1. తోడుగా ఉండి రక్షణనిస్తున్న బాబా2. సాయి కరుణ
తోడుగా ఉండి రక్షణనిస్తున్న బాబా
నా పేరు భవాని. 2023, డిసెంబర్లో మా అమ్మకు చెస్ట్ పెయిన్ వస్తే, వైజాగ్‌లోని ఆర్ఎమ్‌పి డాక్టర్‌కి చూపించాం. ఆయన ఇంజక్షన్ చేశారు కానీ, అమ్మకి నొప్పి తగ్గలేదు. దాంతో రెండు రోజుల తర్వాత మేము హార్ట్ డాక్టర్ దగ్గర చూపిద్దామని అమ్మని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్ ఈసీజీ తీసాక, "ఈసీజీ నార్మల్‌గా ఉంది. కానీ స్కానింగ్ చేయాలి" అని చెప్పారు. అప్పుడు నాకు భయమేసి, "బాబా! అమ్మ స్కానింగ్ రిపోర్ట్ నార్మల్ రావాలి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను. అలాగే గుడిలో పాలకోవా పంచుతాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నార్మల్ రిపోర్ట్ వచ్చింది.
మా పెద్దబాబుకి ఆరు సంవత్సరాలు ఉంటాయి. ఒకసారి రాత్రి సమయంలో తనకి బాగా దగ్గు వచ్చింది. దాంతో గొంతునొప్పి పెడుతుందని వాడు ఏడ్చాడు. నాకు ఏం చేయాలో అర్థంకాక వేడి నీటిలో ఉప్పు వేసి, ఆ నీళ్లతో బాబుచేత పుక్కిలింపజేసాను. అలాగే బాబాని ప్రార్థించి, వేడి నీటిలో కొంచెం ఊదీ వేసి బాబుచేత తాగించాను. బాబా దయవల్ల వాడు ఆ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయాడు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఇంకోసారి మధ్య రాత్రిలో మా చిన్నబాబు నిద్రలేచి ఏడ్చాడు. అప్పుడు వాడి వయసు రెండు సంవత్సరాలు. తను ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక, "బాబా! బాబుకి ఏ సమస్యా ఉండకూడదు. వాడు ఏడవకుండా పడుకునేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వాడు కొద్దిసేపట్లో ఏడుపు ఆపి నిద్రపోయాడు. "ధన్యవాదాలు బాబా".
ఈమధ్య నాకు ఆరోగ్యం బాగుండటం లేదని డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. అప్పుడు నాకు బీపీ ఎక్కువగా ఉందని చూపించింది. నిజానికి అంతకుముందు ఎన్నడూ నాకు బీపీ లేదు. డాక్టర్ ఇంటికి వెళ్ళాక మరోసారి బీపీ చెక్ చేసుకోమని చెప్పారు. అయితే మా ఇంటి దగ్గర హాస్పిటల్స్ ఏమీ లేవు. అందువల్ల, "ఎలా బాబా? మీరే ఏదో ఒక దారి చూపించండి" అని బాబాను వేడుకున్నాను. అదే రోజు నేను బాబా గుడికి వెళితే అక్కడ ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నేను బీపీ చెక్ చేసుకుంటే నార్మల్ ఉంది. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి రక్షిస్తూ ఉండు తండ్రీ. నా ఆరోగ్య సమస్య పూర్తిగా తగ్గేలా చూడు తండ్రీ".
సాయి కరుణ
నేను ఒక సామాన్య సాయిభక్తురాలిని. మాది ఖమ్మం జిల్లాలోని ఒక పల్లెటూరికి చెందిన వ్యవసాయ కుటుంబం. ఈమద్య మా ఆవు ఉన్నట్టుండి మేత మేయడం మానేసింది. అప్పుడు నేను సాయిని తలుచుకొని, ఆ ఆవుకి ఊదీ పెట్టి, "బాబా! మా ఆవుకి నయం కావాలి. మాకు ఏదైనా సహాయం చేయండి" అని అనుకున్నాను. అంతలో మావారికి తన స్నేహతుడు ఫోన్ చేసాడు. మావారు అతనితో, “మా ఆవుకి బాగా సీరియస్‌గా ఉంది” అని చెప్పారు. అతను మావూరిలో తెలిసిన ఒకతనికి ఫోన్ చేయమని, అతనికి డాక్టర్లు తెలుసు, అతని వద్ద డాక్టర్ల నెంబర్లు ఉంటాయి అని చెప్పాడు. సరేనని మావారు అతనికి ఫోన్ చేసి విషయం చెపితే, అతను డాక్టరుకి ఫోన్ చేసి మాట్లాడారు. డాక్టరు 9 గంటలకి వస్తానని, వచ్చారు. ఆవిధంగా సాయే ఆ డాక్టరుని పంపారని నాకు అనిపించింది. ఆరోజు నుండి 5 రోజులపాటు ఆ డాక్టరు మా ఆవుకి వైద్యం చేసాక కొంత బాగైంది. తర్వాత నెమ్మదిగా కోలుకొని ఇప్పుడు బాగానే ఉంది. నిజానికి మా మామగారు ఆవు ఇక బతకదని శ్మశానవాటిక వాళ్ళకి చెప్తానని అన్నారు. అది నాకు నచ్చక ఈ ఒక్కరోజు చూసి రేపు చెప్పండి అన్నాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితిలో నేను, "సాయీ! నువ్వే కాపాడాలి తండ్రీ" అని అనుకున్నాను. సాయి కరుణించారు. "కోటి ప్రణామాలు సాయినాథా! ఎల్లప్పుడూ మీ అనుగ్రహం మాపై ఇలానే వర్షించు తండ్రీ".
OM SAIRAM!!
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram ofce lo anta bagunde la chayandi tandri, inko project penchakunda unde la chudandi tandri, work ekkuva aipothundi unna projects ye unde la chudandi tandri pls
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeletesaibaba , maa bangaru tandri sai madava ki eeroju telugu & maths exams . meeru daggara vundi exam rainchandi baba. Maths -sem-2 school lo doriketattu cheyandi baba.
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm sri sairam 🙏
ReplyDeleteOm sairam 🙏
ReplyDeleteBaba maa problem solve ayyela chudandi baba please mee padale naku dikku....nenu chesina thappulu emaina vunte kashaminchi mammalni anugrahinchandi baba....naa valla nannu nammukuni vachina evariki ebbandi kalagakunda chudandi please 🙏🙏🙏🙏🙏🙏🥺🥺🥺😭
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
ReplyDelete