సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1472వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీస్సులు
2. క్షణాల్లో మనస్సులు తేలికపరిచిన బాబా
3. బీపీ తగ్గించిన బాబా

బాబా ఆశీస్సులు

నా పేరు విజయ. మాది ఢిల్లీ. మా అబ్బాయి పవన్ చైతన్యకి 15 సంవత్సరాల వయసు. తను ఒకరోజు సాయంత్రం తన ట్యూషన్ ముగిసిన తర్వాత, "నేను స్వయంగా మార్కెట్‌కెళ్లి స్నాక్స్ కొనుక్కొని రావాలనుకుంటున్నాను" అని అన్నాడు. మార్కెట్ మా ఇంటి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటివరకు మా అబ్బాయి ఎప్పుడూ ఒంటరిగా మార్కెట్‌కి వెళ్ళింది లేదు. ఎప్పుడూ వాళ్ళ నాన్నగారే తనని తీసుకొని వెళ్ళేవారు. అలాంటిది ఆరోజు తను చాలా స్పష్టంగా మార్కెట్‌కి వెళ్ళొస్తానని చెప్పేసరికి, 'సరే, నువ్వూ తెలుసుకోవాలి కాబట్టి తొందరగా వెళ్ళిరా' అని చెప్పి డబ్బులిచ్చి పంపించాము. కానీ బస్సు ఎక్కి మార్కెట్‌కి వెళ్లిన బాబు 2 గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో నేను భయపడి బాబా(ఫోటో) ముందు కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా దయవల్ల ఒక గంట తర్వాత తను ఇంటికి తిరిగి వచ్చాడు. నా ఆనందాన్ని మీరు ఊహించగలరనుకుంటాను. "ధన్యవాదాలు బాబా".

2) మేము 2020లో గ్రేటర్ నోయిడాలో ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నాము. మేము అందుకు సంబంధించి డబ్బంతా చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉండగా అడ్వకేట్ 2022, జనవరిలో రిజిస్ట్రేషన్ అని చెప్పి, మళ్లీ అంతలోనే రద్దు చేశారు. అతను తరచూ అదే మోస్తరుగా సమయం చెప్పడం, ముందురోజు రేపు కాదని రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ‘తదుపరి ఎప్పుడన్నది నేను మీకు తెలియజేస్తాను’ అని చెప్తుండేవాడు. ఇక చివరికి నేను ఆ విషయం గురించి బాబాను ప్రార్థించాను. తరువాత 2023, ఫిబ్రవరి 6న మేము మా రిజిస్ట్రేషన్ ఎప్పుడని ఫోన్ చేసి అడిగితే, "రేపు రండి" అని చెప్పాడు. బాబా ఆశీస్సులతో ఫిబ్రవరి 7న అర్థగంటలో మా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. "ధన్యవాదాలు బాబా. నేను బాబాను మరికొన్ని కోరికలు తీర్చమని ప్రార్థించాను. అవి నెరవేరిన తర్వాత వాటిని కూడా మీ అందరితో పంచుకుంటాను. నా అనుభవాలు చదివిన సాయిభక్తులందరికీ ధన్యవాదాలు. "బాబా! ఎల్లప్పుడూ మాతో ఉంటూ మంచి కర్మలు చేసేలా మమ్మల్ని ప్రోత్సహించండి, అలాగే మాలోని ప్రతికూల ఆలోచనలను తొలగించండి. మీ ఆశీస్సులు మాకు సదా ఉండాలి సాయీ".

క్షణాల్లో మనస్సులు తేలికపరిచిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు జయంతి నాగరాజరావు. బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మాకు, మా జీవనానికి ఆధారం మా అమ్మాయే. తను బాబా ప్రసాదించిన ఒక ఉద్యోగం చేస్తూ మా కుటుంబానికి అండగా వుంటోంది. తను చాలా నెమ్మదస్తురాలు. ఎవరైనా ఏమైనా అంటే తనలోతానే చాలా బాధపడుతుంది తప్పితే అవతలివారిని ఏమీ అనదు. 2023, ఫిబ్రవరి 6, సోమవారం సాయంత్రం 3గంటలకు తను నాకు ఫోన్ చేసి, ఏడుస్తూ, "నేను ఇంకా ఈ ఉద్యోగం చేయను, వదిలేస్తాను. వేరే ఉద్యోగం చూసుకుంటాను" అని చెప్పింది. "ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమి జరిగింది?" అని అడిగితే, "నా తోటి ఉద్యోగస్తురాలైన ఒక అమ్మాయి నన్ను గేలి చేస్తూ మాట్లాడింది. మిగిలిన వాళ్లంతా నవ్వారు. నా పని నేను చేసుకుంటున్నా ఇలా చేస్తున్నారు" అని చాలా బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది. నేను తనతో, "అలా కాదమ్మా! వాళ్ళు నవ్వారని నువ్వు ఏడుస్తు ఉద్యోగం వదిలేయడం మూర్ఖత్వం. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివాళ్ళు ఉంటారు. అలా ఎంత దూరం పరిగెడతావు. నీ పొరపాటు లేనప్పుడు ఉన్నచోట నీ పని నువ్వు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. మనకు బాబా వున్నారు" అని ధైర్యం చెప్పాను. తను, "సరే అమ్మ" అంది. నేను ఫోన్ పెట్టేసాక, "ఎందుకు మాకు ఈ పరీక్ష/ తను నాతో సరే అంది కాని, బాధతో ఉద్యోగం వదిలేస్తే ఎలా సాయి?" అంటూ బాధగా బాబాతో చెప్పుకుంటూ ఫోన్ చూసాను. అంతే, మా అమ్మాయి మెసేజ్, ఏమనంటే.. "ఏమైందో నాకు తెలీదు అమ్మ. నన్ను గేలి చేసి నవ్విన అమ్మాయి నా వద్దకొచ్చి సారీ చెప్పింది. ఎందుకు సారీ అంటే, నిన్ను బాధపెట్టానని చెప్పింది" అని. ఈ విధంగా క్షణాల్లో బాబా మా ముందు కొండలా వున్న సమస్యను పరిష్కరించి మా మనస్సులు తేలిక పరిచారు. "ధన్యవాదాలు బాబా".

బీపీ తగ్గించిన బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈ మధ్య నాకు బీపీ వచ్చింది. డాక్టరుని సంప్రదిస్తే రెండు రకాల మాత్రలు ఇచ్చారుగాని కొన్నిరోజుల తరువాత ఒకటే వాడమన్నారు. నేను మాములుగా గురువారం నాడు ఎప్పుడూ భోజనం చేయను. కానీ బీపీ టాబ్లెట్స్ వాడే సమయంలో ఒక గురువారం నాడు నాకు గుర్తులేక భోజనం చేశాను. తరువాత ఆ విషయం గుర్తించి, "సాయీ! ఇలా చేశావేంటి?" అని అనుకున్నాను. కానీ, కొత్తగా బీపీ టాబ్లెట్స్ వాడుతుండటం వల్ల బీపీ డౌన్ అవుతుందని తెలిసి సాయే నాతో భోజనం చేయించారని గ్రహించాను. కొన్ని రోజుల తరువాత నేను మళ్ళీ డాక్టరుని సంప్రదించినప్పుడు బాబా దయవల్ల నాకు బీపీ లేదు. కానీ డాక్టర్ బ్లడ్ టెస్టులు వ్రాసారు. అప్పుడు నేను, "రిపోర్టులో ఏమీ లేకపోతే బ్లాగులో పంచుకుంటాన"ని సాయికి నమస్కరించాను. సాయి దయవలన రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చాయి. ఇలా సాయి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నానని తెలియజేస్తూ ఉన్నారు. "ధన్యవాదాలు సాయి. ఇలాగే మా అమ్మ ఆరోగ్యం విషయంలో తోడుగా ఉండు సాయి. అలాగే మా అమ్మాయికి తోడుగా ఉండి అన్ని పరీక్షలు పాసయ్యేలా చూడు సాయి".


2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo