సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1838వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మకాన్ని బలపరచిన బాబా
2. అడిగిన వెంటనే ఎలా కావాలంటే అలా అనుగ్రహిస్తారు బాబా

నమ్మకాన్ని బలపరచిన బాబా


నా పేరు శైలజ. మేము అమెరికాలో నివాసముంటున్నాము. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అందమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇలాంటివి చదివాను కానీ, ఎప్పుడూ అనుభవించలేదు. 2023, డిసెంబర్ క్రిస్మస్ సెలవులకి మేము మా సోదరి ఇంటికి వెళ్లి, ఒక గురువారంనాడు కారులో తిరుగు ప్రయాణమయ్యాము. మధ్య దారిలో నాకొక విషయం గుర్తుకొచ్చింది. అదేమిటంటే, నేను ఆరోజు బాబాను ప్రార్థించానుగాని, నా నుదిటిపై ఊదీ పెట్టుకోవడం మర్చిపోయానని. నిజానికి నేనెప్పుడూ ఊదీ పెట్టుకోవడం మర్చిపోను. ఆ విషయం గుర్తొచ్చాక అయిందేదో అయిందనుకున్నాను. కొంతదూరం వెళ్ళాక మేము టిఫిన్ కోసం ఒక రెస్టారెంట్‌ వద్ద ఆగాము. అందరమూ తిన్నాక నేను నా కొడుకుని బాత్రూంకి తీసుకెళ్ళొచ్చి తిరిగి కారు ఎక్కాక మా ప్రయాణం ముందుకు సాగించాము. దాదాపు 3 గంటల తర్వాత నేను మామూలుగా నా కుడిచెవిని తాకితే నా చెవికున్న డైమండ్ చెవిపోగు తాలూకు శీల లేదు. నేను మొదటగా చెవిపోగు ఇంకా నా చెవికే ఉన్నందున ఆ శీల నా ఒడిలో లేదా కారులో ఎక్కడో పడి ఉంటుందనుకొని నా ఒడిలో, కారులో క్షుణ్ణంగా పరిశీలించాను. కానీ ఆ శీల దొరకలేదు. అప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయమేమిటంటే, 'నేను రెస్టారెంట్‌ వద్ద ఆగి, టిఫిన్ చేసి, బాత్రూంకి వెళ్ళొచ్చినప్పటికీ నా చెవిపోగు అక్కడెక్కడా జారిపడిపోకుండా ఇప్పటికీ చెవికి ఎలా ఉందోన'ని(శీల లేకుండా చెవిపోగులు ఎక్కువసేపు ఉండవని  చాలామంది మహిళలకి బాగా తెలుసు). అదివరకు ఒకసారి అదే చెవిపోగు శీల ఇంట్లో ఎక్కడో పడిపోయి చాలాసేపటివరకు దొరకలేదు. అప్పుడు బాబాని ప్రార్థిస్తే దొరికింది. ఇక ప్రస్తుత అనుభవం విషయానికి వస్తే, గురువారంనాడు ఆ శీలను పోగొట్టుకున్నందున నేను సెంటిమెంట్‌గా ఫీలై చాలా కలత చెందాను. కానీ కనీసం డైమండ్ చెవిపోగు పోగొట్టుకోలేదని నన్ను నేను ఓదార్చుకున్నాను. అయినప్పటికీ దాన్ని సెంటిమెంట్‌గా భావించినందున, "పోగుట్టుకున్న ఆ శీల తిరిగి దొరికేలా చేయండి" అని బాబాను ప్రార్థించి 108 సార్లు జపం చేసాను. కానీ ఆ శీల దొరకలేదు. కొన్నిరోజులకి ఆ శీల గురించి నేను మర్చిపోయాను. తర్వాత చాలారోజులకి మేము 2024 కొత్త సంవత్సరం వేడుకలకి వేరే రాష్ట్రంలో ఉన్న మా సోదరుడి ఇంటికి వెళ్ళాము. అక్కడ అంతా బాగా గడిచి నేను సంతోషంగా ఉన్నాను. ఇక అక్కడినుండి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో కారు డిక్కీలో మా సామాను పెడుతూ నా భర్త నన్ను పిలిచారు. నేను వెళ్లి చూస్తే, కారు డిక్కీలో సంవత్సరం క్రితం పోయిన చెవిపోగు శీల ఉంది. చాలాకాలం తర్వాత దాన్ని అక్కడ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలారోజులుగా ఉపయోగిస్తున్న ఆ కారులో చాలాకాలం తర్వాత ఆ శీల దొరకడం నిజంగా బాబా చేసిన అద్భుతం. ఎందుకింత బలంగా ఆ మాట చెప్తున్నానంటే, మావారు ఆ శీల పోయినప్పటినుండి ఎన్నోసార్లు ఆ డిక్కీ తెరిచారు. కానీ ఇంతకు ముందెప్పుడూ ఆ శీలని ఆయన అందులో చూడలేదు. ఈ అనుభవం ద్వారా నా ప్రతి చిన్న మోరను బాబా వింటున్నారన్న నా నమ్మకం మునపటికంటే మరింత బలపడింది. "ధన్యవాదాలు బాబా. మీరు ఏది చేసినా అది మా మంచికోసమే అన్న ఆలోచన నా హృదయంలో, మనస్సులో మరింత బలపడుతుంది. లవ్ యు సాయి. దయచేసి మీ బిడ్డలందరికీ ఈ కొత్త సంవత్సరం ఉగాదితో శుభారంభం అయ్యేలా ఆశీర్వదించండి. మేమంతా మీ బిడ్డలం. దయచేసి మా జీవితాలకు మంచి మార్గం వేయండి. నాకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండేలా ఆశీర్వదించండి".


అడిగిన వెంటనే ఎలా కావాలంటే అలా అనుగ్రహిస్తారు బాబా

సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు సరిత. నేను బొంబాయిలో ఉంటాను. 2023, డిసెంబర్‌లో మా కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి శిరిడీ వెళ్ళాము. మేము ముందుగా త్రయంబకేశ్వరం వెళ్లి శివయ్య దర్శనం చేసుకొని తర్వాత శిరిడీ వెళ్ళాము. మేము శిరిడీ చేరుకునేసరికి రాత్రి 8:30 అయింది. 'ఎప్పుడెప్పుడు సాయిని చూస్తానా?' అని నా మనసు ఆరాటపడింది కానీ, మావాళ్లు, 'హోటల్‌కి వెళ్లి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని, రేపు ఉదయం దర్శనానికి వెళదామ'ని నిర్ణయిం చేసారు. ఇక చేసేది లేక సరే అలాగేనని రాత్రి పడుకొని పొద్దున్నే లేచి తయారవుతుంటే నా దురదృష్టం కొద్దీ నాకు విరోచనాలు మొదలయ్యాయి. "అయ్యో.. ఏంటి బాబా ఈ పరీక్ష? మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మీ దర్శనం అయ్యేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. మావారు బయటకి వెళ్లి మెడికల్ షాపులో మందులు తెచ్చారు. ఆ మెడిసిన్ వేసుకొని దర్శనానికి బయలుదేరాను. నా మనసులో, "బాబా! నా మీద మీకు కోపం లేకుంటే నాకు పసుపు రంగు వస్త్రాలు ధరించి నాకు దర్శనం ఇవ్వండి" అని బాబాను వేడుకున్నాను. టికెట్ కోసం కౌంటర్ వద్దకి వెళితే, అక్కడ టీవీలో బాబా ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. చూడండి బాబా కృప! ఆయన నేను కోరినట్లు పసుపు రంగు వస్త్రాల్లో దర్శనం ఇచ్చారు. అది చూసి నా కళ్ళలో నీరు తిరిగాయి. బాబా ఎంత గొప్పవారు? అడిగిన వెంటనే మనకు ఎలా కావాలంటే అలా కనిపిస్తారు. బాబా దయవల్ల మాకు దర్శనం బాగా జరిగింది. తరువాత మేము ఎల్లోరా వెళ్లి సాయంత్రానికి తిరిగి శిరిడీ వచ్చాము. అప్పుడు నేను ఒక్కదాన్నే దర్శనానికి వెళ్ళాను. ఒక్క దర్శనమే చేసుకోలేనేమో అనుకున్న నాకు రెండుసార్లు దర్శనమిచ్చిన గొప్ప తండ్రి నా సాయినాథుడు.

ఒకసారి మేము మా సొంత వాహనంలో బొంబాయి నుండి హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు నేను, "సాయినాథా! క్షేమంగా మమ్మల్ని హైదరాబాద్ చేర్చి, మళ్లీ క్షేమంగా బొంబాయికి చేర్చు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా మా ప్రయాణమంతా మాకు తోడుగా ఉండి మాకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుని క్షేమంగా మా ఇంటికి చేర్చారు. అలాగే మా అబ్బాయి పరీక్షలు బాగా వ్రాసేలా చూడమని బాబాని వేడుకున్నాను. ఆయన అలాగే కృప చూపారు. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


19 comments:

  1. Baba me blessings eppudu undela chudandi. Card thondaraga vachela cheyandi Sai. Meru thodu ga undi mundu ki nadipinchandi anni vishayallo. Om Sai Ram

    ReplyDelete
  2. Baba I love you tandri.very nice experiences.when we trust Sai he will take care.He will be with us.Om Sai Ram

    ReplyDelete
  3. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  4. Baba na problem meku telusu pl help me

    ReplyDelete
  5. Om Sai Ram 🙏 please bless my wife to get a Job .

    ReplyDelete
  6. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Sai, meere elagaina miss aina jewels one hour loga dorikela cheyandi 🙏🙏🙏🙏

    ReplyDelete
  8. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  9. Baba, take care of my son and daughter in law 💐💐💐💐

    ReplyDelete
  10. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  11. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  12. Om sai ram, amma nannalani kshamam ga chudandi tandri vallaki manashanti ni evvandi tandri, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls

    ReplyDelete
  13. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  14. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  15. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  16. Baba,mere dikku 😭

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo