1. భయపడుతున్న బిడ్డని అక్కున చేర్చుకుని ‘నేనున్నాను భయపడక’ని ఊరడించిన సాయి
2. మనసులో అనుకున్నవి కూడా బాబా వింటారు
భయపడుతున్న బిడ్డని అక్కున చేర్చుకుని ‘నేనున్నాను భయపడక’ని ఊరడించిన సాయి
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్‌కు వేల వేల ప్రణామాలు. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా లీలలు నా జీవితంలో అన్నీఇన్నీ కావు. అవన్నీ వ్రాయటానికి నా జీవితం సరిపోదేమో! నేను ఏమీ కోరకపోయినా ఎన్నో సందర్భాలలో నా ఆపదలను గుర్తించి తల్లిలా నన్ను సమస్యల నుండి సాయి రక్షించారు. నా జీవితంలో వచ్చే ఆటుపోట్ల వల్ల నన్ను మానసికంగా ధృడం చేసి తండ్రిలా నా సమర్దతను పెంపొందించారు. నాకు అవసరమైన సమయంలో కళ్ళకు ప్రత్యక్షంగా కనబడకపోయినా తోబుట్టువులా నన్ను ఏదో ఒక రూపంలో ఆదుకున్నారు. నా పరిస్ధితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడు గురువులా సరైన దారి చూపారు. పరిస్ధితులు నా చేయి దాటుతున్నాయి, నేను నిస్సహాయంగా వున్నాను నువ్వే దిక్కు సాయి అని ఆయన పాదాలకు సర్వస్య శరణాగతి చేస్తే దైవంలా ఆదుకుంటారు. ఇక నా అనుభవానికి వస్తే.. 2024, ఫిబ్రవరి నెల చివరి వారంలో నా భర్త వేరే దేశం నుండి అనుకోకుండా బయలుదేరి ఇండియా వస్తుండగా ఆయన ప్రయాణం ఎలా జరుగుతుందో అన్న ఆందోళనతో నాకు చాలా ఒత్తిడిగా అనిపించింది. నాకు అలా అనిపించిందంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుందనే సంకేతాలు నాకు అందినట్లే. ప్రత్యేకంగా ఫలానా అని చెప్పలేను కాని అలాంటి సందర్భాలలో నా మనసుకు అశాంతిగా అనిపిస్తుంది. ఆరోజు కూడా అలాగే వుండి నిద్రపట్టలేదు. భయంకరమైన ఆలోచనలు, పీడకలలతో మనసంతా గందరగోళంగా అనిపించి మావారితో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నిస్తే లైన్ కలవలేదు. నా గదిలో చిన్న బాబా పాలరాతి విగ్రహం ఉంది. ఆ బాబా పాదాలు పట్టుకుని, "ఏ ఆపద రాకుండా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. తర్వాత నాకు కాస్త నిద్రపట్టింది. నిద్రలో కూడా నా చేయి బాబా పాదాలపైనే వుంది. నిజంగా ఆయనే వచ్చి నా చేయి పట్టుకొని, "భయంలేదు తల్లి, నేను చూసుకుంటా!" అని స్పష్టమైన అభయమిచ్చినట్లు నాకు అనిపించింది. దాంతో ఏ భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాను. మరుసటిరోజు ఉదయం అనుకున్న సమయానికి బాబా దయవల్ల నా భర్త ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అందుకు సాయినాథుని పాదాలకు వేలవేల నమస్సులు తెలియచేసుకుంటున్నాను. నా ఊహలు, భయాలు అర్ధవంతమైనవి కాకపోవచ్చేమో కాని, భయపడుతున్న బిడ్డని అక్కున చేర్చుకుని "నేనున్నాను భయపడకు" అని సాయి నన్ను ఎలా ఊరడించారో ప్రత్యక్షంగా అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. "ఎల్లప్పుడూ అద్భుతమైన మీ పాదాలను ఆశ్రయించుకుని బ్రతికే అదృష్టాన్ని నాకు జీవితాంతం ప్రసాదించు సాయితండ్రీ! కలలో కూడా నన్ను నీ పాదాలకు దూరం చేయకు సాయిదేవా!".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
మనసులో అనుకున్నవి కూడా బాబా వింటారు
శ్రీసాయినాథునికి నా వందనాలు. నేను ఒక సాయిభక్తురాలిని. సాయి తప్ప వేరే దిక్కు లేనిదానిని. బాబా నాకు చాలాసార్లు సహాయం చేసారు. 2024, జనవరి 11న యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్ర విసర్జన జరిగే ప్రాంతంలో చాలా మంటగా, మూత్రం లీకు అవుతున్న భావనతో ప్రతి 5 నిముషాలకి వాష్ రూముకి పోవాల్సి వచ్చి ఆఫీసులో చాలా ఇబ్బందిపడ్డాను. ఆ విషయం బాబాకి చెప్పుకొని బాధపడ్డాను. తర్వాత మెడికల్ షాపుకి వెళ్లి టాబ్లెట్లు తెచ్చుకొని, "బాబా! ఈ సమస్య తగ్గేలా అనుగ్రహించమ"ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల రెండు రోజులకి సమస్య తగ్గి చాలా ఉపశమనంగా అనిపించింది నాకు. "చాలా థాంక్స్ బాబా".
నేను పెళ్లికి ముందు హాస్టల్ ఉండేటప్పుడు, ఆ హాస్టల్‌కి దగ్గర్లో ఉండే సాయిబాబా గుడికి వెళ్తుండేదాన్ని. పెళ్ళైన తర్వాత 2024, జనవరి 22న మళ్ళీ ఆ గుడికి వెళ్ళాను. ఆ సమయంలో బాబాకి అభిషేకం చేస్తున్నారు. అయితే గతంలో ఉన్న పూజారి ఇప్పుడు లేరు. అతని స్థానంలో కొత్త పూజారి ఉన్నారు. అందువల్ల నేను నా మనసులో, "బాబా! నేను అప్పట్లో మీ దగ్గరకు వచ్చి శుభ్రం చేసేదాన్ని, మీతో చాలా సన్నిహితంగా ఉండేదాన్నని వీళ్ళకి తెలియదు" అని అనుకున్నాను. అంతలో పూజారి నన్ను పిలిచి, "బాబాకి అభిషేకం చేయమ"ని అన్నారు. మనం మనసులో అనుకున్నవి కూడా బాబా వింటున్నారని నాకు చాలా ఆశ్చర్యమేసింది. "ధన్యవాదాలు బాబా. నేను ఇప్పుడు చావుకి, బ్రతుకుకి మధ్యలో యుద్ధం చేస్తున్నాను. నువ్వు ఉన్నావన్న ధైర్యం తప్ప నాకు వేరు ఏవీ లేవు. మీరు నా జీవితంలో ఏదో అద్భుతం చేస్తారన్న నమ్మకంతో బ్రతుకుతున్నాను. నన్ను, నా బిడ్డని కాపాడండి. ప్లీజ్జ్ బాబా! కరుణించు, ఈ గడ్డు సమస్యల నుండి నన్ను బయటకి లాగి కాపాడండి".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteBaba nannu meere kapadali thandri meeru tappa Naku dikkevaru leru baba. Na samsaranni meere chakkadiddali. Meede bharam thandri. Jai Sairam!!
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeletesai baba maa bangaru tandri sai madava bharam antha meede baba. Tammudiki manchi udyogam ravali baba
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Ram
ReplyDeleteBaba,Mee daya valla Naku avasaram ayinapudu chala rakalu gaa sahayam anedala chesaru... ippudu nenu vallaki tirigi sahayam chese time vachinattu vundi.... dayachesi maa situations set ayyi evariki ebbandi kalagakunda chudandi please 🙏🙏🙏🙏🙏....nannu nammina vallaki nenu kuda shayam chese laga anugrahinchandi baba please 🥺🥺🥺🥺🥺.... Naku mee padale dikku 🙏🙏🥺😭😭
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteSri sadguru sai nath maharaj ki jai🙏🙏🙏🙏🙏
ReplyDelete