- ఆటంకాన్ని తొలగించి ఆపరేషన్ జరిపించిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శ్రీ సాయినాథునికి శతకోటి వందనాలు. సాయిబంధువులందరికీ నమస్కారాలు. నా పేరు చైతన్య, ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. బాబా ఈ బ్లాగు రూపంలో మనతో సజీవంగా ఉన్నారనిపిస్తుంది. ఐదు సంవత్సరాల క్రితం నా గొంతు దగ్గర థైరాయిడ్ గ్లాండ్ మీద చిన్న గడ్డ వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే, ఒక డాక్టర్, "ఆపరేషన్ చేయాల"ని చెప్పారు, ఇంకొక డాక్టర్, "ఆపరేషన్ అవసరం లేదు. దానివల్ల సమస్యేమీ లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి స్కానింగ్ చేయించుకోమ"ని చెప్పారు. కానీ తర్వాత కరోనా రావడంతో హాస్పిటల్‌కి వెళ్ళడానికి లేక నేను స్కాన్ చేయించుకోలేదు. నేను కూడా ఆ గడ్డ గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2023లో ఒకసారి స్కానింగ్ చేయించుకుంటే, 'గడ్డ పరిమాణం పెరిగింద'ని రిపోర్టు వచ్చింది. కానీ డాక్టర్ ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. అయితే ఆ గడ్డ పరిమాణం పెరుగుతూ ఉండటంతో కొంతకాలానికి మా ఇంట్లో అందరూ ఒకసారి హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకో అన్నారు. దాంతో నేను 2024, మార్చిలో మళ్ళీ స్కానింగ్ చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్ళాను. హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు పెద్ద బాబా ఫోటో, డాక్టర్ గదిలో బాబా విగ్రహం నాకు కనిపించాయి. అప్పుడు నాకు చాలా ధైర్యంగా అనిపించింది. కానీ, డాక్టర్ స్కాన్ చేసి, "గడ్డ పరిమాణం బాగా పెరిగింది. ఆపరేషన్ చేయాలి. లేకపోతే ఆ గడ్డ శ్వాస తీసుకొని నాళానికి తగిలి సమస్య అవుతుంద"ని చెప్పారు. అంతేకాకుండా, "ఆ గడ్డ ఎటువంటిదన్నది ఈ స్కాన్లో తెలియదు. సర్జరీ చేసే ముందు మేము ఒక టెస్ట్ చేస్తాము. అప్పుడు ఆ గడ్డ ఏమిటని తెలుస్తుంది. ఒకవేళ క్యాన్సర్ గడ్డ అయితే థైరాయిడ్ గ్లాండ్ మొత్తం తొలగిస్తాము. ప్రస్తుతం మాత్రం ఏం చెప్పలేం. కాకపోతే కొంచెం అనుమానంగా ఉంది" అని చెప్పారు. అది విని నేను చాలా ఆందోళనకి గురయ్యాను. భయమేసి, "ఏంటి బాబా? డాక్టర్ ఇలా చెబుతున్నారు. ఎలాగైనా మీరే కాపాడాలి బాబా" అని బాబాని వేడుకున్నాను. హాస్పటల్ నుండి వచ్చాక ఐదు రోజులు నాకు సరిగా నిద్రపట్టలేదు. ఆ సమయంలో, "ఎందుకు నిద్ర లేకుండా ఆలోచిస్తున్నావు. మంచిగా నిద్రపో! అంతా మంచే జరుగుతుంది. నా మీద నమ్మకముంచు. నీ బాబా నీతో ఉన్నాడు!", "బాబా నీకు ఏ హాని కలగనివ్వడు" వంటి సందేశాలు ఏదో ఒక రూపంలో వస్తూ ఉండేవి. బాబానే నాకు ధైర్యం చెప్పడానికి అలా సందేశాలు పంపారు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని, "బాబా! మీరే ఏదో ఒక రూపంలో వచ్చి నాకు సర్జరీ చేసి నాకు సహాయం చేయండి" అని బాబాను వేడుకున్నాను. తర్వాత డాక్టర్ సర్జరీ చేసేందుకు ఒక తేదీ నిర్ణయించి చెప్పారు. కానీ నాకు ఇన్సూరెన్స్ ఉన్నందున ఇన్సూరెన్స్‌కి అప్లై చేసి, మేము తేదీ చెప్తామని చెప్పాము. బాబా దయవల్ల ఇన్సూరెన్స్ అప్రూవల్ లభించింది. అప్పుడు నేను బాబాని, "బాబా! సర్జరీ సోమవారం చేయించుకోవాలా? గురువారం చేయించుకోవాలా?" అని బాబాని అడిగి చీటీలు వేశాను. అప్పుడు బాబా 'సోమవారం చేయించుకోమ'ని సమాధానం ఇచ్చారు. మేము డాక్టర్‌తో "సోమవారం సర్జరీ చేయించుకుంటామ"ని చెప్పాము. అప్పుడు డాక్టర్, "సోమవారం ఉదయం 7:30 కల్లా హాస్పిటల్‌కి రండి" అని చెప్పారు. సరేనని, మేము ఆరోజు ఉదయం 7:30కి హాస్పిటల్‌కి వెళ్ళాము. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మేము సర్జరీకోసం వేచి చూసాం. కానీ ఎంతసేపటికీ సర్జరీ మొదలుపెట్టలేదు. అక్కడున్న వాళ్ళు కనుక్కుంటే, 'ముందురోజు ఆపరేషన్ థియేటర్లో పెయింటింగ్ వర్క్ మరియు రిపేర్ వర్క్ జరిగిందని, ఆ వర్క్స్ జరిగిన తర్వాత ఆ థియేటర్లో ఆపరేషన్ చేయొచ్చా, లేదా అని టెస్ట్ చేస్తారని, టెస్ట్ రిజల్ట్ నెగటివ్ వస్తే పేషెంట్స్‌కి ఆపరేషన్ చేస్తారని, పాజిటివ్ వస్తే ఆపరేషన్ చేయడం అంత సురక్షితం కాదని, ఆ టెస్ట్ రిపోర్టు పాజిటివ్ వచ్చిందని, కాబట్టి రిపోర్టు నెగిటివ్ వచ్చేవరకు ఆపరేషన్లు చేయరని, టైం పడుతుంద'ని చెప్పారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. దాదాపు 15 మంది పేషెంట్లు సర్జరీకోసం వేచి ఉన్నారు. కొద్దిసేపయ్యాక కొందరు డాక్టర్లు వాళ్ళ పేషంట్ల దగ్గరకి వచ్చి, "ఈరోజు సర్జరీ చేయడం లేదు. పోస్ట్ పోన్ చేసుకుని మరోసారి రండి" అని చెప్పారు. నాకు సర్జరీ చేసే డాక్టర్ వచ్చి కూడా "ఈరోజు సర్జరీ లేదు. మరలా రండి" అని చెప్పారు. మా కుటుంబసభ్యులందరూ, "ఇంటికి వెళ్లి గురువారం మళ్ళీ వద్దాము" అని అన్నారు. నాకు మాత్రం, 'ఆ రోజే సర్జరీ జరుగుతుంద'ని బాబా చెప్తున్నట్టు అనిపించింది. అందువల్ల 'నేను బాబా దగ్గర అనుమతి తీసుకొని సోమవారం వచ్చాను. ఆయన ఎలాగోలా సర్జరీ ఈరోజు జరిగేలా చూస్తారు' అని నమ్మకంతో అక్కడే వేచి ఉన్నాను. దాదాపు అందరూ వెళ్లిపోయారు. నేను ఒక్కదాన్నే మిగిలాను. "బాబా! ఏంటి ఇలా జరిగింది? గురువారం వరకు ఆందోళన చెందుతూ ఉండాలా?" అని అనుకున్నాను. మనం ఆర్తితో బాబాని ప్రార్థిస్తే, ఏదో ఒక రూపంలో వచ్చి ఆయన సహాయం చేస్తారు. అదే జరిగింది. మత్తు ఇచ్చే డాక్టర్ వచ్చి(ఆయన రూపంలో బాబానే వచ్చారని నా నమ్మకం), "మీరు పొద్దున్నుంచి కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా సర్జరీకోసం వేచి ఉన్నారు కదా! కింద ఇంకొక ఆపరేషన్ థియేటర్ ఉంది. నేను మీ డాక్టర్ తో మాట్లాడి అక్కడ సర్జరీ జరిగేలా చూస్తాన"ని చెప్పారు. ఇంకా, "కింద ఉన్న ఆపరేషన్ థియేటర్‌వాళ్ళ అనుమతి తీసుకుంటాను. ఎందుకంటే, అక్కడ సర్జరీలు బుక్ అయి ఉంటాయి కదా! అక్కడ ఖాళీ ఉంటే సర్జరీ చేస్తామ"ని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషమేసింది. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగి ఎట్టకేలకు మధ్యాహ్నం 3:30కు నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అంతసేపు నేను బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. ఆపరేషన్ థియాటర్లోకి వెళ్లిన తర్వాత మత్తు ఇచ్చే డాక్టర్ మళ్ళీ వచ్చి, "ఏమి భయపడకండి. నేనున్నాను" అని ధైర్యం చెప్పారు. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా సర్జరీ జరిగింది. సర్జరీ అనంతరం తొలగించిన గడ్డను బయాప్సికి పంపి, "వారం రోజుల తర్వాత రిపోర్టు వస్తుంది" అని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! రిపోర్ట్ అంతా నార్మల్‌గా ఉండేలా చూడండి" అని అనుకున్నాను. ఆ సాయినాథుని దయవల్ల రిపోర్ట్ అంతా నార్మల్‌గా వచ్చింది. 'కర్మానుసారం వచ్చే కర్మలను మనం అనుభవించక తప్పద'ని బాబా శ్రీసాయి సచ్చరిత్రలో చెప్పారు. కానీ బాబా కృపాదృష్టితో పెద్ద కర్మలను చిన్నగా అనుభవింపజేసి వాటినుండి మనల్ని బయటపడేస్తారు. ఆయన తప్ప మనల్ని రక్షించేవారు ఎవరూ లేరు. ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తారు. మనం 'శ్రద్ధ-సబూరి' కలిగి ఉంటే ఆ కష్టం నుండి మనల్ని బయటపడేస్తారు. "ధన్యవాదాలు బాబా. మీ పాదాలు మేము ఎప్పుడు పట్టుకొని మీ యందు సంపూర్ణమైన విశ్వాసంతో ఉండేలా చూడండి. మేము మాయలో పడి మీ పాదాలు విడిస్తే మమల్ని క్షమించండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి దేవా".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 🙏🙏
ReplyDeleteBaba, take care of my son💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏💐💐
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings forever 🙏🙏
ReplyDeleteBaba ma Anvitha puttina roju eroju me blessing ivvandi baba. Tanani meere chusukovali thandri. Tana bhadhyatha antha Meede Baba. Om Sairam!!
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeletePl bless my son baba vadi bad habit manipinchu swamy satha koti vandanalu
ReplyDeleteOm sai ram, baba na mamasuki nachakunda yedi jaragakunda unde la chudu tandri pls na badha meeku telusu, amma nannalani kshamam ga chudandi tandri pls vaalla badya meede tandri
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha
ReplyDeletesai baba maa sai madava ni naa nundi duram cheya vaddu baba. madava ni school marchelaga chudu baba. St. Anns vaddu baba.
ReplyDeleteOm sri sairam 👏 🙏 🌺
ReplyDeleteOm sri sainadaya namaha 🙏🌺🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba,roju rojuki post avuthu vasthundi....em jaruguthundo ani chala disturb gaa anipisthundi bhayam gaa anipisthundi....mere naku dikku mere sarvasvam mere nannu kadapadali....naku mee padale dikku,naa valla evariki ebbandi rakunda chudandi baba please 🥺🥺🥺🥺🥺.....naku chala bayam vesthundi evarikina emina avasaram ayithe ela arrange avuthayi ani kani eroju daka meru nannu alanti situation loki vellakunda kapaduthune chala thanks Baba....alane kadapadandi naa cheyyi vadalakandi baba please 🥺🥺🥺🥺🥺...mere mammalni kapadi elanti addanki lekunda antha set ayyela chudandi baba
ReplyDeleteOm Sri Sai Raksha🙏🙏🙏
ReplyDeleteSri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏
ReplyDelete