సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1790వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కర్మానుసారం పాస్ కాలేకపోయిన నన్ను అనుగ్రహంతో పాస్ చేసిన బాబా
2. శ్రీసాయి కృప

కర్మానుసారం పాస్ కాలేకపోయిన నన్ను అనుగ్రహంతో పాస్ చేసిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. 2017 బ్యాచ్‌లో బిఈడి చదివిన నేను ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. అదేంటో కానీ నేను ఎన్నిసార్లు ఆ సబ్జెక్టు వ్రాసినా పాస్ కాలేకపోయాను. ఒక రెండుసార్లు అయితే పరీక్షే వ్రాయలేకపోయాను. చివరిసారి 2023, సెప్టెంబర్లో వ్రాసినప్పుడు కూడా నేను ఫెయిల్ అయ్యాను. మా కాలేజీ ప్రిన్సిపాల్ నాకు కాల్ చేసి, "ఈసారి కూడా ఫెయిల్ అయ్యావమ్మా" అని చెప్పినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. “బాబా! కేవలం ఈ ఒక సబ్జెక్టు కారణంగా నేను టెట్, డిఎస్సి వ్రాయలేకపోతున్నాను. నా చదువు ఎటూ కాకుండా పోయింది. మీరే నన్ను ఈసారి పాస్ చేయించి నాకు ఒక ఉద్యోగం ప్రసాదించాలి” అని బాబాను ప్రార్థించి రీవాల్యూయేషన్‌కి ఫీజు కట్టి, "మీరు నన్ను ఈ రీవల్యూయేషన్‌లో పాస్ చేయకపోతే నేనింకా ఈ పరీక్ష వ్రాయను, వదిలేస్తాను. ఇంక నా వల్ల కాదు. ప్లీజ్ బాబా! నన్ను పాస్ చేయించండి. మీరు నన్ను పాస్ చేస్తే, మీ అనుగ్రహం 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. మీ గుడిలో పాలకోవా పంచుతాను" అని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత 2024, ఫిబ్రవరి 9న నేను ఫేస్బుక్ చూస్తుంటే, "నువ్వు నాకు తినడానికి ఏం తెచ్చావు? పాలకోవా తీసుకొని రా" అని బాబా సందేశం వచ్చింది. అప్పుడు నేను, “నిన్న గురువారంనాడు నేను బాబా గుడిలో కొబ్బరికాయ, అగరబత్తీలు సమర్పించాను. బాబా పాలకోవా తెమ్మంటున్నారు’ అని, "వచ్చేవారం గుడిలో మీకు పాలకోవా నివేదిస్తాను బాబా" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటలకి మా కాలేజీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, "నువ్వు పాస్ అయ్యావమ్మా" అని చెప్పారు. అప్పుడు నాకు 'నిన్న బాబా పాలకోవా అడిగినదానికి కారణం ఇదేన'ని అర్థమైంది. చూశారా! మన బాబా ముందుగానే నేను పాస్ అయ్యానని ఎలా చెప్పారో? ఇది నాకు చాలా పెద్ద శుభవార్త.  ఎందుకంటే, నేను రీవాల్యూషన్‌లో పాస్ అవుతానన్న నమ్మకాన్ని పూర్తిగా వదిలేసుకున్నాను. అయినా బాబా మీద నమ్మకంతో ఎదురు చూశాను. బాబా అద్భుతం చేసి చూపించారు. "నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బాబా. నా కర్మానుసారం ఇన్నాళ్లు నేను పాస్ కాలేకపోయాను. మీరే అనుగ్రహంతో నన్ను పాస్ చేసి మీ ఆశీస్సులు ఎప్పుడూ మాకు తోడుగా ఉంటాయని నిరూపించారు తండ్రీ. లవ్ యు బాబా. మీకు శతకోటి వందనాలు తండ్రీ".


ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


శ్రీసాయి కృప


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. సాయే నా తల్లి, తండ్రి, గురువు, దైవం. నా ఊపిరి కూడా ఆయనే. ఆయన ఎప్పుడూ నా తోనే ఉండి నా ప్రతి మాట వింటున్నట్టు నాకు అనిపిస్తుంది. బాబా అంటే పలుకుతాడు. కష్టం వస్తే తీరుస్తాడు. ప్రతి పనిలో తోడుండి ముందుకు నడిపిస్తాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటేనే సాయిని స్మరించే బుద్ధి కలుగుతుంది. ఆయన ప్రసాదించే అనుభవాలు వర్ణించడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఒకసారి నేను మా ఇంట్లో లలిత సహస్రనామ పారాయణ చేయ సంకల్పించి, "బాబా! నువ్వే దగ్గరుండి సక్రమంగా జరిపించాల"ని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల మేము అనుకున్న రోజు అమ్మవారి ఉపాసకురాలు తనకి ఎంత పని ఒత్తిడి ఉన్నా మా ఇంటికి వచ్చి పూజ చేయించింది.


ఈమధ్య మా పనిమనిషి తమ్ముడికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. డాక్టర్లు కాళ్లు తీసేయాలని చెప్పారు. నేను మా పనిమనిషికి ధైర్యం చెప్పి బాబా ఊదీ ఇచ్చాను. ఆమె ఆ ఊదీ నీళ్లలో కలిపి తన తమ్ముడు చేత తాగించింది. బాబా దయతో అతని కాలు తీకుండా చేసారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి అతని కాలు సరి చేశారు. "ధన్యవాదాలు బాబా. నా ఆరోగ్య భారం నీదే తండ్రీ. నాకున్న సకల రోగాలను తీసివేసి కాపాడు తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


22 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 🙏🙏

    ReplyDelete
  6. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  7. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  8. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  9. Om sai ram, shiva ku ela aina jwaram thagge la chudandi tandri pls

    ReplyDelete
  10. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Sai Jai Jai Sai ram

    ReplyDelete
  11. Om sairam 🙏🙏🙏🍰🍰
    Mammulanu enta tondaraga okati cheste anta tondaraga shiridi ki vastamu tandri 🙏🙏🙏🙏
    Eka anta nee daya baba 🙏🙏🙏kaluputavu ane nammakam naku vundi baba 🙏🙏🙏
    Mammulanu nevu enta tondaraga kalupute neevu nizam gane vunnavu baba 🙏🙏🙏🙏om sairam 😀🙏🙏🙏🙏

    ReplyDelete
  12. Tandri sai nadha ma Abbyi pariksha pass ayyela choodu tandri

    ReplyDelete
  13. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  14. sai baba, maa bangaru tandri madava bharam antha meede baba. maa variki ahamkaram taggelaga chudu tandri.

    ReplyDelete
  15. Baba ,mere naku dikku .... mammalni anugrahinchandi baba please ee problems nundi bayataki vachela cheyandi.....roju roju ki bayam vachesthundi mere solve ayyela anugrahinchandi....emina thappu chesthe kashaminchi mammalni kapadandi baba 🙏🥺😭😭😭😭

    ReplyDelete
  16. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  17. Tooth problem nunchi bayataku thesuku ra baba please

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo