సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2044వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా కృపాదృష్టి

నేను ఒక సాయి భక్తుడిని. బాబా అడుగడుగునా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నారు. ఆయన దయతో నేను చిన్న ఉద్యోగం చేస్తూ చెన్నైలో ఉంటున్నాను. మా ఆఫీసులో నాకు విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. ఒక పక్క నేను మంచి చేసిన కూడా స్నేహితులు నన్ను అపార్థం చేసుకోవటం, మరో పక్క మేనేజర్ నా పనిలో తప్పులు పట్టడం వల్ల నేను విపరీతమైన మానసిక సంఘర్షణకి గురవుతున్నాను. ఒకసారి నా మేనేజర్ ఒక పని సరిగ్గా చేయలేదని, సరిగా చేయమని నన్ను హెచ్చరించారు. కొంతసేపటికి నేను ఒక మీటింగ్‌లో ఉండగా 'ఒకసారి రమ్మని' మెసేజ్ పంపారు నా మేనేజర్. నేను 'ఏం సమస్య వచ్చిందో?' అని చాలా భయపడి, "బాబా! ఆయన సమస్య కోసం కాకుండా మామూలుగా పిలిచినట్టు చేయండి" అని వేడుకున్నాను. ఆశ్చర్యం! ఆయన ఏదో పని అప్పచెప్పడానికి నన్ను పిలిచారు. అది తెలిసి నేను ఊపిరి పీల్చుకున్నాను. ఇక స్నేహితులు విషయానికి వస్తే, ఒకసారి అనుకోకుండా నేను నా స్నేహితురాలి మీద కోపంతో అరిచాను. తను చాలా బాధపడింది. నేను తనకి క్షమాపణలు చెప్పి, "బాబా! దయతో నా క్షమాపణలు తను ఆమోదించేలా చేసి, అంతా సవ్యంగా అయ్యేలా చూడండి. అలాగే నాకు మళ్ళీ ఇలా కోపం రాకుండా చేయండి" అని బాబాను వేడుకున్నాను. ఆ మర్నాడు ఏమి జరగనట్టుగా తను నాతో ఉండటం నన్ను అశ్చర్యానికి గురిచేసింది. అంతే కదా! మనసులను ఏలే మహారాజుకి మనసు మార్చటం ఎంత పని? 

ఒకసారి నా మొబైల్ సరిగా పని చేయకపోవడం వలన ఆ ఫోన్ ఇచ్చేసి, కొత్త మొబైల్ తీసుకుందామని అనుకున్నాను. తర్వాత పాత మొబైల్‌కి ఎంత డబ్బులు వస్తాయో చూద్దామని ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తే, 12,000 రూపాయలు అని చూపించింది. అది మంచి ధర అని నేను ఆనందపడ్డాను. కానీ కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో సరిగా పనిచేయక ఇబ్బంది పెట్టే మొబైల్స్‌కు ఫ్లిప్‌కార్ట్ తక్కువ ధరకి తీసుకుంటుందని చెప్పారు. దాంతో నేను పాత ఫోన్ తక్కువ ధరకు పోతే, నేను తీసుకోవాలనుకుంటున్న మొబైల్ ఎక్కువ ధర పెట్టి తీసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెంది, "బాబా! ఫోన్ ఎక్కువ ధరకు వెళ్తే, హనుమాన్ గుడికి వెళ్తాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల నా మొబైల్ అదే ధరకే ఫ్లిప్కార్ట్ అతను తీసుకెళ్లిపోయాడు. నేను చాలా ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకొని హనుమాన్ గుడికి వెళ్లి మొక్కు తీర్చుకున్నాను.

నాకు అరుణాచలం అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు అరుణాచలం వెళ్ళాలనుకొన్నాను కానీ, కుదరలేదు. 8ఏళ్ళ ఆ నా కల బాబా, శివయ్య దయతో నెరవేరిన క్షణం నాకు చాలా ఆనందం కలిగించింది. తర్వాత కూడా నేను బాబా దయతో కొన్నిసార్లు అరుణాచలం వెళ్ళాను. ఒకసారి ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నాక నాతో రావాల్సినవాళ్ళు హఠాత్తుగా కొన్ని పనుల వల్ల రాలేమన్నట్టు మాట్లాడారు. దానికి నేను చాలా బాధపడి, "బాబా! ఈ ప్రయాణం, దర్శనం సాఫీగా అయ్యేలా అనుగ్రహించండి" అని వేడుకున్నాను. బాబా దయ చూపారు. నాతో రావాల్సిన వాళ్ళకి విచిత్రమైన సంఘటనలు ఎదురై పనులు వాయిదా పడి నాతో అరుణాచలం వచ్చారు. అందరం సంతోషంగా శివుని దర్శనం చేసుకున్నాము. గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న సాయిబాబా మందిరం కూడా సందర్శించి క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము. "ధన్యవాదాలు బాబా".

అప్పుడప్పుడు మా నాన్నకి అకారణంగా దగ్గు వచ్చి నెల లేదా పదిహేను రోజుల వరకు అలానే ఉండిపోతుంది. అందువల్ల నాన్నకి ఎప్పుడు దగ్గు వచ్చినా నాకు ఆందోళనగా ఉంటుంది. ఒకసారి 15 రోజులు అయినా నాన్నకి దగ్గు తగ్గలేదు. నేను చాలా ఆందోళన చెంది బాబా ఊదీ నీళ్లలో కలిపి నాన్నకి ఇవ్వటం, మరికొంత ఊదీ నాన్న నుదుటి మీద పెట్టటం చేస్తూ ఉండేవాడిని. అయినా ఒకరోజు దగ్గు బాగా ఎక్కువ అయింది. అప్పుడు నేను, "బాబా! మా నాన్నకి దగ్గు తగ్గేలా చూడండి" అని బాబాని వేడుకున్నాను. మరుసటిరోజుకే దగ్గు తగ్గటం మొదలై పూర్తిగా నయమైపోయింది. ఇలా బాబా నన్ను ఎన్నోసార్లు కాపాడారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలానే నాపై కృపాదృష్టి ఉంచండి". అలాగే మీ అందరికీ కూడా బాబా కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

4 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om Sai Ram please 🙏🙏 bless my family 🙏 Be with us and bless 🙏🙏💗 us

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo