ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి దయుంటే ఏదైనా సాధ్యం!
2. భక్తురాలికోసం సీతారాముల ఊరేగింపును పంపిన బాబా
సాయి దయుంటే ఏదైనా సాధ్యం!
సాయి భక్తకోటికి నా ప్రణామాలు. నా పేరు దీపిక. సాయినాథ్ మహారాజ్ నా జీవితంలో, నా కుటుంబసభ్యుల జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ప్రాణభిక్ష పెట్టారు. "నన్ను ఆశ్రయించినవారిని, శరణుజొచ్చినవారిని రక్షించుటయే నా కర్తవ్యం, నాయందు ఎవరికి దృష్టి కాలేదో వారి యందే నా కటాక్షము" అని ఆయన చెప్పిన మాటలు ఋజువు చేశారు. ఒకసారి మా చెల్లికి నెలసరి సమస్య వచ్చి 22 రోజులు బ్లీడింగ్ అయింది. మనకి ఏదైనా సమస్య వస్తే అమ్మ తర్వాత సాయికే చెప్పుకోగలం. అలాగే మేము సాయికి విన్నవించుకొని డాక్టర్ దగ్గరకి వెళ్తే, పరీక్షలు వ్రాసారు. పరీక్షల్లో థైరాయిడ్ అని, అది కూడా చాలా అధికంగా 10 ఉందని తేలింది. ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న మాకు ఏం చేయాలో దిక్కు తోచలేదు. నేను ప్రతిరోజూ సాయినాథునికి పూజ చేస్తూ, "సాయీ! మేము మీ బిడ్డలం. మమ్మల్ని మీరే కాపాడాలి" అని కన్నీళ్లు పెట్టుకుంటుండేదాన్ని. సాధారణంగా నాకు ఏదైనా సమస్య వస్తే, బాబా సోషల్ మీడియా ద్వారా లేదా కలలో సందేశమిస్తారు. ఆరోజు, "మా చెల్లి పరిస్థితి ఏంటి? తనకి ఈ అనారోగ్యం ఏంటి సాయినాన్నా?" అని ఏడుస్తుంటే, 'నా నామజపం చేయమని' ఇంస్టాగ్రామ్ ద్వారా సాయి సందేశమిచ్చారు. నేను ఆయన చెప్పినట్లే నామజపం చేశాను. 3 రోజుల తర్వాత సమస్య తగ్గుముఖం పట్టింది. అప్పుడు బాబా, 'నా గుడికి వచ్చి ప్రసాదం పంచి, మీరు కూడా తినండి' అని సందేశమిచ్చారు. సరేనని మేము ఆరోజు గుడికి వెళ్లి పాలకోవా పంచిపెట్టి, అన్నప్రసాదం తిని వచ్చాం. సుమారు మధ్యాహ్నం ఒంటిగంటకు మా భోజనం అయిపోయింది. తర్వాత 2.30, 3 ప్రాంతంలో మా చెల్లి సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఒక్క మందు, ఒక్క ఇంజక్షన్, అసలు ఏ ట్రీట్మెంట్ లేకుండా సాయి నా చెల్లి సమస్యను తీసేసి, తనని కాపాడారు. 8 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయిస్తే, మునుపు 10 ఉన్న థైరాయిడ్ ఇప్పుడు నార్మల్ ఉంది. ఆ రిపోర్టు చూసి 'వైద్యం లేకుండా ఇదెలా సాధ్యమని' డాక్టరు షాకయ్యారు. సాయి దయుంటే ఏదైనా సాధ్యమే.
ఒకసారి నేను తీవ్రమైన కడుపునొప్పితో 3 రోజులు అల్లాడిపోయాను. నాకప్పుడు హాస్పిటల్‌కి వెళ్లే సమయం లేదు. అలాగని నొప్పి భరించడం నా వల్ల కాలేదు. వెంటనే సాయికి దణ్ణం పెట్టుకొని ఊదీ నుదుటన, నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి, కాస్త నోట్లో వేసుకున్నాను. అంతే, నొప్పి మాటుమాయమైపోయింది. తర్వాత కొన్ని వారాలపాటు పని ఒత్తిడి వల్ల బాగా నీరసంగా ఉండేది. టాబ్లెట్లు వేసుకున్నా తగ్గేది కాదు. అప్పుడు నేను రెండు పూటలా ఊదీ ధారణ మంత్రం చదివి కాస్త నుదుటున పెట్టుకొని, ఇంకాస్త నోట్లో వేసుకుంటుంటే ఎంతో హుషారుగా ఉండి నీరసం తగ్గిపోయింది. నాకు ఏదైనా అనారోగ్యం లేదా సమస్య వచ్చినా నా సాయినాన్నకే చెప్పుకొని నా భారం, నా కుటుంబ భారం ఆయనపై వేస్తాను. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సాయినాథ్ ఉన్నారు, చూసుకుంటారనే ధైర్యం నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుంది. మా ఇంటి పెద్ద సాయినాథునికి మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాము.
భక్తురాలికోసం సీతారాముల ఊరేగింపును పంపిన బాబా
నా పేరు సాయికుమారి. 2025, ఏప్రిల్ 6, ఆదివారం, శ్రీరామనవమినాడు నా ఆరోగ్యం బాగాలేక రాములవారి కళ్యాణంకి వెళ్ళలేకపోయాను. ఉదయం 10:30 అప్పుడు బాబా దగ్గర బాధపడుతూ, "రామునికి నేను అంటే ఇష్టం లేదు కదా! అందుకే నన్ను ఈరోజు కళ్యాణంకి రాకుండా చేశారు. ఆయన దర్శనం కూడా లేదు" అని అనుకున్నాను. తర్వాత 10 నిమిషాలకు మా వీధిలో సన్నాయి మేళాలు వినపడుతుంటే, 'ఏంటా?' అని వెళ్ళి చూస్తే, సీతారాముల ఊరేగింపు వస్తుంది. వెంటనే వెళ్ళి సీతారాముల వారి దర్శనం చేసుకున్నాను. మా వీధిలో రాములవారి గుడి లేదు. వేరే ప్రాంతం నుంచి మా వీధికి సీతారాములని తీసుకొచ్చారు. వాళ్ళు వేరే ఏ వీధికి వెళ్లకుండా మా వీధి వద్దనుండి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారు. నాకోసమే సీతారాముల ఊరేగింపు వచ్చిందనుకున్నాను. అంతా సాయి దయ.
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDelete