1. సమాధి అనంతరమూ బాబా మహత్యానికి లోటు లేడు
2. విడిపోయిన జంటను కలిపిన బాబా
సమాధి అనంతరమూ బాబా మహత్యానికి లోటు లేడు
నా పేరు వెంకట సాయినాథ్. మా తాతగారు JVBనాయుడు బాబాకి గొప్ప భక్తులు. ఆయనతో నేను 1968 తరువాత మొట్ట మొదటసారి శిరిడీ వెళ్ళాను. ఆ రోజుల్లో సమాధిపైకి వెళ్లి బాబాని తాకి పాలు, పెరుగుతో సమాధిని అభిషేకించి వీలుండేది. కాకడ ఆరతికి హాజరైన వాళ్ళందరినీ వరుసలు కుర్చోపెట్టి పదేసి మందిని ఒకసారి సమాధి ఉన్న అరుగు మీదకి పంపేవారు. అలా పైకి వెళ్లిన మా తాతగారు సమాధిని అభిషేకించిన తరువాత మనసులో, "బాబా సమాధి అయి 50 సంవత్సరాలైంది కదా! ఇంకా ఆయన మహత్యం ఉందా?" అని అనుకున్నారు. మరుక్షణం అందరూ చూస్తుండగా ఎవరో ఒక్క తన్ను తంతే ఎలా పడతారో అలా పైనించి కిందపడ్డారు మా తాత. ఆ సమయంలో అక్కడున్న టెంపుల్ ఇంచార్జి శ్రీభాగ్వేగారు గబుక్కున మా తాతని పట్టుకొని, "ఏమైంది? అలా పడ్డారు" అని అడిగితే, "నా మనసులో ఇలా అనుకున్నాను. అంతే ఏమైందో నాకు తెలియకుండానే పడిపోయాను" అన్నారు మా తాత. అయితే ఆయనకి చిన్న దెబ్బ కూడా తగలలేదు. అలా బాబా తమ మహత్యానికి లోటు లేదని చాటారు. అప్పట్లో శిరిడీ వెళ్లాలంటే చాలా శ్రమపడాల్సి వచ్చేది. ముందుగా విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లి, అక్కడనుంచి రైలులో మన్మడ్ వెళ్లి, అక్కడనుంచి బస్సులో శిరిడీ వెళ్లాల్సి వచ్చేది. మేము 60 మంది వరకు వెళ్లేవెళ్ళాము. అక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు ఉండేవారు కాదు. శిరిడీ సంస్థాన్‌వాళ్ళు మమ్మల్ని మదరాసి అని అనేవాళ్ళు. ఆ రోజులే వేరు అంత కష్టపడి వెళ్లినప్పటికీ బాబా దర్శనంతో కష్టమంతా మరచిపోయేవాళ్ళం. అక్కడ 10రోజులు ఉన్నాక తిరిగి వస్తుంటే ప్రతి ఒక్కరికీ అయినవాళ్ళని వదిలి వస్తున్నట్లు చాలా బాధగా ఉండేది.
అప్పట్లో మేము మా ఇంటిలో ప్రతి గురువారం బాబా భజన చేసేవాళ్ళం. మా తండ్రి భాస్కరరావుగారు విజయవాడ జీవితభీమా సంస్థలో పనిచేసేవారు. ఆయన గురువారం ఉదయం ఇంట్లో పూజచేసి ప్రసాదం తీసుకెళ్లి ఆఫీసులోని బాయ్ నుంచి మేనేజర్ వరకు ఒక్కరికి తప్ప అందరికీ ఇచ్చేవారు. ఆ ఒక్కరూ ఆయనకి ప్రాణస్నేహితుడైన శ్రీజాస్తి శేషగిరిరావుగారు. ఆయన నాస్తికుడు. అలాంటి ఆయన కొన్నిరోజులకి మా నాన్నతో, "నేను మీ ఇంటిలో జరిగే భజనకి వస్తాను" అని అన్నారు. మా నాన్న, "మా ఇంట్లో పిల్లలు చిన్నవాళ్లు. వాళ్ళకి తోచినట్లు భజన చేసుకుంటారు. నువ్వు వచ్చి కూర్చో, నీకు నచ్చితే ఉండు, లేకపొతే వెళ్ళిపో" అన్న షరతు మీద అయిష్టంగానే ఆయన రావడానికి ఒప్పుకున్నారు. నాన్న అలా చెప్పడానికి కారణమేమిటంటే, ఒకరోజు శేషగిరిరావుగారు ఆఫీసుకి వెళ్లిన తరువాత ఆయన భార్య తన స్నేహితులతో కలిసి ఒక స్వామీజీని తమ ఇంటికి ఆహ్వానించి ఆయనకి పాదపూజ చేయసాగింది. అంతలో ఆఫీసుకని వెళ్లిన శేషగిరిరావుగారు పెన్ కోసం ఇంటికి తిరిగి వచ్చి జరుగుతున్న తతంగాన్ని చూసి కోపంతో ఆ స్వామీజీని బయటకి లాక్కుపోయి నానా తిట్లు తిట్టి, కొట్టి 'నా అనుమతి లేనిదే నా ఇంటికి ఎందుకు వచ్చావు?' అని గేంటేసారు. అలాంటి మనిషి కాబట్టే మా నాన్న ఇష్టంగా ఆయన్ని రమ్మని అనలేదు. అయినా మా నాన్న పెట్టిన షరతుకి ఒప్పుకొని శేషగిరిరావుగారు ఆ గురువారం మా ఇంటికి వచ్చి భజనలో కొంచెం సేపు ఉండి వెళ్లిపోయారు. తరువాత గురువారం కూడా వచ్చి భజనలో పాల్గొని ప్రసాదం కూడా తిని వెళ్లారు. ఇంకో గురువారం అందరికంటే ముందు వచ్చి కూర్చున్నారు. భజన మొదలయ్యాక ఆయన కళ్ళు వాటంతట అవే మూతపడి నీళ్లు కారసాగాయి. తుడుచుకుంటున్న ఆ కన్నీటి ధార ఆగలేదు. భజన అయిపోయి అందరూ వెళ్ళిపోయినా ఆయన వెళ్ళకుండా మా నాన్నతో జరిగిందంతా చెప్పారు. అలా బాబా పరమ నాస్తికుడిని ఆస్తికుడిగా మార్చారు.
విడిపోయిన జంటను కలిపిన బాబా
సాయి పరివారమందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. 2021 సెప్టెంబరులో కొన్ని కారణాల వల్ల మా అక్క, బావ బాగా గొడవపడ్డారు. దాంతో మా కుటుంబంలోని వాళ్ళు అక్కని మా ఇంటికి తీసుకొచ్చేసారు. ఒక సంవత్సరంపాటు అక్క తన ఇద్దరి పిల్లలితో మా ఇంట్లోనే ఉన్నాక తను ఇంక మా బావ దగ్గరకి వెళ్లనని నిర్ణయం తీసుకుంది. మా బావ కూడా తను నాకొద్దు విడాకులు తీసుకుంటామని నిర్ణయించుకున్నాడు. ఎవరెన్ని చెప్పినా వాళ్ళు వినలేదు. ఎన్ని గొడవలు జరిగినా మాకు ఎవరూ మద్దతునివ్వలేదు. ఇలా ఉండగా 2023, మార్చిలో నేను ఎందుకోగానీ, "బాబా! అక్కాబావ కలిస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత 15 రోజులకి 2023, ఏప్రిల్ 3న అనుకోకుండా గొడవ మొత్తం సద్దుమణిగి వాళ్లిద్దరూ కలిసిపోయారు. ఆ పరిణామాన్ని అసలెవరూ ఊహించలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. దయచేసి నాకున్న కోరిక తీర్చు తండ్రి. అది నేరవేరితే మీ అనుగ్రహాన్ని మీ పరివారం అందరితో పంచుకుంటాను తండ్రి".
సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDelete