ఈ భాగంలో అనుభవాలు:
- ఏ సమస్యా లేకుండా మా కష్టాన్ని తీర్చారు సాయి
- కృపతో గిఫ్ట్ ఇచ్చేలా అనుగ్రహించిన బాబా
ఏ సమస్యా లేకుండా మా కష్టాన్ని తీర్చారు సాయి
సాయిభక్తురాలు సాహిత్య తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
శ్రీసాయిబంధువులకు నా నమస్కారాలు. మేము విజయవాడ వాస్తవ్యులం. శ్రీసాయికి మాపై ఉన్న కృపకు, కరుణకు నిదర్శనమైన ఒక సంఘటన మా జీవితంలో జరిగింది. దాన్నే నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
మా నాన్నగారు 2013లో పరమపదించారు. అంతకుముందు నాన్న ఉన్నప్పుడు ఆయన వద్దనుండి ఒకతను కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. నాన్న మరణించడంతో అతను ఆ డబ్బు గురించి పూర్తిగా వదిలేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతను మా నాన్నకి ఇచ్చిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు మా అమ్మ కంటపడ్డాయి. అవి తీసుకొని లాయరుని సంప్రదిద్దామని అనుకున్నాం. ఆ సమయంలో మేము చాలా ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నాము. ఇంట్లో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తీర్చాల్సిన అప్పులు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి స్థితిలో ఆ డబ్బు మాకొస్తే, కొంతైనా మా సమస్యలు తీరుతాయన్న చిన్న ఆశతో సాయికి మ్రొక్కుకొని శ్రీసాయి దివ్యపూజ 5 గురువారాలు చేశాము. నిజానికి ఎప్పుడో 6 సంవత్సరాల క్రిందటి సమస్యకు లాయరు కేసు టేకప్ చేస్తారని గానీ, సదరు వ్యక్తి డబ్బులు తిరిగి ఇస్తాడని గానీ మేము అనుకోలేదు. ఆ విషయంలో మాకస్సలు నమ్మకమే లేదు. కానీ సాయితో ఒకటే చెప్పుకున్నాను. "సాయీ! మా నాన్న వద్దనుంచి అతను తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేలా చూడు. అమ్మకు ఉన్న అప్పుల బాధ తీరేలా చూడు" అని రోజూ పూజలో చెప్పుకుంటూండేదాన్ని.
ఒకరోజు అతనిచ్చిన చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకొని మేము మా లాయరు దగ్గరకు వెళ్ళాము. లాయరు కేసు టేకప్ చేస్తానని ఒప్పుకున్నారు, కానీ ఒకసారి రాజీ ప్రయత్నం చేసి చూద్దామని సదరు వ్యక్తిని పిలిపించారు. అతను వెంటనే వచ్చి "తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తాన"ని చెప్పాడు. చెప్పినట్లుగానే కొన్నిరోజులకి డబ్బు తిరిగి ఇచ్చాడు. ఆ డబ్బుతో అమ్మ అప్పుల బాధనుండి కొంతవరకు విముక్తి పొందింది. ఇదంతా బాబా దయ. ఏ సమస్య లేకుండా మా కష్టాన్ని తీర్చారు సాయి. ఈ విషయం ఒకటే కాదు, చాలా విషయాలలో బాబా మాకు సహాయం చేశారు. నిత్యజీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా సాయికి చెప్పుకొని, ఆయనకు దక్షిణ సమర్పించి, ఊదీ పెట్టుకుంటే ఆ సమస్య కొన్ని రోజులలోనే పరిష్కారం అయిపోతుంది. మా ఇంటికి యజమాని ఆ సద్గురు సాయినాథుడే!
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
కృపతో గిఫ్ట్ ఇచ్చేలా అనుగ్రహించిన బాబా
ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఇటీవల నాకు జరిగిన అనుభవాన్ని బాబాకు ఇచ్చిన మాట ప్రకారం మీతో పంచుకుంటున్నాను. బాబా చాలా సంవత్సరాల క్రితమే నాకొక అబ్బాయితో వివాహం నిశ్చయించారు. ఇటీవల అతని పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న గిఫ్ట్ తనకు ఇవ్వాలనిపించి, 'ఇవ్వాలా', 'వద్దా' అని చీటీల ద్వారా బాబాను అడిగాను. బాబా 'ఇవ్వమ'ని సమాధానమిచ్చారు. గురువారం పూజ పూర్తైన తర్వాత అతనికి ఆ గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను. నిజానికి అది కూడా బాబానే సూచించారు. అయితే, మాకు ఇంకా నిశ్చితార్థం కానందున ఇంట్లోవాళ్ళు చూస్తే బాగుండదని, వాళ్ళు ఏమంటారోనని నాలో నేను మధనపడ్డాను. అందువలన ముందురోజునుంచే బాబాతో, "బాబా! నీ అనుమతితోనే ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యత కూడా నీదే బాబా" అని చెప్పుకున్నాను.
గురువారం తెల్లవారుఝామున రెండు గంటలకే నిద్రలేచి బాబాకు స్నానం చేయించి, పూజ మొదలుపెట్టాను. ఎప్పుడూ ఆ సమయంలో నిద్రపోతుండే మా తాతయ్య ఆరోజు మాత్రం నిద్రపట్టడంలేదని హాల్లో తిరుగుతున్నాడు. అందువల్ల అమ్మమ్మ కూడా లేచొచ్చి నా దగ్గర కూర్చుంది. నేను బాబాను చూస్తూ, "ఇదేంటి బాబా! ఉదయం గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం కదా! మళ్లీ నాకు ఈ పరీక్ష ఏమిటి? సమయాన్ని నిర్ణయించిన నువ్వే మళ్ళీ పరీక్ష ఎందుకు పెడుతున్నావ్?" అని అడుగుతూ పూజ చేస్తున్నాను. "బాబా! ఈరోజు ఎటువంటి సమస్యలు లేకుండా గిఫ్ట్ అతని దగ్గరికి చేరితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఎలాగైనా అమ్మమ్మ, తాతయ్యలకు నిద్రపట్టేలా చూడు" అని వేడుకున్నాను. బాబా అనుగ్రహించారు. నా పూజ ముగిసేసరికి తాతయ్య నిద్రపోతున్నాడు. అది చూసి అమ్మమ్మని కూడా వెళ్లి పడుకోమని చెప్పాను. దాంతో తాను కూడా వెళ్లి పడుకుంది. తర్వాత బాబా కృపతో గిఫ్ట్ అతనికి ఇచ్చేశాను. బాబా చివరి నిమిషం వరకు నన్ను పరీక్షించినా, చివరికి గిఫ్ట్ అతనికి చేరేలా అనుగ్రహించారు. "థాంక్యూ సో మచ్ బాబా!"
ఓం సాయిరామ్!
🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeletebaba is the head of the family i like this message very much.i trust this is corret to all people
ReplyDeleteYes
DeleteOm Sai Ram
ReplyDeleteBaba mamalini kapadu thandri
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Baba,mee లీలలు అమోఘం.ome srisairam
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
🏵🥥🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏🥥🏵
ReplyDelete