ఈ భాగంలో అనుభవాలు:
1. కృపతో సమస్యలను పరిష్కరించిన సాయి
2. కోరుకున్నట్లే పండగకి మనవరాలిని పంపిన బాబా
కృపతో సమస్యలను పరిష్కరించిన సాయి
ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిబంధువులకు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. సాయి నాకు ఇచ్చిన రెండు ఆశీర్వాదాలను మీ అందరితో పంచుకోవాలని మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను నా గత అనుభవంలో మా మరదలి పొలంలో బోరు వేసే విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయని, బాబాను ప్రార్థించాక ఆయన దయతో కొద్దిరోజుల క్రితం బోరు వేయించామని చెప్పాను. ఆ తరువాత, అంతకుముందు నుంచి ఆ పొలం కౌలుకు చేస్తున్న రైతు పొలాన్ని ఎవరికీ ఇవ్వనివ్వకుండా చాలా ఇబ్బందిపెట్టాడు. ఎవరు పొలం చేయటానికి వచ్చినా ఏదో చెప్పి వాళ్ళని పంపేస్తుండేవాడు. 'ఆ సమస్య కూడా పరిష్కారమైతే, తోటి భక్తులతో పంచుకుంటాను' అని బాబాకి చెప్పుకున్నాను. మా మరదలు కూడా, ‘బోరు వేశాక మొదటి పంట మీద వచ్చిన రాబడిలో కొంత మొత్తాన్ని బాబాకి ఇస్తాన’ని మొక్కుకుంది. బాబా దయతో అన్ని సమస్యలు పరిష్కారమై పొలాన్ని కొత్త రైతుకి కౌలుకి ఇచ్చాము. మా మరదలువాళ్ళు చాలా ఆనందంగా తమ మొక్కు తీర్చుకున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా. వాళ్ళకున్న మిగతా సమస్యలు కూడా త్వరగా పరిష్కరించి ఎల్లపుడూ వాళ్ళకి తోడుగా ఉండి బాగా చూసుకో తండ్రీ".
ఇప్పుడు మహాపారాయణ చేస్తున్న ఒక భక్తురాలికి బాబా ఇచ్చిన ఆశీర్వాదం గురించి మీతో పంచుకుంటాను. ఆ భక్తురాలి కుటుంబానికి ఆదాయాన్నిచ్చే ఏకైక ఆర్థిక వనరు వాళ్ళకున్న ఒక బిల్డింగ్. వాళ్ళు దానిని కరోనాకి ముందు ఒకరికి అద్దెకి ఇచ్చారు. కరోనా వచ్చాక అతను అద్దె ఇవ్వటం మానేశాడు. రెండేళ్లకు పైగా అతను అద్దె ఇవ్వకుండా వాళ్ళను చాలా ఇబ్బందిపెట్టాడు. కనీసం బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళమన్నా వెళ్ళలేదు సరికదా, తనకున్న పరపతి ఉపయోగించి వాళ్ళను బెదిరించాడు. పోలీసు కేసులు, అవీఇవీ అని ఆ భక్తురాలువాళ్ళు చాలా నలిగిపోయారు. ఆమె నాతో చెప్పుకొని బాధపడేది. నేను వాళ్ళ పేరుమీద ‘సంకల్పపారాయణ’ చేయించి, 'వాళ్ళ సమస్య తీరితే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను' అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల అతను బిల్డింగ్ ఖాళీచేసి వెళ్ళిపోయాడు. కానీ చాలా పెద్ద మొత్తం అద్దె డబ్బులు ఇవ్వలేదు. డబ్బు పోతేపోయింది, వాడి పీడ విరగడ అయిందని మేము చాలా సంతోషించాము. "చాలా చాలా థాంక్స్ బాబా. ఆమె మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. త్వరలోనే తనకి మంచి ఉద్యోగం వచ్చేలా దీవించు సాయీ. వాళ్లకి ఎటువంటి కష్టం రాకుండా నువ్వే కాచుకో తండ్రీ. అలాగే పై రెండు అనుభవాలను పంచుకోవడం ఆలస్యమైనందుకు నన్ను క్షమించు సాయీ".
ఇప్పుడు 2023, ఫిబ్రవరి 25న బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని పంచుకుంటాను. అప్పటికి కొన్ని రోజులుగా నేను శ్రీగురుచరిత్ర పారాయణ చేయాలని అనుకుంటూండేదాన్ని. కానీ వారంలో పూర్తి చేయటం అవుతుందో, లేదోనని రోజుకి ఒక అధ్యాయం చదువుదామని అనిపిస్తుండేది. చివరికి 2023, ఫిబ్రవరి 23, గురువారంనాడు పారాయణ మొదలుపెడదామని నిర్ణయించుకుని మిగిలిన పారాయణలన్నీ త్వరత్వరగా ముగించాను. అంతే, హఠాత్తుగా నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ మొదలైంది. ఊపిరి తీస్తున్నా నొప్పి వస్తుండేది. అలా అంతకుముందెప్పుడూ రాలేదు. ఆ నొప్పి వలన మహాపారాయణ క్లాసెస్ చూసుకోలేమోననిపించింది. బాబా దయవల్ల ఊదీనీళ్ళు త్రాగితే సాయంత్రానికి తగ్గింది. కానీ శ్రీగురుచరిత్ర పారాయణ మొదలుపెడదామన్నప్పుడే ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. సరే, మన సాయి ప్రణాళిక వేరేలా ఉందని ఆయనకే వదిలేస్తూ, 'ఒకవేళ పారాయణ మొదలుపెట్టమ'ని బాబా ఆదేశిస్తే, ఒక సాయిబంధువుని (ఆవిడకి పారాయణ గ్రూపులు చాలా ఉన్నాయి) శ్రీగురుచరిత్ర పారాయణ గ్రూపు ఉంటే చెప్పమని అడుగుదామనుకున్నాను. కానీ సాయి నుంచి ఎలాంటి ఆదేశం, సందేశం రాలేదు. అలాగని ఆయన నా విన్నపాన్ని వినలేదని కాదు కదా! ఆయన మహిమలు మనం ఊహించలేం కూడా. మన ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదనుకునే లోపే సాయి అద్భుతం చేస్తారు. అవును, అదే జరిగింది. బాబా ఆదేశమొస్తే, నేను ఏ సాయిబంధువునైతే పారాయణ గ్రూపు గురించి అడుగుదామనుకున్నానో ఆవిడే 2023, ఫిబ్రవరి 25 సాయంత్రం, 'శ్రీగురుచరిత్ర పారాయణ గ్రూపు మొదలవుతుంది. ఆసక్తిగలవారు జాయిన్ అవ్వండి' అని వేరే గ్రూపులో మెసేజ్ పెట్టారు. నేను ఎంత సంతోషించి ఉంటానో మీకు అర్థమై ఉంటుంది కదా! ఈ అద్భుతాన్ని వెంటనే మీ అందరితో పంచుకోవాలనిపించి వ్రాసి బ్లాగుకి పంపాను. "చాలా చాలా ధన్యవాదాలు సాయీ".
శుభం భవతు!!!
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
కోరుకున్నట్లే పండగకి మనవరాలిని పంపిన బాబా
ఈ బ్లాగు నిర్వాహకులకు సాటి సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈమధ్య మా కుటుంబంలో అనుకోకుండా గొడవలు వచ్చాయి. ఆ గొడవల వలన నా కూతురు, అల్లుడు, మనవరాలు పండగకి రామని అన్నారు. నేను చాలా చాలా బాధపడి, "కనీసం నా మనవరాలైన పండగకి వస్తే, మీ అనుగ్రహాన్ని నేను బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాను పగలూరాత్రీ వేడుకున్నాను. కొన్ని సమస్యలు వచ్చినా నా మనవరాలు పండగకి వచ్చి పది రోజులు మాతో ఆనందంగా గడిపింది. "ధన్యవాదాలు బాబా. సమస్యలన్నీ తీరిపోయి నా కూతురు, అల్లుడు, నా భర్త అందరినీ కలపమని వేడుకుంటున్నాను తండ్రి".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me