1. సమస్యలేవైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారు2. పారాయణ పూర్తికాకముందే అనుగ్రహంచిన బాబా
సమస్యలేవైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారు
నేను సాయినాథుని భక్తపరమాణువుని. నాపేరు బదరీనాథ్. మాది పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలు. ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. మీరు బ్లాగు నిర్వహించకపోతే లక్షలాది సాయిభక్తుల అనుభవాలను తెలుసుకునే భాగ్యం మాకు ఉండేది కాదు. నేను ఇప్పుడు చెప్పబోయే అనుభవాలు చదివి కొంతమందికి 'ఇంత చిన్న విషయం కూడా చెప్పుకోవాలా?' అనిపించినా, ఇంకొందరు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు మా ఇంటిలోని 32 ఇంచుల ఎల్ఈడి టీవీ హఠాత్తుగా ఆగిపోయింది. ఆ విషయం నా ఫ్రెండ్‌కి చెప్తే, "ఎల్ఈడి టీవీ రిపేరు వస్తే, ఇక అంతే! ఐదు వందలకో, వెయ్యికో అమ్మేసుకోవడమే. రిపేర్లు అవ్వవు. రిపేర్ అయినా ఆ డబ్బుతో కొత్తది కొనేసుకోవచ్చు" అని అన్నాడు. కానీ నేను ఆ టీవీ మా చెల్లి నాకు ఇచ్చిందన్న సెంటిమెంట్‌తో ఎంతైనా రిపేరు చేయించాలని నిర్ణయించుకొని నా ఫ్రెండ్‌తో కలిసి టీవీ తీసుకొని మెకానిక్ దగ్గరకు వెళ్లాను. అతను, "చూసి, రేపు సాయంత్రానికి కంప్లైంట్ ఏమిటో, ఎంత అవుతుందో చెప్తాను" అని, "వీటికి రిపేరు చేస్తాము కానీ, వారంటీ ఇవ్వడం ఉండదు. ఒకవేళ మీకు కొత్త టీవీ కావాలంటే నెలనెలా కట్టుకునేలా షాపులో ఫైనాన్సు ఇప్పిస్తాను" అని అన్నాడు. "రిపేరుకు ఎంత అవుతుందో చెప్పండి. కొత్త టీవీ విషయం తర్వాత ఆలోచిద్దాం" అని చెప్పి మేము వచ్చేసాం. నా ఫ్రెండ్, "పదివేలకు పైనే అవ్వొచ్చు. కొత్తది తీసుకోవచ్చు కదా! వారంటీ కూడా ఉంటుంద"ని సలహా ఇచ్చాడు. మరునాడు ఉదయం నేను నా నిత్యపూజలో బాబాతో, "తండ్రి సాయిదేవా! ఐదువేల రూపాయల లోపు టీవీ బాగయ్యేలా చూడు తండ్రి. అలా అయితే మీ అనుగ్రహాన్ని తప్పకుండా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా మన కుటుంబసభ్యులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. సాయంత్రం నా ఫ్రెండ్‌తో కలిసి రిపేర్ షాపుకు వెళితే మెకానిక్, "స్పేర్స్ 4,800 రూపాయలు, సర్వీస్ చార్జీ 500 రూపాయలు. మొత్తం 5,300 రూపాయలు" అన్నాడు. అది విని నా ఆనందానికి అవధులు లేవు. డబ్బులు గురించి కాదుగాని సాయిదేవుని దృష్టిలో నేను ఉన్నాను, ఆయన నా మాటలు విన్నారు, నా సెంటిమెంట్‌ను కాపాడారు, అన్ని కోట్లమంది భక్తుల్లో నన్ను కూడా గుర్తుపెట్టుకున్నారు అదే నా ఆనందానికి కారణం. "సాయి సమర్థా! ఇంతకంటే ఏం కావాలి తండ్రి. మీకు నా శతకోటి వందనాలు".
2023, ఏప్రిల్ 15న నేను క్యారెట్ జ్యూస్ తయారుచేసి ఆఫీసుకి వెళ్లేటప్పుడు తీసుకువెళదామని డీప్ ఫ్రిజ్‍లో ఉంచాను. తరువాత వంట చేసుకొని, టిఫిన్ తిని తయారై ఆఫీసుకు వెళ్ళబోతూ ఫ్రిడ్జ్‌లోని క్యారెట్ జ్యూస్ బాటిల్ తీస్తే, ఆ బాటిల్ పట్టింది పెట్టినట్టే ఉంది. ఏ మాత్రమూ చల్లబడలేదు. తీరా చూస్తే ఫ్రిడ్జ్ పని చేయడం లేదు. అదెప్పుడు ఆగిపోయిందో అర్థం కాలేదు. ఆఫీసుకి టైమ్ అయిపోతున్నా ప్లగ్ ప్రెస్ చేసాను, స్విచ్ చెక్ చేశాను. కానీ ఏం ప్రయోజనం లేదు. ఇక సాయినాథుడే దిక్కు అనుకుని ఆఫీసుకు వెళ్ళాను. నేను ఉండేది మొదటి అంతస్థులో. పైగా ఒక్కడినే ఉంటున్నాను. ఫ్రిడ్జ్‌ని మెకానిక్ షాపుకి తీసుకెళ్లాలంటే ఇరుకుగా ఉండే మెట్ల మీదనుంచి దింపటం, మళ్లీ పైకి ఎక్కించడం చాలా పెద్ద పని. అందుకు కనీసం నలుగురు మనుషులు కావాలి. ముందు వాళ్ళు దొరకాలిగా! సరే ఈ విషయాలన్ని సాయినాథుని చెవిన వేసి, "తండ్రీ! ఎలాగైనా ఫ్రిడ్జ్ పనిచేసేలా చేయండి. నేను సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పటికి ఫ్రిజ్ పని చేస్తుంటే గనక రేపే మీ అనుగ్రహాన్ని మన కుటుంబసభ్యులతో పంచుకోవడానికి 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి పంపుతాను" అని బాబాకి మ్రొక్కుకొని భారం ఆ తండ్రి మీద వేసాను. సాయంత్రం(రాత్రి) ఇంటికి వెళ్ళగానే ముందు ఫ్రిజ్ పని చేస్తుందో, లేదో చూసాను. బాబా దయవల్ల అది పనిచేస్తుండటంతో చాలా ఆనందించాను. మరమత్తు సమస్యలైనా, ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగ, విదేశీయాన సమస్యలైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారు. "ధన్యవాదాలు బాబా. మీకు చెప్పినట్లుగానే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. మీ పిల్లలందరినీ ఇలాగే కరుణించి కాపాడండి సాయిదేవా".
ఓం శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!
పారాయణ పూర్తికాకముందే అనుగ్రహంచిన బాబా
ప్రియమైన సాయి భక్తులకు ప్రణామాలు. నా పేరు బాలాజీ. నేను ఉదయాన్నే చేసే మొదటి పని ఏమిటంటే, ఈ బ్లాగులో ఆరోజు ప్రచురితమైన అనుభవాలను చదవడం. హృదయానికి హత్తుకునే ఆ అనుభవాలన్నీ చదవని రోజు అంటూ ఉండదు. ఇక నా అనుభవానికి వస్తే.. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టిన నా కొడుకు తనకి ఏ ఫీల్డ్‌లో ఉద్యోగం కావాలో ఖచ్చితంగా తెలియక ఒక నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంలో పడ్డాడు. అప్పుడు నేను, "బాబా! నా కొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు తగిన ఉద్యోగం పొందేలా తనకి మార్గనిర్దేశం చేయండి" అని మన ప్రియమైన సాయిని ప్రార్థించి 'సచ్చరిత్ర' సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. ఆయన దయతో నా పారాయణ పూర్తికాకముందే నా కొడుకు అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నాడు. తను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలా ఎన్నో అనుభవాలు బాబా మాకు ప్రసాదిస్తూ ఉన్నారు. సాయితల్లి చూపుతున్న అనుగ్రహానికి మా కుటుంబం సదా ఋణపడి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నా హృదయపూర్వక ప్రణామాలు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram please be with me.please reduce tension and anxiety.please give positive thoughts.
ReplyDeleteSai Baaba you Allweys with me Bless me SAINAATHA
ReplyDelete