ఈ భాగంలో అనుభవాలు:
- నాకోసం వర్షాన్ని ఆపిన బాబా
- మరుజన్మనిచ్చిన సాయిబాబాకి కృతజ్ఞతాసుమాంజలి
నాకోసం వర్షాన్ని ఆపిన బాబా
ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకి చాలా చాలా ధన్యవాదాలు.
నా పేరు శ్రీకాంత్. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొప్పోలు గ్రామ నివాసిని. ఇప్పటికి నేను రెండుసార్లు నా అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. వాటిలో, నేను బాధలలో ఉన్నప్పుడు బాబా నన్ను ఎలా దగ్గరకి తీసుకున్నదీ, బాబా ప్రసాదం ఇవ్వడం గురించీ చెప్పుకున్నాను. ఇప్పుడు సంవత్సరం క్రితం జరిగిన మరో మంచి అనుభవాన్ని మీతో పంచుకుంటాను.
2019, డిసెంబర్ 2వ తేదీన మేము మా ఊరిలో క్రొత్త ఇంటికోసం భూమిపూజ చేసే సమయంలో జరిగిన అనుభవమిది. సరిగ్గా ఆరోజుకి రెండు రోజుల ముందునుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పూజ రోజు కూడా వర్షం తగ్గుముఖం పట్టలేదు. పూజకోసం గుంట తీసే పనివాళ్ళు, "ఇంత వర్షంలో గుంట తీయటం మావల్ల కాదు, అసలెవరూ తీయలేరు. ఒకవేళ గుంట త్రవ్వడం మొదలుపెట్టినా, ఒక ప్రక్కనుంచి గుంట తీస్తుంటే మరో ప్రక్కనుంచి గుంటలోకి నీరు చేరుతూ ఉంటుంది. కాబట్టి పని చేయడం అసాధ్యం" అని అన్నారు. ఊరిలో అందరూ అదే మాట చెప్పారు. మాకేమో మొదట నిర్ణయించిన ముహుర్తానికే పూజ చేయించుకోవాలని ఉంది. ఏమి చేయాలో అర్థం కాలేదు. నేను రోజూ మా ఇంట్లో బాబాకు అభిషేకం చేస్తాను. ఆరోజు కూడా బాబాకు అభిషేకం చేస్తూ, "బాబా తాతా! అందరూ అలా అంటున్నారు. మీరు తలచుకుంటే, ఆనాడు శిరిడీవాసుల కోసం ఎలా వర్షాన్ని ఆపుచేశారో అలా ఈనాడు మా ఊరిలో వర్షాన్ని ఆపగలరు. మరి మీరు ఏమి చేస్తారో ఏమో, నాకు మాత్రం ఈరోజు మీరు సహాయం చేయాలి తాతా" అని చెప్పుకున్నాను. ఆశ్చర్యం! కాసేపటికే వర్షం ఆగిపోయింది. పనిచేసేవాళ్ళని పిలిపించి, గుంట తీయమని ఎంతగానో చెప్తే, "మేము తీయగలిగేంత తీస్తాం. నీరు పడితే మాత్రం మేము ఏమీ చేయలేము" అని అన్నారు. "సరే, ఎంతవరకు వీలయితే అంతవరకు చెయ్యండి" అని చెప్పాను. బాబా దయవలన ఎటువంటి ఇబ్బందీ లేకుండా వాళ్ళు మాకు కావాల్సిన 5.5 అంగుళాల గుంట తీశారు. మేము అనుకున్నట్లుగానే పూజ పూర్తి చేశాము. ఆనందంతో మనసులోనే బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అలా బాబా నేను పిలిచినప్పుడల్లా నాకు సహాయం చేసేందుకు వస్తారు. "నా ముందు చేయి చాపి ఏమి కోరితే అది ఇస్తాను" అని బాబా అంటారు. అది అక్షర సత్యం. ప్రతిరోజూ పూజ చేసే సమయంలో నేను బాబా కళ్ళను చూస్తుంటాను. ఏమైనా చెప్పాలనుకుంటే, బాబా తన కళ్ళ ద్వారానే నాకు చెప్తుంటారు. ప్రతిరోజూ ఆయన నాకు అనుభవాలు ప్రసాదిస్తుంటారు. మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. "థాంక్యూ సో మచ్ బాబా!"
ఓం సాయిరాం! జయ జయ సాయిరాం!

"మరుజన్మనిచ్చిన సాయిబాబాకి కృతజ్ఞతాసుమాంజలి"
ముందుగా నా తల్లి, తండ్రి, గురువు అయిన సాయిబాబాకు నా నమస్కారములు. అలాగే ఈ బ్లాగు నిర్వాహకులకు నా శుభాభివందనములు. నా పేరు నాగార్జున. నేను 2012 నుండి బాబా భక్తుడిని. మా ఊరిలో బాబా గుడి లేని కారణంగా నాకు బాబా గురించి అంతగా తెలియకపోయినప్పటికీ బాబా అంటే ఇష్టం ఏర్పడింది. 2012లో నేను పదవతరగతి పూర్తిచేసి ఇంటర్ చదువు కోసం మా ప్రక్కఊరికి వెళ్ళాను. అక్కడ బాబా గుడి చూసి నా మనసు ఆనందంతో పరవశించిపోయింది. కాలేజీలో చేరాక ప్రతి గురువారం బాబా గుడికి వెళ్లడం అలవాటు చేసుకున్నాను. ఇది నా జీవితంలో గొప్ప పరిణామం. దాన్ని బాబా ఇచ్చిన శుభసూచకంగా నేను భావిస్తున్నాను. అప్పటినుండి బాబా అనేక విధాల నన్ను కాపాడుతూ ఉన్నారు. నా కర్మలను ధ్వంసం చేసి అనేక గండాల నుండి బాబా నన్ను కాపాడారు. అందుకు కృతజ్ఞతగా నేను నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటాను.
2018 విజయదశమికి, అంటే శతాబ్ది ఉత్సవాలకు మా బంధువులు శిరిడీ వెళ్తూ అనుకోకుండా నాకు కూడా ఒక టికెట్ బుక్ చేశారు. అయితే, 'సాయిబాబా మాల ధరించి శిరిడీ వెళ్లాల'ని నాకొక కోరిక ఉండేది. ఆ విషయం నా తల్లిదండ్రులకు చెప్పి సాయిమాల ధరిద్దామంటే నా తండ్రి పూజలు వంటి వాటికి అస్సలు ఒప్పుకోరు. ఏమి చేయాలో తోచక, "సహాయం చేయమ"ని బాబా పాదాల వద్ద కన్నీరు కార్చాను. గుడిలో నాకు పరిచయస్తుడైన ఒక స్నేహితుడు, "మా ఊరివారి ద్వారా మీ నాన్నగారిని ఒప్పించేలా చేయమ"ని సలహా ఇచ్చాడు. ఆ విషయమై నేను అన్నయ్యతో మాట్లాడాను. బాబా దయవలన నాన్న ఒప్పుకున్నారు. సంతోషంగా సాయిమాల వేసుకుని శిరిడీ వెళ్లాను. ఆ విజయదశమి నుండి తరువాత విజయదశమి లోపల నేను మూడుసార్లు శిరిడీయాత్ర చేశాను. నాపై ప్రేమతో బాబా నాకు అంత గొప్ప వరమిచ్చారు.
ఇకపోతే, నా కజిన్ సిస్టర్ ఒక అబ్బాయిని ప్రేమించింది. నాలుగు సంవత్సరాల నుండి వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన మా అత్తయ్య కొడుకు నేను శిరిడీలో ఉన్నప్పుడు కాకడ ఆరతి సమయంలో నాకు చెప్పాడు. నేను వెంటనే ఈ విషయం మా పిన్నివాళ్ళతో చెబుదామనుకున్నాను. కానీ నేను మాలలో ఉన్నందున తర్వాత చెబుదాములే అనుకొని బాబాకి నమస్కారం చేసి, "ఏమిటి తండ్రీ నాకీ పరీక్ష? మా పిన్నివాళ్ళు కోటీశ్వరులు. ఆ అబ్బాయికి ఆస్తిపాస్తులు లేవు. ఒక్కగానొక్క కూతురిని అటువంటి అబ్బాయికిచ్చి పెళ్లి చేయడానికి మా పిన్ని అస్సలు ఒప్పుకోదు. మరి వాళ్ళ పెళ్లి ఎలా సాధ్యమవుతుంది తండ్రీ?" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత ఒక సంవత్సరంపాటు ఆ విషయం ఎవరికీ తెలియకుండా నాలోనే దాచుకొని నాలో నేను చాలా క్షోభను అనుభవించాను.
2020 మే నెలలో మా పిన్నివాళ్ళకి విషయం తెలిసింది. మా చెల్లి 'అన్నయ్యకి ఈ విషయం తెలుస'ని చెప్పడంతో నమ్మినవాళ్లే మోసం చేస్తున్నారని మా పిన్నివాళ్లు నా మీద రివర్స్ అయ్యారు. ఎన్నో చిన్న చిన్న గొడవలు జరిగిన తర్వాత ఆదివారం, అమావాస్య, గ్రహణం కలిసి వచ్చిన రోజున నాపైన చెడు ప్రయోగం చేయడానికి పూనుకున్నారు. ఈ విషయం నాకు బాబా గుడిలో మా గురువుగారు చెప్పారు. నేను భయంతో కంపించిపోయాను. 'నాకు రక్షణనివ్వమ'ని దీనంగా బాబానే వేడుకున్నాను. తరువాత వాళ్ళు చేసిన మంత్రప్రయోగ ప్రభావం వలన మా ఇంటి ముందు ఉన్న పెద్ద నింబవృక్షం హఠాత్తుగా నేలకు ఒరిగింది. ఆ సమయంలో నేను జ్వరం, నీరసంతో పలురకాలుగా బాధపడుతున్నాను. ఈ విషయాలేవీ నా తల్లిదండ్రులకు తెలియకూడదని బాబాకు చెప్పుకొని, ఆయననే శరణు వేడాను. బాబా తన బిడ్డనైన నాకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూసుకున్నారు.
నా మీద ప్రయోగించబడిన మంత్రప్రయోగాన్ని సాయిబాబా తమ నింబవృక్షం మీదకి తీసుకొని నన్ను రక్షించారు. వృక్షమే నెలకొరిగిపోయిందంటే బాబా నన్ను ఎంతలా కాపాడారో అర్థమవుతుంది. ఆయన ప్రేమతో నాకు మరుజన్మను ప్రసాదించారు. ఇలా బాబా నన్ను ఎల్లవేళలా కాపాడుతున్నారు. రీసెంట్ గా 2020, జూన్ 30న బాబా నాకు మహాపారాయణలో అవకాశం కల్పించి నన్ను ఆశీర్వదించారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇకపై ఏ ఆపదలూ నా దరిచేరకుండా చూడండి బాబా. నాకు మంచి ఉద్యోగం ప్రసాదించు తండ్రీ!"
మరోసారి ఈ బ్లాగు ద్వారా మరికొన్ని అనుభవాలు మీ అందరితో పంచుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఓం సాయిరాం!

🙏🌹🙏🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏🙏🌹🙏
ReplyDeleteనిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూప సమర్థ సద్గురు సాయినాథ పాహిమాం పాహిమాం రక్ష రక్ష
!! శ్రీ సచ్ిదానంద సమర్థ సద్గురు
సాయినాథ మహారాజ్ కీ జై!!
🙏🌹🙏 🙏🌹🙏 🙏🌹🙏 🙏🌹🙏 🙏🌹🙏
Thank you very much SAI BABA
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhāvyā srēē
Jail sairam
ReplyDeleteJaisairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏
ఓం సాయిరాం! జయ జయ సాయిరాం!
ReplyDelete