సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1807వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అద్భుత అనుగ్రహం
2. పాసయ్యేలా అనుగ్రహించిన బాబా

బాబా అద్భుత అనుగ్రహం


బాబాయే సర్వం అని నమ్మి ఆయన బాటలో నడవాలనుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని. ఇంచుమించుగా 20 సంవత్సరాల నుంచి నాకు బాబాతో పరిచయం ఉంది. బాబా నాకు చాలా విషయాలలో తోడుగా నిలిచి నా సమస్యల్ని పరిష్కరించారు. అందులో కొన్నింటిని తోటి సాయి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయినైన నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను. మా పెళ్ళికి మా ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. నన్ను గృహనిర్బంధంలో ఉంచారు. ఆ సమయంలో నేను భారమంతా బాబా మీద వేసి పెద్దవాళ్ళని మా పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను పడ్డ ప్రతి కష్టంలో నాకు తోడుగా నిలిచారు బాబా. నేను గృహనిర్బంధంలో ఉన్న సమయంలో బాబా పేరుతో నడిచే ఒక టీవీ ఛానల్‌వాళ్ళు బాబా డైరీని ప్రింట్ చేసి, 150 రూపాయలు రుసుము తీసుకొని భక్తులకు పంపిణి చేస్తూండేవాళ్లు. నేను ఆ డైరీ పొందాలని ఆ టీవీ ఛానల్ ఆఫీసుకి ఫోన్ చేసి, డైరీతోపాటు బాబా ఊదీ కూడా పంపమని నా అడ్రస్ చెప్పాను. అయితే వాళ్ళు తమ బ్యాంక్ అకౌంట్‌కి 150 రూపాయలు పంపమని చెప్పారు. గృహనిర్బందంలో ఉన్న నాకు ఆ నగదు పంపడానికి వీలుపడక ఆ విషయం గురించి వదిలేసాను. తర్వాత కొన్నిరోజులకి ఒక రోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక అబ్బాయి ఆ డైరీ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నేను డబ్బులు ఇచ్చేలోపే ఆ అబ్బాయి మా ఇంటికి దగ్గరలో ఉన్న బాబా గుడి వైపుకు వెళ్లిపోయాడు. అదేరోజు మధ్యాహ్నం నాకు ఒక పార్సిల్ హైదరాబాదు నుంచి వచ్చింది. ఆ పార్సెల్ విప్పి చూస్తే, అందులో బాబా డైరీ ఉంది. నిజానికి ఆ టీవీ ఛానల్‌వాళ్ళు మనం డబ్బులు పంపిన బ్యాంక్ అకౌంట్ నెంబరు, పేరు తనిఖీ చేసుకున్న తర్వాతనే డైరీ పంపుతామని నాతో ఫోన్లో చెప్పారు. అలాంటిది నేను ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే నాకు ఆ డైరీ వచ్చింది. దాన్ని బాబాయే నాకోసం పంపించారని నేను మనస్పూర్తిగా నమ్మాను. ఇదే విషయం ఆయన నాకు ముందుగా కల రూపంలో తెలియజేశారు.


ఇకపోతే, నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత ప్రయత్నించినా మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఎన్నో ఇబ్బందుల తర్వాత బాబా ఆశీర్వాదంతో మా పెళ్లి జరిగింది. పెళ్ళైన సంవత్సరం వరకు మాకు పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై నేను బాబాని అడుగుతూ ఉండేదాన్ని. ఒకరోజు కలలో బాబా దర్శనమిచ్చారు. ఆ కలలో నేను బాబాని పిల్లల విషయమై అడగపోబోయేలోపు ఆయన చేతితో ఏదో సైగ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆ కలలో ఒక చిన్నపాప మా ఆయన తల దగ్గర ఏడుస్తూ నాకు కనిపించింది. ఇంకా ఆ కలలోనే ఆ పాప పెరిగి ఏడు సంవత్సరాల వయసు వచ్చాక తన కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే మేము కంగారుపడటం కూడా కనిపించింది. సరిగ్గా ఈ కల వచ్చిన నెల రోజులకు నేను గర్భవతినని నిర్థారణ అయింది. నా భర్త పాప కావాలి అనుకున్నారు. నేను 'బాబా కలలో చూపించారు కదా! పాపే పుడుతుంది' అనుకున్నాను. కానీ 2020, జనవరి 13న మాకు బాబు పుట్టాడు. దాంతో నా భర్త నా కల విషయం నమ్మలేదు. అలాగే మా పక్కింటి ఆంటీ కూడా నమ్మలేదు. పాప పుడుతుంది అంటే బాబు పుట్టాడు అని ఎగతాళి చేశారు. కానీ నేను బాబా మాటలను మనస్ఫూర్తిగా నమ్మాను. బాబా దయవల్ల రెండోసారి ప్రెగ్నెన్సీ కష్టమని చెప్పినప్పటికీ బాబు పుట్టిన మూడు నెలలకే నేను రెండవసారి గర్భవతినయ్యాను. ఈసారి బాబా చెప్పినట్లే 2020, డిసెంబర్ 24న నాకు పాప పుట్టింది. అప్పుడు నేను నా భర్త, పక్కింటి ఆంటీలతో, "బాబా నాకు కలలో పాప పుడుతుందని చెప్పారు. అలాగే నాకు పాపం పుట్టింది. బాబా మాటలు ఎన్నటికీ అసత్యం కావు" అని చెప్పాను. ఇలా నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, అన్ని బంధుత్వాలు తామై బాబా నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి మార్గం చూపిస్తున్నారు. నా జీవితాంతం బాబాతో నా ప్రయాణం ఇలాగే సాగాలని బాబాను మనస్పూర్తిగా వేడుకుంటున్నాను.


పాసయ్యేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. నేను ఇదివరకు స్కూల్లో టీచరుగా పని చేసాను. కరోనా కారణంగా నా ఆరోగ్యం సహకరించక ప్రస్తుతం స్కూలుకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పుకుంటున్నాను. నేను గతంలో పనిచేసిన స్కూల్ మేడంవాళ్ళ పాలిటెక్నిక్ చదువుతున్న పాప రెండుసార్లు కెమిస్ట్రీ ఫెయిల్ అయింది. మేడం నా దగ్గరకు వచ్చి, "మేడం! మీరు మా పాపకి ట్యూషన్ చెప్పరా?" అని అడిగింది. నేను LKG నుండి పదవ తరగతి వరకు చెప్తున్నందువల్ల ఆ అమ్మాయికి చెప్పడం కుదరదు. ఆ విషయం మేడం గారితో ఎలా చెప్పాలో అర్థంకాక, "నా భర్త ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో పని చేస్తున్నారు. తను చాలా బాగా కెమిస్ట్రీ వివరించి చెప్తారు" అని చెప్పాను. మేడం, "సరే, ఇక మీదే బాధ్యత" అని చెప్పి ఫీజు ఎంతని అడిగారు. నేను, నా భర్త, "ఫీజు వద్దు. తను పాస్ అయిందన్న మాట మాకు చాలు" అని చెప్పాము. నా భర్త ఆ అమ్మాయికి సరిగ్గా రెండు నెలలు కెమిస్ట్రీ చెప్పాక 2024, జనవరి 10న పరీక్ష జరిగింది. ఫిబ్రవరి 27న నేను ఆ అమ్మాయిని "ఇంకా రిజల్ట్ రాలేదా" అని అడిగాను. అందుకు తను, "లేదు మేడం. వస్తే, కాల్ చేసి చెప్తాను" అని అంది. మరుసటిరోజు ఉదయం నేను పూజ చేసేటప్పుడు, "బాబా! ఆ పాప పాస్ అయ్యేలా చూడండి" అని అనుకున్నాను. అదేరోజు మధ్యాహ్నం సరిగ్గా 12:11 నిమిషాలకు ఆ పాప నాకు ఫోన్ చేసి, "మేడం పాస్ అయ్యాను" అని చెప్పింది. అది విని నాకు చాలా ఆనందంగా అనిపించింది. "చాలా ధన్యవాదాలు బాబా. మా పరువు కాపాడారు, ఆ పాప పాస్ అయ్యేలా చేశారు తండ్రీ. చాలా సంతోషం తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


15 comments:

  1. Om sai ram 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om Sai Sri Sai Jaya Jaya Sai. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu🙏🙏

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai Ram

    ReplyDelete
  8. baba madavaki SA-2 75%. marks ravali. madava bharam antha meede baba

    ReplyDelete
  9. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🙏🌺

    ReplyDelete
  10. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  11. ఇస్లాం: ప్రకృతి మరియు కరుణ మతం

    ప్రారంభం:

    ఇస్లాం ప్రకృతి మరియు కరుణ మతం, ఇది దేవుడు తన సేవకులకు ఎంచుకున్న మతం. ఇస్లాం ఒకే దేవుడిపై నమ్మకం, ప్రవక్తలు మరియు రాయబారులు, స్వర్గపు గ్రంథాలు మరియు తీర్పు రోజు.

    ఇస్లాం యొక్క స్తంభాలు:

    షహాదా: ఒకే దేవుడు మాత్రమే ఉన్నాడు మరియు ముహమ్మద్ అతని ప్రవక్త అని సాక్ష్యమివ్వడం.
    నమాజ్: రోజుకు ఐదు సార్లు ప్రార్థించడం.
    జకాత్: అవసరమైనవారికి ధనం యొక్క ఒక భాగాన్ని ఇవ్వడం.
    రమదాన్ ఉపవాసం: రమదాన్ నెలలో తెల్లవారుఝాము నుండి సూర్యాస్తమయం వరకు తినడం, త్రాగడం మరియు లైంగిక సంబంధం నుండి దూరంగా ఉండటం.
    హజ్: సామర్థ్యం ఉన్నవారికి మక్కాలోని పవిత్ర కాబాను సందర్శించడం.
    ఇస్లాం యొక్క సూత్రాలు:

    తౌహీద్: ఒకే దేవుడిపై నమ్మకం, అతనికి భాగస్వాములు లేరు.
    న్యాయం: ఇస్లాం ప్రజల మధ్య న్యాయం పాటించాలని, అన్ని రకాల అన్యాయాలను నిషేధిస్తుంది.
    ఇహ్సాన్: ఇస్లాం ప్రజలకు దయ చూపాలని, పేదలు మరియు అవసరమైనవారికి సహాయం చేయాలని బోధిస్తుంది.
    బాధ్యత: ఇస్లాం మానవుడిని తన చర్యలకు బాధ్యత వహిస్తుంది మరియు తీర్పు రోజున దానికి సమాధానం ఇవ్వాలి.
    కరుణ: ఇస్లాం ప్రజల మధ్య కరుణను ప్రోత్సహిస్తుంది, హత్య మరియు దూకుడును నిషేధిస్తుంది.
    ఇస్లాం యొక్క ప్రయోజనాలు:

    ఇహలోక మరియు పరలోక సంతోషం: ఇస్లాం మానవుడికి ఇహలోక మరియు పరలోక సంతోషాన్ని అందిస్తుంది.
    మార్గదర్శకత్వం మరియు సరైన మార్గం: ఇస్లాం మానవుడిని సరైన మార్గంలో నడిపిస్తుంది,

    ReplyDelete
  12. Baba edoka rakam gaa apataniki try chesthunna andari manasu marchi maku pending lo vunnavi vachela chudandi please....Baba naa valla evariki ebbandi kalagakunda chudandi please thandri ....Naku chala bayam gaa vundi 🥺🥺🥺🥺🥺.....Mee padale naku dikku 🥺🥺🥺😭😭

    ReplyDelete
  13. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo