సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1837వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనల్ని వదిలేయరు!

2. బంధం నిలబెట్టిన బాబా


బాబా మనల్ని వదిలేయరు!


నా పేరు శర్మ. మేము అమెరికాలో నివాసముంటున్నాము. 2023, అక్టోబర్‌‌‌లో మా అబ్బాయి మాకు చెప్పకుండా క్రెడిట్ కార్డు మీద ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొనుగోలు చేసాడు. తర్వాత తను ఆ విషయం మాకు చెప్పి, తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పి, "ఇలా ఎప్పుడూ చేయను" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరే, తను కొన్న ఆ వస్తువు విషయంలో ఏమి చేయాలో మొదట్లో మాకు తెలియలేదు. దానికి సంబంధించి కొన్ని వివరాలు సేకరించి, చర్చించుకున్న మీదట ఆ వస్తువు వెనక్కి ఇచ్చేద్దామని నిర్ణయించాము. అయితే ఆ వస్తువు ఆన్లైన్లో కొన్నది. వాళ్ళని సంప్రదిస్తే, వాళ్ళు 'ఆ వస్తువు మీ ఊర్లో ఉన్న షాపులో ఇచ్చేయండి' అని మెయిల్ పెట్టారు. కానీ ఆ విషయంలో ఒక తిరకాసు వచ్చింది. మా ఊర్లో ఉన్న షాపులవాళ్ళు, "ఆ వస్తువు మేము తీసుకోమ"ని చెప్పారు. దాంతో ఆన్లైన్లో వాళ్ళకి పరిస్థితి చెప్పి, 'ఇప్పుడు ఏమి చేయాలో తెలిపమ'ని మెయిల్ పెట్టాము. అందుకు వాళ్ళు 'మేము మీకు రిటర్న్ స్లిప్ పంపుతాము' అన్నారు. అయితే ఎన్నిసార్లు అడిగినా 'ఇదిగో', 'అదిగో' అనడమే తప్ప రిటర్న్ స్లిప్ పంపలేదు. ఆఖరికి నాకు ఏమి చేయాలో తెలియక ఆ విషయం గురించి బాబాతో చెప్పుకున్నాను. ప్రతిసారీ చిన్న చిన్న సమస్యలకి వీగిపోయి అలా బాబాని అడగకూడదనుకోండి! కానీ, ఆ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తోచలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా కుర్రాడికి మంచి నడవడి రావాలి. మాతో చెప్పకుండా అలా క్రెడిట్ కార్డ్ వాడటం మంచిది కాదు కదా!  అందుకోసం మరియు ఆ వస్తువు వెనక్కి ఇచ్చేయడం కోసం 'సహాయం చేయమ'ని బాబాను అడిగాను. అయితే పని అవ్వలేదు. అయినా నేను, 'సరే, చేసేదేముంది. బాబా మనల్ని అలా వదిలేయరు కదా!' అని అనుకున్నాను. కానీ మనసులో ఆందోళన అలానే ఉంది. దాదాపు ఆరు, ఏడు సార్లు ఫోన్ చేసాక చివరికి 2024, ఫిబ్రవరిలో వాళ్ళు రిటర్న్ స్లిప్ పంపారు. వెంటనే మేము ఆ వస్తువు వెనక్కి పంపేసాము. కానీ వాళ్ళు డబ్బు వాపస్ ఇవ్వలేదు. దాంతో మళ్ళీ వాళ్ళకి అనేకసార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది. చివరికి మార్చ్లో మీ డబ్బులు వాపసు ఇస్తాం అని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఫోన్ చేస్తే, "ఇంక డబ్బులు ఇవ్వం" అన్నారు. నేను ఇంకా ఆశ వదిలేసుకున్నాను. కానీ, 'అదేమిటి? వస్తువు ఇచ్చేసాం కదా! అయినా ఇలా చేస్తున్నారేంటి? లాయర్తో మాట్లాడాలేమో!' అని మధనపడ్డాను. ఆ రోజు ఎందుకో తెలీదు సాయి సచ్చరిత్రలోని "నీ డబ్బులు ఎక్కడకీ పోవు. ప్రశాంతంగా కూర్చో!" అని బాబా ఒక భక్తునితో అన్న ఒక వాక్యం గుర్తు వచ్చింది. ఆశ వదులుకున్న నేను మనసులో 'తప్పకుండా ఆ పని జరుగుతుంది. లేకపోతే ఆ వాక్యం నాకు గుర్తు రావడం ఏమిటి?' అని అనుకున్నాను. అయినా మనసులో ఆందోళన పోలేదు. సరిగ్గా 2024, ఏప్రిల్ 4, గురువారం మాకు ఒక మెయిల్ వచ్చింది. అందులో 'మరోసారి ఫోన్ చేస్తే, రెండు రోజుల్లో మీ డబ్బులు మీకు ఇస్తాము' అని ఉంది. అయితే గంటలోపే డబ్బులు వాపసు వచ్చినట్టు బ్యాంకు నుండి మాకు మెయిల్ వచ్చింది. అది చూసి బాబా అనుగ్రహానికి ఒక్కసారిగా నాకు ఉక్కిరిబిక్కిరి అయినట్టైంది. సమస్య తీరిపోయినందుకు బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి, "మరోసారి ఇటువంటి పరిస్థితి మాకు రాకూడదు. ఎప్పుడూ మిమ్మల్ని ఇలా పనికిరాని విషయాలకోసం అడిగే పని రాకూడదు. అయినా మీరు ఎప్పుడూ మాతో ఉంటే చాలు. ఆ తర్వాత ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది" అని చెప్పుకున్నాను. నేను మా పిల్లలతో, "భగవంతుడితో ఎప్పుడూ 'ఇది ఇవ్వు, అది ఇవ్వు' అని కూరలు బేరం ఆడినట్టు ఆడకూడదు. ఎప్పుడూ మాతో ఉండు అని అడిగితే చాలు. మిగతావి అవే వస్తాయి" అని చెప్తుంటాను. ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంట్లో నాకు ఒక పుస్తకం ఇచ్చారు. ఏదైనా సమస్య వస్తే ఒక అంకె తలుచుకొని ఆ పుస్తకంలో సమాధానం చూడవచ్చు. అయితే ఆ పుస్తకం మొదట్లోనే 'ఇది అదృష్టం పరీక్షించుకునే పుస్తకం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి' అని వుంది. నేను ఆ పుస్తకాన్ని ఇప్పటివరకు ఇండియాలో ఒకసారి, అమెరికాలో ఒకసారి మాత్రమే చూసాను. అదీ కష్టమైన విషయాల్లో. ఈ ఎలక్ట్రానిక్ వస్తువు విషయంలో కూడా చూడలేదు.


బంధం నిలబెట్టిన బాబా


ఓం సాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తురాలిని. బాబా చాలా విషయాలలో నాకు తోడుగా ఉన్నారు. నాది ప్రేమ వివాహం. నా భర్త నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు. అందువల్ల మేము సంతోషంగా ఉంటున్నాము. అయితే ఒకసారి ఒక చిన్న అపార్థం వల్ల మా మధ్య గొడవ మొదలైంది. దాంతో నా భర్త నాతో పొడిపొడిగా మాట్లాడుతుండేవారు. ఎప్పుడూ బాగా చూసుకునే నా భర్త హఠాత్తుగా అలా ఉంటుంటే నేను తట్టుకోలేక చాలా ఏడ్చాను. ఒకరోజు బాబా గుడికి వెళ్లి, బాబా పాదాల మీద పడి, "మేము మళ్ళీ ఎప్పటిలా అంతే ప్రేమగా ఉండాలి" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. బాబా దయవల్ల ఒక్క వారం రోజులకి అన్నీ సద్దుమణిగి మళ్ళీ నా భర్త నన్ను అంతే ప్రేమగా చూసుకుంటున్నారు. "చాలా ధన్యవాదాలు బాబా. మేము మా జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉండేలా ఆశీర్వదించండి బాబా. నేను ఒక విషయంగా పోరాటం చేస్తున్నాను. ఆ సమస్య నుండి గట్టెక్కించి నా భర్త, బిడ్డతో ఆనందంగా ఉండేలా చేయండి బాబా. ఎప్పుడూ మాతో వుండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి బాబా".


25 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son and daughter in law 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete
  7. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Sai Jai Jai Sai

    ReplyDelete
  8. Om sai ram, amma nannalani kshamam ga arogyam chusukondi vaallaki manashanti ni evvandi, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, na badha meeke telusu

    ReplyDelete
  9. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  10. Baba na problem meku telusu pl help me to solve the problem

    ReplyDelete
  11. Pl all devotee s pray Sai to solve my problem

    ReplyDelete
  12. baba madava ki 60 % marks vachhayi. 8th lo baaga ravali baba. madava ni vere school lo cherchudamu ani maavaru anali baba. madava ni vere school lo cherchite nenu puja cheyinchi dashina shirdi lo , ekkadina gudilo palakova panchutanu baba 101/- dakshina samarpinchukuntanu baba.

    ReplyDelete
  13. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  14. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏

    ReplyDelete
  15. Baba,naa problem ni naa jivitham ni Mee padala daggara vadilesthunna....em cheyalo ela cheyalo meku thelusu....maa thappulu kshaminchandi maa valla Kiran bro vallu bhadapadatam asalu baledu....ee situation ki edoka solution ivvandi please 🥺🥺🥺🥺🥺🥺

    ReplyDelete
  16. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  17. Na vamsi nakosam thirigivacheyyali malli memu kalavali om sairam

    ReplyDelete
  18. Inka yenni years paduthundhi baba sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo