ఈ భాగంలో అనుభవాలు:
1. బాబాకి చెప్పుకుంటే పని అయిపోతుంది2. నిజంగా బాబా ఉన్నారు
బాబాకి చెప్పుకుంటే పని అయిపోతుంది
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ!!! ముందుగా సాయి భక్తులకు మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజూ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలు చదవడం వల్ల బాబాపట్ల భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందుతున్నాయి. నా పేరు తిలోత్తమ. మాది ఒరిస్సా. మా ఆయన టీచరుగా పని చేస్తున్నారు. ఆయన డిప్యూటేషన్ మీద మా ఊరికి దగ్గరలో ఉన్న స్కూల్లో పని చేస్తుండగా ఆయనకు గ్రేడ్ 4 ప్రమోషన్ వచ్చి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అదే సమయంలో డిప్యూటేషన్ మీద ఎవరెవరు ఉన్నారో, వాళ్ళు అదే స్కూల్లో కొనసాగొచ్చు అని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మావారికి బదిలీ అయిన కొత్త చోటు మా ఊరికి చాలా దూరంగా ఉన్నందు వల్ల అదివరకు పని చేస్తున్న స్కూలులోనే కొనసాగాలని మావారు అనుకున్నారు. కానీ వాళ్ల హెచ్ఎం దానికి ఒప్పుకోక ప్రమోషన్ మీద వచ్చిన స్కూల్లోనే జాయిన్ అవ్వమని చెప్పారు. ఎవరు చెప్పినా ఆమె వినలేదు. ఇక అప్పుడు నేను, "బాబా! మా ఆయన ముందు పనిచేసే స్కూల్లోనే జాయిన్ అయ్యేలాగా చేయండి. అలా జరిగితే మీ కృపను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత ఫోన్‍లో బాబా సందేశం కోసం చూస్తే, "భయపడకు నువ్వు వున్న చోటనే పని చేస్తావు. నేనుండగా భయం ఎందుకు?" అని వచ్చింది. దాంతో నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఆ తరువాత ఒక బుధవారం రోజున మావారి స్కూలు హెచ్ఎం కాల్ చేసి, "రేపు రండి సార్. మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాను" అని చెప్పింది. అది విని మాకు చాలా సంతోషం కలిగింది. మరుసటిరోజు గురువారం మావారు వెళ్లి ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు.
ఈమధ్య మా అమ్మ ఒక పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కాలు జారి పడిపోయింది. రెండు రోజుల వరకు నొప్పి తగ్గకపోతే ఎక్స్ రే తీయించాము. రిపోర్టులో కొంచెం పగులు ఉందని చెప్పి కట్టువేశారు. నేను, "బాబా! మీ దయతో ఆ పగులు త్వరగా కలిసిపోతే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. నెలరోజుల తర్వాత ఎక్స్ రే తీసి, "పగులు కలిసిపోయింద"ని కట్టు తీసేసారు.
నేను ఇదివరకు బాబా చల్లని దీవెనలతో గర్భవతినయ్యానని మీతో పంచుకున్నాను. ఆ విషయంలో బాబాకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్న తక్కువే. ఇకపోతే, ఐదవ నెలలో డాక్టర్, "స్కాన్ చేయించమ"ని చెప్పినప్పుడు నేను, "బాబా! రిపోర్ట్ నార్మల్ వచ్చేలా చేయండి, అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయతో స్కాన్ రిపోర్టులు నార్మల్ వచ్చాయి. "ధన్యవాదాలు బాబా. మీకు చెప్పుకోగానే మా ఒక్కొక్క సమస్య తీరిపోతుంది. మీకు మాటిచ్చినట్టు ఈ అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను. దయతో సుఖ ప్రసవమయ్యేలా ఆశీర్వదించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను".
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
నిజంగా బాబా ఉన్నారు
నా పేరు అజయ్. ఒకప్పుడు నాకు ఉద్యోగం లేదు, సమాజంలో గౌరవం లేదు, నేను ప్రేమించిన అమ్మాయికి నేను అంటే ఇష్టం లేదు. అలాంటి సమయంలో నేను అనుకోకుండా 'గురుపౌర్ణమి' అనే సాయిబాబా సినిమా చూసి, 'నాకు ఉద్యోగం వచ్చి, నేను ప్రేమించే అమ్మాయి నన్ను ప్రేమిస్తే నువ్వు నిజంగా ఉన్నావ'ని నమ్ముతానని అనుకున్నాను. ఆశ్చర్యం! అద్బుతం! అప్పటివరకు ఇంటి వద్ద ఉన్న నేను ఏదో కారణం చేత హైదరాబాద్ వెళ్లి ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుందామని ఇన్స్టిట్యూట్‍లో జాయినయ్యాను. నాతో జాయిన్ అయిన వాళ్లందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ నాకు రావటానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో నేను నా మనసులో ఒక వైపు 'ఏంటి బాబా ఇలా చేస్తున్నారు?' అన్న బాధ, మరోవైపు 'ఆయనే దారి చూపుతారు' అన్న నమ్మకం ఉండేవి. అదే సమయంలో నేను ఈ బ్లాగుని చూశాను. అప్పుడు "బాబా! నాకు ఉద్యోగం వస్తే, మీ దయను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత ఒక ఇంటర్వ్యూ జరిగి నాకు ఒక ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగం పూణేలో. భాష రాదు, పైగా అంత దూరమని మళ్ళీ బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యం! 10 రోజుల్లో హైదరాబాద్‍కి చెందిన వేరే కంపెనీలో నాకు ఇంకొక ఆఫర్ వచ్చింది. ఇంగ్లీష్ కూడా రాని నేను ఇప్పుడు MNC కంపెనీలో పని చేస్తున్నాను. అంతేకాదు, ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఇది నూటికి నూరుపాళ్ళు బాబా దయవల్లనే. ఆయనని ప్రార్ధించడం వల్ల నా జీవితాన్నే మార్చేశారు. నిజంగా బాబా ఉన్నారు. నమ్మకంతో మొక్కితే ఎంత పెద్ద సమస్య అయిన తీరుస్తారు నా తండ్రి. "ధన్యవాదాలు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
సాయి నా భర్తను అర్థం చేసుకొని నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి నన్ను నా వంశీని కలుపు సాయి నిన్నే నమ్ముకుని నీ మీద ఆధారపడి బతుకుతున్నాను బాబా సాయి ఇప్పటిదాకా నాకే అన్యాయం జరగలేదు బాబా సాయి. మీరు ఉండగానే జరగదు బాబా ఈ మాంగల్యాన్ని నా భర్తని నాకు మీరు బాబా నా బంధం ఇప్పటికీ విడిపోదని నమ్మకం నాకుంది బాబా తొందరగా నన్ను నా భర్తని కలుపు దూరంగా ఉండలేకపోతున్నాను బాబా
ReplyDeleteOME SRISAIRAM
ReplyDelete