ఈ భాగంలో అనుభవాలు:
1. సాయినామస్మరణ - సచ్చరిత్రల మహిమ
2. ఏ సమస్య లేకుండా లాప్టాప్ పనిచేసేలా అనుగ్రహించిన బాబా
సాయినామస్మరణ - సచ్చరిత్రల మహిమ
నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. పెళ్ళైన కొత్తలో నూతన పరిస్థితులకు సర్దుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నా మనసు ఎప్పుడూ దిగులుగా, ఆదుర్ధాగా ఉండేది. నాకు, మావారికి మధ్య ఏ కాస్త గొడవ జరిగినా భవిష్యత్తులో ఎలా ఉంటానో ఏమో అని భయపడేదాన్ని. ఏవేవో ఆలోచనలతో మనసులో ఒక పెద్ద యుద్ధమే జరిగేది. అస్సలు మనశ్శాంతి ఉండేది కాదు. దానికి తోడు మొదటి కాన్పులో నా పాప చనిపోవడంతో నా ప్రపంచం తలకిందులైంది. నేను చాలా షాకుకి గురయ్యాను. నేను ఎవరినీ బాధపెట్టలేదు, నాకే ఎందుకిలా జరిగిందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఒక్కోసారి బాబాని తిట్టాను కూడా(నన్ను క్షమించండి బాబా). కానీ చివరికి బాబాతో ఒక్కటే చెప్పుకున్నాను: "నాకు మీరే దిక్కు. మమ్మల్ని విడదీస్తారో లేక కలిపి ఉంచుతారో అంత మీ పాదాల దగ్గర పెడుతున్నాను" అని. తర్వాత ఎందుకు అనిపించిందో తెలీదుగాని ఆరోజు నుండి సదా నామస్మరణ, ప్రతిరోజూ సచ్చరిత్ర ఒక అధ్యాయం చదవడం మొదలుపెట్టాను. 6 నెలల్లో ఎవరు ఊహించలేనంత ఆనందంగా నా జీవితం మారింది. నాకు ఉద్యోగం వచ్చింది. నా భర్త నన్ను అర్థం చేసుకున్నారు. నేను మళ్ళీ గర్భవతినయ్యాను. ఇక అడగటానికి ఏ కోరిక లేదన్నంతలా నా జీవితం అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, సాయినామస్మరణ, సచ్చరిత్రల మహిమ. అయితే 2025, జులై వరకు సచ్చరిత్ర చదివిన నేను ఆ తర్వాత రోజూ చదవడం కుదరక పూర్తిగా చదవడం మానేసాను. ఇక చూడండి, మళ్ళీ నా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అప్పటి అవే ఆలోచనలు, అదే దిగులుతో కొన్నిసార్లు నన్ను నేను నియంత్రించుకోలేక ఏడ్చేసేదాన్ని. అటువంటి సమయంలో ఎప్పుడో సచ్చరిత్ర పారాయణ ఒక వారంలో పూర్తి చేస్తానన్న మొక్కు గుర్తుకొచ్చి, ఈ కష్ట సమయంలో చదువుదాం, కాస్త ప్రశాంతంగా ఉంటుందనిపించి పారాయణ మొదలుపెట్టాను. అంతే! నేను పొందిన మనశాంతి మాటల్లో చెప్పలేను. అంతా మార్చిపోయి, ఎందుకు అంతలా ఆలోచించినా అనుకున్నాను. అప్పుడు నేను ఇన్ని రోజులు సచ్చరిత్ర చదవడం మానివేయడమే నా దిగులుకు కారణమని నాకు అర్థమైంది. "నేను మళ్ళీ సచ్చరిత్ర చదివేలా చేసినందుకు ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ ఈ అలవాటుని విడిచిపెట్టకుండా చూడండి తండ్రి".
మరో చిన్న అనుభవం చెప్తాను. 2025, అక్టోబరులో నా కొడుకుకి బాగా వేడి చేసింది. వాడికి వేడి చేస్తే, రాత్రి నిద్రలో పిచ్చిగా ఏదో కలవరించడం, ఏదో చూసి భయపడుతున్నట్టు భయపడటం వంటివి చేస్తుంటాడు. వాడిని ఒంట్లో చల్లదనం కోసం ఏదైనా తీసుకోమని ఎంత చెప్పినా వాడు తీసుకోడు. అందువల్ల నేను ఎక్కడ వేడి ఎక్కువై వాడికి ఏమైనా అవుతుందేమోననని చాలా టెన్షన్ పడ్డాను. ఏమీ చేయలేక బాబాని శరణువేడాను. బాబా దయవల్ల ఉదయానికి వేడి తగ్గి బాబు కుదుటపడ్డాడు. బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. తర్వాత నవంబర్ 17న బాబు మళ్ళీ అదే సమస్యతో బాధపడ్డాడు. నేను ఆ రాత్రి పడుకొని బాబా నామస్మరణ చేస్తూ ఉండగా సుమారు 3:30 ప్రాంతంలో బాబు నొప్పి అని చాలా బాధపడ్డాడు. అప్పుడు నేను, "బాబా నన్ను క్షమించండి. దయచేసి నా బాబుకి నయమయ్యేలా చూడండి" అని వేడుకున్నాను. బాబా చేసిన అద్భుతం చూడండి. ఒక 5 నిముషాలు తరువాత బాబు బాత్రూమ్కి వెళ్లొచ్చి, "అమ్మా! నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. రేపు స్కూలుకి వెళ్తాను" అని అన్నాడు. నాకు సంతోషంగా అనిపించింది. "చాలా ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ మీ పాదాల దగ్గర ఉండేలా మమ్ము దీవించు తండ్రీ. నాకు మీ సేవ చేసుకునే అదృష్టాన్ని ఈ జీవితంలో ఒక్కసారైనా కలిగించండి బాబా. స్వయంగా ఉద్యోగం చేసుకొనే భాగ్యాన్ని నాకు ఇవ్వండి బాబా. మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి తండ్రీ".
సాయి స్మరణం శంకట హరణంబాబా శరణం భవభయ హరణం
ఏ సమస్య లేకుండా లాప్టాప్ పనిచేసేలా అనుగ్రహించిన బాబా
నా పేరు దివ్య. 2025, డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం అనుకోకుండా మావారి లాప్టాప్ మీద నీళ్లు పడ్డాయి. అది కంపెనీవాళ్ళ లాప్టాప్ అయినందువల్ల మావారు చాలా టెన్షన్ పడ్డారు. నేను అతని బాధ చూడలేక బాబాతో, "లాప్టాప్కి ఊదీ పెడతాను. అది పని చేసేలా చూడండి" అని బాబాను ప్రార్థించి ఊదీ బాబా పాదాలకు తాకించి లాప్టాప్కి పెట్టాను. సాయంత్రం మావారిని "లాప్టాప్ పనిచేస్తుందా?" అని అడిగితే, "పర్వాలేదు. రాత్రి వరకు చూడాలి ఏమైనా సమస్య వస్తుందో, లేదో" అని అన్నారు. రాత్రి మళ్ళీ అడిగితే, "బాగానే పని చేస్తుంది" అన్నారు. "ధన్యవాదాలు బాబా. మీ దయతో మాకు ఒక మంచి ఇల్లు దొరకాలి. మాకు చాలా అంటే చాలా కష్టాలు వస్తున్నాయి. నేను ఒకటే గట్టిగా కోరుకుంటున్నాను, 'మావారి ఉద్యోగానికి ఎలాంటి సమస్యలు రావద్దు. ఎలా దారి చూపిస్తారో మీ ఇష్టం' ".

Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm sai ram, tandri amma nannalani kshamam ga ayur arogyalatho anni velala kshamam ga chusukondi tandri vaalla purti badyata meede tandri, ofce lo intlo ye problems lekunda anta manchiga unde la chusukondi baba, e kadupulo noppi tagginchi manchi arogyanni prasadinchandi thandri, Ammamma tatayalu ye problems lekunda twaraga illu kattukune la daya chupandi tandri pls.
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Onsairam
ReplyDeleteఓం సాయిరామ్
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete