1. దయతో అనుకున్నవి నెరవేర్చిన బాబా2. సాయి మహిమ
దయతో అనుకున్నవి నెరవేర్చిన బాబా
నేను ఒక సాయిభక్తుడిని. మేము షోలాపూర్‌లో నివాసముంటున్నాము. ఇక్కడ ప్రతి బుధవారం శివాలయం నందు పిల్లలకి తాయత్తు కడుతుంటారు. పిల్లలకి ఏమైనా గాలి సోకితే, అది తొలగిపోయి వాళ్ళ ఆరోగ్యం చక్కబడుతుందని ఇక్కడి వాళ్ళకి ఏన్నో ఏళ్లుగా ఉన్న నమ్మకం. అందుకని నేను ఒక బుధవారం సాయంత్రం మా బాబుని తీసుకొని ఆ గుడికి వెళదామని అనుకున్నాను. అయితే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మా సార్ ఒకరు నాకు ఫోన్ చేసి, "అగ్ని ప్రమాదం జరిగింది. నువ్వు నీ బృందాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది" అని అన్నారు. నేను ఆ పని మీద వెళ్తే, బాబుని తీసుకొని శివాలయంకి వెళ్లడం కుదరదు. మరో వారం రోజులు వేచి చూడాల్సి వస్తుంది. అందువల్ల నేను వెంటనే బాబాని తలుచుకొని, "బాబా! ఈ అత్యవసర విధులు రద్దయ్యేలా చేసి, నేను బాబుని తీసుకొని గుడికి వెళ్లి, తాయత్తు కట్టించి తెచ్చేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబాని నమ్ముకుంటే కానిది అంటూ ఏమైనా ఉందా? బాబా దయవల్ల నేను శివాలయంకి వెళ్ళాను. అక్కడ రద్దీగా ఉంది. అంత రద్దీలో కూడా బాబుకి తాయెత్తు కట్టించి తిరిగి ఇంటికి వచ్చేవరకు ఆఫీస్ నుండి నాకు ఏ కాల్ రాలేదు. అంతా బాబా దయ.
ఇంకోసారి కాస్త జలుబు, దగ్గు వల్ల కాబోలు మా బాబు సరిగా తినేవాడు కాదు. తినిపిస్తుంటే బాగా ఏడవటం, సగం తిని మిగతాది ఊసేయడం చేస్తుండేవాడు. అప్పుడు నేను, "బాబా! బాబు రేపటినుండి ఇబ్బంది పెట్టకుండా చక్కగా తినేటట్లు చేయండి. లేదంటే వాడు నిరసించిపోతాడు. మీ దయవల్ల వాడు సరిగా తింటే మీకు పాలకోవా నివేదిస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఇక బాబా అద్భుతం చూడండి. మరుసటిరోజు నుండి బాబు ఏడవకుండా చక్కగా తినడం మొదలుపెట్టాడు. బాబాకీ మొక్కుకున్నట్లు గురువారంనాడు మందిరంలో బాబాకి పాలకోవా సమర్పించుకున్నాను. "ధన్యవాదాలు బాబా. ఇక మీదట కూడా బాబు ఇబ్బంది పెట్టకుండా చక్కగా తినేలా చూడండి బాబా. ఇలాగే నా భార్యాబిడ్డలను కాపాడుతూ ఉండండి తండ్రీ”.
సాయి మహిమ
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. మా ఇంటి బాల్కనీలో మొక్కలకు ఎన్ని మందులు వేసినా వాడిపోయినట్లు ఉంటుండేవి. నాకు చాలా బాధేసి బాబాకి దణ్ణం పెట్టుకొని ఊదీ మొక్కలకు వేసాను. కొన్ని రోజుల్లోనే ఆ వాడిన మొక్కలు చిగురించి పూలు కూడా వచ్చాయి. ఏమి నా సాయి మహిమ?
ఈమధ్య నా ఆరోగ్యం బాగుండటం లేదు. దానికి తోడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి సరిగా సమయానికి రాకుండా ఆలస్యం చేస్తుండేది. నాకు కోపమొచ్చి అడిగితే, "మీకు ఇష్టం లేకుంటే పనికి రాన"ని అంది. నేను కూడా రావద్దని చెప్పాను. తర్వాత బాబాకి నా పరిస్థితి చెప్పుకొని, 'సాయి అసహాయసహాయాయ నమ:' అని జపించసాగాను. బాబా దయతో 2వ రోజు వేరే పని అమ్మాయి వచ్చింది. బాబానే నా ఇబ్బందిని అర్థం చేసుకొని ఆ అమ్మాయిని పంపారు. "కోటి నమస్కారాలు సాయి. దయతో ఆ అమ్మాయి మంచిగా చేసేలా చూడండి. నేను ఎదుర్కొంటున్న సమస్యల మూలన మీరు నాకు సహాయం చేయటం లేదనే భావన నన్ను వెంటాడుతోంది. నన్ను క్షమించండి సాయి. మీ సమక్షంలో నా కర్మఫలం అనుభవించనివ్వు సాయి. నా మనసు మీ పాదాల వద్ద వుంచే శక్తి ఇవ్వు".
Om Sai Ram today is our marriage anniversary Baba please bless us to. Celebrate our anniversary with happiness forever.please give that desire forever.please bless my husband with full aayush.Bless my family and be with us om Sai Ram
ReplyDeleteOm Sairam!!
ReplyDeleteBaba miku memu ala runam tirchukovali baba ...om sai ram 🙏
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteOm sai ram, na mamasuki nachakunda yedi jaragakunda chudu tandri, nenu ye situation lo cheppeno meeku telusu nenu unna situation na manasu meeku matrame telusu nenu meeku matrame cheppugogalanu, adi ela aina aagi poye la chudu baba, naaku manashanti ni evvu baba
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏 🙏 🙏 🙏 🙏 🙏
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba andaru bavundali andulo manam vundali 🙏 Sargeant sukinobhavanthu
ReplyDeleteBaba, enduku memu edi chesina eduru vasthundo ardam kavatam ledu.... mimmlane nammukunna baba naa cheyyi pattukuni ee kastalu datinchandi....Naa valla naa chuttu vunna andaru ebbandulu paduthunnaru dayachesi vallaki elanti ebbandi rakuda chudalisindi kuda mere....Naku mee padale dikku Baba....nannu kapadandi 🙏🙏🙏🙏🙏🥺😭❤️
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteOm.Sai Ram
ReplyDeleteమేము ఇదే రోజు షిర్డీ లో బాబా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న రోజే మా ఈ అనుభవం రావడం నిజంగా మా అదృష్టం. బాబా కృపకి నిదర్శనం.
ReplyDeleteSri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏
ReplyDelete