సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1821వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శ్రీ సాయి అనుగ్రహలీలలు - 33వ భాగం

నా పేరు సాయిబాబు. జీవితంలో ఒకసారైనా కాశీ, రామేశ్వరం దర్శించాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అందుకని 2020లో నేను కాశీ, శిరిడీ వెళ్లాలనుకొని రిజర్వేషన్ చేయిస్తే, కరోనా వల్ల ప్రయాణం రద్దు అయింది. తర్వాత 2021, అక్టోబర్లో ఒకరోజు నా మనసులో బలంగా కాశీ వెళ్లాలనిపించి, "కాశీయాత్రకు అనుమతిస్తారా బాబా?" అని బాబాను అడిగాను. అదేరోజు నేను సచ్చరిత్ర చదువుతుంటే, అందులో ఓ చోట ‘కాశీ, గయ, ప్రయోగ దర్శించు' అని కనిపించింది. అలా బాబా అనుమతి లభించిందని నేను సంతోషించాను. తర్వాత బెంగళూరులో ఉన్న మా అమ్మాయివాళ్ళకి కూడా బాబా అనుమతి ఇవ్వాలని, "వాళ్ళకి కూడా అనుమతి ఇవ్వండి" అని బాబాను అడిగాను. రెండు రోజుల తర్వాత మా అమ్మాయి నాకు ఫోన్ చేసి, "బాబా అనుమతి ఇచ్చారు. కాశీ వెళ్దాం, వస్తారా" అని నన్ను అడిగింది. నిజానికి నేను కాశీ ప్రయాణానికి బాబా నాకు అనుమతి ఇచ్చిన విషయం, వాళ్ళకి అనుమతి ఇమ్మని బాబాని అడిగిన విషయం వాళ్ళకి చెప్పలేదు. కానీ బాబానే వాళ్ళకి కాశీయాత్ర చేయమని, అది కూడా కారులో అని చెప్పారట. అయితే అంత దూరం కారులో వెళ్లడమంటే భయపడ్డాం. అయినప్పటికీ బాబా ముందుండి ప్రయాణం చేయిస్తారని నేను అక్టోబరు నెల చివరి వారంలో బెంగుళూరు వెళ్ళి, అక్కడినుండి గురువారం ఉదయం మా అమ్మాయివాళ్లతో కలిసి కారులో కాశీయాత్ర మొదలుపెట్టాలని అనుకున్నాము. మా ఇంట్లో బాబాకి నిత్యం అభిషేకం చేయాలని అదివరకే రెండుసార్లు కాశీయాత్ర చేసిన నా భార్య ఇంట్లో ఉండిపోయింది. నేను ముందుగా అనుకున్నట్లు బెంగుళూరు వెళ్ళాను. అక్కడినుండి నేను, మా అమ్మాయి, అల్లుడు, మనవడు కలిసి కాశీయాత్రకు బయలుదేరాము. దారిలో ఉన్న శక్తిపీఠాలు దర్శించుకుంటూ కాశీ చేరుకున్నాము. ఆ రోజు తెల్లవారితే కార్తీకమాసం మొదలవుతున్నందున రాత్రి 2-30 గంటలకే కాశీ విశ్వనాథుని ఆలయం చేరుకున్నాము. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా వచ్చారు. వారి పూజ పూర్తైన తర్వాత చాలా తక్కువ మందిని మందిరం లోపలికి అనుమతించారు. అందువల్ల మేము తనివితీరా విశ్వేశ్వర లింగాన్ని స్పర్శించి ధన్యులమైనాము. మహా హారతి మొదలైన పూజ కార్యక్రమాలు వీక్షించాము. చీఫ్ జస్టిస్ వచ్చినందువల్ల భద్రతారీత్యా ఆరోజు పూజ సామగ్రిగానీ, ఆవుపాలుగానీ లోపలికి అనుమతించలేదు. కానీ నా అదృష్టం కొద్ది మందిరం లోపల నా పక్కనే ఉన్న ఒకరి వద్ద నుండి నాకు బిల్వపత్రం లభించింది. ఆ పత్రాన్ని నేను భక్తితో ఆనందంగా విశ్వేశ్వర లింగం మీద ఉంచాను. అంతా బాబా ఏర్పాటు. ఆయన మమ్మల్ని అంత గొప్పగా అనుగ్రహించారు. నా జన్మధన్యం. కృతజ్ఞతలు బాబా.

కాశీలో చూడవలసిన మందిరాలు, ప్రదేశాలు అన్నీ చూసుకొని కాశీలో మూడు నిద్రలు చేశాము. తర్వాత ప్రయాగ వెళ్ళాము. అక్కడ త్రివేణి సంగమం వద్దకు పడవలో వెళ్ళి, గంగాయమునలు కలిసేచోట మూడుసార్లు నీటిలో మునగడం నాకు ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే, చిన్నప్పటి నుండి నీళ్లన్నా, సముద్రస్నానాలన్నా నాకు భయం. అలాంటిది బాబా ప్రేరణ వల్ల కాశీగంగలో, త్రివేణీ సంగమంలో ఎటువంటి భయం లేకుండా మునిగాను. ఆపై గయలో శక్తిపీఠం వింధ్యాచల్ అమ్మవారిని దర్శించి తిరుగు ప్రయాణమయ్యాము. మా ప్రయాణానికి ముందు బాబా కాశీ, ప్రయోగ, గయకు మాత్రమే అనుమతించారని శిరిడీ దర్శనం లేకుండా రూట్ మ్యాప్ తయారుచేశారు మా అమ్మాయివాళ్ళు. నేను తిరుగు ప్రయాణంలో శిరిడీ వెళదామంటే, మా అల్లుడు "అది వేరే రూటు. ఇంకోసారి వెళ్దాం" అన్నాడు. నాకేమో శిరిడీ వెళ్లాలని, వాళ్లేమో వద్దని. ఈ సమస్యను బాబా ఎలా తీర్చారో చూడండి. తిరుగు ప్రయాణంలో మా అమ్మాయికి బాబా కలలో కనబడి శిరిడీ రమ్మన్నారు. అయితే శిరిడీ వెళ్లాలంటే వేరే రూట్‌లో అదనంగా 500 కిలోమీటర్లు వెళ్లాలి. అదీకాక మా అల్లుడికి ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉందని, అర్జెంట్‌గా రమ్మని ఫోన్ వచ్చింది. ఎలా ఏం చేయాలి? శిరిడీనా? ఆఫీసా? అని ఎటు తేల్చుకోలేని స్థితిలో పడ్డాము. అప్పుడు బాబా ఎలా దారి చూపారో, సమయానికి ఎలా ఆదుకున్నారో చూడండి. బయలుదేరిన కొద్దిసేపటికి కారులో ఉన్న డాష్ బోర్డులో 'కీ' బొమ్మ గల సెన్సార్ లైట్ వెలిగి ఆగింది. దాంతో ఒక టోల్గేట్ దగ్గర కారు పక్కన ఆపి ఇంజన్ కింద చూసేసరికి కూలెంట్ వాటర్ మొత్తం నెలపాలై ట్యాంక్ మొత్తం ఖాళీ అయింది. అంతలో ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి కారుకి ఏమైందని అడిగి కింద మడుగు చూసి, "ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ దూరంలో మెకానిక్ ఉన్నాడు, అతన్ని పిలుచుకొని రండి" అని అడ్రస్ చెప్పి, తన బైక్ కూడా ఇచ్చాడు. మా అల్లుడు ఆ బైక్ మీద వెళ్లి మెకానిక్‌ని తీసుకొచ్చాడు. అతను చూసి, "కూలెంట్ వాటర్ పైపు పగిలిపోయినట్టుంది. ప్రస్తుతానికి నీళ్లు పోసుకుని పది కిలోమీటర్ల వరకు వెళ్తే, ఒక గ్యారేజ్ వస్తుంది. అక్కడ చూపించండి" అని చెప్పాడు. అలాగే అని వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి గ్యారేజ్‌కు వెళ్ళాము. అక్కడ మెకానిక్ కారును చూసి, "రిపేర్ ఏమిటో అర్థం కావడం లేదు. కారు ముందు భాగం విప్పి చూడాలి. ఒకరోజు పడుతుంది. దీపావళి కారణంగా షాపులు సెలవు. కాబట్టి స్పేర్ పార్టులు దొరకవు" అని చెప్పి తన దగ్గర ఉన్న కూలెంట్ వాటర్ బాటిల్ ఇచ్చాడు. కానీ అది కారిపోకుండా నిలవాలి కదా! అందుకని మా అమ్మాయి బాబాని ప్రార్థించి ఒక ఊదీ ప్యాకెట్ మొత్తం ట్యాంక్‌లో పోసి, "ఇక బయలుదేరుదాం. ఏ ఆటంకం రాకుండా బాబానే మనల్ని శిరిడీ చేర్చుతారు" అంది. అంతే, శిరిడీ వెళదామని నిర్ణయించుకుని, దర్శన పాసులు బుక్ చేసుకొని, బాబా మీద భారమేసి బయలుదేరాము. రాత్రి 8 గంటలకు శిరిడీ చేరుకున్నాము. మేము ముందుగా ద్వారకామాయిలో బాబాని దర్శించుకొని తర్వాత పదిగంటలకు సమాధి మందిరంలో అడుగుపెట్టాము. బాబా మూర్తిని చూడగానే నా చుట్టూ వున్నవేవీ నాకు కన్పించలేదు. బాబా మాత్రమే నాకు కనిపిస్తున్నారు. అంతలో ఓ అద్భుతమైన ఆశీర్వచనం నాకు లభించింది. బాబా తమ శిరస్సును క్రిందకి, పైకి ఆడించి కనులు మూసి తెరిచారు, 'రమ్మనగానే వచ్చారా'? అన్నట్లుగా. ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను, భ్రమ ఏమో అనుకున్నానుగాని ఆ విషయం గురించి నేను మావాళ్లెవరికీ చెప్పలేదు. శేజారతి అనంతరం రూమ్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకొని, మర్నాడు ఉదయం కొల్హాపూర్ వెళ్లేందుకు బయల్దేరాము. అప్పుడు మా అమ్మాయి మొబైల్ ఫోన్‌కి, "మీ నాన్నకు నా అనుగ్రహం లభించింది" అని ఒక మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే ఒక వీడియో మెసేజ్ కూడా వచ్చింది. ఆ వీడియోలో ఒక గుడిలో అమ్మవారు నెమ్మదిగా కనులు మూసి, మళ్ళీ తెరవడం, అంతేకాక అమ్మకు ఎడమ వైపున బాబా ఉండటం వుంది. వాటిని మా అమ్మాయి నాకు చూపించినప్పుడు రాత్రి నాకు కలిగిన అనుభవం భ్రమ కాదని, బాబా తమ నిజరూప దర్శనమిచ్చామని ఈవిధంగా తెలియజేస్తున్నారనిపించి మా అమ్మాయివాళ్లకు ముందురోజు రాత్రి నాకు కలిగిన అనుభవం గురించి చెప్పాను. బాబా అనుగ్రహానికి మా అందరికీ చాలా సంతోషమేసింది. ముందురోజు ఆ మెకానిక్ చెప్పింది, 'పది కిలోమీటర్లు వెళ్ళవచ్చ'ని. కానీ బాబా శిరిడీ, శిరిడీ నుండి కొల్హాపూర్, అక్కడినుండి బెంగళూరులోని మా ఇంటికి ఏ ఆటంకం లేకుండా చేర్చారు(అంతేకాదు, ఇప్పటివరకు కారుకి ఏ రిపేరూ లేదు). ఇన్ఫెక్షన్ సమయానికి మా అల్లుడు ఆఫీసుకి కూడా వెళ్ళిపోయాడు. అలా రూట్ మ్యాప్‌లో లేని శిరిడీ దర్శనం, అవలీలగా అన్ని కిలోమీటర్ల ప్రయాణం బాబా ఆశీస్సులతో సాద్యమైంది. "ధన్యవాదాలు బాబా. ఎప్పటికీ ఇలాగే మా కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండు బాబా".

17 comments:

  1. Sri sachidanand Samardha Sadguru Sainath Maharaj ki Jai!!!

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my parents 🙏🙏

    ReplyDelete
  4. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐

    ReplyDelete
  6. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Om sai ram na manasuki nachanidi yedi jaragoddu tandri, aa discusdion kuda ma intlo rakunda chudu tandri

    ReplyDelete
  9. Omsaisri Sai Jai Jai Sai Ram kapadu Tandri omsairamRaksha Raksha omsaisri Jai Jai Sai Ram

    ReplyDelete
  10. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  11. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  12. Om Sairam 🙏🏻 Anantha koti brahmanada nayakudu, ayanake sadhyam ee leelalu !! Adbhutham Sai !!

    ReplyDelete
  13. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  14. sai baba maa bangaru tandri madava exams baaga rayali.

    ReplyDelete
  15. Baba,meru edo suchisthunnaru ani naku anipisthundi naa thappu lu kashaminchandi baba naa manasu mee mede vundela chesi thappulu em cheyakunda chudandi please....Maa situations ni set chesi evariki ebbandi lekunda chudandi baba please 🥺🥺🥺🥺🥺....Naku mere dikku 🙏🥺🥺❤️♥️....Naa daggara Hanuman dollar poyindi baba 😔😔😔😔 dorikela chudandi

    ReplyDelete
  16. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo