సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 560వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సమయానికి బాబా అందించిన సహాయం
  2. "దిగులుపడకు, నీ భవిషత్తు నా బాధ్యత!' 

సమయానికి బాబా అందించిన సహాయం

నేను ఒక సాయి భక్తురాలిని. 2020, సెప్టెంబర్ 13న బాబా మాపై చూపిన అనుగ్రహాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. బాబా తన బిడ్డలను ఎంత ప్రేమగా చూస్తారనేది అందరికీ తెలియాలి. క్లుప్తంగానే చెప్తాను. ఆరోజు మన బ్లాగులో ఆ వారంలో ప్రచురించిన కొన్ని అనుభవాలను చదివాను. ఒక అనుభవంలో ఒక బాబా మంత్రం చూశాను, “శ్రీ సాయి సూక్ష్మాయ నమః” అని. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తే పోయినవి దొరుకుతాయని అందులో ఉంది. ‘అది నోట్ చేసుకుందాం, ఎవరికైనా ఉపయోగపడుతుంది’ అనుకున్నాను. కానీ, బాబా అది నా కోసమే పంపారని ఆ సమయంలో నాకు తెలీదు. నేను అలా అనుకున్న కాసేపటికి ఒక క్రొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తీరా లిఫ్ట్ చేస్తే మా తమ్ముడు మాట్లాడాడు. “ఈ క్రొత్త నెంబర్ ఎవరిది? నీ ఫోన్ ఏమైంది?” అని అడిగితే, తన మొబైల్ ఎక్కడో పోయిందని, అన్నిచోట్లా వెతికామని, ఆ నెంబరుకి కాల్ చేస్తూనే ఉన్నానని, అయినా మొబైల్ దొరకలేదని, చాలా టెన్షన్గా ఉందని చెప్పాడు. వెంటనే నేను బాబాకు నమస్కరించుకుని, “మొబైల్ దొరికేలా చేయండి బాబా” అని చెప్పుకున్నాను. వెంటనే నాకు బాబా మంత్రం గుర్తుకు వచ్చింది. ‘ఇందుకోసమేనేమో బాబా నాతో ఆ అనుభవం చదివేలా చేశారు’ అనుకుని, “శ్రీ సాయి సూక్ష్మాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తూ తమ్ముడి ఫోన్కు కాల్స్ చేస్తూ మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము.

తమ్ముడి ఫ్రెండ్ సి.ఐ.గా చేస్తున్నాడు. అతను ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ చేశాడు, కానీ ఆ ప్రదేశం నిర్దిష్టంగా తెలియలేదు. ట్రేస్ చేసిన చోటికి వెళ్లి చూస్తే చాలా ఇళ్ళు ఉన్నాయక్కడ. ఏ ఇంట్లో ఉందని వెతకాలి? మాకు ఏం చేయటానికీ తోచలేదు. బాబా మంత్రజపం చేస్తూనే ఉన్నాను. ప్రశ్నలు-జవాబుల వెబ్సైట్లో బాబాను అడిగితే, “100 రూపాయలు దానం చెయ్యి, 18 గంటల్లో మీరు కోరుకునేది జరుగుతుంది, ఒకరు మీకు సహాయం చేస్తారు” అని సమాధానమిచ్చారు బాబా. బాబా సమాధానాన్ని మా తమ్ముడికి చెప్పాను. దాంతో తను ఇక వెతకటం ఆపేసి వచ్చేశాడు. ఇక ఫోన్ దొరకదని అనుకున్నాము. అంతలోనే మళ్లీ మరొకసారి ప్రయత్నిద్దామని తన ఫోన్కి కాల్ చేశాడు మా తమ్ముడు. ఆశ్చర్యంగా, ఉదయం నుంచి ఎవరూ లిఫ్ట్ చేయని ఫోన్ని అప్పుడు ఎవరో లిఫ్ట్ చేశారు. అతనిని ఫోన్ గురించి అడిగితే, ఆ ఫోన్ తన తల్లికి దొరికిందని, ఆవిడ పెద్దావిడ కావటంతో ఫోన్ ఎలా ఆన్సర్ చేయాలో తెలియక తాను వచ్చేవరకు చూసి తను ఇంటికి వచ్చాక విషయం చెప్పి ఫోన్ ఇచ్చిందని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి తమ్ముడు ఆ ఫోన్కి కాల్ చేశాడు. అతను విషయం మొత్తం చెప్పి వాళ్ళుండే అడ్రస్ ఇచ్చాడు. వెంటనే తమ్ముడు వెళ్లి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి తన ఫోన్ తెచ్చుకున్నాడు. అసలు ఇక దొరకదనుకున్న ఫోన్ ఎలా దొరికిందో చూశారా? ఫోన్ పోతుందని తెలిసి ముందు జాగ్రత్తగా బాబా నాతో ఆ మంత్రం ఉన్న అనుభవాన్ని చదివించారు. అనుక్షణం బిడ్డల్ని కాచుకునే తల్లి సాయి. సాయిని నమ్మితే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తారు. “నీ బిడ్డలందరినీ చల్లగా చూడు బాబా! ఇలా నీకు చెప్పటం నా అజ్ఞానమే కదా బాబా? ఎందుకంటే మేము అడిగినా, అడగకపోయినా నువ్వు మమ్మల్ని కాచుకుంటూనే ఉంటావు”.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

'దిగులుపడకు, నీ భవిషత్తు నా బాధ్యత!'

నా పేరు అనిల్. నేను వృత్తిరీత్యా అకౌంటెంట్ గానూ, కంప్యూటర్ ఆపరేటర్ గానూ వర్క్ చేస్తున్నాను. నా వయస్సు 31 సంవత్సరాలు. నాకు ఇంకా వివాహం కాలేదు. నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను బాబాను కొలుస్తున్నాను. నా వృత్తిజీవితంలో ఎన్నో ఆటుపోట్లు జరుగుతుండేవి. పైపెచ్చు మా నాన్నగారు 7 సంవత్సరముల క్రితం కాలం చేశారు. ఆ తరువాత బాబాను నా తండ్రిగా భావించి, "నా జీవితాన్ని నీ చేతిలో పెట్టాను బాబా" అని బాబాకు చెప్పుకున్నాను. వీలైనప్పుడల్లా బాబాకు పూజ చేసుకుంటాను. కానీ మా నాన్నగారు కాలం చేసినప్పటినుండి నాకు మతిమరుపు ఎక్కువగా ఉంటోంది. ఏ పనిమీదా ధ్యాస ఉండటం లేదు. అంతకుముందు నాకు పనిమీద ధ్యాస, జ్ఞాపకశక్తి మెండుగా ఉండేవి. ఇప్పుడు వృత్తిలో చాలా వెనుకబడుతున్నాను. ఇటీవల నేను పనిచేసే ఆఫీసుకు ఒక జ్యోతిష్కుడు వచ్చారు. ఆయన నా ముఖం చూసి, "నీకు చాలా గడ్డుకాలం నడుస్తోంది. నీ జాతకంలో సూర్యుడు, గురుడు, శని, రాహువు, కేతువు, శుక్రుడు అందరూ నీచస్థితిలో ఉన్నారు. నీ జీవితం కష్టమే!" అని చెప్పి, ఉపశమనం కోసం కొన్ని పరిహారాలు చెప్పారు. అది విని నేను మనస్సులో బాగా దిగులుపడ్డాను. కొంతసేపటి తరువాత నా పనిలో నిమగ్నమవుతూ నా మిత్రుని వాట్సాప్ స్టేటస్ చూశాను. అందులో ఒక యువకుడు దిగులుగా ఉంటే వెనుకనుండి బాబా అతని భుజం మీద చేయి వేసి, 'దిగులుపడకు, నీ భవిషత్తు నా బాధ్యత!' అని చెప్తున్న ఫోటో ఉంది. బాబా సందేశాన్ని చూసి ఆయన నాపై చూపుతున్న ప్రేమకు నా కళ్ళవెంట కన్నీళ్లు వచ్చేశాయి. "బాబా! నిన్నే నమ్ముకున్నాను. నాకు ఏ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలైన పలుకుబడి కలిగినవారు ఎవ్వరూ తెలియదు. నాకు నువ్వే ఎమ్మెల్యేవి, ఎంపీవి, గురువువి, తల్లివి, తండ్రివి" అనుకొని బాబాకు ఆత్మనమస్కారం చేసుకున్నాను. ఇది నా అనుభవం. తప్పులోను, ఒప్పులోను, కష్టంలోను, సుఖంలోను బాబా ఎప్పుడూ నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను.


11 comments:

  1. Om Sairam
    Sai Always Be With ME

    ReplyDelete
  2. Baba nijanga anni maku neeve thandri

    ReplyDelete
  3. Baba nenne namukunamu thandri ma bhadhyata nedhe thandri sharanam thandri sharanam

    ReplyDelete
  4. Baba what will I be without you....Thank you for being with me....continue to guide me and help me in following a path that is shown by you. Om Sri Sairam🙏🙏🙏

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  6. Definitely baba will bless us , Om Sai Ram Raksha🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo