సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1792వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పరిష్కారం చూపి కోరుకున్న జీతాన్ని అనుగ్రహించిన బాబా

2. పెళ్లి జరగకుండా ఆపిన బాబా


పరిష్కారం చూపి కోరుకున్న జీతాన్ని అనుగ్రహించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నా గురువు సాయికి, సాయిభక్తులందరికీ నా నమస్కారం. నా పేరు అనూష. నేను నా గత అనుభవంలో బాబా దయతో నాకు ఉద్యోగం వచ్చిందని పంచుకున్నాను. నాకు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు నేను అడిగినంత జీతం ఇవ్వకుండా నా పర్ఫార్మెన్స్ చూసి జనవరి నుండి ఇస్తామని చెప్పారు. నేను సరేనన్నాను. కానీ జనవరి నెల వచ్చిన తర్వాత నా జీతం గురించి అడగాలంటే, 'మేడం నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడలేనంటారేమోన'ని భయపడ్డాను. దాంతో మేడంని అడగలేక బాబాని, "మీరే ఆదుకోవాల"ని ప్రార్థిస్తుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు యూట్యూబ్‌లో ఎవరో భక్తులు శనగలు గుడిలో పంచిపెట్టి బాబాని వేడుకోవడం వల్ల తను కోరుకున్నట్లు జీతం పెరిగిందని, అలా చేస్తే ఖచ్చితంగా జీతం పెరుగుతుందని చెప్పారు. దాంతో నేను శనగలు ఉడికించి 2024, జనవరి 11న బాబా గుడికి వెళ్లి, "బాబా! నా జీతం నేను అనుకున్నంత పెరిగేలా, అలాగే నా భర్త జీతం రెట్టింపు అయ్యేలా చేయండి. అలా జరిగితే మళ్ళీ మీ గుడిలో శనగలు, దాంతోపాటు శీరా పంచుతాను" అని బాబాని వేడుకున్నాను. సంక్రాంతి పండగ తర్వాత మా మేడంని అడుగుదామనుకున్నాను కానీ అడగలేక, "బాబా! నువ్వే దారి చూపించు. నా సమస్య తిరితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తర్వాత ఫిబ్రవరి 4, శనివారం మా మేడం, "ఆఫీస్ రూముకి వచ్చి మాట్లాడండి. మీ జీతం గురించి మాట్లాడాలి" అని నాకు మెసేజ్ చేసారు. అది చూసి నాకు ఆశ్చర్యమేసింది. నేను సోమవారం మా మేడంతో మాట్లాడాలని అనుకున్నాను కానీ, ఆరోజు మేడం బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. మంగళవారం కూడా కుదరలేదు. బుధవారం మేడం రాలేదు. అప్పుడు నేను, "ఏంటి బాబా? మీరు అవకాశం కల్పించినా నా దరిద్రం నన్ను మాట్లాడనీయకుండా చేస్తుంది" అని బాధపడ్డాను. తర్వాత ఆ రోజు ఇంస్టాగ్రామ్ చూస్తుండగా, 'ఎదురు చూడటం వల్ల మంచి జరుగుతుంది' అని ఒక మెసేజ్ కనిపించింది. అది చూసి, ఈ మెసేజ్ నాకోసమే బాబా ఇచ్చారనుకొని ధైర్యంగా ఉన్నాను. తర్వాత రోజు అంటే గురువారం నాడు మేడంని కలిసి మాట్లాడాను. వెంటనే ఆవిడ నేను అడిగినంత జీతం పెంచుతానని చెప్పారు. నేను సంతోషంగా, "బాబా! ఇది నీవల్లే జరిగింది. నువ్వే ఆవిడను ఒప్పించావు" అని బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.


ఇకపోతే, బాబా దయవల్ల నా భర్తకి కూడా వేరే కంపెనీ నుండి రెట్టింపు జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ అది యుఎస్ కంపెనీ అవ్వడం వల్ల నా భర్త భయపడ్డారు. తను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడలేరు. అందువల్ల వెనకడుగు వేస్తున్నారు. కానీ తనలో ఆ జాబ్‌కి సరిపోయే టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి సమయం ఉంది. "బాబా! ఈలోపు ఈ గందరగోళ పరిస్థితి నుండి బయటపడేసి తన ఎదుగుదలకు సహాయం చెయ్యండి ప్లీజ్. తనకు ఏది మంచిదైతే అది చేసి మా ఆర్థిక సమస్యలు తొలగించండి సాయి. నువ్వు తోడుగా లేకుంటే నా జీవితం శూన్యం బాబా. ప్రతి సమస్య నుండి నన్ను కాపాడూకుంటూ వస్తున్న మీకు శతకోటి నమస్కారాలు బాబా. నా మదిలోని కోరికను తీర్చు తండ్రీ. అందరి సమస్యలు తీర్చి అందరినీ ఆదుకోండి బాబా".


పెళ్లి జరగకుండా ఆపిన బాబా


శ్రీసాయినాథుని పాదపద్మములకు, సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. ఇటీవల మా అమ్మాయికి ఒక వివాహ సంబంధం వచ్చింది. నేను జాతకాలు చూపిస్తే, ఆ సంబంధం సరైనది కాదని చెప్పారు. నేను మావారితో జాతకాలు కలవలేదని చెప్పాను. కానీ జాతకాలు నమ్మని మావారు నా మాట వినకపోగా అబ్బాయివాళ్ళు తొందరపడుతున్నారు, పెళ్లి చేసేదామన్నారు. అప్పుడు నేను సాయినాథుని ఆర్తితో, "స్వామీ! మీ దయతో ఎట్టి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ సమస్య సమసిపోవాలి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను. దయచేసి కాపాడండి. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే మీ అనుగ్రహంతోనే జరగాలి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల జాతకాలు నమ్మని మావారు వేరే పురోహితులకు జాతకాలు చూపించారు. వాళ్ళు కూడా కుదరదని చెప్పడంతో మావారు మనసు మార్చుకొని అబ్బాయివాళ్లకి విషయం తెలియపరిచారు. దాంతో మేము తేలికైన మనసుతో భక్తిగా బాబాకు నమస్కరించుకున్నాము. "ధన్యవాదాలు తండ్రీ. మీ ఆశీస్సులతో మా అందరి జీవితాలు సాఫీగా సాగాలి. ప్రతి పనిలో మార్గదర్శిగా ఉండి మమ్ము నడిపించండి సాయి భగవాన్".


23 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 💐💐

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  8. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  9. Om Sai Ram!! Baba meere kapadali. Daya chupinchandi baba!! Antha Meede bharam thandri!! Om SaiRam

    ReplyDelete
  10. Baba mammlanu tondaraga kalupu Baba 🙏🙏🙏🙏🙏Eka anta meedaya Baba 🙏🙏🙏🙏🙏om sairam 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  11. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  12. Naku na batha kavali na bartha tho matladali sai

    ReplyDelete
  13. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  14. Baba,memu ippudu vunna situations thelisi kuda malli ee pariksha enduku thandari.....mere mammalni ee situation nundi gattu ekkinchandi....maa valla kadu baba ee vishayam ni inka thattukolemu.....mere kapadandi Mee padale maku dikku..... dayatho evariki naa valla ebbandi lekunda edi solve ayyela anugrahinchandi baba please 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  15. Ma baba papa ki manchi name select cheyandi thandri..na pannu problem nunchi bayataku thesuku ra baba please

    ReplyDelete
  16. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  17. baba maa sai madava bharam antha meede baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo