సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1804వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఉద్యోగ విషయంలో బాబా చూపిన దయ 
2. బాబా అనుగ్రహం

ఉద్యోగ విషయంలో బాబా చూపిన దయ 


నా పేరు మాధవి. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఒకరోజు ఆఫీసులో ఒక సమస్యను పరిష్కరించమని నాకు పని కేటాయించారు. మా మేనేజర్ ఫోన్ చేసి, "అది కొంచెం చిక్కు సమస్య. వీలైనంత త్వరగా చేయండి" అని అన్నారు. నేను అతనికి, "ఎంత సమయం పడుతుందో నేను ఇప్పుడే ఏం చెప్పలేను" అని సమాధానం ఇచ్చాను. కానీ నా పట్ల అతనికి చెడు అభిప్రాయం కలుగుతుందేమోనని భయపడి, "బాబా! నేను నా మేనేజర్‌తో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, నన్ను క్షమించి ఈ పని పూర్తి చేసేలా అనుగ్రహించండి” అని బాబాను ప్రార్థించాను. అదృష్టవశాత్తూ నా భర్త నాకు సహాయం చేస్తానన్నారు. ఎందుకంటే, నేను పనికి  కొత్త, నాకు అంత పరిజ్ఞానం లేదు. బాబా దయతో నేను, నా భర్త కలిసి నిర్ణిత సమయానికి 2 రోజుల ముందే పనిని పూర్తి చేయగలిగాము. తర్వాత ప్రొడక్షన్‌లో వచ్చిన సమస్యను కూడా పరిష్కరించడంలో బాబా నాకు సహాయం చేసారు. 


మరొకరోజు వేరే టీమ్‌వాళ్ళు నా పనిలో ఒక బగ్ ఫిక్స్ చేసి, నేను సరిగ్గా కోడ్ చేయలేదన్నారు. దాంతో నేను చాలా టెన్షన్‌ పడ్డాను. నేను ఆ పనికి కొత్త అయినందున నా భర్త సహాయంతో నా పని చేస్తున్నాను. అతనే ఆ కోడ్ వ్రాసింది. కానీ కోడ్ తప్పు ఉందంటే, అతను దాన్ని ఒప్పుకోలేదు. పైగా కోపం తెచ్చుకొని, చాటింగ్‌లో కొంచెం కఠినమైన వాక్యాలు మెసేజ్ చేసారు. దాంతో నేను చాలా భయపడిపోయాను. 'నా టీమ్ లీడ్ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో! అతను సానుకూలంగా తీసుకుంటాడా లేక ప్రతికూలంగా తీసుకుంటాడా? అది నా ఉద్యోగంపై ప్రభావం చూపుతుందా?' అని నా మనస్సులో చాలా ఆలోచనలు సాగాయి. నేను చాలా బాధతో, "నా భర్త అంత కఠినంగా ఉండకూడదు. ఏదైనా తప్పు ఉంటే అతను ఒప్పుకోవాలి" అని బాబాను ప్రార్థించి, ఆయన దయతో మావారు మంచిగా స్పందించి వేరే టీమ్‌వాళ్ళకి చక్కగా సమాధానం ఇస్తారని, సమస్యను పరిష్కరిస్తారని ఆశించాను. తర్వాత నేను నా భర్తతో, "ఆవేశపడకండి. దయచేసి వాళ్లతో మంచిగా చెప్పండి" అని చెప్పాను. బాబా దయవల్ల కొద్దిసేపటికి నా భర్త శాంతించి వేరే టీమ్‌వాళ్ల అవసరాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, అవసమైనది చేస్తానని మంచిగా సందేశం పంపారు. బాబా దయతో ఒక్క రోజులో సమస్య పరిష్కారమైంది. మరుసటిరోజు మీటింగ్‌లో నా టీమ్ లీడ్ బాబా అనుగ్రహం వల్ల సానుకూలంగా స్పందించాడు. అతను మీటింగ్‌లో ఆ విషయం గురించి అస్సలు మాట్లాడలేదు. "చాలా ధన్యవాదాలు బాబా. మీ ఆశీర్వాదం లేకుండా ఏదీ సాధ్యం కాదు బాబా. మీరే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. అలాగే నేను సబ్జెక్ట్ నేర్చుకునేలా చేయండి బాబా, నాకు మీ ఆశీస్సులు కావాలి తండ్రీ. నా ఉద్యోగ జీవితం గురించి ఆలోచించినప్పుడు నేను కొన్నిసార్లు కొంచెం నిరాశకు గురవుతున్నాను. దయచేసి నా గురువుగా ఉండి అలాగే నా పని నేను చేసుకునేలా ఆశీర్వదించండి బాబా. నేను నా తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉన్నందున కొన్నిసార్లు నాకు చాలా విచారంగా ఉంటుంది. దయచేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అన్నిటికీ ధన్యవాదాలు బాబా".


ఓం సాయి రక్షక శరణం!!!


బాబా అనుగ్రహం


నా పేరు శ్రీకాంత్. 2024, ఫిబ్రవరి నెల మూడోవారంలో నా ఆఫీసు పనిలో మా టీం తప్పిదం వల్ల నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది.  దానిని పరిష్కరించాలంటే 2 వారాలు ఆగాలి. కానీ అప్పటివరకు క్లయింట్ వేచి ఉండరు. నాకు ఏమి చెయ్యాలో తెలియక వెంటనే, "బాబా! ఈ సమస్య నుండి కాపాడండి" అని సాయిబాబాని వేడుకున్నాను. ఆశ్చర్యంగా మరుసటిరోజు క్లయింట్లు 2 వారాలు వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారని నాకు మెయిల్ వచ్చింది. దాంతో నేను స్థిమితపడ్డాను. "ధన్యవాదాలు బాబా". 


2024, ఫిబ్రవరి నెల మూడోవారంలో మా అబ్బాయి గొంతు నొప్పి, వాంతులతో ఆరోగ్యం పాడవడంతో అత్యవసరంగా తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్ళేముందు బాబాకి "బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేయమనకుండా ఉండాలి. తనకి మందులతో తగ్గిపోవాలి" అని వేడుకున్నాను. డాక్టర్ బాబుని చూసి ఒక టాబ్లెట్ ఇచ్చి, “ఒక 30 నిమిషాలు వేచి ఉండమ”ని చెప్పారు. బాబా దయవల్ల వాంతులు ఆగిపోయాయి. దాంతో డాక్టర్, “అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. 5 రోజులపాటు మందులు వాడండి" అని చెప్పారు. నేను ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.



18 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  6. Om sai sri sai jaya jaya sai, sarvejana sukenobavantu

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Jai Jai Sai Ram

    ReplyDelete
  8. baba maavari purse dorakali. madavani emi anakunda chudani.

    ReplyDelete
  9. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  10. ఓం సాయిరామ్

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  13. Om sri samagra sadguru sainath maharaj ki jai 🙏

    ReplyDelete
  14. Baba please take care of my child 🙏

    ReplyDelete
  15. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  16. Baba,roju rojuki chala kastam gaa anipisthundi....andaru okatesari avasaram antunnaru.... dayachesi elanti addanki lekunda pending vunnavi antha maa chethiki vachela cheyandi Baba....naa valla evaru ebbandi padakunda chudandi please baba 🙏🙏🥺❤️♥️....Mee padale naku dikku mere nannu kadapadali Baba 🥺🥺🥺🥺🥺

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo