సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1477వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి
2. బాబుని కాపాడి తమపై నమ్మకాన్ని కలిగించిన బాబా

బాబా దయుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయి

ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేను రైల్వేలో ఆక్సిడెంట్ రైలు మైంటెనెన్సు ఇంచార్జిగా విధులు నిర్వహిస్తాను. ఒకరోజు హఠాత్తుగా మా హెడ్ క్వార్టర్ నుండి ఒక ఆఫీసర్ ఇన్స్పెక్షన్‌కి వచ్చారు. అతను వచ్చే సమయానికి నా పరిధిలో ఉన్న ఒక ముఖ్యమైన ఎక్విప్మెంట్ పనిచేయడం మానేసింది. ఒకవేళ అతను అది గమనిస్తే నాకు చాలా సమస్య అవుతుంది. అయితే అతను ముందు వేరే లొకేషన్‌కి వెళ్ళారు. అతను అక్కడినుండి మా దగ్గరకి వచ్చేలోపు మేము ఆ ఎక్విప్మెంట్ తీసేసి అతనికి కనపడకుండా దాచేసాము. అతను వచ్చి మిగతా ఎక్విప్మెంట్ పనితనం చూసి మమ్మల్ని మెచ్చుకొని వెళ్ళారు. అంతా బాబా దయ. అతను మమ్మల్ని చూసి కూడా మొదట మా దగ్గరకి రాకుండా వేరే చోటకి వెళ్ళటం బాబా చేసిన మాయ. లేదంటే పరిస్థితి వేరేగా ఉండేది. "ధన్యవాదాలు తండ్రి.

మా అక్కవాళ్ళ అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లి సంబంధం కుదిరింది. ఆ సంబంధానికి సరేనన్న ఆ అమ్మాయి ఒకరోజు ఉదయం ఇంట్లో చెప్పాపెట్టకుండా, మొబైల్ కూడా ఇంట్లోనే ఉంచేసి ఏటో వెళ్ళిపోయింది. తరువాత మాకు తెలిసిన విషయమేమిటంటే,  అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి దగ్గరకి వెళ్తుందని. ఆ అబ్బాయి వల్ల కుటుంబం మంచిది కాబట్టి, మా అక్కకి ఫోన్ చేసి, "మీ అమ్మాయి విజయవాడలో దిగి, తెనాలి వస్తానని, నన్ను తీసుకెళ్లడానికి రండని చెప్పింది" అని  చెప్పారు. దానితో అందరికీ టెన్షన్ మొదలైంది. వెంటనే మా అక్క పలాస నుండి బస్సులో బయలుదేరింది. మా కజిన్ హైదరాబాద్ నుండి విజయవాడకి బయల్దేరాడు. మేము ఎందుకైనా మంచిదని విశాఖపట్నంలో ఫ్రెండ్స్‌కి చెప్పి ఆ అమ్మాయిని విశాఖపట్నంలో ఆపే ప్రయత్నం చేసాము కానీ ఎవరూ సెట్ అవ్వలేదు. ఇలా ఉండగా అక్క రాత్రి 7:30కి విశాఖపట్నంలో దిగింది. అక్కడి నుండి విజయవాడ వెళ్ళడానికి నేను వేరే బస్సు బుక్ చేశాను కానీ చివరి నిముషంలో ఆ బస్సు కాన్సల్ అయింది. విశాఖపట్నంలో ఉన్న నాకు తెలిసిన ఒక అబ్బాయికి విషయం చెపితే, తను వెళ్లి మా అక్కకు కొంత డబ్బిచ్చి వేరే బస్సు ఎక్కించాడు. అటు హైదరాబాద్ నుండి బయలుదేరిన మా కజిన్ రాత్రి 9.30 కల్లా విజయవాడ చేరుకున్నాడు. కానీ మా అక్క కూతురు ఎక్కడ ఉన్నదో తెలీలేదు. నేను బాబాని "బాబా మా అక్కవాళ్ళ అమ్మాయి క్షేమంగా ఉండి, మావాళ్ళకి దొరికితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. బాబా దయవల్ల నేను ఉదయం 5.30కి కాల్ చేసేసరికి అందరూ ఒక చోట ఉన్నారని తెలిసింది. విషయం ఏమిటంటే, అమ్మాయి ఎవరి ఇంటికైతే వెళ్లిందో వాళ్ళే ఫోన్ చేసి, అమ్మాయి వాళ్ళింటిలో ఉందని చెప్పారు, దాంతో అందరూ అక్కడ కలిశారు. "ధన్యవాదాలు బాబా. అలానే ఈ సమస్యకి చక్కటి పరిష్కారం దొరికేలా చూడు తండ్రి. ఈ విషయం బయటకు తెలిస్తే మా అక్కవాళ్ళ కుటుంబం పరువుపోతుంది. మీరే ఎదో ఒక దారి చూపండి తండ్రి. నా భార్య, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి. నీ అనుగ్రహం మా కుటుంబంపై, నీ భక్తులపై ఎల్లప్పుడూ చూపుతూ సదా సంరక్షించు తండ్రి".

అఖిలందకొటి బ్రహ్మందనాయక రాజాధిరాజా యోగిరాజా  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

బాబుని కాపాడి తమపై నమ్మకాన్ని కలిగించిన బాబా

సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు నవ్య. మా ఆంటీవాళ్ళ బాబుని గురుకుల హాస్టల్లో జాయిన్ చేసారు. కానీ ఆ బాబు హాస్టల్లో ఉండనని బాగా ఏడ్చి ఒక్క రోజు కూడ పూర్తికాకముందే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయించాడు. దాంతో వాళ్ళ అమ్మ బాబుని ఇంటికి తీసుకొచ్చింది. మరుసటిరోజు గురువారం. ఆంటీ బాబుని మా ఇంటికి తీసుకొచ్చి, "బాబు హాస్టల్లో అస్సలు ఉండనంటున్నాడు. నువ్వు ధ్యానంలో వీడు హాస్టల్లో ఉంటాడో, లేదో బాబాని అడిగి చూడు" అని నాతో చెప్పింది. నేను సాయి ధ్యానం చేస్తాను. ధ్యానంలో సాయి చాలా ప్రశ్నలకి జవాబులు ఇచ్చారు. నేను ధ్యానంలో, 'ఆ బాబు హాస్టల్లో ఉంటాడో, లేదో తెలియజేమ'ని అడిగితే, "ఆ బాబు హాస్టల్లో ఉండడు" అని సాయి చెప్పారు. అదే విషయం నేను ఆంటీకి చెప్పాను. అయితే ఆంటీవాళ్ళు సాయి భక్తులు కాదు. ఆమె సాయి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందక దేవుడు ఆవహించి ప్రశ్నలకు జవాబులు చెప్తారంటారు కదా! అటువంటి వాళ్ళను సంప్రదించి వాళ్ళిచ్చిన బొట్టు ఇచ్చి బాబుని మళ్ళీ హాస్టల్కి పంపింది. ఆ బాబు మరుసటిరోజు హాస్టల్ నుండి కనబడకుండా పారిపోయాడు. మా ఆంటీ నాకు ఫోన్ చేసి, "బాబు ఎక్కడికో పారిపోయాడు. ధ్యానంలో సాయిని బాబు దొరకాలని, వాడికి ఏ ఆపద రాకుండా చూడామని చెప్పు" అని ఏడుస్తూ చెప్పింది. నేను ధ్యానం చేస్తే, "నా మాట వినకుండా, నన్ను నమ్మకుండా వేరే దగ్గర అడిగి హాస్టల్కి పంపారు" అని చెప్పారు బాబా. ఆ విషయం నాకూ అప్పుడే తెలిసింది. నేను ఆంటీవాళ్ళకి ఫోన్ చేసి, బాబా చెప్పింది చెప్పాను. అప్పుడు అంటి, "నువ్వు చెప్పిందంతా నిజమే" అని చెప్పింది. తరువాత, "నేను నిన్ను నమ్ముతున్నాను బాబా. కానీ నా బాబుకు ఏమీ కాకూడదు" అని అనుకుంది. నేను కూడా బాబా ఫోటో ముందు, "బాబా! అ బాబు దొరికేలా చూడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అంతే, 10నిమిషాల్లో ఆ బాబు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, "నేను హాస్టల్లో ఉండను. నన్ను ఒక ముసలాయన బాబా గుడికి తీసుకెళ్లాడు. నేను బాబా గుడిలో  వున్నాను. వచ్చి నన్ను తీసుకెళ్లండి" అని చెప్పాడు. ఆ బాబును స్వయంగా బాబానే కాపాడారని మా ఆంటీవాళ్ళు ఇప్పుడు బాబాని నమ్ముతున్నారు.

2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo