ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నాపేరు రాధ. శ్రీ సచ్ఛిదానంద సమర్థ సద్గురుని నాకు పరిచయం చేసినందుకు ఈ అనంత విశ్వానికి ముందుగా మనఃస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా జీవితంలో నేను తెలిసీతెలియక ఎన్నో తప్పులు చేసాను. నా తప్పులన్నింటిని సాయినాథుని పాదాల ముందు నేను ఒప్పుకుంటున్నాను. నా తప్పులను మన్నించమని ఆ తండ్రి పాదాలపై నా శిరస్సునుంచి ప్రాధేయపడుతున్నాను. నా కుటుంబంలో ఇప్పటివరకు నన్ను, నా భర్త, పిల్లల్ని ఎన్నోసార్లు, ఎన్నో విధాలుగా నా సాయి ఆపదల నుంచి రక్షించినందుకు నా సాయికి కోటానుకోట్ల సార్లు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికీ అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నా సమస్యలన్నింటినీ తన సమస్యల్లా మోస్తున్న నా సాయితండ్రిని మనఃస్పూర్తిగా ప్రేమిస్తున్నాను. మన బంధం ఇలాగే నా జీవితాంతం వుండేలా చూడు అని ఆ సాయితండ్రికి ప్రాధేయపడుతున్నాను.
2024, మార్చిలో హఠాత్తుగా నాకు నా భర్తతో కలిసి శిరిడీ వెళ్ళాలనిపించింది. కానీ నా భర్త నాస్తికులు. అందువల్ల ఆయన ఒప్పుకుంటారో, లేదోనని సందేహిస్తూ సాయిని, "తండ్రీ! మీ దర్శనం చేసుకోవాలని వుంది. శిరిడీ రమ్మంటారా?" అని బాబాను అడిగాను. అప్పుడు బాబా శిరిడీ రమ్మని అనుమతి ఇచ్చారు. ఆయన దయవల్ల నా భర్త అడిగిన వెంటనే నాతో రావటానికి ఒప్పుకున్నారు. అయితే ముందుగా అనుకోని ప్రయాణం వల్ల ట్రైన్ టిక్కెట్లు వెయిటింగ్ లిస్టులో దొరికాయి. సాయి మీద భారమేసి ప్రయాణ ప్రయత్నాలు మొదలుపెట్టాము. సాయి అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయానికి శిరిడీ చేరుకున్నాము. ముందుగా రిజర్వ్ చేసుకోకపోయినా గుడికి 5 నిముషాల దూరంలో మాకు హోటల్ రూమ్ దొరికింది. స్నానాలు చేసి సాయి దర్శనానికి బయలుదేరాం. ఆ తండ్రి సన్నిధికి వెళుతుంటే అవధులు లేని ఆనందంతో నా కళ్ళు నీళ్లతో నిండిపోసాగాయి. నా తనివితీరా సాయినాథుని దర్శనం నాకు అయ్యింది. నా భర్త మొదటిసారి సాయిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఎలా అనిపించిందని మావారిని అడిగితే, "ఆయన(సాయి) నన్నేచూస్తున్నారనిపించింది. మనసు ప్రశాంతంగా వుంది" అన్నారు. అది విని నాకు చాలా సంతోషమేసింది. నేను సాయంత్రం హారతి చూడాలనుకున్నాను కానీ, కౌంటరులో అడిగితే, "టికెట్ల్ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో వుంటాయ"ని చెప్పారు. అది విని, "నాకు హారతి చూసే ప్రాప్తం వుంటే ఆ భాగ్యాన్ని ప్రసాదించమ"ని బాబాను వేడుకున్నాను. అంతలో కౌంటరులో ఉన్న అతను, "మీరు ఎక్కడ నుండి వచ్చారు?" అని నన్ను అడిగాడు. నేను ఫలానా చోటని చెప్పి, "హారతి టికెట్ దొరికే అవకాశం ఏమైనా ఉందా?" అని అతన్ని మళ్ళీ అడిగాను. అందుకతను, "NRI కోటాలో అయితే ఇప్పటికిప్పుడే దొరికే అవకాశం వుంటుందిగాని, మాములుగా కుదరదు" అని అన్నారు. అప్పుడు నేను, "నేనూ NRIని" అని చెప్పాను. అతను, "మీ పాస్పోర్ట్ చూపించండి" అని అన్నారు. నేను, "దాన్ని ఇంట్లో వుంచి, ఆధార్ కార్డ్ తెచ్చాన"ని చెప్పాను. అతను, "అలా కుదరదు. పాసుపోర్టు ఉండాల్సిందే" అని చెప్పారు. నేను నిరాశగా నాకు బాబా హారతి చూసే యోగం లేదనుకున్నాను. ఇంతలో అతను, "మీ ఫోన్‌లో మీ పాస్పోర్ట్ కాపీ చూపగలరా?" అని అడిగారు. వెంటనే నేను చూపించాను. అప్పుడు అతను, "టికెట్ ఇస్తాను. ఇంకో అరగంటలో 6 గంటల హారతి వుంది. వెళతారా?" అని అడిగారు. నేను సంతోషంగా సరేనన్నాను. అతను టికెట్ ప్రింట్ తీస్తున్న సమయంలో, "10 గంటల హారతి కూడా చూడాలని వుంది. ఆ టికెట్ కూడా యివ్వగలరా?" అని అడిగాను. అతను నవ్వి రెండు హారతుల టికెట్లు నా చేతిలో పెట్టారు. బాబానే ఆ విధంగా నాకు తమ హారతి చూసే అవకాశం యిచ్చారు. ఆయనకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుని సంతోషంగా సంధ్యహారతి, శేజారతి అతి దగ్గరగా చూసాను. బాబా దయవల్ల తప్ప మరే విధంగానూ యిది సాధ్యమయ్యేది కాదు.
నేను నా భర్తకు ద్వారకామాయి చూపించాలనుకున్నాను. ఇద్దరమూ అక్కడకి వెళ్ళాక అక్కడ సెక్యూరిటీవాళ్ళు నా భర్త వద్ద సెల్ ఫోన్ ఉన్న కారణంగా లోపలకి వెళ్ళటం కుదరదన్నారు. ఆ సమయంలో ఒక అర్జంట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న నా భర్త 'నన్ను ఒక్కదాన్నే వెళ్ళిరమ్మని, నేను వచ్చేవరకు తను బయట వేచి ఉంటానని, కావలసినంత సమయం ద్వారకామాయిలో నన్ను వుండమని' అన్నారు. కానీ తను కూడా నాతో వస్తే బాగుంటుందని నా మనసులోని కోరిక. ఆ విషయం సాయికి చెప్పుకున్నాను. అంతలో నాకు, నా భర్తకి మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వింటున్న సెక్యూరిటీ ఏమనుకున్నారో ఏమోగానీ, ఫోన్ ఫాంట్ జేబులో పెట్టుకొని, దాన్ని బయటకు తీయవద్దని మా వద్ద మాట తీసుకుని మా ఇద్దరినీ లోపలకు పంపించారు. నేను అడిగిన వెంటనే నా కోరికను సెక్యూరిటీ రూపంలో నా సాయినాథుడే తీర్చారని మనసారా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలా అడుగడుగునా నా కోరికలు మన్నిస్తూ నా శిరిడీ ప్రయాణం, దర్శనం అన్నీ బాబా దగ్గరుండి చేయించారు. అందుకాయనకు ఈ బ్లాగులోని 'సాయిభక్తుల అనుభవమాలిక' ద్వారా కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రోజురోజుకు మాకు మీ పాదాలయందు అచంచలమైన భక్తివిశ్వాసాలు పెంపొందేలా మమ్మల్ని దీవించండి అని వేడుకొంటున్నాను. "సాయిదేవా! నీ తోడులేక నేను శూన్యం తండ్రీ. నాపై దయవుంచి నన్ను నీనుండి ఎప్పటికీ దూరం చేయకు సాయితండ్రీ. నా మనోనేత్రంతో ప్రతిక్షణం నిన్ను చూసుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు సాయీ".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm sai ram, anta bagunde la chayandi tandri, naamasuki nachakunda yedi jaragakunda unde la chudandi tandri pls, amma nannalani, ma kutumbanni, ne bakthulni, e prapanchanni kshamam ga kapadandi tandri pls
ReplyDelete🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me 🌺🌺
baba madava bharam antha meede baba. madava free fire adakunda chudu baba
ReplyDeleteOm.Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Sainadha,naa jivitham etu velthundo theliyatam ledu antha tension kopam bhada veti madyalo naligipothunnattu vundi.... Kachitham gaa meru naku elanti apada ranivvaru ani thelusu kani jaruguthundi chusthunte chala bayam vesthundi....elanti ebbandi lekunda 19 th naa amount vachela chudandi baba,chala bayam vesthundi negative thoughts emina vasthe ....alane Seshu ki kuda health set ayyela cheyandi Baba...naa thappulu anni kshaminchi anugrahinchandi baba 🙏🥺🥺❤️😘 naku mee padale dikku nannu anugrahinchandi nannu vadileyakandi naaa cheyi pattukuni nadipinchandi kapadandi Baba please....naa valla evariki ebbandi rakunda kapadandi Baba 🥺🥺🥺🥺🥺
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDelete