సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1469వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిక్షణనిస్తున్న బాబా
2. ఎటువంటి సమస్య అయినా చెప్పుకుంటే కాపాడతారు సాయి

శిక్షణనిస్తున్న బాబా

నేను బాబా భక్తురాలిని. నేను ఇంతకుముందు బాబా ప్రసాదించిన ఎన్నో అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో అనుభవం పంచుకోవాలనుకుంటున్నాను. నేను దాచుకున్న నా డబ్బులతో మరికొంత డబ్బు సంపాదించాలని ఒక ఫీల్డ్‌లో పెట్టుబడి పెట్టాను. మొదట్లో డబ్బులు వచ్చాయి. కానీ ఆ ఫీల్డ్ గురించి నాకు సరైన అవగాహన లేకపోవడం, సరిగా పరిశీలించకుండా మళ్ళీ పెట్టుబడి పెట్టి తప్పటడుగు వేయడం వల్ల నేను చాలా డబ్బులు నష్టపోయాను. నష్టంలో ఉన్నప్పుడు 'ఎలా అయినా ఈ నష్టం నుంచి కాపాడమ'ని బాబాను ప్రార్థించాను. కానీ, ఆ నష్టాలు పోలేదు. నాకు ఏదో బాధగా అనిపించి, 'బాబా కూడా సహాయం చేయలేదు' అని ఆయనను ప్రార్థించడంపై ఆసక్తిపోయి ప్రార్థించడం మానేశాను. కానీ బాబా, 'నేను ఎందుకిలా చేశానో నీకు తర్వాత తెలుస్తుంది' అని మెసేజ్ రూపంలో నాకు తెలియజేశారు. మనం ఆయన్ని మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోరు, వదలరు అంటే ఇదేనేమో! అయినా నా మనసులో అదే బాధ. కానీ 'ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆ ఒక్క ధైర్యం చాలు, పోయిన అన్నింటినీ వెనక్కి తీసుకువస్తుంద'ని నా మనసుకి నేనే చెప్పుకొని ఎలాగైనా నష్టపోయిన డబ్బును తిరిగి సంపాదించాలని తలచి, ఏ ఫీల్డ్‌లో అయితే పెట్టుబడి పెట్టానో, ఆ ఫీల్డ్‌కి సంబంధించిన వీడియోలు చూసి ఎక్కడ పొరపాటు చేశానో తెలుసుకొని, ఈసారి కొంచెం మొత్తం పెట్టుబడి పెట్టి నెమ్మదిగా లాభం పొందాలని వీడియోలు చూడటం మొదలుపెట్టాను. మెల్లగా నా పొరపాట్లు తెలుసుకొని, ఎలా చేస్తే నేను అనుకున్నది సాధిస్తానో అవగాహన తెచ్చుకొని పెట్టుబడి పెడుతుండేదాన్ని. కొన్నిసార్లు నష్టం, కొన్నిసార్లు లాభం వస్తున్నా నేను ఎక్కడ పొరపాటు చేశానో నాకు తెలిసింది. ఇంకా డబ్బుల గురించి బాధపడుతున్న అలాంటి ఒక సందర్భంలో బాబా నాకు కింది మెసేజ్ చూపించారు. ఇలా ఏదో ఒక మెసేజ్ రూపంలో నాకు ధైర్యాన్నిస్తూ ఉండేవారు బాబా.
ఆయనిచ్చిన మెసేజ్ చూడగానే, 'నిజంగా ఈసారి లాభం వస్తే, వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఆ మెసేజ్‌లో చెప్పినట్లే నాకు లాభం వచ్చింది. ఈ అనుభవం ద్వారా 'పూర్తి జ్ఞానం లేకుండా పెట్టుబడి పెట్టడం వల్ల కొన్నిసార్లు లాభం వచ్చినా అన్నిసార్లు రాదనీ, ఇంకా ఇంకా నష్టపోతామనీ, అలాగే లాభాలొస్తే దానికి సంబంధించిన మెళుకువలు, జ్ఞానం నేర్చుకోలేమనీ, నష్టం వచ్చినప్పుడే నేర్చుకుంటామనీ నాకు నేర్పించి, బాగా ఆలోచించి పెట్టబడి పెట్టేలా చేస్తున్నారు బాబా' అని నా మనసుకు అనిపించింది. బాబా ఏదైనా మనకి చెప్పాలంటే ఆయన ఎన్నుకునే మార్గాలు వేరుగా ఉంటాయి. ఇలా అయితేనే నేను నేర్చుకుంటానని బాబా అనుకొని ఉంటారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా విషయంలో వైఫల్యం ఎదురైతే బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లండి. ఏదో నేర్పించాలనుకుంటేనే బాబా మనకి సమస్యలు ఇస్తారు. మనకి ఈరోజే తెలుసు, కానీ బాబాకి మన భవిష్యత్తు తెలుసు. ప్రపంచం వదిలిపెట్టినా ఆయన మన చేయి ఎన్నడూ వదిలిపెట్టరు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే నేను బాగా నేర్చుకొనేలా చేసి పెట్టుబడి పెట్టి నష్టపోయిన డబ్బు వెనక్కి వచ్చేలా చేస్తారని నమ్ముతున్నాను. అలాగే ప్రతి విషయంలో నాకు తోడుండి ముందుకు నడిపించమని కోరుతున్నాను తండ్రీ. మీరు తోడులేని దారిలో నేను ఎప్పుడూ వెళ్ళలేను. తెలిసీతెలియక ఏదైనా తప్పులు చేస్తే పెద్ద మనసుతో నన్ను క్షమించండి తండ్రీ".

ఎటువంటి సమస్య అయినా చెప్పుకుంటే కాపాడతారు సాయి

నా పేరు యశోద. మేము అనంతపురంలో ఉంటాము. మా అమ్మాయి, అల్లుడు, మనవడు హైదరాబాదులో ఉంటున్నారు. వాళ్ళు ఇదివరకు నాలుగు సంవత్సరాలు స్వీడన్‌లో ఉన్నారు. అందువల్ల మా అమ్మాయికి ఒడిబియ్యం పెట్టడం కుదరలేదు. తొమ్మిది సంవత్సరాలు దాటితే ఒడిబియ్యం పెట్టకూడదని ఆచారం. అందువల్ల 2023, జనవరి 26న ఒడిబియ్యం పెట్టడానికి ముహూర్తం పెట్టుకున్నాం. కానీ మా అమ్మాయికి రావాల్సిన సమయం కన్నా 15 రోజులు ఆలస్యమైనా నెలసరి రాలేదు. డాక్టర్ వద్దకు వెళ్లి మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. దాంతో, ఈసారి కూడా ఒడిబియ్యం పెట్టుకోగలనో, లేదో అన్న దిగులుతో చాలా ఆందోళన చెందాను. 2023, జనవరి 20న నేను మా అమ్మాయితో, "బాబాకి మొక్కుకోమ"ని చెప్పి, నేను కూడా బాబాతో, "ఈ సమస్య నుంచి గట్టెక్కించు తండ్రీ. మీ అనుగ్రహాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటాము" అని చెప్పుకున్నాను. అంతే, ఆరోజు సాయంత్రానికి మా అమ్మాయి ఫోన్ చేసి, తనకు నెలసరి వచ్చిందని చెప్పింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. సంతోషంగా జనవరి 26న ఏ ఆటంకం లేకుండా ఒడిబియ్యం కార్యక్రమం పూర్తిచేసుకున్నాము. ఎటువంటి సమస్య అయినా మన తండ్రి సాయినాథునికి చెప్పుకుంటే ఆయన కాపాడతారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  3. Ome sri samardha sadguru sai nath maharaj ki jai🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo