- భక్తసులభుడు నా సాయి
- సాయినాథుని కృపాకటాక్షాలతో సంపూర్ణ ఆరోగ్యం
భక్తసులభుడు నా సాయి
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకి బాబా ప్రసాదించిన అనుభవాలనిలా మనతో పంచుకుంటున్నారు:
అందరికీ సాయిరాం! నేను ఇంతకుముందు బాబాతో నా అనుబంధాన్ని, బాబా నాకు ప్రసాదించిన ఆశీస్సులను (అనుభవాలను) మీతో పంచుకున్నాను. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను. 'బాబా ఎప్పుడూ తన బిడ్డలను బాధపడనివ్వరు' అని మరోసారి చూపించారు. ఆ అనుభవాన్నే మీ అందరితో పంచుకుంటానని బాబాకు మాటిచ్చాను.
హెల్త్ చెకప్ చేయించుకుని చాలా రోజులు అయిందని మొన్నీమధ్య మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టరుకి చూపించుకునేటప్పుడు 'కొంచెం దగ్గు కూడా వస్తోంది' అని చెప్పింది. అదేమీ ఇప్పుడు కొత్తగా వచ్చిన దగ్గు కాదు. అయినా కూడా డాక్టర్ వెంటనే కోవిడ్ టెస్ట్ కోసం స్కానింగ్ చేయించమని చెప్పారు. కనీసం అమ్మని దగ్గరనుంచి కూడా చూడలేదు. కోవిడ్ టెస్ట్ అని వినగానే మేము ఎంత టెన్షన్ పడ్డామో బాబాకు మాత్రమే తెలుసు. అమ్మ టెస్ట్ చేయించుకుంది. రిపోర్టు మర్నాడు వస్తుందన్నారు. అంతా నార్మల్ అని వచ్చేలా చేయమని బాబాను వేడుకుని, సాయి నామజపం చేయసాగాను. 'ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను. బాబా దయవల్ల అమ్మ ఆరోగ్యం బాగుంటే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. మర్నాడు తమ్ముడి స్నేహితుడు వెళ్లి రిపోర్ట్ తీసుకున్నాడు. ఆ అబ్బాయి కాల్ చేసి చెప్పేవరకు నేను పడ్డ టెన్షన్ మాటల్లో చెప్పలేను. ఆరోజు గురువారం. మహాపారాయణ బిజీలో ఉన్నప్పటికీ టెన్షన్ పడుతూనే ఉన్నాను. నా సాయితల్లి తన బిడ్డలను బాధపడనివ్వదు కదా! అదే జరిగింది. రిపోర్టులో అంతా నార్మల్ అని ఉంది. ఆ రిపోర్టు చూసిన తర్వాత మా అమ్మకి వచ్చింది మామూలు దగ్గేనని దానికి ఏవో మందులు ఇచ్చారు. అది విన్నాక నాకు ఎంత రిలీఫ్ వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. బాబా ఇచ్చే ఆశీస్సులకి థాంక్స్ అనేది చాలా చిన్న పదం. "థాంక్యూ సో మచ్ బాబా!"
ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. నా మేనకోడలికి ఒక నెల క్రితం మెడ చుట్టూ చిన్న చిన్న నల్ల మచ్చలు వచ్చాయి. దానివల్ల ఏమీ ఇబ్బంది లేదుగానీ అవి త్వరగా తగ్గిపోవాలని బాబాను ప్రార్థించాను. వారం క్రితం నుంచి హోమియో మందులు వాడుతున్నాం. బాబా అనుగ్రహంతో ఇప్పుడు ఆ మచ్చలు అసలు ఆనవాలు కూడా లేకుండా పోయాయి. ఎన్ని అడిగినా, ఏమి అడిగినా అన్నీ ఇచ్చేసే భక్తసులభుడు నా సాయి.
అమ్మ రిపోర్టు విషయంలో నేను టెన్షన్ పడ్డపుడు నాకు ఒకటే అనిపించింది, 'ఇలా ఇప్పుడు ప్రతిరోజూ కొన్ని లక్షలమంది టెన్షన్ పడుతున్నారు కదా' అని. రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చిన వాళ్ల పరిస్థితి ఊహించటానికి కూడా నాకు ధైర్యం సరిపోవటం లేదు. "ఈ కరోనా మహమ్మారిని త్వరగా అంతం చేయి బాబా! నీ బిడ్డలందరినీ చల్లగా చూడు తండ్రీ! అలాగే నాకు ధైర్యాన్ని ఇవ్వు బాబా! ప్రతి చిన్న విషయానికీ ఈమధ్య ఒక నెల రోజుల నుంచీ ఎక్కువ భయపడుతున్నాను. రోజూ వినే వార్తల వల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ బాబా! నువ్వుండగా ఎవరికీ ఏమీ కాదు అనే నమ్మకం ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించు తండ్రీ!"
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
శుభం భవతు!
ఓం సాయిరాం!
సాయినాథుని కృపాకటాక్షాలతో సంపూర్ణ ఆరోగ్యం
సాయిభక్తుడు కృష్ణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నా పరాత్పర గురువైనటువంటి శ్రీ సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ నాకు జరిగిన అనుభవాన్ని వివరిస్తున్నాను. నా పేరు కృష్ణ. కొద్ది రోజుల క్రితం ఒక మధ్యాహ్నం శరీరంలో కాస్త నలతగా ఉండి ఇబ్బందిపడ్డాను. ఆరోజు రాత్రికి తీవ్రమైన ఒళ్ళునొప్పులతో కదలలేని స్థితిలో ఉండిపోయాను. అసలే కరోనా వైరస్తో అందరూ భయపడుతున్న ఈ సమయంలో నేను ఈ రకంగా ఒళ్ళునొప్పులతో బాధపడుతుండటం కొంత భయాన్ని కలగజేసింది. నాతోపాటు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, నా వల్ల వాళ్ళకేదైనా అవుతుందేమోనని భయపడ్డాను. ఆ రాత్రంతా బాబాను తలచుకుంటూ, మధ్యమధ్యలో బాబా ఊదీని నోట్లో వేసుకుంటూ గడిపాను. మరుసటిరోజు తెల్లవారుఝామున 5:30 వరకు ఎంతో ఇబ్బందిపడ్డాను. కానీ చాలా విచిత్రంగా ఒక్క అరగంటలో చాలావరకు ఉపశమనం కలిగింది. నా అంతట నేను లేచి స్నానం చేయగలిగాను. ఆరోజు ఏకాదశి. పాండురంగస్వామి గుడికి కూడా వెళ్ళగలిగాను. అప్పటినుండి ఒక వారంరోజుల్లో నాకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. పెద్దగా మందులేమీ వేసుకోకుండానే, ఏ డాక్టరునూ సంప్రదించకుండానే, కేవలం అపర ధన్వంతరి అయినటువంటి ఆ సాయినాథుని కృపాకటాక్షాలతో నేను తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలిగాను. ఏదో పెద్ద భయంకరమైనటువంటి వ్యాధితో నేను బాధపడవలసినది కేవలం చాలా చిన్న బాధతో ఆ పూర్తి కర్మను నా పరాత్పర గురువైనటువంటి సాయినాథుడు తీసివేశారు. మా ఇంట్లో అందర్నీ కూడా ఆ సాయినాథుడు ఆరోగ్యంగా ఉంచారు. తండ్రీ! గురుదేవా! సాయినాథా! యావత్ ప్రపంచాన్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ని పూర్తిగా పారద్రోలి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించి, అతి త్వరలో మీ దర్శనభాగ్యాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను తండ్రీ! మీరు ఒక్కరు మాత్రమే ఈ పని చేయగలరు స్వామీ!
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ౹
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ౹౹"
ఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరాం
ReplyDeleteOm Sai ram
ReplyDeleteBaba bless cheyandi pls
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Sai శరణం సకల రోగ నివారణం.సాయి శరణం సకల జన శుభకరం.
ReplyDeleteBaba ma pyna daya chupinchava thandri sai sai sai
ReplyDeleteOm Sairam...Bless all the needy people
ReplyDeleteOm Sairam Deva tandri sainatha pls bless with calm mind baba pls show me the way in my life Deva,love u and TQ so much for your abundance blessings on me and my family.
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏