- నమ్ముకున్న భక్తులకి అండగా ఉంటూ ప్రతి కష్టం నుండి కాపాడతారు బాబా
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
సాయిభక్తులకి నమస్కారం. నా పేరు అనూష. సాయి తమని నమ్ముకున్న భక్తులకి అండగా ఉంటూ ప్రతి కష్టం నుండి కాపాడతారు. 2024, జనవరి నెలలో మా బాబుకి మొదట చెవి నొప్పితో మొదలై మరుసటిరోజు ఉదయానికి జ్వరం వచ్చింది. చెవి దగ్గర చాలా వాపు కూడా వచ్చింది. సమస్యేమిటో నాకు మొదట తెలియలేదుగాని తర్వాత మా అత్తమ్మ చెంపలమ్మ(గవదబిళ్ళలు) అని చెప్పారు. నాకు చాలా భయమేసి, "ఇలా అయిందేమిటి బాబా? దయచేసి బాబుకి నయమయ్యేలా చేయండి బాబా" అని బాబాని వేడుకున్నాను. కానీ తగ్గలేదు సరికదా మరుసటిరోజుకి ఇంకో చెవి దగ్గర కూడా వాపు వచ్చింది. బాబు నొప్పి అని ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. నా దగ్గర బాబా ఊదీ లేనందున, "బాబా! అగరబత్తీ పొడినే ఊదీగా భావించి బాబుకి పెడుతున్నాను. తనకి తగ్గిపోయేలా చేయండి బాబా" అని బాబాని వేడుకొని అగరబత్తి పొడిని బాబు చెవుల దగ్గర పూసి, జ్వరం సిరప్ వేసాను. బాబా దయవల్ల మరుసటిరోజుకి వాపు, జ్వరం తగ్గుముఖం పట్టాయి. తర్వాత రోజు బాబుకి స్కూలు ప్రారంభమైంది. అయినా నేను తనని స్కూలుకి పంపకుండా నాతో నేను పని చేస్తున్న స్కూలుకి తీసుకెళ్ళాను. ఆ రోజంతా బాబుకి జ్వరం రాలేదు, వాపు కూడా తగ్గిపోయింది. దాంతో ఆ మరుసటిరోజు బాబుని తన స్కూలుకి పంపించాను. అయితే స్కూలుకి వెళ్ళాక బాబు చాలా నీరసంగా అయిపోయాడు. మధ్యాహ్ననానికి మళ్ళీ జ్వరం వచ్చేసింది. మేడమ్ నాకు ఫోన్ చేసి, "మీ బాబు నిరుత్సాహంగా ఉన్నాడు. అన్నం తినకుండా ఏడుస్తున్నాడు. వచ్చి తీసుకెళ్లండి" అని చెప్పింది. నేను మావారికి ఫోన్ చేసి, విషయం చెప్పి బాబుని తీసుకొని రమ్మన్నాను. కాసేపటికి మావారు ఫోన్ చేసి తను వెళ్ళేలోపు బాబు వాంతి చేసుకొని పడిపోయాడని చెప్పేసరికి నాకు ఏడుపొచ్చేసింది. "మళ్ళీ వాడికి జ్వరం వచ్చింది ఏమిటి బాబా" అని బాధతో బాబాని తలుచుకుంటూ వెళ్ళాను. బాబుని స్కూలు నుండి ఇంటికి తీసుకొని రాకుండా నేరుగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. డాక్టర్, “బ్లడ్ టెస్ట్ చేయించండి” అన్నారు. నాకు చాలా భయమేసి, "బాబా! రిపోర్ట్ నార్మల్‌గా వచ్చేలా చేయండి. మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ వచ్చింది. డాక్టర్, "మామూలు జ్వరమే. కానీ గొంతులో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది" అని మందులు వ్రాసిచ్చి, "రెండు రోజుల్లో తగ్గకుంటే మళ్ళీ రండి" అని చెప్పారు. నేను, "బాబా! బాబుకి పూర్తిగా తగ్గిపోయేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల బాబుకి తగ్గిపోయింది. తర్వాత పండగకని నెల్లూరు వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఆదివారంనాడు మా చిన్నోడికి జ్వరం వచ్చింది. నేను బాబుకి సిరప్ ఇచ్చి, "బాబా! బాబుకి తగ్గిపోయేలా చేయండి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల జ్వరం తగ్గింది. మరుసటిరోజు పండగనాడు మేము కడపలో ఉన్న మా అమ్మావాళ్ళింటికి వెళ్ళాం. అక్కడ బాబుకి మళ్ళీ జ్వరం వచ్చింది. దాంతో నాకు ఇక్కడ వీడికి కూడా చెంపలమ్మ వచ్చేస్తుందేమో అని చాలా భయమేసింది. ఎందుకంటే, చెంపలమ్మ వస్తే, తగ్గేవరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అసలే స్కూలులో పనిచేసున్న నేను సెలవు కూడా తీసుకోలేదు. కాబట్టి అన్ని రోజులు ఉండాలంటే నాకు కుదరదు. అందువల్ల, "ప్లీజ్ బాబా! వాడికి జ్వరం తగ్గిపోవాలి. అలాగే చెంపలమ్మ రాకుండా చూడు" అని వేడుకున్నాను. బాబా దయవల్ల బాబుకి జ్వరం తగ్గిపోయింది. "ధన్యవాదాలు సాయి. ప్రతి కష్టంలో తోడుగా ఉండి మాకు ధైర్యాన్నిస్తూ, సమస్యలు తీరుస్తూ మమల్ని ఆదుకుంటున్నావు”.
మేము పండక్కి ఊరు వెళ్ళటప్పుడు కారులో వెళ్ళాం. ఆ కారుని మా బంధువుల అబ్బాయి అద్దెకు తీసుకున్నాడు. తనకి డ్రైవింగ్ కొత్త అయినందువల్ల హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్ళడానికి భయమేసి, "బాబా! ఏలాంటి ప్రమాదం జరగకుండా చూడండి. దారిలో మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించండి. మీ దర్శనమైతే ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకాకుండా వెళ్తాము" అని అనుకొని షాపులు, వాహనాలు గమనిస్తూ వెళ్ళాను. చాలా దూరం వెళ్లేవరకు బాబా కనిపించలేదు. దాంతో నాకు బాధేసింది. ఇంతలో డ్రైవింగ్ చేస్తున్న మా బంధువుల అబ్బాయి, "అక్కా! ఇది ఫేమస్ సాయిబాబా టెంపుల్. చూడు!" అని అన్నాడు. అది చింతపల్లి బాబా గుడి. ఆ అబ్బాయి చెప్పకుంటే నేను అటువైపు చూసేదాన్ని కాదు. బాబానే ఆ అబ్బాయితో చెప్పించారు. నాకు చాలా సంతోషమేసి బాబా దర్శనం చేసుకున్నాను. తిరిగి హైదరాబాద్‌కి వచ్చేటప్పుడు కూడా నేను, "బాబా! మీ దర్శనాన్ని అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. కానీ ఏ ఊరు ఎప్పుడు వస్తుందో, ఊరు వచ్చినప్పుడు నిద్రపోతానేమో బాబాని చూడటం తప్పిపోతుందేమో అని భయపడ్డాను. కానీ బాబా గుడి రాగానే మా బావ, "అదిగో చూడు. నీకు బాబా అంటే ఇష్టం కదా! ఇది ఫేమస్ బాబా గుడి" అని చూపించారు. సాయే అతని చేత చూపించారు. ఎందుకిలా అంటున్నానంటే, అదివరకు రెండుసార్లు మేము అదే మార్గంలో, మా బావవాళ్ళతో వెళ్ళాం. అప్పుడు మా బావ ఇప్పుడు చెప్పినట్లు చెప్పలేదు. నేను బాబాని నీ దర్శనాన్ని అనుగ్రహించు అని వేడుకున్నందున ఆయనే వాళ్లతో అలా చెప్పించి నాకు తమ దర్శనాన్ని ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. "ధన్యవాదాలు బాబా".
2023, దసరా రోజున నేను పెద్దమ్మ గుడికి వెళ్లి అమ్మవారి దగ్గర, అక్కడ కాకపోయినా గుడి ముందైనా నిమ్మకాయ దీపం వెలిగించాలని అనుకున్నాను. అయితే ఆసారి దసరా సోమవారం, మంగళవారం రెండు రోజులు వచ్చి మంగళవారం చేయాల్సి ఉండగా సోమవారమే చేసుకోవాలని అన్నారు. అందువల్ల నేను సోమవారంనాడు మా వారిని పెద్దమ్మ గుడికి వెళదామని అన్నాను. అందుకుతను, "నేను డ్యూటీకి వెళ్ళాలి" అని అన్నారు. నేను, "ఈరోజు పండగ కదా! డ్యూటీ ఏమిటి?" అని అన్నాను. "ఈరోజు కాదు. పండగ రేపు. మాకు రేపే సెలవు" అని మావారు అన్నారు. ఆ విషయంలో మేము కాసేపు గొడవ పడ్డాము. చివరికి నేను "నన్ను ఈరోజు తీసుకెళ్ళు" అంటే, "తీసుకెళ్లన"ని చెప్పి ఆయన డ్యూటీకి వెళ్లిపోయారు. నాకు ఏడుపొచ్చి, "ఏంటి బాబా? నేను ఏమి అనుకున్నా అది జరగదు ఎందుకు? ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది నాకు" అని బాధపడ్డాను. అంతలో 'సమీపంలో ఉన్న పోచమ్మ గుడికి వెళదాం. ఎక్కడైనా అమ్మే కదా!' అనుకొని బాబాని, "గుడి తెరిచి ఉండేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. ఎందుకంటే, ఆ సమయంలో ఆ గుడి ఎప్పుడూ తెరిచి ఉండదు. ఇంకా నేను పోచమ్మ గుడికని బయలుదేరి దారిలో గుడి తలుపులు తెరిచి ఉండాలని బాబాని వేడుకుంటూ వెళ్ళాను. కొబ్బరికాయ తీసుకుందామని గుడి దగ్గరున్న ఒక షాపుకి వెళితే, వాళ్ళు కొబ్బరికాయలు లేవన్నారు. దాంతో నేను మళ్ళీ వెనక్కి వెళ్లి వేరే షాపులో కొబ్బరికాయ తీసుకొని తిరిగి గుడి దగ్గరకి వచ్చాను. అప్పటికి గుడి తలుపులు తెరవలేదు. నేను బాధతో గుడి బయటే దీపాలు వెలిగిద్దామనుకొని వెనక్కి తిరిగి చూస్తే, సరిగ్గా అప్పుడే గుడి తలుపులు తాళం తీయడానికి ఒక ముసలాయన అక్కడికి వచ్చారు. అప్పుడు నాకు 'నేను ముందు వెళ్లిన షాపులో కొబ్బరికాయ ఉండి ఉంటే నేను ముందుగా ఇక్కడికి వచ్చేదాన్ని, అప్పుడు గుడి తెరిచి ఉండకపోవడం వల్ల బయటే దీపాలు వెలిగించి వెళ్లిపోయేదాన్ని, కానీ ఆ షాపులో కొబ్బరికాయ లేకవడంవల్ల వెనక్కి వెళ్లి వచ్చేసరికి గుడి తెరిచారు. అంతా బాబా లీల’ అనుకున్నాను. తరువాత గుడి లోపలికి వెళ్లి అమ్మ దగ్గర గుడి లోపల అంత శుభ్రం చేసి, అమ్మ ముందే నిమ్మకాయ దీపాలు వెలిగించాను. అమ్మ దగ్గర దీపాలు వెలిగించడంతోపాటు గుడిని శుభ్రం చేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషమేసింది. అంత బాబా దయ. ఇంటికి వచ్చాక ఫోన్‌లో క్యాలెండరు చూస్తే సరిగ్గా నేను దీపాలు వెలిగించిన సమయానికి రావుకాలం మొదలైంది. నిజానికి నా మనసులో రాహుకాలంలో గుడిలో 9 నిమ్మకాయల దీపాలు వెలిగించాలని వుంది. సరిగ్గా అలాగే జరిగింది. దాంతో నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆనందంతో మనసులోని కోరికను అడగకుండానే తీర్చారు బాబా అనుకున్నాను. మరుసటిరోజు మంగళవారంనాడు మావారు, "పెద్దమ్మ గుడికి వెళదాం, పదా!" అని అన్నారు. దాంతో పెద్దమ్మ గుడికి వెళ్లాలన్న కోరిక కూడా తీరింది. ఆ గుడిలో చాలా జనం ఉన్నారు. ముందురోజు నా భర్త ఆ గుడికి తీసుకెళ్లినా దీపాలు వెలిగించడం కుదిరేది కాదేమో! ఎప్పుడు, ఏది జరగాలో బాబాకి తెలుసు గనుకనే సోమవారం గుడికి వెళ్ళానివ్వకుండా చేసి నేను ఎలా దీపాలు వెలిగించాలని అనుకున్నానో అలా కుదిరేలా చేసి నాపైన సాయి కరుణ చూపించారు. "మీ ప్రేమకి శతకోటి వందనాలు బాబా".
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sri sai nathaya namaha, chala thanks tandri adigindi chesinanduku
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteBaba nee daya valla maku anta manchi jaragalani korukuntunna baba 🙏🙏🙏🙏Mammulanu tondaraga kalupu baba 🙏🙏🙏🙏Eka anta needaya baba 🙏🙏🙏🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba napai nidaya chupinchu naku vachhina e kastam nundi gattekinchu baba
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba,em jaruguthundo theliyatam ledu....Mee meda baram vesi ala wait chesthunna....nannu nammi Naku support gaa nilabadina evarini ebbandi pettakunda ee vishayam set ayyela chudandi baba please....Naku mere dikku Mee padale saranu maku please mere mammalni kapadandi baba 🙏🥺🥺🥺🥺😭
ReplyDeleteBaba teeth extracted valla swelling vundi baba repatiki purthiga thagipovali thandri please..ba baba ma papa name pettadam manchiga jaragali thandri..mere manchi select chesala chudu baba
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeletebaba maa sai madava bharam antha meede baba
ReplyDelete