సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1819వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • అసాధ్యాల్ని సుసాధ్యం చేసే శక్తి కేవలం బాబాకి మాత్రమే ఉంది

అసాధ్యాల్ని సుసాధ్యం చేసే శక్తి కేవలం బాబాకి మాత్రమే ఉంది


నేను ఒక సాయిభక్తుడిని. 2024, ఫిబ్రవరి 14న విజయనగరంలో నా భార్య పిన్ని కొడుకు పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి వెళ్లి, అక్కడినుండి పలాస వెళ్లి భూమి రిజిస్ట్రేషన్ పని చూసుకొని వద్దామని నేను, నా భార్య ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు వెళ్ళడానికి కుదరని పరిస్థితి వచ్చింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా భార్యను సంవత్సరం 5 నెలల వయసున్న మా బాబుతో పంపాలని అనుకున్నాను. షోలాపూర్ నుండి విజయనగరానికి 20 గంటల ప్రయాణం. అందువల్ల నేను బాబాని, "నా భార్యను చిన్నబాబుతో మొదటిసారి అంతదూరం పంపుతున్నాను బాబా. వాళ్లకు ఎవరూ తోడు లేరు. మీరే వాళ్ళకి తోడుగా ఉండి ఎటువంటి ఇబ్బందీ లేకుండా అక్కడికి చేర్చి, అలాగే తిరిగి వచ్చేలా కరుణించండి. వాళ్ళు తిరిగి వచ్చాక గురువారంనాడు మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ సమర్పించి, ఒకరికి అన్నదానం చేస్తాను" అని ప్రార్థించాను. బాబా నా కోరిక విన్నారు. నా భార్యబిడ్డలు క్షేమంగా వెళ్ళి, అక్కడ పెళ్లి చూసుకొని తిరిగి షోలాపూర్ చేరుకున్నారు. లేదు, లేదు బాబానే తోడుగా ఉండి క్షేమంగా వెళ్లివచ్చేలా చూశారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


తర్వాత 2024, మార్చ్ 6న నా భార్య అత్త కొడుకు పెళ్లి విశాఖలో జరిగింది. నేను ఆ పెళ్ళికి వెళ్లి, మర్నాడు భూమి రిజిస్ట్రేషన్ పని చూసుకొని వద్దామని అనుకున్నాను. అయితే నేను ఇండియన్ రైల్వేస్ ఆక్సిడెంట్ విభాగంలో పని చేస్తున్నాను. మా సెక్షన్‌లో నేను, నాతోపాటు ఇంకొకతను ఇంచార్జ్ ఇంజనీర్స్‌గా ఉన్నాము. మా ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా విధులలో ఉండాలి. అయితే ఆ వేరే ఇంజనీర్ రెండు వారాల ట్రైనింగ్ పని మీద 2024, మార్చ్ 4న బెంగళూరు వెళ్లడంతో నేను ఆఫీస్ వదిలి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి వల్లే ఫిబ్రవరి 14న పెళ్లికి వెళ్ళలేకపోయాను. దాంతో భూమి రిజిస్ట్రేషన్ పని వాయిదా పడింది. ఈ పెళ్లికైనా వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వద్దామంటే మళ్ళీ వెళ్లలేని పరిస్థితి వచ్చేసరికి బాబానే నాకు మొదట గుర్తుకు వచ్చారు. ఎందుకంటే, అసాధ్యాల్ని సుసాధ్యం చేసే శక్తి కేవలం ఆయనకి మాత్రమే ఉంది. అందుచేత, "బాబా! గతనెలలో పెళ్లికి వెళ్లాలని రిజర్వేషన్ చేసుకొని కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళలేకపోయాను. కనీసం ఇప్పుడైనా పెళ్లికి వెళ్ళేటట్లు చేసి బంధువునల వద్ద ఎటువంటి మాట పడకుండా చేయి తండ్రీ. అలానే రిజిస్ట్రేషన్ పని పూర్తయ్యేలా అనుగ్రహించు బాబా. అలా జరిగితే మీ మందిరంలో 101 రూపాయల దక్షిణ, మీకెంతో ఇష్టమైన పాలకోవా సమర్పించి, 5 గురుకి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఆ తండ్రిని భక్తితో ప్రార్థిస్తే జరగనిది ఏమైనా ఉందా? బాబా దయవల్ల మా ఇంచార్జ్ నా సహోద్యోగి సహకారంతో నా విధులను సర్దుబాటు చేసారు. దాంతో నేను విశాఖపట్నంలో పెళ్లికి వెళ్లి బందువులతో కలిసి సంతోషంగా గడిపి, మరుసటిరోజు విజయనగరంలోని మా అత్తగారింటికి వెళ్లి, అక్కడ నుండి పలాస వెళ్ళాను. బాబా కరుణతో రిజిస్ట్రేషన్ పని పూర్తి చేయించారు. ఆయన దయతో మహాశివరాత్రి రోజున మా నాన్నగారితో కలిసి మా శివాలయంలో శ్రీకపిలేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత షోలాపూర్ తిరిగి వచ్చాను. మొత్తం ప్రయాణంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ కలగకుండా బాబా కరుణించారు. అలాగే నేను లేని నాలుగు రోజులు షోలాపూర్‌లో ఉన్న నా భార్య, 1.5 సంవత్సరాలు మా బాబుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు బాబా.


ఆ తర్వాత 2024, మర్చి 24న మా బంధువుల పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఆరోజు ఆదివారం అయినందున నాకు, నా భార్యకి ఇద్దరికీ సెలవు, పైగా ఆ ఫంక్షన్‌కి మా అన్నయ్య-వదినలు, అక్క-బావలు, నా భార్య అక్కలు వాళ్ళవాళ్ళ కుటుంబాలతో వస్తున్నారు. అందువల్ల వాళ్ళందర్నీ కలవాలన్న ఉత్సుకతతో ఆ ఫంక్షన్‌కి హాజరవ్వదలచి నాకు, నా భార్యకి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం. అయితే మేము శనివారం రాత్రి 10 గంటలకి ట్రైన్ ఎక్కాల్సి ఉండగా ఆరోజు ఉదయం 03:30కి ఒక ట్రైన్ ఏక్సిడెంట్ అయిందని సైరన్ మోగించారు. దాంతో నేను వెంటనే పునరుద్ధరణ పనుల నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. 2023, మే నెలలో ఇలానే ఆక్సిడెంట్ అయితే డ్యూటీ ముగించుకొని 27 గంటల తర్వాత ఇంటికి వచ్చాను. ఈసారి కూడా అలా అయితే నేను హైదరాబాద్ వెళ్లడం కుదరదు. మా కుటుంబసభ్యులని కలిసే అవకాశం ఉండదు. అందువల్ల నాకు చాలా టెన్షన్ పట్టుకొని, "బాబా! ఈ పునరుద్ధరణ పనులు తొందరగా పూర్తై, తొందరగా ఇంటికి చేరుకునేలా కరుణించండి. అలా కరుణిస్తే మీకు 101 రూపాయల దక్షిణ సమర్పించుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబాని ప్రార్థిస్తే జరగనిదంటూ ఏమైనా ఉంటుందా! బాబా దయవల్ల మేము మొదలుపెట్టిన పునరుద్ధరణ పని ఉదయం 06:20కే పూర్తై పోయింది. వెంటనే పునరుద్ధరణ మెటీరియల్/ఎక్విప్మెంట్ అంతా టూల్ వ్యాన్‌లో 8గంటల వరకు లోడింగ్ చేసాము. వెంటనే తిరుగు ప్రయాణానికి పై అధికారులను అనుమతి అడిగాము. గతసారి లోడింగ్ అయినా తర్వాత మధ్యాహ్నం 03:30కి తిరుగు ప్రయాణానికి అనుమతి అడిగితే, రాత్రి 01:30కి అనుమతి దొరికింది. కానీ ఈసారి బాబాని భక్తితో ప్రార్థించడం వల్ల 08:00కి అనుమతి అడిగితే, 09:00 కల్లా అనుమతి దొరికింది. ఏమని చెప్పను బాబా లీలని? నేను ఉదయం 10:00 కల్లా ఇంటికి వచ్చాను. బ్యాగులు సర్దుకొని రాత్రి 10:00కి ట్రైన్ ఎక్కాము. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో దిగి బంధువులందరితో కలసి సరదాగా గడిపి అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాము. ఇదంతా కేవలం సాయినాథుని కృప. ఆ తండ్రికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. "మీ దీవెనలు ఎల్లప్పుడూ నీ భక్తులపై ఉండాలని కోరుకుంటున్నాను బాబా".


17 comments:

  1. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  7. Sainatha Prabhu paahimaam paahimaam rakshamaam rakshamaam!!

    ReplyDelete
  8. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  9. Sai repu naku pariksha adhi niku kuda tlsu ninne nammukunna tandri kastapaddanu ee exam kosam
    Eesarina nuvve daggarundi rayunchu
    Nenu korukunnadi naku vachela chadu

    ReplyDelete
  10. sai baba maa bangaru tandri anni exams baaga rasenduku meeru daggara vandi exams rainchandi .nenu kuda 101 rupayalu dakshina samarpinchukuntanu.

    ReplyDelete
  11. 💐💐🙏🙏 Om Sai Ram 🙏🙏💐💐

    ReplyDelete
  12. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  13. ఓం సాయిరామ్

    ReplyDelete
  14. ఓం శ్రీ సాయినాథాయ నమః

    ReplyDelete
  15. Sugar reports normal ga vachinaduku thank you baba

    ReplyDelete
  16. Baba,naa situation em ardam kavatam ledu....nenu em papam chesano ardam kavatam ledu.... dayachesi naa thappulu emina vunte kshaminchi anugrahinchandi please 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  17. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo