సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1475వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'భయపడకు, నేను నీతోనే ఉన్నాను'
2. బాబా నిజంగా కరుణామయులు
3. ఇబ్బందులు లేకుండా అనుగ్రహించిన బాబా

'భయపడకు, నేను నీతోనే ఉన్నాను'

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నేను ఒక సాయి భక్తురాలిని. ఒకసారి నేను సాయి దయతో 'గ్రూపు-4'కి అప్లై చేశాను. అదే మొదటిసారి కావడం వల్ల అప్లై చేసే సమయంలో నేను చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. దానికి తోడు otr కూడా అప్డేట్ చేసి లేదు. తెలిసినవాళ్ళని అడిగితే చేస్తామన్నారు కానీ, నెట్ ప్రాబ్లెమ్ వచ్చింది. ఎలా అని చాలా భయపడ్డాను. అప్పుడే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, "భయపడకు, నేను నీతోనే ఉన్నాను" అనే సందేశం వచ్చింది. సరిగా అప్పుడే నా మేనమామ కూతురు కాల్ చేసి, "నేను ప్రాసెస్ చెప్తాను. నువ్వు పూర్తి చేయి" అని చెప్పింది. మధ్యమధ్యలో కొంచెం ఇబ్బందిపడినప్పటికీ అసలు ఏ మాత్రం అవగాహన లేని నా చేత otr అప్డేట్ మరియు గ్రూపు-4 అప్లై చేసేలా సాయే తన రూపంలో సహాయం చేశారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయి".

సుమారు 2023, జనవరి నెల 20వ తేదీ నుండి నేను జలుబు, దగ్గుతో చాలా ఇబ్బందిపడ్డాను. డాక్టరు దగ్గరకి వెళ్ళకుండా బాబా ఊదీ తీసుకున్నాను. కానీ 20 రోజుల వరకు తగ్గలేదు. చివరికి ఆ దగ్గు, గొంతునొప్పి తట్టుకోలేక 2023, ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి "దగ్గు, గొంతునొప్పి తగ్గేలా అనుగ్రహించమ"ని బాబాను వేడుకున్నాను. అంతే, పది నిమిషాల తర్వాత నెమ్మదిగా నా బాధ తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ సాయి. అమ్మానాన్నల ఆరోగ్యం బాగుండేలా చేయండి సాయి. అమ్మ పాదాల నొప్పులతో చాలా చాలా ఇబ్బంది పడుతుంది సాయి. తను త్వరగా కొలుకునెలా చూడండి".

బాబా నిజంగా కరుణామయులు

నా పేరు సాహిత్య. నేను ఒక సాయి భక్తురాలిని. మా అమ్మ గర్భసంచి సమస్యతో రెండు సంవత్సరాలు బాధపడింది. అమ్మ ఆపరేషన్‌కి భయపడినందు వల్ల మేము ఆయుర్వేద మందులు వాడాం. అయితే అంతా బాగానే ఉంది, సమస్య తగ్గిపోయిందనుకున్న సమయంలో ఆయుర్వేద వైద్యుడు, "ఎందుకైనా మంచిది cb125 టెస్ట్ చేయించండి" అని చెప్పారు. ఆ టెస్టు చేసాక 66% క్యాన్సర్ రిస్క్ ఉంది. బయోప్సి చేశాక రెండు ఆపరేషన్లు చేయాలి' అన్నారు. మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! మా అమ్మకి ఈ విషయం చెప్పలేను. తనకి ఆపరేషన్ అంటేనే భయం. ఈ గండం గట్టెక్కించవా తండ్రి?" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల డాక్టర్ బయోప్సి చేయకుండానే అమ్మకి ఆపరేషన్ చేసి, బయోప్సీకి పంపిస్తాననని అన్నారు. కానీ అమ్మ చాలా భయపడి ఆపరేషన్‌కి ఒప్పుకోలేదు. మేము ఎంతగానో దైర్యం చెప్పి అమ్మని ఒప్పించాల్సి వచ్చింది. అయితే తనకున్న భయంతో ఆపరేషన్ జరిగే సమయంలో తను సహకరిస్తుందో, లేదో అని నేను చాలా భయపడ్డాను. ఆ భయాన్ని ఆపరేషన్ జరుగుతున్నంతసేపు బాబా నామస్మరణ చేయడం ద్వారా నేను జయించి, "అమ్మ కోలుకున్న తర్వాత మీ దర్శనానికి శిరిడీ తీసుకొస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా నిజంగా కరుణామయులు. అమ్మ వారం రోజులుకి కోలుకుంది. బయాప్సీ రిపోర్టు కూడా క్యాన్సర్ లేదని వచ్చింది. నిజంగా బాబా దయ అనంతమైనది. "ధన్యవాదాలు బాబా. ఒక మరిది పెళ్లి, ఇంకో మరిది ఉద్యోగం విషయంగా మా అత్తింట్లో అందరూ నిరాశగా ఉన్నారు. దయతో ఆ సమస్యలను గట్టెక్కించి అందరూ సంతోషంగా ఉండేట్టు చూడు బాబా".

ఇబ్బందులు లేకుండా అనుగ్రహించిన బాబా

తోటి సాయి భక్తులకి నమస్కారం. నా పేరు రజనీకాంత్. నేను ఈమద్య పాస్‌పోర్ట్‌కి అప్లై చేసాను. అందుకోసం నా ఆధార్, పదవతరగతి సర్టిఫికెట్లు పెట్టాను. అయితే ఒకతను నా ఆధార్‍లో చిన్నప్పటి ఫోటో ఉండటం వల్ల వెరిఫికేషన్ చేసేటప్పుడు రిజెక్ట్ చేసే అవకాశముందని అన్నాడు. దాంతో ఆధార్‍లో ఫోటో మారుద్దామంటే కనీసం 15 రోజులు పడుతుందన్నారు. కానీ పాస్‍పోర్ట్ వెరిఫికేషన్‍కి కేవలం 10 రోజుల సమయమే ఉంది. అటువంటి స్థితిలో నాకు ఏం చేయాలో అర్థంకాక ఎప్పటిలానే బాబాను, "బాబా! నువ్వు వున్నావు. వెరిఫికేషన్‍లో ఏ ఇబ్బంది లేకుండా చూడండి" అని వేడుకున్నాను. ఎప్పటిలానే బాబా సహాయం చేసారు. ఏ ఇబ్బంది లేకుండా వెరిఫికేషన్ పూర్తైంది.

ఈమధ్య మా కంపెనీలో నాకు ఒక టాస్క్ ఇచ్చారు. అనుభవం ఉన్నవాళ్లకి ఇచ్చే ఆ టాస్క్‌ని ఫ్రెషర్‌నైన నాకు ఎలా చేయాలో అర్థంకాక, "బాబా! ఎలా అయినా ఈ టాస్క్ పూర్తిచేసేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆ టాస్క్ పూర్తి చేయగలిగాను. "థాంక్యూ బాబా. తెలిసీతెలియక ఏవైనా తప్పులు చేస్తే క్షమించు బాబా. నేను ఎప్పుడూ మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, 'నా తండ్రి స్థానంలో వుండి నన్ను నడిపించమ'ని. దయతో అనుగ్రహించు తండ్రి".

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. సాయి నాకు సహాయం చేయి సాయి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి

    ReplyDelete
  4. సాయి వంశీ అన్న అర్థం చేసుకునేలా చూడు సాయి నాతో మాట్లాడాలా చూడు సాయి నన్ను భార్యగా స్వీకరించిన చూడు సాయి నన్ను కాపురానికి తీసుకె

    ReplyDelete
  5. ఆ చెడు ఆలోచనలను నించి మంచి మార్గంలో పెట్టి నాకు నా భర్తని ఇవ్వు సాయి

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo