ఈ భాగంలో అనుభవాలు:
1. తొందరగా చికెన్‌పాక్స్ తగ్గేలా దయచూపిన బాబా2. గృహప్రవేశానికొచ్చి మా ఇంట కొలువైవున్న బాబా
తొందరగా చికెన్‌పాక్స్ తగ్గేలా దయచూపిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒకరోజు మా చిన్న అబ్బాయి స్కూలు నుంచి వచ్చాక, "ఏదోలా ఉంద"ని తినకుండా పడుకొని కాసేపయ్యాక లేచాడు. నేను, "తింటావా కొంచెం?" అని అడిగితే, "ఎలానో ఉంది. తినాలని లేదు" అన్నాడు. తను బట్టలు మార్చుకుంటుంటే చూస్తే, చికెన్‌పాక్స్ వచ్చిందని తేలింది. వెంటనే తనని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాము. డాక్టరు చూసి, "మైల్డ్ చికెన్‌పాక్స్" అన్నారు. నేను బాబాని, "ఏమీ కాకుండా తొందరగా తగ్గేలా చూడు సాయీ" అని వేడుకున్నాను. బాబా దయవల్ల మూడు రోజులకి తగ్గిపోయి తను మామూలు అయ్యాడు. మరుసటి వారం మా పెద్ద అబ్బాయికి కూడా చికెన్‌పాక్స్ వచ్చినప్పటికీ బాబా దయవల్ల తనకి కూడా తొందరగానే తగ్గిపోయింది. "థాంక్యూ సాయీ. ఎప్పుడూ ఇలాగే అందరికీ తోడుగా ఉండు స్వామీ".
నేను ప్రతి గురువారం బాబాకి 108 బంగారుపూలతో పూజ చేసి శనివారం వాటిని తీసిపెట్టుకుంటాను. ఒకసారి పూజయ్యాక శుభ్రపరుస్తుంటే ఒక పువ్వు కన్పించలేదు. అంతా వెతికినా దొరకలేదు. నేను మాత్రమే కాకుండా మా పిల్లలిద్దరూ లెక్కించినా 107 పువ్వులే ఉన్నాయి. అయితే శివరాత్రినాడు శివుని అష్టోత్తరం చదువుతుంటే 108 పువ్వులున్నాయి. అలా ఎలా ఉన్నాయో తెలియక చాలా ఆశ్చర్యమేసింది. ఏదేమైనా బాబా దయవల్లే అది మళ్ళీ మాకు దొరికింది. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ".
ఇటీవల నా ఆఫీసు వర్క్‌లో నాకు ఒక సమస్య వచ్చింది. నేను దాన్ని పరిష్కరించాక మా లీడ్ అప్రూవ్ చేయాల్సి ఉండగా ఆవిడ తొందరగా అప్రూవ్ చేయలేదు. ఒకపక్క నేను ఆ పని పూర్తిచేయాల్సిన గడువు సమయం సమీపిస్తోంది. నేను ఆవిడకి నా పరిస్థితి విస్తరిస్తున్నా తను వినేదికాదు. చివరికి నేను టెన్షన్‍తో, "విషయం మీకే వదిలేస్తున్నాను సాయీ. ఎలాగైనా గడువు సమయం సమీపించేలోపు ఆవిడ అప్రూవ్ చేసేలా చూడు తండ్రీ" అని బాబాకి చెప్పుకొని ఆయన నామస్మరణ చేశాను. హఠాత్తుగా ఆవిడ అప్రూవ్ చేసినట్టు మెయిల్ వచ్చింది. "థాంక్యూ సాయీ".
గృహప్రవేశానికొచ్చి మా ఇంట కొలువైవున్న బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. భక్తుల అనుభవాలను ప్రచురిస్తూ తోటి భక్తుల సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఈ బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను బాబా భక్తురాలిని. నా పేరు మల్లిక. చిన్నప్పటినుండి ప్రతి విషయంలో బాబా నాకు తోడుగా ఉన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ప్రతి సంవత్సరం శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని వస్తాను. బాబా నాకు ఒక సొంత ఇంటిని ప్రసాదించారు. ఆ ఇంటి గృహప్రవేశానికి ముందు మా స్నేహితులు శిరిడీ వెళ్తుంటే, "గృహప్రవేశానికి రమ్మని పిలిచానని బాబాతో చెప్పండి" అని అన్నాను. వాళ్ళు సరేనని శిరిడీ వెళ్లి, 'నేను పిలిచాన'ని బాబాతో చెప్పారు. బాబా గృహప్రవేశానికి ఎలా వస్తారో అని నేను ఎదురుచూశాను. 2021, జనవరి 7వ తేదీ రాత్రి గృహప్రవేశం జరిగింది. తెల్లవారాక జూన్ 8, గురువారంనాడు ఫంక్షన్. ఆరోజు పొద్దున్న నా స్నేహితురాలు శిరిడీ ఊదీ ప్యాకెట్లు తీసుకొని వచ్చింది. నేను చాలా ఆశ్చర్యానందాలకు లోనయ్యాను. అదేరోజు రాత్రి 9:30 సమయంలో మాకు తెలిసిన ఒక ఆంటీ, 'పొద్దున్న ఫంక్షన్‍కి రాలేకపోయాన'ని వచ్చారు. ఆమె తనతోపాటు ఒక బాబా ఫోటో తీసుకొచ్చి మాకు కానుకగా ఇచ్చారు. బాబా ఈ రూపంలో మా ఇంటిలో అడుగుపెట్టారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఒకటి కాదు, బాబా నా జీవితంలో చాలా చేస్తున్నారు.
ఈమధ్య మా బాబు స్కూలుకి వెళ్తూ పడిపోయాడు. అ సమయంలో నేను బాబా పుస్తకం తీస్తే, "పిల్లలు జాగ్రత్త" అని వచ్చింది. సరిగ్గా అప్పుడే మా ఇంటిలో గోడ మీద కింది విధంగా బాబా ఆకారం దర్శనమిచ్చింది.
మా బాబు 10వ తరగతికి వచ్చాడు. తను మొబైల్ ఫోన్ కారణంగా సరిగా చదవడంలేదు. తను మొండితనంతో చెప్పిన మాట వినడు. అందుచేత నేను బాబాతో, "బాబా! బాబు జీవితం బాగుండాలంటే తను ఫోన్ వాడకూడదు. ఏదో విధంగా ఫోన్ వాడి దగ్గర లేకుండా చేయండి బాబా. బాబు ఫోన్ వాడకుండా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. అప్పుడు బాబా ఫోటోకి పెట్టిన ఒక పువ్వు కిందపడింది. అంతే, బాబు ఫోన్ పాడైపోయింది. బాబా దయవల్ల ఇప్పుడు బాబు ఫోన్ చూడటం తగ్గించాడు. "కృతజ్ఞతలు బాబా. బాబు భవిష్యత్ బాగుండాలని ఒక తల్లిగా నేను అలా కోరుకున్నాను. తప్పైతే క్షమించండి బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteJai sairam 🌷🙏
ReplyDelete