సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 566వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. మంత్రాన్నిచ్చి జీవిత గమ్యానికి చేరుస్తానని వాగ్దానం చేసిన బాబా
  2. బాబా కృపతో నయమైన బాబు కంటి సమస్య
  3. బాబా అనుగ్రహించిన ధునిలో ఊదీ

మంత్రాన్నిచ్చి జీవిత గమ్యానికి చేరుస్తానని వాగ్దానం చేసిన బాబా

నా పేరు మాధవి. 2020, సెప్టెంబరు 10, గురువారంనాడు నేను సాయిసచ్చరిత్రలో 26, 27 అధ్యాయాలు పారాయణ చేశాను. పారాయణ ప్రారంభించే ముందు నేను సాయిని ఒక ప్రశ్న అడిగాను. సాయి నాకు, 'రాజారామ్' అని సమాధానం ఇచ్చి, నా జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఆ తరువాత మధ్యాహ్నం అనుకోకుండా నేను ప్రేమసాయి మందిరానికి వెళ్ళాను. అక్కడ కూడా బాబా నన్ను ఆశీర్వదించారు. మరుసటిరోజు (11-09-2020) శుక్రవారంనాడు నేను నా మురళీధరుడు ప్రసాదించిన పనిచేసే చోటకి వెళ్లి, సాయి పరివార్ వాట్సాప్ గ్రూపు తెరిచి చాలా సంతోషానికి లోనయ్యాను. ఎందుకంటే, ముందురోజు బాబా చేసిన వాగ్దానాన్ని గుర్తుచేస్తూ పారాయణలో నాకు బహుమతిగా లభించిన 'రాజారామ్' మంత్రం కనిపించింది. తద్వారా నా ప్రతి కదలికను సంతోషంగా మలచడానికి బాబా నాతో ఉన్నానని తెలియజేశారు. ఈ అద్భుతమైన అనుభవాన్ని నా సాయి పరివార్‌(కుటుంబం)తో పంచుకోవడం ఆనందంగా ఉంది.

బాబా కృపతో నయమైన బాబు కంటి సమస్య

అందరికీ నమస్కారం. నా పేరు రూప. నేను ఇప్పుడు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. 2020లో మా బాబు కన్ను ఎర్రబడి దురద, వాపుతో చాలా ఇబ్బందిపెట్టింది. ఆ కరోనా సమయంలో వాడిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లాలంటే నాకు చాలా భయమేసింది. అప్పుడు సర్వవేళలా భక్తులకు కొండంత అండగా నిలిచే బాబాను తలచుకొని, "బాబుకి త్వరగా తగ్గిపోయేలా చూడండి బాబా. మీ దయవల్ల బాబుకి నయమవ్వాలి" అని ఆయనతో చెప్పుకున్నాను. బాబా ప్రేమతో బాబుకి నయమయ్యేలా చేశారు. ఆనందంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబాను నమ్ముకుంటే, ఆయన మన వెంటే ఉంటారని నా నమ్మకము.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

బాబా అనుగ్రహించిన ధునిలో ఊదీ

సాయి భక్తులందరికీ హాయ్. నేను హైదరాబాద్ నుండి మహేశ్వర. నేను నా జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా చెడు కర్మ కారణంగా మొదటి భార్యకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది, తరువాత నేను నా ఉద్యోగాన్ని కోల్పోయాను. అయినప్పటికీ బాబా ఆశీస్సులతో 32 ఏళ్ళ వయస్సులో నేను రెండో పెళ్లి చేసుకున్నాను. ఆ వివాహం వలన కూడా నేను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కేవలం బాబా ఆశీస్సుల వల్లే నేను మనశాంతితో ఉన్నాను. నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఊదీ కావాలని నేను 2020, జూన్ 13న శిరిడీ వెళ్ళాను. బాబాని ప్రార్థించి ఊదీకోసం ధుని ఉండే ద్వారకామాయికి వెళ్ళాను. అక్కడ తాళాలు వేసి ఉన్నాయి. దాంతో నేను, "బాబా! నేను మీ ఊదీకోసం ఇక్కడికి వచ్చాను. కాని ఇక్కడ తాళాలు వేసి ఉన్నాయి. ఇప్పుడు నేనేమి చేయాలి?" అని బాబాతో చెప్పుకుంటూ ఉన్నాను. అంతలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి ధుని తాళాలు తీసాడు. నేను ఆశ్చర్యపోతూ నాతోపాటు తీసుకుని వెళ్లిన బాక్స్ చూపించి, "ఇందులో కొంత ఊదీ ఇవ్వమ"ని అడిగాను. అతను కాదనకుండా వెంటనే ఊదీ ఇచ్చాడు. నిజంగా ఇది సాయిబాబా చేసిన అద్భుతం. ఆయన అనుగ్రహానికి ఆనందంతో పరవశించిపోయాను. హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని ఆనందంగా తిరిగి వచ్చాను.


8 comments:

  1. Om sai ram! 🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయిణే నమః
    🙏 🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete
  3. Baba me daya valana Kalyan ki marriage settle inadi Elanti avarodalu lakunda marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house problem solve cheyandi pl na health bagu cheyandi pl

    ReplyDelete
  4. Om sri sairam 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo