1. సరైన సమయానికి ఆలోచననిచ్చి పెద్ద సమస్య కాకుండా కాపాడిన బాబా
2. సాయికి చెప్పుకుంటే తీరిన సమస్య
సరైన సమయానికి ఆలోచననిచ్చి పెద్ద సమస్య కాకుండా కాపాడిన బాబా
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సుగుణ. నేను నా అర్హతలకి తగ్గ ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్ వెళ్ళాను. ఆ ఉద్యోగం వచ్చేలోపు బాబా నాకు ఒక చిన్న ఉద్యోగాన్ని చూపించి, తద్వారా వచ్చే డబ్బుతో ఎవరి మీద ఆధారపడకుండా నా పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళ ఇతర అవసరాలు, అలాగే నా అవసరాలు తీర్చుకుంటూ నా బాధ్యతలన్నీ నెరవేర్చుకునేలా అనుగ్రహించారు. అందుకు ధన్యవాదాలు బాబా. ఇకపోతే, నా పిల్లలు మా అమ్మవాళ్ళ దగ్గరుండి చదువుకుంటున్నారు. 2024, ఫిబ్రవరిలో ఐదేళ్లు ఉన్న మా చిన్నబాబుకి రాత్రి నిద్రలో జ్వరం వచ్చింది. అమ్మ జ్వరం సిరప్ వేస్తే, జ్వరం తగ్గిందికానీ భయంతో రాత్రంతా నిద్రలో ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయం టిఫిన్ కూడా సరిగా తినలేదు. నీరసంగా ఉన్నందున బాబుని ఆరోజు స్కూలుకి పంపలేదు. మధ్యాహ్నానికి మళ్ళీ జ్వరం రావడంతో అమ్మ బాబుని హాస్పిటల్‌కి తీసుకెళితే డాక్టరు మందులిచ్చారు. ఆ మందులు వాడుతున్నా బాబుకి జ్వరం తగ్గడం, మళ్ళీ రావడం జరుగుతుండేది. అప్పుడు నాకు, 'ఎందుకన్నా మంచిది. ఒకసారి నేను వెళ్తే, బాబుకి బెంగ ఏమన్నా ఉంటే పోతుంది' అనిపించి హఠాత్తుగా టికెట్ తీసుకొని అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. నేను వెళ్లేసరికి బాబుకి జ్వరం లేదు, బాగానే ఉన్నాడు. దాంతో రెండు రోజుల తర్వాత నేను రైలు టికెట్ తీసుకోవాలా, వద్దా అని ఆలోచించినప్పటికీ మళ్ళీ వద్దులే, ఇంకో 2 రోజులు ఇక్కడ ఉందామని టిక్కెట్టు తీసుకోలేదు. అదేరోజు మధ్యాహ్నం బాబుకి మళ్ళీ జ్వరం వచ్చింది. సిరప్ వేస్తే తగ్గిందికానీ, ఒకసారి రక్తపరీక్ష చేయిస్తే మంచిదనే ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచన నాకొచ్చిందనే కంటే బాబా ఇచ్చారు అనడం సబబుగా ఉంటుంది. విషయం అమ్మతో చెప్తే, "సరే, బాబుని హాస్పిటల్‌కి తీసుకెళదాం" అంది. అయితే ఆరోజు మంగళవారం అయినందున పిల్లల హాస్పటల్‌కి సెలవు ఉంటుంది. అయినా ఎందుకైనా మంచిదని ఒకసారి హాస్పిటల్‌కి కాల్ చేస్తే, "ఈ రోజు హాస్పిటల్ ఓపెన్ ఉంది. డాక్టరు ఇప్పుడు 1:30 నుండి 3:30 వరకు ఓపీ చూస్తారు. మీరు 3, 3.30 లోపు రండి" అని చెప్పారు. వాళ్ళు చెప్పిన సమయానికి బాబుని తీసుకుని నేను, అమ్మ హాస్పిటల్‌కి వెళ్లి కన్సల్టెంట్ స్లిప్ వ్రాయించాను. 5 నిమిషాల్లోనే నన్ను పిలిచారు. అసలు ఆ హాస్పిటల్లో చాలా సమయం వెయిట్ చేయాలి. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టరు బాబుని చెక్ చేసి, నేను అడగకముందే "ఒకసారి బ్లడ్ టెస్ట్ చెపిద్దాం అమ్మా" అన్నారు. సరేనని అక్కడే టెస్ట్ చేయిస్తే ఒక గంటలో రిపోర్ట్ వచ్చింది. అందులో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఉంది. బాబుకి సంవత్సరంన్నర వయసున్నప్పుడు కూడా ఇలానే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇదే హాస్పిటల్లో 3 రోజులు ఉన్నాం. ఇప్పుడు కూడా ఎవరో పిల్లలిద్దరు అదే సమస్య కారణంగా హాస్పిటల్‌లో అడ్మిట్ అయి చికిత్స తీసుకోవడం నేను చూశాను. అందువల్ల, 'మేము కూడా హాస్పిటల్‌లో ఉండాలా ఏంటి?' అని అనుకోసాగాను. కానీ మనసులో ఎక్కడో, 'లేదు. ఉండవలసిన అవసరం లేకుండా మన బాబా చూస్తారు' అనిపించింది. సరే, రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే, నా మనసుకి అనిపించినట్లే, 'హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి, రెండు రోజులు వాడి రమ్మన్నారు'. డాక్టర్ చెప్పినట్టు 2 రోజులు ఆ మందులు వాడాక మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే, "ఇప్పుడు బాగానే ఉంది" అని మల్టీవిటమిన్ సిరప్ వ్రాసారు. చూసారా! మన బాబా దయతో సమస్య పెద్దది కాకుండా మొదటిలోనే పరీక్ష చేయించాలనే ఆలోచన నాకిచ్చి నా బాబు ఆరోగ్యం బాగుండేలా చేసారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ. ఎప్పుడూ ఇలాగే నా బిడ్డలని, కుటుంబసభ్యులని చల్లగా చూడు తండ్రీ. నా చేయి ఎప్పుడూ వదలకుండా మీపై మరింత భక్తి ధృడపరుచు తండ్రీ".
సాయికి చెప్పుకుంటే తీరిన సమస్య
సాయి భక్తులకు నమస్కారం. నా పేరు రఘునాథ్. ఎక్కడ ఉన్నా, ఎంత దూరాన ఉన్నా నా వారిని పిచ్చుక కాలికి దారం కట్టి నా దగ్గరకి లాక్కుంటానని చెప్పినా విధంగా సాయి నన్ను తన భక్తుడిగా చేసుకున్నారు. 2024, ఫిబ్రవరి నెల మొదటి వారం నుండి 40 రోజులపాటు నా చెవిలో ఏదో ఉన్నట్టుండి చాలా ఇబ్బంది పడ్డాను. చివరికి డాక్టర్ వద్దకు వెళ్ళాలనుకుంటూ సాయి భక్తుల అనుభవాలు చదివాను. అలా చదువుతున్న సమయంలో, "నా చెవి సమస్య తగ్గితే, మీ అనుగ్రహాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాన"ని సాయికి చెప్పుకున్నాను. ఆ మరుసటిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఇయర్ బడ్ చెవిలో పెట్టుకున్నాను. దాన్ని తిరిగి బయటకి తీసే క్రమంలో అదివరకు ఎప్పుడో నా చెవిలో ఉండిపోయిన ఇయర్ బడ్ తాలూకు దూది బయటకు వచ్చింది. నేను ప్రతిరోజూ ఇయర్ బడ్ ఉపయోగిస్తున్నప్పటికీ 40 రోజులుగా నన్ను ఇబ్బందిపెడుతున్న ఆ దూది బయటకి రాలేదు. సాయికి చెప్పుకున్నాకనే ఆయన దయతో ఆ దూది బయటకు వచ్చి సమస్య తీరింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Om Sairam!! Antha savyanga jarigela chudu thandri!! Meede bharam baba!!
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai
ReplyDeleteOm sairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sri sainadaya namaha 🙏 🌺 🙏
ReplyDeletePlease take care of child baba 🙏
ReplyDeletePlease baba ma chelli vallu nato matladali baba
ReplyDeleteBaba,roju rojuki chala kastam ayipothundi problems perigipothunnayi baba....Mee meda baram vesi chala varaku dairyam vundataniki alavatu chesukunna....mere mammalni kapadi elanti addanki lekunda pending vunnavi antha vachela cheyandi Baba...naa valla evariki ebbandi rakunda chudandi baba, Mee padale naku dikku 🙏🙏🥺❤️♥️
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeletesai baba maa sai madava bharam antha meede baba
ReplyDelete