సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1808వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పొందిన మేలును విస్మరించి అటూఇటూ తిరిగిన తమ భక్తుని తిరిగి తమకు శరణుపొందిలా చేసిన బాబా
2. నమ్మినవాళ్ళకి బాబా ఎప్పుడూ తోడు ఉంటారు

పొందిన మేలును విస్మరించి అటూఇటూ తిరిగిన తమ భక్తుని తిరిగి తమకు శరణుపొందిలా చేసిన బాబా


నా పేరు కే. నాగశ్రీనివాసరావు. నేను కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండల వాస్తవ్యున్ని. 'సాయిరాజ్ మహారాజ్ సన్నిధి'కి ముందుగా నా నమస్కారములు. ప్రపంచంలోని అనేకమంది సాయిబాబా భక్తులు బాబా ద్వారా తాము పొందిన ఉపకారములను ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటూ ఉన్నందున ఈ బ్లాగును ‘ఆధునిక సచ్చరిత్ర’గా పిలవడంలో అతిశయోక్తి లేదు. నేను ఇప్పుడు ఈ ఆధునిక సచ్చరిత్రలో నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను 25 సంవత్సరాలుగా సాయిబాబా భక్తుడిని. ఆయన వల్ల నేను ఎన్నో ఉపకారాలు పొందాను. సంతానం భాగ్యం కూడా దక్కింది. అయితే నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు మాట విని నా కష్టాలు తీరిపోతాయని చర్చికి వెళ్లడం మొదలుపెట్టాను. కానీ, ఆర్థికంగా ఎటువంటి అభివృద్ధి కనపడలేదు. మా ఇంట్లోవాళ్ళు సాయిబాబాని తప్ప వేరే ఏ దేవుణ్ణి పూజించకపోయినా నేను మాత్రం ఆరు నెలలు చర్చకి వెళ్లడం, ఆపై మానేసి మళ్ళీ సాయినాథుని పూజించడం, కొంతకాలానికి సాయినాథుని పూజించడం మానేసి మళ్లీ చర్చికి వెళ్ళటం చేస్తూ ఉండేవాడిని. అలా ఏడు సంవత్సరాలు గడిచాక ఈ మధ్యకాలంలో ఒక స్నేహితుడి మాట విని ఏదో విధంగా డబ్బు సంపాదించాలని ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నాను. చివరికి ఉండటానికి సరైన ఇల్లు కూడా లేక కుటుంబంతో రోడ్డున పడి చాలా ఇబ్బందులు పడుతూ మనశ్శాంతి లేకుండా పోయింది నాకు. అటువంటి సమయంలో 2024, జనవరి నెలలో సంక్రాంతికి ముందు బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ కలలో నేను మా ఊరికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడి తలుపులు తీసి నేరుగా వెళ్లి, 'బాబా' అని అన్నాను. అప్పటీకే బాబా నన్ను చూసి తమలో తాము తిట్టుకుంటున్నారు. నేను బాబా అనగానే ఆయన, “నీకు డబ్బు... !” అని అన్నారు. తర్వాత, "నువ్వు నేరుగా నా దగ్గరకు రాకు. నువ్వు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి నా వద్దకు రా" అని చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో నేను ఆయన చెప్పినట్టే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గుడిలోకి వెళ్లాను. బాబా, “ఇతను నన్ను నమ్మి గత 25 సంవత్సరాల్లో ఎన్నో ప్రతిఫలాలు పొందాడు. సంతానం లేకపోతే సంతానం కూడా ప్రసాదించాను. అలాంటిది నన్ను విస్మరించి ఏదేదో చేసాడు" అని తిడుతూ నేను గుడిలోకి వెళ్ళగానే తల ఊపారు. అంతటితో నాకు మెలకువ వచ్చింది. అదివరకు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి'లో "నీ డబ్బు ఎక్కడికీ పోదు. ఊరికే ఉండు. అదే వస్తుంది" అని బాబా ఫోటోతో సహా నాకు ఆయన సందేశం కనిపించింది. ఆ విషయం గురించే బాబా కలలో 'నీకు డబ్బు' అని స్పష్టంగా చెప్పారు. ఆ కల వచ్చిన తర్వాత నేను 'బాబా నా వెన్నంటే ఉన్నా ఇన్నాళ్లు నేను ఆ విషయాన్ని గ్రహించలేకపోయాను. ఆయన తప్ప నాకు ఇంకే దేవుడు అక్కరలేద'ని వేరే దేవుళ్లను పూజించడం మానేసాను. ఇప్పుడు బాబా చరిత్ర రోజుకు ఒక అధ్యాయం చదువుతూ బాబాయే నా సర్వంగా జీవిస్తున్నాను. 


నేను రైల్వే వికలాంగుల పాస్ కోసం ఆన్లైన్లో అప్లై చేస్తే డాక్టర్ సంతకం, రిజిస్టర్ నెంబర్ లేదని రిజెక్ట్ అయింది. అప్పుడు డాక్టర్ సంతకం, రిజిస్టర్ నెంబర్లతో రెండోసారి అప్లై చేసాను. అలా అప్లై చేసి ఇంచుమించు మూడు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఈ బ్లాగులో అనుభవాలు చదువుతున్నప్పుడు, "బాబా! నాకు పాస్ త్వరగా వచ్చేలా చేయండి" అని అనుకున్నాను. అదేరోజు ఆన్లైన్లో చెక్ చేస్తే, '15 రోజుల తర్వాత మీకు సమీపంలో ఉన్న స్టేషన్‌లో మీ కార్డు తీసుకోండి' అని వచ్చింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా, "మీ పాస్ విషయంగా మీకు ఫోన్ వస్తుంది" అని చెప్పారు. కానీ చాలా రోజులు గడిచినా నాకు ఏ ఫోన్ కాల్ రాలేదు. 2024, ఫిబ్రవరి 23, శుక్రవారంనాడు బాబా నిత్య పారాయణం చేస్తూ, "బాబా! ఈరోజు రైల్వేవాళ్ళు నాకు ఫోన్ చేసి, మీ పాస్ తీసుకెళ్ళమని చెప్పేలా చేయి తండ్రీ" అని అనుకున్నాను. అంతే, అరగంటలో నాకు రైల్వేవాళ్ళు ఫోన్ చేసి, "మీ పాసు వచ్చింది. తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. ఇలా బాబా నాకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటూ నన్ను నడిపిస్తున్నారని నాకు అర్థమైంది. ఇక నా ప్రాణం ఉన్నంతవరకు బాబాని తప్ప ఇంక ఎవరినీ కొలవను. “చాలా చాలా ధన్యవాదాలు బాబా”.


నమ్మినవాళ్ళకి బాబా ఎప్పుడూ తోడు ఉంటారు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!

సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై!!!


నా పేరు సువర్ణ. బాబా నాకు తల్లి, తండ్రి అన్నీ. బాధైనా, సంతోషమైనా నాకు బాబానే. ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఆయనకే చెప్పుకుంటాను. నాకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని, ప్రేమని మాటల్లో వర్ణించడం నాకు కష్టమనిపిస్తుంది. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. అందులో నుండి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బాబా నన్ను ఆదుకున్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను చాలా రోజులు ఉపాధి కోసం ఎంతో ప్రయత్నించాను. ఆ క్రమంలో నేను ఎన్ని కంపెనీలకు నా రెజ్యూమ్ పంపినా వాళ్ళ దగ్గర నుండి నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. చివరికి ఒకసారి యూట్యూబ్‌లో చూసి ఒక ఊద్యోగంకి అప్లై చేస్తే, వాళ్ళు రమ్మని పిలిచారు. కానీ అక్కడ నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. నేను అప్పుడు చాలా బాధపడ్డాను. "బాబా! నాకు ఎందుకు ఉద్యోగం రావడం లేదు" అని రోజూ బాబాకి చెప్పి ఏడ్చేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు, 'మన బాధలు బాబాకి చెప్పి, వాటి గురించి మార్చిపోవాలి' అని ఒక కొటేషన్ చదివి, బాబాకి చెప్పి వదిలేశాను. అలా వదిలేశానో, లేదో ఒక కంపెనీకి రెజ్యూమ్ మెయిల్ చేసాను. ఒక్క గంటలో వాళ్ళు కాల్ చేసి, "రేపు రండి" అని అన్నారు. బాబా మీద నమ్మకం ఉంచి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసారు. విచిత్రం ఏంటంటే, తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసిన హెచ్ఆర్ టేబుల్ మీద బాబా విగ్రహం ఉంది. అది చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాళ్ళు నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకున్నారు. బాబా నాతోనే వున్నారు. ఈ ఉద్యోగం బాబా అనుగ్రహంతోనే నాకు వచ్చింది. బాబాని నమ్మినవాళ్ళకి ఆయన ఎప్పుడూ తోడు ఉంటారని నేను ఈ అనుభవం ద్వారా తెలుసుకున్నాను.


15 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha Raksha Sai raksha

    ReplyDelete
  7. Baba atuvanti heart pain lekunda chudu baba

    ReplyDelete
  8. ఓం సాయిరామ్

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Baba,meru vunnaru ane nammakam thone vundataniki try chesthunna.....kani naa valla migatha vallu ,amma nanna ekkada ebbandi padatharu ani bayam vesthundi....etu chusina situations complicated ayipothunnayi baba.... Naku mere dikku nannu ee kastam nundi bayataki vachela cheyandi naa valla evaru ebbandi padakunda chudandi baba please 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  11. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  12. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  13. baba maa bangaru tandri sai madava bharam antha meede baba. tammudiki kuda manchi udyogam ravali baba.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo