ఈ భాగంలో అనుభవాలు:
1. 'నేను నా భక్తుల వద్దనే ఉంటాను'
2. దయ చూపిన బాబా
'నేను నా భక్తుల వద్దనే ఉంటాను'
సాయి భక్తులందరికీ వందనం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా అనుగ్రహం అందరితో పంచుకోవడానికి ఈ బ్లాగు చాలా చక్కటి వేదిక. ఈ బ్లాగు బాబా అనుగ్రహంతో హేమాడ్పంత్ రచించిన సాయి సచ్చరిత్ర, దాసగణు అందించిన స్తవనమంజరితో తలతూగగలదనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 2003 నుండి సాయితో నాకు అనుబంధం ఉంది. అప్పటికి నాకు సాయిబాబా పేరు మాత్రమే తెలుసు. నేను హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతుండేదాన్ని. అప్పుడొకసారి నా స్నేహితురాలు తనకు తోడుగా నన్ను బాబా గుడికి తీసుకెళ్లింది. అదే నేను మొదటిసారి బాబా గుడికి వెళ్ళటం. అప్పటినుండి నా స్నేహితులు రమ్మని పిలిచినప్పుడల్లా వాళ్ళతో కలిసి బాబా గుడికి వెళ్తుండేదాన్ని. అయితే నాకోసం బాబాని పెద్దగా కోరికలు కోరినట్లు, బాధలు చెప్పుకున్నట్లు నాకు గుర్తులేదు కానీ, 2010లో నాకు బాబా మీద నమ్మకం కుదిరింది. ఇక అప్పటినుండి ఎన్నో విషయాలలో బాబా నాకు తోడుగా ఉన్నారు. ఆయన నాకు ప్రసాదించిన చిన్న, పెద్ద అనుభవాలన్నీ కలిపి ఒక పుస్తకం అవుతుంది. ఇప్పుడు మాత్రం ఇటీవల జరిగిన ఒక అనుభవం చెప్తాను. 2025, ఫిబ్రవరిలో ఒకసారోజు నా మనసుకి ఎందుకో దిగులుగా అనిపించి, "ఏదో ఒక రూపంలో మా ఇంటికి రండి బాబా" అని మనసులోనే అనుకున్నాను. ఆ రోజు ఎల్కేజీ చదువుతున్న మా ఐదు సంవత్సరాల పాప స్కూలుకెళ్ళి, తిరిగి వచ్చేటప్పుడు ఒక సాయిబాబా ఫోటో తెచ్చి నా చేతిలో పెట్టింది. నేను, "ఎక్కడిదమ్మా?" అని అడిగితే, "స్కూల్లో ఇచ్చారు మమ్మీ" అని చెప్పింది. విషయమేమిటంటే, ఆ ముందురోజు మా పాప స్కూల్లో చిన్న ఫంక్షన్ జరిగింది. దానికి గుర్తుగా పిల్లలకి దేవుడు ఫోటోలు ఇచ్చారు. బాబాని చూడగానే 'పిలిచినంతనే వచ్చారే!' అని నా మనసు ఆనంద, ఆశ్చర్యాలతో నిండిపోయింది. కానీ అది నా నెలసరి సమయమైనందున, 'నేను పిలిచినంతనే బాబా ఇంటికి వచ్చారు. ఆయనకి ఏ సేవా చేయలేకపోతున్నానే!" అని చాలా బాధేసింది. అంతలో బాబా నాకు ఏదో సందేశమిస్తున్నట్టనిపించి, "ఏంటి బాబా?" అని బాబా క్వశ్చన్&ఆన్సర్ సైట్లో చూస్తే, 'సమయం ఆసన్నమైంది' అని వచ్చింది. అది నాకు అర్థంకాక మళ్ళీ, 'ఏంటి బాబా?' అని అడిగితే, 'ప్రతిదీ నీకు తెలియాల్సిన అవసరం లేదు' అని వచ్చింది. 'ఏంటో బాబా మాటలు!!' అని అప్పటికి ఊరుకున్నాను. కొంతసేపటికి జరిగిన అద్భుతం చూడండి. మా పాప ఎవరూ చెప్పకుండా తనంతటతానే తను కూర్చునే చిన్న కుర్చీలో ఆ బాబా ఫోటో పెట్టి, పూజగదిలో నుండి కుంకుమ తెచ్చి బాబాకి పెట్టి, హారతి ఇచ్చి, పండు నైవేద్యం పెట్టి తనకి తోచిన విధంగా పూజ చేసింది. ఇంకా టీవీ ఆన్ చేసి యూట్యూబ్లో బాబా పాటలు ప్లే చేసింది. ఆ పాటలు వింటూ, బాబాని తలచుకుంటూ మనసుతో బాబాని సేవించుకున్నాను. బాబాకి సేవ చేసుకోలేకపోతున్నానని బాధపడినందుకు ఆ వెలితి తీరేలా బాబానే పాప చేత తమ పూజ చేసేలా పాపని ప్రేరేపించారు. ఇకపోతే, 'సమయం ఆసన్నమైంది' అన్న బాబా మాటకి 'సాయి సేవ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది' అని మరియు 'అన్ని నీకు తెలియాల్సిన అవసరం లేదు' అన్న మాటకి 'సాయితండ్రి సర్వాంతర్యామి, బిడ్డల మనసెరిగి సమయానికి తగిన ఏర్పాట్లు తానే చేస్తారు, మనం బాబాని పూర్తిగా నమ్మి ముందుకుసాగాలి, అంతా బాబానే చూసుకుంటారని' నాకు అర్థమైంది.
అదేరోజు రాత్రి మా పాప ఆడుకుంటూ ఏదో అందుకోబోతే షోకేస్లో పెట్టిన చిన్న పాలరాతి బాబా ప్రతిమకు తన చేయి తగిలి, అది కిందపడి, ప్రతిమ విరిగి తల, మొండెం విడిగా అయిపోయాయి. పాప బాధపడుతూ, "కావాలని చేయలేదు మమ్మీ" అని చెప్పింది. నాకింకా ఏడుపు ఆగలేదు, ఏడుస్తూ, "నువ్వు ఇంటికి వచ్చావని ఆనందపడితే ఇలా అయిందేంటి బాబా?" అని ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో, సారీ చెప్పి, "అపరాధాన్ని క్షమించమ"ని వేడుకున్నాను. ఇంతలో పేజీ రిఫ్రెష్ అయ్యి "నేను నా భక్తుల వద్దనే ఉంటాను" అన్న సాయి వచనం వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ బ్లాగు చూస్తుంటే, "నేనెవరినీ మధ్యలో విడవను. చివరికంటా గమ్యం చేరుస్తాను'" అన్న సాయి వచనం, దాంతోపాటు "బాబా నీతోనే ఉన్నారు. అంతా శుభమే జరుగుతుంది" అన్న బాబూజీ సందేశం ఒకేసారి వచ్చాయి. అవి చదివాక బాబా ఎప్పుడూ నాతోనే ఉన్నారని నమ్మకం కలిగించిన నా తండ్రి అనుగ్రహానికి మనసు ఆనందంతో నిండిపోయింది. సాటి సాయి బంధువుగా నా మానసిక ఆనందాన్ని మీ అందరూ అనుభూతి చెందే ఉంటారని అనుకుంటున్నాను. ఆ మర్నాడు మా ఆడపడుచు ఫెవికాల్తో బాబా ప్రతిమ అతికించి ఇచ్చింది. అసలు అతుకు వేసినట్లే లేదు, బాబా ప్రతిమ మునుపటిలాగే ఉంది. తనకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. "బాబా! ఎప్పుడూ మాతోనే ఉండి నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతూ ఉండు. మా ఆడపడుచుకి తొందరగా పెళ్లి కుదిర్చి, మీ చేతుల మీదగా పెళ్లి జరిపించు తండ్రి. మీ ప్రేమ, అనుగ్రహం అందరిపైనా వర్షించు. నాలో అహంకారం ఏ మూలనున్నా తీసివేసి శ్రద్ధ-సబూరి పెంపొందించు దేవా".
దయ చూపిన బాబా
నేను ఒక సాయిభక్తుడిని. ఒకరోజు రెండున్నర సంవత్సరాల మా బాబుకి జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. అదే సమయంలో మూడు నెలల మా పాపకి ముక్కుపట్టేసి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయింది. దానివలన తను పాలు సరిగ్గా తాగేది కాదు. మా వద్ద ఉన్న మందులు వాడినప్పటికీ ఇద్దరికీ తగ్గలేదు. దాంతో బాబాను తలుచుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లి, చూపించాము. డాక్టర్ కొన్ని మందులు ఇచ్చారు. నేను బాబాని, "బాబా! ఈ మందులు వాడాక పిల్లలిద్దరికీ తొందరగా నయమయ్యేలా చూడండి. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని అనుకొని ఇద్దరికీ ఊదీ రాసాను. బాబా దయచూపారు. రెండు రోజులో పిల్లలిద్దరికీ నయమైపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలానే మా పిల్లలపై, మీ భక్తులపై కరుణ చూపండి. పిల్లలకి అన్నివేళలా తోడుగా ఉండండి తండ్రీ. నా ఉద్యోగంలో ప్రశాంతత ఉండేలా చూడండి".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteBaba help me I. am in big trouble, save me baba, save my family baba and save my job. Om Sai Ram🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteBaba baba baba baba baba 🥲🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Sai Ram
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteఓమ్ శ్రీ సాయిరామ్🙏🏻
ReplyDelete🌹🙏🏻🙏🏻🙏🏻🌹
Om sairam
ReplyDeleteOm sairam
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏
ReplyDeleteBaba.. asadhyanni susadhyam chese samartha sadguruvivi nuvvu.. dayachesi ma adapaduchuki pelli kudirinchi daggarundi pelli jaripinchu 🙏
ReplyDelete