సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1817వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

 • భక్తుడిగా ఆమోదించి కాపాడుతున్న బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిబంధువులకు నమస్కారములు. నేను ఒక సాయిభక్తుడ్ని. నేను నా కుటుంబంతో ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాను. మేము 2023, సెప్టెంబర్లో ఇండియా వచ్చి తిరిగి 2023, అక్టోబర్లో ఆస్ట్రేలియాలోని మా ఇంటికి చేరుకున్నాము. ఇక్కడకి వచ్చిన రోజు నుంచి మా కుటుంబమంతా అనారోగ్యం పాలయ్యాము. కోవిడ్‌ ఏమోనని పరీక్ష చేయిస్తే, నెగటివ్‌ వచ్చింది. అయితే మరుసటిరోజు మా ఇద్దరబ్బాయిలు మరింత ఎక్కువగా అనారోగ్యం పాలై రాత్రంతా నిద్రపోకుండా చాలా ఇబ్బందిపడ్డారు. మాకు చాలా భయమేసి మందులతో పాటు బాబా ఊదీ పిల్లల నుదటన పెట్టి, మరికొంత ఊదీ నీటిలో కలిపి ఇచ్చి, "ఉదయానికల్లా తగ్గేలా దయ చూపమ"ని బాబాను వేడుకొన్నాము. అంతే! సాయి దయతో ఉదయానికల్లా పిల్లలకు చాలావరకు నయమైంది. సాయిబాబాను నమ్ముకున్న వాళ్ళకు ఎలాంటి ఆపద రానివ్వరు. “ధన్యవాదాలు బాబా”.


2013వ సంవత్సరం ముందు నేను అన్ని గుళ్ళకు వెళ్ళినట్టే సాయి మందిరాలకు కూడా వెళ్ళేవాడిని. కానీ సాయిబాబా గురించి, హారతులు గురించి నాకు ఏమీ తెలియదు. అప్పటికే నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం లేదు. మేము సంతానం కోసం డాక్టర్లు సూచించిన మందులు వాడుతున్నాము. అటువంటి సమయంలో మా స్నేహితులు ఇచ్చిన సలహాననుసరించి సాయిబాబా మీద పూర్తి నమ్మకంతో 'నవగురువార' వ్రత్రం మొదలుపెట్టి భక్తిశ్రద్ధలతో ముగించాము. వ్రతం ముగిసిన కొన్నిరోజులకే మేము తల్లితండ్రులం కాబోతున్నామని మాకు తెలిసింది. మేము సంతోషంతో బాబాకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొని బాబాను ప్రతిరోజూ పూజించటం మొదలుపెట్టాము. బాబా దయతో మాకు పండంటి బాబు జన్మించాడు. ఆ తరువాత రెండున్నర సంవత్సరాలకు బాబా దయతో మరో బాబు జన్మించాడు. మేము ఇద్దరికీ చివర 'సాయి' అని వచ్చేటట్టు పేర్లు పెట్టుకున్నాము. బాబా మా జీవితంలో భాగమై మాకు తోడుగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని నడిపిస్తున్నారు. “ధన్యవాదాలు బాబా”.


పై అనుభవం జరగడానికి ముందు నుంచే బాబా నన్ను తమ భక్తుడిగా ఆమోదించి కాపాడుతున్నారని నేను చాలా ఆలస్యంగా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు వివాహం జరగడానికి సుమారు రెండు సంవత్సరాలకు ముందు చలికాలంలో నేను కొంతమంది స్నేహితులతో కలసి మంచుకొండల్లో స్నో బోర్డింగ్(snowboarding) ఆడటానికి కొంతదూరం ప్రయాణించి ఓ చోటుకి వెళ్ళాను. అక్కడ అందరూ ఐస్‌(మంచు) మీద పైనుంచి కిందకి టొబొగ్గాన్ అనే బోర్డ్ మీద కూర్చుని జారుతున్నారు. మేము కూడా ఆ టొబొగ్గాన్ బోర్డులు అద్దెకు తీసుకొని జారడం మొదలుపెట్టాలని అనుకున్నాము. అయితే మా అందరికి సరిపడా బోర్డులు దొరకలేదు. కొన్నే దొరికాయి. అందుచేత మేము ఒకరి తర్వాత ఒకరు జారడం మొదలుపెట్టాము. నేను కిందకి జారిన తర్వాత ఆ బోర్డు తీసుకొని పైనున్న నా స్నేహితుడికి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు సుమారు 70 సంవత్సరాల వయస్సున్న ఒక పెద్దాయన, ఆయనతోపాటు ఒక పెద్దావిడ నాకు కనిపించారు. వాళ్ళు చూడటానికి ఇండియా నుండి వచ్చిన దంపతులలా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరూ లేరు. వాళ్ళు చాలా పలుచని అతి సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు. -3 డిగ్రీల మంచు వర్షంలా పడుతున్న ఆ వాతావరణంలో అలాంటి దుస్తులతో ఉండగలగడం చాలా కష్టం. వాళ్ళు నన్ను ఆపి ఇంగ్లీషులో "టొబొగ్గాన్ బోర్డ్ ఇస్తావా? మేము కూడా జారుతాము" అని అన్నారు. నేను వాళ్లతో, "ఇవ్వలేను. మీరు ఏమీ అనుకోవద్దు. అక్కడ నా స్నేహితులు ఈ బోర్డు కోసం ఎదురు చూస్తున్నారు" అని చెప్పి పైకి నడక సాగించాను. అలా నడుస్తూ, 'వీళ్ళు ఈ వయసులో అసలు ఎలా జారగలరు? అసలు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరితో వచ్చారు?' అని ఆలోచిస్తూ కొంతదూరం వెళ్ళి తిరిగి కిందకి చూస్తే, వాళ్ళు కనిపించలేదు. నేను పైకి ఎక్కాక ఆ వృద్ధ దంపతుల గురించి నా స్నేహితులతో చెప్పాను. వాళ్ళు మాకెవ్వరికీ మళ్ళీ కనపడలేదు. అప్పటినుండి నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా, 'వాళ్ళు ఎవరై ఉంటారా?' అని నేను ఆలోచిస్తుండేవాడిని. రెండేళ్ల తర్వాత 2013 నుండి ప్రతిరోజూ బాబాను దగ్గరగా చూస్తూ, పూజించడం మొదలుపెట్టాక కొన్ని సంవత్సరాలకు 'ఆరోజు మంచుకొండల్లో నాతో మాట్లాడింది ఎవరో కాదు, ఖచ్చితంగా సాయిబాబానే' అని గ్రహించి ఎంతో ఆశ్చర్యపోయాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఆరోజు నేను చూసిన ఆ పెద్దాయన రూపురేఖలు, ఆ వస్త్రధారణ నా మనసులో ఇప్పటికీ నిలిచిపోయాయి. వి ఖచ్చితంగా బాబా వేషధారణతో సరిపోతాయి. "బాబా! మీరు నన్ను భక్తుడిగా గుర్తించి నాకు ఎదురుగా వచ్చినా నేను మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు నన్ను క్షమించండి. మీ భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారంకట్టి లాగినట్టు నన్ను మీ దగ్గరకు లాక్కున్నారు. మీ భక్తులందరికీ తోడుండి ఎల్లవేళలా కాపాడండి. ధన్యవాదాలు సాయినాథా”.


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


19 comments:

 1. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha Raksha omsaisri Sai Jai Jai Sai

  ReplyDelete
 2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

  ReplyDelete
 3. Baba, take care of my parents 🙏🙏

  ReplyDelete
 4. Baba, take care of my son 💐💐💐💐

  ReplyDelete
 5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

  ReplyDelete
 6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

  ReplyDelete
 7. ఓం సాయి రామ్

  ReplyDelete
 8. ఓం సాయిరామ్

  ReplyDelete
 9. Om sairam 🙏 🙌

  ReplyDelete
 10. Om sri sairam 👏 🌺 🙏

  ReplyDelete
 11. baba, maa bangaru tandri sai madavaki kopam taggi manchi pravarthana kaligi baaga chaduvu kovali. baba madavani hostel lo cherchavaddu baba

  ReplyDelete
 12. Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha
  Om sri sainathaya namaha

  ReplyDelete
 13. Baba,eroju chala tension vachindi em cheyali ardam kaledu....meru edokati chesi nannu kapadatharu ane nammakam tho vundataniki alavatu paduthunna...Naa valla evariki ebbandi rakunda chudandi baba,naku chala bayam vesthundi evarikina emina issue vasthundi emo ani.... Please baba ravalisina money vache varaku evariki ebbandi rakunda chudandi baba.....naku aa money Thursday roju thesukovali ani vundi anugrahinchandi please 🙏🙏🙏🙏🙏🥺🥺.....naku mee padale dikku 🙏🙏🥺❤️♥️🥺

  ReplyDelete
 14. Om Sri Sai Raksha 🙏🙏🙏

  ReplyDelete
 15. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

  ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo