ఈ భాగంలో అనుభవం:
- అవధులు లేని సాయితండ్రి అనుగ్రహం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఒకసారి మావారు ఇంట్లో వాడకుండా ఉన్న కొన్ని బరువైన చెక్క బల్లలను సర్దుతుండగా అదుపు తప్పి కొంచెం ఎత్తు నుంచి కింద పడ్డారు. ఆ ఘటన వల్ల మావారి చేతికి దెబ్బ తగిలి కొంచెం వాపు వచ్చి, నొప్పి కూడా ఉండింది. సరిగ్గా ఆ సమయంలోనే మా అత్తగారికి రెండవసారి ఫ్రాక్చర్ అయ్యి ఉన్నందున నాకు భయమేసి "బాబా! మావారి చేతికి ఫ్రాక్చర్ కాకుండా ఉంటే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. తర్వాత డాక్టర్ దగ్గరకి వెళితే, కొన్ని ప్రాథమిక పరీక్షలు చేసి, 'అది ఫ్రాక్చర్ కాదు, కండరానికి తగిలిన దెబ్బ' అని చెప్పి, ఆయిల్, మెడిసిన్స్ వ్రాసిచ్చి, "కొద్ది రోజులు బరువులు ఎత్తకుండా జాగ్రత్తగా ఉండమ"ని అన్నారు. అలా చేయగా కొద్ది రోజులకు నొప్పి తగ్గిపోయింది. "ధన్యవాదాలు సాయితండ్రీ".
ఒకసారి మేము పని మీద వేరే వూరు వెళ్ళాము. అక్కడున్న మా బంధువులు తమ ఇంటిని వాడుకోమని ఆ ఇంటి తాలూకు రెండు జతల తాళాలు మాకు ఇచ్చారు. ఒక జత నా దగ్గర, ఇంకొక జత మావారి దగ్గర ఉంచుకున్నాము. తర్వాత నా దగ్గర ఉన్న ఇంటి తాళాలు కనబడలేదు. ఇల్లంతా వెతికానుకానీ ఎక్కడా కనపడలేదు. దాంతో ఆ ముందురోజు బజారుకు వెళ్లి ఉన్న నేను ఆ తాళాలను బయట ఎక్కడైనా పోగొట్టుకున్నానేమో అని అనుకుని, 'ఇప్పుడు మా బంధువులకు ఏమని చెప్పాలి?' అని కొంచెం కంగారుపడ్డాను. వెంటనే బాబాకు దణ్ణం పెట్టుకుని, "ఆ తాళాలు కనబడితే, మీ దయను బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల ఇంకొకసారి ఇల్లంతా వెతికితే తాళాలు దొరికాయి. "ధన్యవాదాలు బాబా".
ఒకసారి నేను, మా అమ్మాయి హైదరాబాదు వెళ్లి తిరిగి బెంగళూరు వస్తుండగా సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో మా అమ్మాయికి విరేచనాలు మొదలయ్యాయి. ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, మేము ఉదయం 7:30కి కానీ మా ఇల్లు చేరుకోలేము. ఆ ఎనిమిది గంటలసేపు ప్రయాణంలో విరేచనాలు అవుతుంటే కష్టం కదా! అదీగాక మరుసటిరోజు మా అమ్మాయికి నవగురువార పూజ కూడా ఉంది. ఆ పూజకు కూడా ఆటంకమవుతుందని కంగారుపడ్డాను. వెంటనే బాబాను స్మరించుకొని, "విరేచనాలు తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకొని ఒక గంటసేపు బాబా నామస్మరణ చేస్తూ కూర్చున్నాను. బాబా నా మొర ఆలకించారు. మా అమ్మాయికి విరేచనాలు ఆగిపోయాయి. మరుసటిరోజు తన పూజ కూడా బాగా జరిగింది.
అలానే ఇంకొకసారి నేను, మా అమ్మాయి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మేము కూర్చున్న బోగీలో మూడు సీట్లలో తప్ప అందరూ మగవాళ్లే ఉన్నారు. వాళ్లంతా మంచివాళ్లే. వాళ్ళ వల్ల మాకు ఏ విధమైన ఇబ్బందీ లేదు. కాకపోతే ఆడవాళ్లుగానీ, కుటుంబాలుగానీ ఉంటే మాట్లాడుకోవచ్చు అని, అంతే. ఇదే విషయం గురించి నేను నా మనసులో యథాలాపంగా బాబాతో మాట్లాడుకున్నాను. ఆశ్చర్యం! పక్క స్టేషన్లో ఒక ఫ్యామిలీ ఎక్కింది. వాళ్లలో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఒకసారి మా అత్తగారు కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు, మా మామగారికి, మా మరిదికి, మాకు మధ్య ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది. అది చిలికి చిలికి గాలివానై పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారింది. అందులో ఎవరి తప్పూ లేదు. (కొన్ని కారణాల వల్ల విషయాన్ని వివరంగా వ్రాయలేకపోతున్నందుకు మన్నించండి.) కానీ మా అత్తగారు కోపంతో మా మరిదివాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న ఆమె అలా మనసు కష్టపెట్టుకొని వెళ్లడం వల్ల నాకు బాధగా అనిపించింది. వెంటనే నేను, "ఆమె తిరిగి రావాల"ని బాబాతో చెప్పుకున్నాను. నాలుగు రోజుల తర్వాత మా అత్తగారు మా దగ్గరకి తిరిగి వచ్చారు. ఇప్పుడు అందరమూ బాగున్నాము. ఆమె ఆరోగ్యం బాగుంది.
ఒకసారి మా చెల్లెలు తన అత్తగారి పాత నగలు కరిగించి కొత్తవి తీసుకోవాలని అనుకుంది. అయితే తనకి బంగారం కొనుగోలు విషయంలో తగినంత అనుభవం లేనందున నన్ను కూడా తనతో రమ్మంది. నేను ఆ నగలు బాబా పాదాల దగ్గర పెట్టి, "బాబా! నేను నిన్ను నమ్ముకుని వెళ్తున్నాను. అంతా నీదే భారం" అని చెప్పుకున్నాను. తరువాత ఇద్దరమూ కలిసి బయటకి వెళ్ళాము. ముందు రెండు ప్రముఖ షాపులలో అడిగితే, 'ఆ నగలలో ప్యూరిటీ తక్కువగా ఉన్నందున తీసుకోము' అని చెప్పారు. ఇంకొక షాపులో అడిగితే వాళ్ళు, "నగలు కరిగించిన తర్వాత చూసిగానీ ఏమి చెప్పలేము" అని అన్నారు. అప్పుడు మా చెల్లి బాబాకి నమస్కరించుకొని, "ప్యూరిటీ బాగా ఉందని వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకుంది. బాబా దయవల్ల నగలు కరిగించిన తర్వాత 72% ప్యూరిటీ ఉందని వచ్చింది. ఆ నగలు ఇచ్చేసి వేరే నగలు తీసుకున్నాము. ఆ షాపువాళ్ళు అక్కడున్న బాబా ఫోటోకి ఆ కొత్త నగలు తాకించి, బాబాకి పెట్టిన పువ్వులు వాటిపై వేసి మాకిచ్చారు. మేము వాటిని బాబా ప్రసాదంగా తీసుకొని చాలా సంతోషించాము.
ఒకసారి మా చెల్లి ఒక ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తన బంగారు నెక్లెస్ తీసి హ్యాండ్‌బ్యాగులో వేసుకుంది. తర్వాత ఆ బ్యాగు తీసుకుని షాపింగ్‌కి వెళ్ళింది. రెండు రోజుల తర్వాత నెక్లెస్ కోసం వెతికితే అది బ్యాగులో కనిపించలేదు. వెంటనే తను బాబాను స్మరించి, "నెక్లెస్ దొరికితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకొని మరలా అన్ని బ్యాగులు వెతికితే ఆ నెక్లెస్ వేరే బ్యాగులో దొరికింది. సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా 'బాబా' అని స్మరించిన వెంటనే చేయి పట్టుకుని నడిపిస్తున్న మన సాయితండ్రి అవధులు లేని అనుగ్రహాన్ని, కరుణని గురించి ఏమని చెప్పగలం? "ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మా మీద ఇలాగే ఉండనీ బాబా".
సాయి నన్ను నవంశీని గణపసాయి నా భర్త నన్ను అర్థం చేసుకొని కాపురానికి తీసుకొని వెళ్లేలా చూడు సాయి నిన్నే నమ్ముకొని భారం అంతా నీ మీదే విసి బతుకుతున్నాను సాయి
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha