండి మీద వెళ్తూ, 'ఈ పెట్రోల్ తొందరగా అయిపోతుంది. వంద రూపాయల పెట్రోల్ అయితే ఒక రెండు రోజులకి వస్తుంద'ని అనుకుంటూ మనసులోనే, "వంద రూపాయలు ఉంటే బాగుండు బాబా. బండిలో పెట్రోల్ పోయించుకోవాలి" అని బాబాతో చెప్పుకున్నాను. ఇంటికెళ్లి, ఆపై నా డ్యూటీకి వెళ్ళాను. మధ్యాహ్నం ఏదో పనిమీద బయటికి వెళ్తుంటే రోడ్డు మీద నాకు వంద రూపాయల నోటు కనిపించింది. నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యమేసింది. వంద రూపాయలు దొరికినందుకు కాదు, 'నా మాటలు బాబాకి వినిపించాయి' అని. నా జీవితంలో ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో చేసిన బాబా ఈ అనుభవంతో 'నీకు నేనున్నాన'ని ఇంకొకసారి నిరూపించారు. "థాంక్యూ సో మచ్ బాబా. నాకు ఒక పెద్ద సమస్య ఉంది. ఆ విషయంలో మీరు నాకు సమాధానమిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు దాన్ని తీర్చేస్తారనుకుంటున్నాను. కాకపోతే సమయం పడుతుందేమోనని సహనంగా మీ మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను బాబా".
సాయిదేవుని అనుగ్రహం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు శ్రేయ. సాయిదేవుడు మనల్నే కాదు, మనకు సంబంధించినవాళ్ళని కూడా ఆపదలో ఉన్నప్పుడు కాపాడతారని నా అపార నమ్మకం. ఒకరోజు మా అన్నయ్యకు ఛాతీలో నొప్పి వస్తే, వెంటనే తనని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేయాలని చెప్పారు. అయితే మాకు ఆ ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరూ పరిచయం లేనందున మేము ఇంటికి తిరిగి వచ్చేసి మరునాడు మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. ఆయన కూడా అన్ని పరీక్షలు చేసి, "మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రామ్ చేస్తేగానీ గుండె నరాల్లో బ్లాక్స్ ఉన్నాయో, లేదో తెలియదు. ఒకవేళ బ్లాక్స్ ఉంటే వెంటనే స్టెంట్ వేయాల"ని చెప్పారు. అప్పుడు నేను మన ఆరాధ్యదైవమైన సాయికి, "బ్లాక్స్ ఏమీ లేకపోతే, స్టెంట్ వేయవలసిన అవసరం రాకపోతే నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. సాయి దయవలన అన్నయ్య గుండెలో బ్లాక్స్ ఏమీ లేవని డాక్టర్ చెప్పారు. "ధన్యవాదాలు బాబా. మా అన్నయ్య ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. తనని ఆ కష్టాల నుండి మీరు కాపాడుతారని నమ్ముతున్నాను బాబా".
Om Shri Sainathaya namah
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sai Sri Sai Jai jai sai
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteసాయి నన్ను నా భర్తని కలుపు సాయి నవంశీ నన్ను అర్థం చేసుకొని కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి నాకు అన్ని దంపత్యాన్ని ప్రసాదించు సాయి
ReplyDeleteOm sai ram
ReplyDeleteJAISAIRAM
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏
ReplyDelete