సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1788వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయే మనకు రక్ష
2. కోరుకున్నట్లే దయ చూపిన బాబా

సాయే మనకు రక్ష


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. నాకు చిన్నప్పటినుండి సాయిబాబా అంటే చాలా నమ్మకం. 2023, డిసెంబర్‌లో నా భర్త పని చేస్తున్న కంపెనీవాళ్ళు మొదట నా భర్త జీతం పెంచుతామని చెప్పారు. కానీ తర్వాత అది కింద స్థాయి వాళ్లకు మాత్రమే అని అన్నారు. అప్పుడు నేను, "బాబా! నా భర్త జీతం పెంచితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మావారి జీతం పెంచారు.


2024, జనవరిలో యూరిన్ సమస్య వల్ల మా నాన్నకి చిన్న సర్జరీ జరిగింది. ఆ సర్జరీ అనంతరం డాక్టర్, "యూరిన్ బ్లాడర్ దగ్గర గడ్డ ఉంది. దాన్ని బయాప్సి పంపించాలి" అని అన్నారు. అప్పుడు మా కుటుంబం అంతా చాలా భయపడ్డాము. నేను, "బాబా! మీ దయవల్ల ఆ బయాప్సీ రిపోర్టు నార్మల్ అని వస్తే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. నేను కోరుకున్నట్లే రిపోర్టు నార్మల్‌గా వచ్చింది. డాక్టర్ ఇంకేం ప్రాబ్లం లేదని చెప్పారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


మా నాన్న ప్రతి సంవత్సరం మా పాప పేరు మీద ఎల్ఐసి కడుతున్నారు. అయితే ఈ సంవత్సరం(2024, జనవరిలో) ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ఎల్ఐసి డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది. అదే జరిగితే మేము ఆ డబ్బులు కట్టాల్సి వస్తుంది. కానీ మాకు కొన్ని ఆర్థిక సమస్యలున్నాయి. వాటివల్ల కట్టలేకపోతే ఎలాగనిపించి నేను, "బాబా! మీ కృపతో నాన్న ఎల్ఐసి డబ్బులు కడితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిబంధువులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల నాన్న ఎల్ఐసి డబ్బులు కట్టారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మా కుటుంబం మీద, తోటి సాయి భక్తుల మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. మీరు లేని మా జీవితాలు శూన్యం తండ్రి. మీరే మాకు రక్ష మీ చల్లని నీడలో మమ్మల్ని సదా సంరక్షించండి తండ్రి".


కోరుకున్నట్లే దయ చూపిన బాబా

సాయిబంధువులకు నమస్కారం. నేను ఆరవ తరగతి చదివేటప్పుటి నుంచి బాబా భక్తురాలిని. ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు. బాబా నాకు మంచి భర్త, ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. నాకొచ్చిన ప్రతి సమస్య నుంచి గట్టెక్కిస్తున్నారు. ఒకసారి మా అన్నయ్యకి కళ్ళ సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల తనకి కంటిచూపు పోయే పరిస్థితి ఉండటంతో మేము చాలా బాధపడ్డాము. హైదరాబాదు వెళ్లి హాస్పిటల్లో చూపించాము. అప్పుడు నేను, "బాబా! ఈ హాస్పిటల్లో సమస్యేమీ లేదని, డ్రాప్స్‌తో తగ్గుతుందని చెప్పాలి. అలా చెప్తే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవలన నేను కోరుకున్నట్లే చెప్పి మూడు నెలలు డ్రాప్స్ వేసుకోమని ఇచ్చారు. "థాంక్యూ బాబా. మూడు సంవత్సరాల నుంచి మా పాప గురించి ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాను. దాన్ని అనుగ్రహించండి బాబా".


21 comments:

  1. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Baba Kalyan ki marriage chai thandri vadini bless cheyandi

    ReplyDelete
    Replies
    1. OM Sai Sri Sai Jaya Jaya Sai 🙏🌹🙏🌹🙏

      Delete
  9. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  10. sai baba , eeroju maa bangaru tandri sai madava ki computer exam. meere daggara vundi exam ranchali baba. madava lo maarpu ravali baba.

    ReplyDelete
  11. Baba ma chinna abbai 15 days nundi health bagaledhu .A doctor daggariki vellina a problem ledhu antunnaru,kani enduku adustunnado artam kavatledhu.Mere ma Babu ni rakshinchali .

    ReplyDelete
  12. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  13. ఓం సాయిరామ్

    ReplyDelete
  14. Baba, mammalni mere kapadali....ee problems nundi memu bayataki vachelaga cheyandi please.....Chala bayam gaa anipisthundi Baba....naa valla nanna kuda kangaru paduthunnaru....naa thappulu emaina vunte kashaminchi mammalni anugrahinchandi baba.....naa valla nannu nammukuni vunna evarini ebbandi pettakunda chudandi baba ....Mee padale naku dikku 🙏🙏🥺😭😭

    ReplyDelete
  15. OM Sai Ram ji 🙏🏽🌹🙏🏽🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo