సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1794వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చిన్న చిన్న కోరికలను గమినిస్తూ వాటిని తీర్చి నా నమ్మకం బలపరుస్తున్న బాబా
2. టెన్షన్ తీసేసిన శ్రీసాయి

చిన్న చిన్న కోరికలను గమినిస్తూ వాటిని తీర్చి నా నమ్మకం బలపరుస్తున్న బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


నేను ఒక సాయి భక్తురాలిని. గుడిలోని హుండీలో ఎలా అయితే మన మొక్కుబడులు చెల్లిస్తామో అలాగే మన అనుభవాలను భద్రపరిచే పవిత్ర హుండీ ఈ 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్' అని నా అభిప్రాయం. ఎన్నెనో కోరికలు, ఇబ్బందులు ఈ బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటానని సంకల్పించినంతనే అవి తీరిపోతున్నాయి. ఈ అనుభవాల ద్వారా బాబా తన సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్ధత్వాన్ని భక్తులకి ఎప్పటినుంచో తెలియచేస్తున్నారు. ఇక మీదట కూడా తెలియజేస్తారు. ఇక నా అనుభవాల విషయానికి వస్తే..

 

నేను ఎల్.ఎల్.బి. పూర్తి చేసి కోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్గా పని చేస్తున్నాను. ప్రభుత్వం నా లాంటి జూనియర్లకి ప్రోత్సాహంగా నెలకి 5,000 రూపాయలు మంజూరు చేసే స్కీమ్ తీసుకొస్తే నేను దానికి అప్లై చేసాను. అప్లికేషన్ సబ్మిట్ చేసాక మున్సిపల్ ఆఫీసువాళ్ళు ఫోన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పిలవాల్సి ఉండగా 3 నెలలవుతున్నా నాకు ఎవరూ కాల్ చేయలేదు. ఈ విషయం గురించి నా స్నేహితరాలిని అడిగితే, తను నన్ను మున్సిపల్ ఆఫీసుకి వెళ్లి అడగమంది. తను చెప్పిన ప్రకారం నేను ఆఫీసుకి వెళితే నా డాక్యుమెంట్లు వెరిఫై చేశారు. దాంతో ఇక నాకు నెలవారీ స్టైఫెండ్ పడుతుందని ఆశ పడ్డాను. అయితే ప్రభుత్వ నిధులు విడుదల చేసిన రోజు నాకు తప్ప నా స్నేహితులందరికీ స్టైఫెండ్ పడింది. దాంతో నేను తరుచూ మున్సిపల్ ఆఫీసుకి వెళ్లి స్టైఫెండ్ గురించి అడిగుతుండేదాన్ని. వాళ్ళు ఇంకోసారి నిధులు విడుదల చేసినప్పుడు పడతాయని చెప్తుండేవాళ్ళు. నేను చేసేది లేక గమ్మున తిరిగి వచ్చేదాన్ని. ఇలా ఒక సంవత్సరం పాటు నాకు స్టైఫెండ్ పడలేదు. ఆ పథకానికి నేను అర్హురాలినైనప్పటికీ నాకు పడకపోవటం బాధగా అనిపించేది. బహుశా బాబా సమ్మతి లేదేమోనని అనుకున్నప్పటికీ, "ఆ డబ్బులు నాకు పడేలా చేయమ"ని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు నాకు ఒక ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. చూస్తే, స్టైఫండ్ స్కీముకి సంబంధించిన ఆఫీస్ ఫోన్ కాల్ అది. ఫోన్లో ఒక అధికారి నాతో మాట్లాడి, 'డబ్బులు ఎందుకు పడడం లేద'ని విచారించి, "బ్యాంకు వివారాలు ఒకసారి చెక్ చేసుకోమ"ని అన్నారు. నేను చెక్ చేసి, "అన్నీ సరిగానే ఉన్నాయ"ని చెప్పాను. "సరే, సమస్య ఎక్కడ ఉందో నేను చూస్తాను" అని ఆ అధికారి ఫోన్ పెట్టేశాడు. అప్పుడు నాకెందుకో గానీ ఒకసారి బ్యాంకుకి ఫోన్ చేసి కనుక్కోవాలనిపించింది. నిజానికీ నాకు అనిపించడం కాదు బాబానే అలా ప్రేరణనిచ్చారు. దాంతో నాకు తెలిసిన ఒక బ్యాంకు ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడాను. అతను, "మీ బ్యాంకు ifsc కోడ్ ఇంతకుముందు ఒకసారి లోన్ కోసం మార్చము కదా!" అని అన్నాడు. అప్పుడు నాకు చాలా రోజుల కిందట లోన్ కోసం నేను నా బ్యాంక్ అకౌంటును హోమ్ బ్రాంచ్ నుండి వేరే బ్రాంచ్‌కి మార్చుకున్నానని గుర్తు వచ్చింది. నేను ఆ విషయం పూర్తిగా మార్చిపోయినందు వల్ల అన్నీ చోట్లా నా పాత బ్రాంచ్ ifsc కోడే వ్రాసేదాన్ని. దానివల్లే నాకు రావాల్సిన స్టైఫెండ్ ఆగిపోయిందని వెంటనే ఆ ఉద్యోగిని అడిగి ifsc కోడ్ తెలుసుకొని, నా అప్లికేషన్‌లో అప్డేట్ చేసి సదరు ఆఫీసుకి ఫోన్ చేసి అంత వివరంగా చెప్పాను. ఆ ఆఫీసర్, "అంత క్లియర్ అయి మీకు స్టైఫెండ్ అయితే వస్తుంది. కానీ ఎప్పుడు పడుతుందో నేను చెప్పలేను" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేను బాబా ఖచ్చితంగా అనుగ్రహిస్తారని నమ్మకంతో ఉండసాగాను. కానీ 2 నెలలవుతున్నా నాకు స్తైఫెండ్ పడలేదు. నాకు మళ్లీ నిరాశగా అనిపించి 'అది నాకు రావాల్సి ఉంటే తప్పక వస్తుంది' అని వదిలేశాను. డబ్బుకోసం కాదు గాని, అందరికీ వచ్చి కూడా అర్హత ఉండి కూడా నాకు రానందుకు నిరాశగా అనిపించేది. కొన్నాళ్ళు గడిచాక 2024, ఫిబ్రవరి నెల మొదటి వారంలో 1 సంవత్సరం తాలూకు స్టైఫెండ్ అంతా నా అకౌంటులో పడింది. అది చూసి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆఫీసర్ ఫోన్ చెయ్యడం, ఎవరో చెప్పినట్టు నేను బ్యాంక్ ఉద్యోగికి ఫోన్ చేయడం, బ్యాంకు ఉద్యోగికి నేను ifsc కోడ్ మార్చుకున్న విషయం జ్ఞాపకం ఉండడము చూస్తుంటే, బాబా నా చిన్న చిన్న కోరికలను కూడా గమినిస్తూ, వాటిని తీర్చి నా నమ్మకం బలపరుస్తున్నారు అనడానికి నిదర్శనం అని నాకు అనిపిస్తుంది.


ఒకసారి నాకు జలుబు చేసి గొంతు నసతో చాలా ఇబ్బందిపడ్డాను. ఒకరోజు తగ్గినట్లు ఉండడము మరుసటిరోజు ఎక్కువ అవ్వడం జరుగుతుండేది. ఆ విధంగా నాకు నాలుగు రాత్రుళ్ళు నిద్ర లేదు. పరిస్థితి అలా ఉంటే ఇతరత్రా పనులు కూడా ఉండడము వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. చివరికి నా వల్ల కాక, "బాబా! ఈ నస, జలుబు తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. మరుసటిరోజు పొద్దున్నకల్లా నాకు ఉపశమనంగా అనిపించింది. సమస్య ఇంకా కొంచెం ఉన్నప్పటికీ తీవ్రత తగ్గింది. ఏమి చేసి బాబాకి కృతజ్ఞతలు తెలపాలో నాకు తెలియడం లేదు. ఆయన అడిగిన శ్రద్ధ-సబూరీ అను రెండు పైసాల దక్షిణ సమర్పించటానికి ప్రయత్నం చేయటం తప్ప నేనేం చేయగలను? "ధన్యవాదాలు బాబా. ఈ దీనురాలి వెంట సదా ఉండి కాపాడండి బాబా".


సర్వేజన సుఖినోభవంతు!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


టెన్షన్ తీసేసిన శ్రీసాయి


శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజు పాదలకు పాదాభివందనం. నా పేరు రాణి. మాది గుంటూరు. నేను ఒక హాస్టల్‌లో పని చేస్తున్నాను. 2024, ఫిబ్రవరి 13న నా క్రింద పనిచేసే ఆమె ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్ పగలగొట్టేసే తనకు ఏమీ తెలియనట్లు పెట్టెసింది. తర్వాత నేను అది గమనించినప్పుడు చాలా ఆందోళనకు గురయ్యాను. ఎందుకంటే, మా మేనేజర్‌ చాలా కోపిష్టి. అందుచేత, "బాబా! నాకు మీరే దిక్కు. నేను ఈ విషయం మేనేజర్‌కి తెలియజేయాలి. అతను ఈ విషయం శాంతంగా తీసుకోవాలి. అంతా ప్రశాంతంగా జరిగిపోవాలి. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకొని సార్ దగ్గరకు వెళ్లి, విషయం చెప్పాను. అతను అంతా విన్నారు, నన్ను ఏమీ అనలేదు. "నాన్నా(బాబా)! మీరు నాకు తోడు ఉన్నారు. మీకు శతకోటి కృతజ్ఞతలు, శతకోటి పాదాభివందనములు తండ్రీ".


20 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om sairam vamsi natho malli munupati lage prema ga matladela chudu sai

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  6. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  7. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  8. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  9. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Jai Jai Sai Sai Ram

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  11. Baba, mammalni mere kapadali ee situation nundi mammalni andarini bayataki vachela cheyandi ....Mere adukuni amount adjust ayyela chestharu kani maku ravali amount matram andataam ledu....memu vetilo vundakudadu Leda memu velle way wrong ayithe sort chesi mammalni anugrahinchandi baba please mere dikku maku

    ReplyDelete
  12. Ede inka continue ayithe maa pranalu vadulukodam thappa maku vere dikku vundadu baba....raboye rojulu ee vishayam munduki velli pending vi rakunda memu face cheyalemu dayachesi edi sort ayyela chudandi baba please 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  13. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  14. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  15. Baba please take care of my child 🙏🌺🙏

    ReplyDelete
  16. baba, maa sai madava bharam antha meede

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo