సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1787వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో నయమైన నొప్పి - తగ్గిన ఆందోళన
2. అత్తింటివారు కాపురానికి తీసుకెళ్లేలా దయచూపిన బాబా

బాబా అనుగ్రహంతో నయమైన నొప్పి - తగ్గిన ఆందోళన


సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌదామిని. నాకు 25 సంవత్సరాల నుండి బాబాతో అనుబంధం ఉంది. సాయితండ్రి నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నాకు పరిచయమయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు నాకు ఏ సమస్య వచ్చినా అడిగినంతనే బాబా దానిని తీసిపారేస్తున్నారు. చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు, వాళ్ళ చదువులు అన్నీ ఆయన ప్రసాదించినవే. నాకు ఏ కష్టం రాకుండా నేను అడిగినవి, అడగనివి ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పిస్తూ సమస్తం నాకు ఇస్తున్నారు బాబా. 2021లో నాకు కోవిడ్ వచ్చింది. దానివల్ల నేను ఏ ఇబ్బంది ఎదుర్కోలేదు కానీ, పోస్ట్ కోవిడ్ వలన యాంగ్జైటీ సమస్య మొదలైంది. 2023, ఫిబ్రవరి నెలలో అనుకుంటా ఒకసారి యాంగ్జైటీ వల్ల నా కాళ్లు బాగా జలదరించడం, మంటలుగా ఉండటం, దానితో పాటు జ్వరం కూడా వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే బీపీ, షుగర్, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ మొదలైన అన్ని టెస్టులు వ్రాశారు. నాకు చాలా భయమేసి బాబా గుర్తుకు వచ్చారు. అంతే, నా బాధంతా ఆయనకు నివేదించుకొని, "నాకు ఏ సమస్య లేకపోతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చాయి. థైరాయిడ్, బీపీ, షుగర్ అన్నీ నార్మల్‌‌‌గా ఉందని చెప్పారు డాక్టర్. ఇదంతా నా తండ్రి నాకు పెట్టిన భిక్ష. క్రమంగా నా ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది.


2023, మే నెలలో మేము శిరిడీ వెళ్ళాము. బాబా మాకు ఒక హారతి, రెండు దర్శనాలు ప్రసాదించారు. ఆ సమయంలో నేను మా బాబు కాలేజీ సీటు, హాస్టల్ గురించి బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా మావాడికి మంచి హాస్టల్లో అడ్మిషన్ ఇప్పించారు. ఆ హాస్టల్ రూమ్‌లోకి వెళ్ళగానే గోడ మీద బాబా ఫోటో దర్శనమిచ్చింది. అంతే, నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నేను అడగకుండానే నాకోసం, నా బిడ్డ కోసం ఆయన అక్కడికి ముందుగానే వచ్చేసారు. అంతేకాదు, హాస్టల్ బిల్డింగ్ ఉన్న లైన్‌లో బాబా గుడి వుంది. "థాంక్యూ సో మచ్ బాబా".


2023, సెప్టెంబర్‌లో నేను ఒక టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి 20 రోజులు విపరీతమైన యాంగ్జైటీ, దడ, నిద్రలేమితో బాధపడ్డాను. దానికి తోడు తలనొప్పి(మాడునొప్పి, తల వెనుక నొప్పి), పడుకుంటే చటుక్కున లేచి బయటకి వెళ్లాలనిపించడం జరుగుతుండేది. ఒకసారి భయం వచ్చేసి ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేక ఆరుబయట ఒక రోజంతా గడిపాను. నా పరిస్థితి తెలిసి మా అమ్మానాన్న వచ్చారు. మావారు నన్ను న్యూరాలజిస్ట్ దగ్గరకి తీసుకొని వెళ్తే, అర్జెంటుగా ఎమ్ఆర్ఐ స్కాన్ తీయమని చెప్పారు. ఆ సమయంలో బాబా అన్ని చూసుకుంటారన్న విశ్వాసంతో నాకు ఏమి కాదని ధైర్యంగా ఉన్నాను. మా అమ్మ కూడా ఆయనకి దణ్ణం పెట్టుకొని సాయంత్రం నేను ఇంటికి వచ్చేవరకు అన్నం తినకుండా నా గురించి ఆదుర్దాగా ఆలోచిస్తూ గడిపింది. ఎమ్ఆర్ఐ రిపోర్టులో సైనస్ సమస్య అని వచ్చింది. అందుకే ఈ నొప్పి అని డాక్టర్ చెప్పారు. నేను మాములుగా హోమియో మందులు వాడుతాను. అందుచేత హోమియో వైద్యురాలికి నాకున్న లక్షణాలు, పరిస్థితి గురించి వివరించాను. ఆమె కూడా బాబా భక్తురాలు. ఆమె బాబాను ప్రార్థించి వైద్యం ప్రారంభిస్తుంది. ఆమె ఇచ్చిన మందులు నాకు చాలా బాగా పని చేసాయి. నాలుగు, ఐదు రోజులకు బాగా ప్రశాంతంగా అనిపించి నొప్పి తగ్గిపోయింది, మంచిగా నిద్రపట్టింది. ఆందోళన తగ్గి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా ప్రశాంతంగా నా పనులన్నీ నేనే చేసుకోసాగాను. మరలా ఇప్పటివరకు ఆ బాధ నాకు రాలేదు. బాబా నాకు శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ప్రశాంతతను కూడా ఇచ్చారు. బాబాని ప్రార్థించి, దైర్యంగా సంపూర్ణ శరణాగతి చేస్తే ఆయన మన వెంట ఉండి మనల్ని సదా రక్షిస్తారు. ఇది నిజం. 'విశ్వాసంతో కూడిన ఓరిమి కలిగి ఉండు' అని బాబా చెప్పింది నేను పాటిస్తాను. నేను నా అవసరాలు, సమస్యలు అన్ని ఆయన పాదాల దగ్గరకు చేరవేస్తాను.  "ధన్యవాదాలు బాబా. ఇక ముందు కూడా మీరు నాకు అన్నివేళలా, అన్ని విషయాల్లో తోడుగా నిలుస్తారని విశ్వాసంతో మీ దగ్గర ప్రార్థించినట్లుగా నా ఈ అనుభవాలను తోటి భక్తులతో పంచుకున్నాను తండ్రీ. మీ బిడ్డ భక్తితో, చెక్కుచెదరని విశ్వాసంతో స్థిరంగా మీ పాదాలను అట్టిపెట్టుకొని ఉండేలా దీవించు బాబా".


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!

జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


అత్తింటివారు కాపురానికి తీసుకెళ్లేలా దయచూపిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు సాయినాథుడు అంటే చాలా నమ్మకం. రెండు సంవత్సరాల క్రితం మా ఆడపడుచు కూతురికి పెళ్లైంది. మొదట్లో తనతో తన అత్తగారి కుటుంబం బాగానే ఉండేది. కానీ తను ప్రెగ్నెంట్ అయినప్పటినుంచి తనకి బాధలు మొదలయ్యాయి. తన అత్తగారు ఏదో ఒకటి అంటూ తనని బాధపెట్టేది. నెమ్మదిగా గొడవలు మొదలై అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది. అప్పుడు నేను ఫేస్బుక్‌లో సాయి భక్తుల అనుభవాలు చదివి, "ఎటువంటి గొడవలు లేకుండా తన అత్తగారువాళ్ళు అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని సాయినాథునికి దణ్ణం పెట్టుకున్నాను. ఆ సాయినాథుడు కరుణించారు. అమ్మాయిని తన అత్తింటివారు కాపురానికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు. "ధన్యవాదాలు సాయి. ఎటువంటి గొడవలు లేకుండా అమ్మాయి కాపురం చల్లగా సాగేలా దీవించు తండ్రీ".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


22 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  6. Sai nannu kuda ma athagaru vallu kodaliga accept chesi kapuraniki thiskellela chudu baba sai

    ReplyDelete
  7. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri Raksha Raksha Raksha omsaisri Jai Jai Sai

    ReplyDelete
  8. ఓం సాయిరామ్

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Babà Kalyan ki marriage chai thandri

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  12. Sai Baba maa Sai madavaki repu computer exam .eeroju baaga chadivi repu exam baaga resetattu cheyi thandri.

    ReplyDelete
  13. Mamalini manchiga chudu baba...ma akka ki oka baby ni Prasadam ga ivvu baba please

    ReplyDelete
  14. Baba enka ennallu baba e pariksha
    Mammulanu tvaraga a ammayi manasu marchi okati cheyyi baba nee meeda daya to vunna baba nevu kaluputavani 🙏🙏🙏🙏🙏om sairam 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  15. Baba maa situations sardukune laga chudandi please....nenu chesina papalu kshaminchandi,naa valla evaru ebbandi padakunda chudandi baba please mere dikku 🥺🥺🥺🥺🥺.....naa manasu mee padalu daggara nammakam tho vundelaga ashirwadinchandi..... please baba mammalni mere kapadali 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
    Replies
    1. Bayam vesthundi baba manava sahajam kada ,kani mere edoka dari chupistharu ani nammakam kuda vuntundi.....naa nammakam nilabetti chekku chedarani vishavasam Mee padala meda vundela karuninchandi please 🙏🙏🙏🙏🙏

      Delete
  16. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo