సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1461వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సచ్చరిత్ర చదువుతున్నప్పటినుండి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టిన సమస్యలు
2. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యా లేదని భరోసా ఇచ్చిన బాబా

సచ్చరిత్ర చదువుతున్నప్పటినుండి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టిన సమస్యలు

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు అలేఖ్య. బాబా దయవల్ల నేను ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాను, పడుతున్నాను. వాటిలో ఒకటి రెండు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. నెమ్ము సమస్య ఉండటం వల్ల మా బాబుకి నాలుగు సంవత్సరాలు వచ్చినా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండనే ఉంటుండేది. తనకి రెండు సంవత్సరాల వయసున్నప్పుడు బాగా సీరియస్ అయి హాస్పిటల్లో ఒక వారం ఉన్నాము. అప్పటినుంచి తనకి దగ్గు, జలుబు, నెలకి రెండుసార్లు జ్వరం ఉంటుండేవి. ఎన్ని మందులు వాడేవాళ్ళమో చెప్పలేను. ఇలా ఉండగా నా ఫ్రెండ్(బంధువు) నాతో, "నువ్వు సాయిసచ్చరిత్ర నిత్యపారాయణ చేస్తావా?" అని అడిగింది. నేను వెంటనే 'సరే' అని ఆ గ్రూపులో జాయిన్ అయిపోయాను. సచ్చరిత్ర చదువుతున్నప్పటినుండి నా సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా మా బాబు ఆరోగ్యం బాగుంది. బాబా దయవల్ల బెస్ట్ హోమియో డాక్టర్ ఒకరు మందులిచ్చారు. బాబా మీద నమ్మకంతో మేము ఆ మందులు వాడుతున్నాము. బాబా అనుగ్రహం ఎంతలా ఉందంటే, ఇటీవల మేము శిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ చాలా చలిగా ఉంది. అంత చలిలో బాబుకి కనీసం జలుబు కూడా చేయలేదు. అదీ బాబా దయ.

నేను సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టిన ఒక 15 రోజులకి కలలో నీలిరంగు వస్త్రాలలో బాబా నాకు దర్శనమిచ్చారు. నేను బాబా పాదాలకి శరణాగతి చేసుకుంటే, బాబా నన్ను దీవించారు. నాకు చాలా ఆనందమేసింది. తరువాత మేము శిరిడీ వెళ్ళాము. వెళ్లేముందు నేను, 'బాబా నా మీద దయవుంచి స్వప్నంలో కనిపించినట్లు నీలిరంగు వస్త్రాల్లో నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదిస్తే బాగుండు' అని అనుకున్నాను. 2023, జనవరి 11న మేము దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా నీలిరంగు కండువాతో నాకు దర్శనమిచ్చారు. నేను చాలా చాలా సంతోషించాను. "థాంక్యూ బాబా. ఐ లవ్ యు" అని ఎన్నిసార్లు చెప్పుకున్నానో! 

ఇటీవల నాకు, మా అత్తగారికి మధ్య చిన్న అశాంతి చోటుచేసుకుంది. ఒక మంగళవారంనాడు నా తప్పేమీ లేకున్నా, ఆవిడ చిన్న అపార్థంతో నన్ను, నా బాబుని మందలించి మాతో మాట్లాడటం మానేశారు. నేను, "బాబా! ఎందుకు ఇలా చేశారు? ఆవిడ మాతో సరిగ్గా ఉండేటట్లు చేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. సరిగ్గా రెండు రోజుల తర్వాత గురువారం అత్తయ్య నన్ను పలకరించి మాట్లాడి, నా బిడ్డని దగ్గరకి తీసుకున్నారు. నాకు పెళ్ళై పదకొండు సంవత్సరాలు, నా బాబుకి ఐదు సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలలో ఆవిడ అంత ప్రేమగా ఉండటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆవిడ మునుపటికన్నా నా బిడ్డని ఇంకా ప్రేమగా చూస్తున్నారు, నన్ను కూడా అభిమానిస్తున్నారు. అదంతా కేవలం బాబానే చేశారు. ఇలాంటివి ఎన్నో అనుభవాలు నాకున్నాయి. బాబా దయవల్ల నా వేళలకు అనుగుణంగా ఒక ఉద్యోగం దొరికితే, మళ్లీ బ్లాగులో పంచుకుంటాను. "థాంక్యూ సాయీ. ప్లీజ్ బాబా! నాతో ఉంటూ ఎల్లప్పుడూ నన్ను ఆశీర్వదించండి బాబా. ఐ లవ్ యు బాబా. ప్లీజ్ లవ్ మి బాబా".

ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యా లేదని భరోసా ఇచ్చిన బాబా

నా పేరు పుష్పలత. నా జీవితంలో బాబా చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. నా దినచర్య బాబా నామస్మరణతోనే మొదలవుతుంది. ఈరోజు మేము సుఖంగా, సంతోషంగా ఉండటానికి బాబా దయ, కరుణలే కారణం. 2023, జనవరి నెల చివరిలో నేను మూడు రోజులు హైపర్ అసిడిటీతో చాలా ఇబ్బందిపడ్డాను. మామూలుగానే నేను ప్రతి చిన్నదానికీ భయపడి హాస్పిటల్‌కి వెళ్తుంటాను. కానీ ఈసారి హాస్పిటల్‌కి వెళ్ళకుండానే బాబా ఊదీతో నా సమస్యను తగ్గించుకోవాలని శ్రద్ధ, సబూరీతో రోజూ నొప్పి ఉన్న చోట ఊదీ రాసుకుంటూ, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగసాగాను. 2023, జనవరి 30న, 'బాబా సందేశం ఏదో ఒక రూపంలో నాకు వస్తే, నేను హాస్పిటల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదా హాస్పటల్‌కి వెళ్ళాలి' అని మనసులో అనుకున్నాను. తరువాత నా ఆరోగ్యరీత్యా నేను చాలా ప్రతికూల ఆలోచనలతో సతమతమయ్యాను. ఆ సాయంత్రం అనుకోకుండా మా స్టూడెంట్ ఒకరు శిరిడీ వెళ్లొచ్చి గ్రీన్ కలర్‌లో ఉన్న బాబా విగ్రహం, ఊదీ, ప్రసాదాలు నాకు ఇచ్చారు. బాబాను చూస్తూనే నాకు ఎంతో ధైర్యం వచ్చి చెప్పలేనంత సంతోషమేసింది. బాబా నేను కోరుకున్నట్లుగానే గ్రీన్ కలర్ విగ్రహరూపంలో నా వద్దకు చేరి 'నీకు ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యా లేద'ని భరోసా ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా".

5 comments:

  1. ఓం సాయి రామ్ నేను నెగెటివ్ ఆలోచనలతో బాధ పడుతున్నా.నాకు మంచి ఆలోచనలు వచ్చేలాగ ఆశీస్సులు అందించు.నాతో వుండండి.నేను ముందులు వాడుతున్నాను.సాయీ తండ్రిని నిమ్మ కంతో గురువారం 2 చాప్టర్ లు చదువుతాను.నా కర్మ తొలగించు స్వామీ .ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete
  2. ఓం సాయి రామ్, ఓం సాయి రామ్

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om. Sri sai ram
    Seaf my famili baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo